
ప్రశ్న — నమస్కారం మేడం !నా వయస్సు 26, పెళ్లై 2 సంవత్సరాలు . పెళ్లయ్యాక నాకు థైరాయిడ్ సమస్య మొదలైంది. నాకు కలయిక పట్ల అసలు ఆసక్తి లేదు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా ఉండవు అని బాధ పడుతున్నాడు అసలెందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు? నాకు ఆయనతో సరదాగా ఎలా ఉండాలో అర్థం కావటంలేదు దయ చేసి సలహా ఇవ్వగలరు ———జోషు జో —జిమెయిల్ ద్వారా
థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లు శరీరంలోని అన్ని కణాలను, అన్ని భాగాలతో పాటు లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అవయవాల పనితీరుని ప్రభావితం చేస్తుంది.థైరాయిడ్ సమస్య అది హైపో/హైపర్ థైరోయిడిజం ఏదైనా గాని పురుషులలో {31%} లెస్ లిబిడో అంగస్థంభన లోపం, స్త్రీలలో{43%} సెక్స్ పట్ల తక్కువ ఆసక్తి, కలయికలో నొప్పికి కారణం అవుతాయి.అలాగే థైరాయిడ్ వల్ల వచ్చే ఇతర శారీరిక అనారోగ్యాలు, మానసిక లక్షణాలు నీరసం, ఉద్రేకం, కోపం,చిరాకు, దుఃఖం డిప్రెషన్, ఒత్తిడి ఇవన్నీ కూడా ఉండడం తో సెక్స్ లో ఆసక్తి మరింతగా తగ్గుతుంది .లాస్ అఫ్ సెక్స్ డ్రైవ్, హైపో ఆక్టివ్ సెక్సువల్ డిసార్డర్ {HSDD}–సెక్స్ కి సంబంధించిన ఆలోచనలు, స్వీకరణ కూడా తగ్గి పోవడం వలన దంపతుల మధ్య స్పర్ధలు రావడం జరుగుతుంది . మీరు ఎండో క్రెయినాలజిస్ట్ ను కలిసి థైరాయిడ్ ప్రొఫైల్ మరోసారి చేయించుకోండి. లీవో థైరాక్సిన్ హార్మోన్ సరైన స్థాయిలో తీసుకోవాలి . దీనివలన దాంపత్య జీవితంలో ఆసక్తి కలిగే అవకాశముంటుంది.అలాగే కలయిక తరువాత నొప్పి తగ్గడానికి వెజైనా లోపలి కండరాలకి లూబ్రికెంట్ అప్లై చేయాలి థైరాయిడ్ సమస్య వల్లవచ్చే లావు , తలనొప్పి, కళ్ళకింది నలుపు, డ్రై స్కిన్,పాలీ సిస్టిక్ ఓవేరియన్ డీసీస్ , హార్మోనల్ ఇంబాలన్స్, ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యలు పోవడానికి రోజూ వాకింగ్, యోగ, బ్రీతింగ్ టెక్నిక్స్, పౌష్టిక ఆహారం, డిప్రెషన్, స్ట్రెస్ తగ్గడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయడంతో పాటు దంపతులు ఇద్దరూ ఈ సమస్యను అధిగమించడానికి కలిసి మాట్లాడుకోవాలి, సమస్యను శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి ..ఇద్దరూ మారిటల్ దెరపిస్టును కలవండి.
Dr. Bharathi MS
Sexual Health Counsellor, Marital and psychotherapist
Family counsellor
Gvs Research Centre for Sexual & Mental
Health
Email id: bharathi27964@gmail.com,
Mobile-8688519225
Timings -11 am to 2 pm /5 pm -8 pm
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.