
ది వైర్ ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులను ఇంటరాగేట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇపుడు రాజకీయ నాయకుల పై తన దృష్టి మళ్లించింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఇంటరాగేషన్‌కు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్నారు. ఇంతవరకు కథా కథనం షరా మామూలే. ఈ కథనంలో ట్విస్ట్ అంతా సిఐడి దర్యాప్తు కు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రముఖ నేత, చంద్రబాబుకు ఆత్మగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన టీడీ జనార్ధన్‌ను కలవడమే.
ది వైర్ తెలుగు ఏపీ లిక్కర్ స్కాం కు సంబంధించిన కథనాలను ఈ క్రింది లింక్స్‌లో చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు – ప్రతీకార రాజకీయాలతో పట్టాలు తప్పుతున్న పాలన
టీడీ జనార్ధన్, విజయసాయి రెడ్డిలు ఒకరి వెంట ఒకరు ఒక ఇంట్లోకి వెళ్ళడం, తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేర్వేరు కార్లలో వెళ్ళడానికి సంబంధించిన ఫోటో ది వైర్ రిలీజ్ చేస్తుంది.
రహస్య భేటీ వివరాలు.
ది వైర్‌కు అందుబాటులో ఉన్న సమాచారం, ఫొటోల ప్రకారం మార్చి 11 సాయంత్రం 5:49 గంటలకు విజయసాయి రెడ్డి విజయవాడ తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లేలో విల్లా నెం. 27లోకి వెళ్లారు. ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావుది. విజయసాయి రెడ్డి లోపలికి వెళ్లిన కొద్ది సేపటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన టిడి జనార్ధన్ అదే విల్లాలోకి వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం 6:50 గంటలకు విజయసాయి రెడ్డి బయటకు రాగా, వెంటనే జనార్ధన్ కూడా విల్లా నుంచి వెళ్లిపోయారు.
సమావేశం పై సందేహాలు
లిక్కర్ కుంభకోణం పై విచారణకు హారజరు కావడానికి కొన్ని గంటలు ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ భేటీ జరిగిన కొన్ని గంటలు తరువాత విజయసాయి రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణకు ముందు టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి తో సాయిరెడ్డి రహాస్య సమావేశం అవడం ఇప్పుడు పలు అనుమానాలుకు దారితీస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.