
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించంటానికి ముందు దేశంలో రెండు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు రెండు సర్వేలు చేశారు. ఈ సర్వేల సారాంశం ఢిల్లీలో అక్రమ వలసదారులు ఎవరు, వారి వలన ఢిల్లీ రాష్ట్ర జనాభా పొందిక ఎలా మారుతోంది అన్నా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమే.
ఈ సర్వేలు జరిపిన వారి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన ప్రొఫెసర్లు.
మరింత స్పష్ణంగా చెప్పాలంటే జే ఎన్ యూ ప్రొఫెసర్ నిర్వహించిన సర్వే నివేదిక శీర్షిక అక్రమ వలసదారులు : సామాజిక రాజకీయ ఆర్థిక పర్యవసానాలు. ఈ నివేదిక విడుదల అయిన రోజునే బిజెపి నేత సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో అక్రమ వలసదారుల బెడద పెరిగిందన్న బిజెపి వాదన రుజువు అయిందని చెప్పారు. ఈ వలసదారులు మయన్మార్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు అని వీరికి ఆమ్ ఆద్మీ పార్టీ దన్నుగా ఉన్నదని సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ నివేదిక నిర్దారణల గురించి మీడియా ప్రత్యేక కథనాలు నడిపింది. ఢిల్లీ లో బిజెపి నెగ్గిన తర్వాత రే నివేదిక మీడియా చర్చల నుండి మాయమైంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే తరహా అంశం మీద మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక కథనం వెలువడింది. ఈ రెండు నివేదికలు సదరు అధ్యయనం పూర్తి అయ్యాక విడుదల అయ్యాయా లేక మధ్యంతర నివేదికల అన్నది స్పష్టత లేదు. ఒక వేళ రెండు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు స్వతంత్రంగా ఈ అధ్యయనాలు చేస్తుంటే సరిగ్గా ఎన్నికల ముందే అసంపూర్ణంగా మధ్యంతర నివేదికలు రూపొందించాల్సి వచ్చింది అన్నది ముఖ్యమైన ప్రశ్న.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ తప్పుడు వాదనల సమర్ధింపు కోసం ఇలా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను దుర్వినియోగ పర్చడం ఈ కాలంలో పెరిగిందని పలువురు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టులకు నిధులు ఎలా కేటాయిస్తారు, ప్రాజెక్టులు ఎవరు అనుమతిస్తారు అనే విషయాలు వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పౌర మేధావులు ఆరోపిస్తున్నారు.
ఈరెండు నివేదికలను బిజెపి నాయకులు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకోవడం గమనిస్తే పౌర మేధావుల ఆరోపణలు నిరాధారమైనవని కాదు అని అర్థమవుతుంది.
గత ఎడాది నవంబర్ 5 న జరిగిన ఒక సెమినార్ లో టిస్ ప్రొఫెసర్ రూపొందించిన సర్వే నివేదికను విడుదల చేసారు. నాలుగు రోజుల తర్వాత నవంబర్ 9 న బీజేపీ నేత కిరీటి సోమయ్య ఓ వీడియో లో మాట్లాడుతూ ఈ నివేదిక ను ప్రస్తావించి మహారాష్ట్ర లో అక్రమవలసదారుల బెడద పెగిందని, వీరిని వదిలించుకోవాలంటే బీజేపీ యే దిక్కని మాట్లాడారు.. ఇంకా ఒక అడుగు ముందుకేసి 2051 నాటికి ముంబై లో స్థానిక జనాభా 54 శాతానికి తో పోతుందని కూడా హెచ్చరించారు. దీనికి తగ్గ శాస్త్రీయమైన వివరాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్నికలకు ముందు జరగటం గమనించాల్సిన విషయం. మరికొన్ని రోజుల తర్వాత ఉద్దబ్ థాకరే నాయకత్వంలో ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే ముంబై ముస్లింల సొంతం అవుతుందని బంగారం ఉందని బిజెపి ఐటి సెల్ సమన్వయకర్త అమిత్ మాలవీయ అన్నారు.
ఇదే రకమైన వ్యవహారం ఢిల్లీ ఎన్నికల ముందు కూడా జరిగింది. జవహర్ లాల్ విశ్వ. విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అవినాష్ కుమార్ ఇటువంటి అధ్యాయనాలన్నీ అర్థం లేనివని కొట్టి పారేశారు. వ్యక్తుల కు స్వతంత్ర రాజకీయ అభిప్రాయాలు ఉండటం తప్పేమీ కాదని అయితే తమ రాజకీయ అభిప్రాయాలు రుద్దటానికి విద్యాసంస్థ సుదీర్ఘ కాలంలో నెలకొల్పిన ప్రమాణాలను ఫణంగా పెట్టరాదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇప్పుడున్న పాలకులే ఒకప్పుడు జే ఎన్ యూ లో సాగే పరిశోధనలు దేశానికి ఉపయోగం లేనివనీ, ప్రజల ధనం వృధా చేస్తున్నాయని ఆరోపించారు. అదే పాలకులు సో కాల్డ్ పరిశోధనలు తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే వాటిని నెత్తిన పెట్టుకుని ఉరేగుతున్నారనీ అవినాష్ గుర్తు చేసారు.
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక విడుదల చేసిన తర్వాత 500 మంది మేధావులుz విశ్రాంత ప్రొఫెసర్లు, పౌర మేధావులు ఒక ప్రకటన లో ఇటువంటి నివేదికలు ” ఓటర్లను మఠాధారిత భావోద్వేగాల ప్రాతిపదికన చీల్చేందుకు ఉద్దెనించిన ప్రయత్నం. అణగారిన సామాజిక తరగతుల పట్ల, పొట్ట చేతబట్టుకుని వచ్చిన వలస కార్మికుల పట్ల విద్వేషాన్ని రెచ్చ గొట్టే వ్యూహం ” అని విమర్శించారు..
ఇటువంటి ప్రయోగాలు వినూత్నంగా కనిపిస్తున్నప్పటికీ వ్యూహం, రాజకీయ ప్రేరణ లు ఒకటేనని పొర మేధావులు ఆ లేఖ లో అభిప్రాయ పడ్డారు. కేవలం 300 మందితో మాట్లాడి మొత్తం మహారాష్ట్ర వాసుల మనోగతం గా చెప్పే ప్రయత్నం పరిశోధనా విలువలను పక్కన పెట్టీ కనీసం సామాజిక నైతికత కు కూడా విరుద్ధంగా ఉన్న చర్య అని అభిప్రాయ పడ్డారు.
ఈ నివేదికలకు పెట్టిన పేర్లు చూస్తే ఈ ప్రయత్నం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ తరహాలో జరిగినట్లు కనిపిస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన చేపట్టిన వ్యక్తులు గతంలో ఎన్నడూ వలసల మీద గానీ మతపరంగా ఉన్న అల్ప సంఖ్యాకుల సమస్యల మీద గానీ పరిశోధన చేసిన అనుభవం ఉన్నవారు కాదు.
జె ఎన్ యూ తరఫున ప్రాజెక్ట్ చేసిన ప్రొఫెసర్ మనురాధ చౌదరి రష్యన్ భాష బోధించే ప్రొఫెసర్. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ గా కూడా పని చేశారు. పొరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ బహిరంగ ప్రకటన చేసిన వారిలో ఈమె ఒకరు. ఈ చట్టం ఆమోదించిన తర్వాత దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసన ల నేపథ్యంలో విడుదలైన ఈ బహిరంగ ప్రకటన అర్థరహితంగా జనంలో చత్య గురించిన భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నంగా ఈ ఆందోళనల గురించి వ్యాఖ్యానించారు.
మనూ రాధ చౌదరి ట్వీట్ల నిండా ఆర్ఎస్ఎస్ నేతల ప్రకటనలే ఉంటాయి.. హిందువులు ఉంటేనే దేశం ఉంటుంది అంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు కృష్ణ గోపాల్ చేసిన వీడియో వ్యాఖ్యలు కూడా ఈమె ట్విట్టర్ ఖాతాలో చూడవచ్చు.
టిస్ తరఫున అధ్యయనం. నిర్వహించిన బృందానికి నాయకుడు టిస్ ప్రో వైస్ చాన్సలర్ శంకర్ దాస్. ఈయన బోధించే రంగం వైద్య వ్యవస్థల గురించిన రంగం. పాలస్తీనా పోరాటానికి సంఘీభావం తెలిపేలా దుస్తులు ధరించినందుకు ఒక విద్యార్థికి పట్టా ఇవ్వ నిరాకరించడం ద్వారా 2924 సెప్టెంబర్ లో శంకర్ దాస్ వార్తల్లోకి ఎక్కారు.
ఈయన గారి నాయకత్వంలో నే గతంలో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరం ను రద్దు చేయటం, విశ్వ విద్యాలయం పాలక మండలికి వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళనలు చేయనని రాసి ఇవ్వడం, దేశభక్తి లేని చర్చల్లో పాల్గొననని ప్రతిజ్ఞ చేయతం వంటి ప్రతిపాదనల అమలుకు ప్రయత్నం చేశారు..పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు.
ఢిల్లీలో నవంబర్ 11 న జరిగిన సెమినార్ లో ఈ నివేదికలు ప్రవేశ పెట్టారు. ఆ సెమినార్ లో జే ఎన్ యూ వైస్ చాన్సలర్ శాంతిశ్రీ దూలిపూడి పండిట్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఇక ఈ నివేదికల లోని పరిశోధన ఫలితాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక దశలో ఈ నివేదిక ను ఎక్కిక్యూటివ్ సమ్మరీ అని పిలిస్తే మరో దశలో ఇది పైలట్ స్టడీ మాత్రమే అని,మరో దశలో మధ్యంతర నివేదిక అని చెప్పారు. అంతిమంగా వలసలు వాటి పర్యవసానాలు గురించిన అధ్యయనాల్లో మైలురాయి అని వారికి వారే కితాబు ఇచ్చుకున్నారు..
ముంబై కి సంబంధించిన అధ్యయనంలో ఇటువంటి వలసలతో ముంబై మురికివాడలు నిండి పోయాయని, ఫలితం గా విద్యా వైద్య సదుపాయాలు వంటివి కల్పించడం ప్రభుత్వాలకు భారంగా మారిందని నిర్ధారించారు. వలసదారులు పిల్లల కారణంగా స్థానికుల పిల్లలు నాణ్యమైన విద్య పొందలేక పోతున్నారని కూడా నివేదిక లో ఆరోపించారు.
19661 నాటికి ముంబై లో 88 శాతంగా ఉన్న స్థానికులు ప్రత్యేకించి హిందువులు 2011 నాటికి 66 శాతానికి తగ్గి పోయారనీ 1961 లో కేవలం ఆరు శాతంగా ఉన్న ముస్లింలు 21 శాతానికి పెరిగి పోయారని కూడా ఈ నివేదిక నిర్ధారించింది. ఇదంతా కేవలం 300 మందిని మాత్రమే ప్రశ్నించి రూపొందించిన నివేదిక. 2051 నాటికి నగరంలో హిందువుల జనాభా 54 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది. మౌలికంగా నే ఈ లెక్కలు అందుబాటులో ఉన్న జనగణన వివరాలకు నిర్ధారణకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్పాన్సర్ చేసిన అధ్యయనం లో కూడా వలసదారులు నగర మౌలిక సదుపాయాల కొరతకు నాణ్యత లోపానికి కారణం అవుతున్నారని విద్యా వైద్య రంగాల్లో ఫలితాలు రాక పోవడానికి కారణం అని నిర్ధారించింది. సీలంపూర్, ముస్తఫా నగర్, జామియా నగర్ వంటి ప్రాంతాల్లో స్థానిక సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించింది ఈ నివేదిక.
స్థానికులు స్థానికేతరులు మధ్య తలెత్తే వివాదాలు తరచూ ఆందోళన రూపం తీసుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అక్రమ వలసదారులకి రాజకీయ ప్రాపకం అవసరం తో ఓటు హక్కు కూడా కల్పిస్తున్నారని ఫలితంగా ప్రజాస్వామ్యం నైతికత దెబ్బ తింటోంది అని నివేదిక అంచనాకు వచ్చింది.
పలువురు మేధావులు స్వతంత్ర పరిశోధకులు ఈ నివేదికలను పలు కోణాల్లో విమర్శించారు. ఎంచుకున్న పతీశోధనా పద్ధతి, నిర్ధారణకు పాటించిన ప్రమాణాలు గురించిన అనేక ప్రశ్నలు ఉన్నాయి.
మేధోపరంగా చూసినా ఈ పరిశోధన పెవలంగా ఉంది. జనాభా పొందిక లో వస్తున్న మార్పులను దీర్ఘకాలంలో అధ్యయనం చెయ్యాలి. కోట్లాది జనాభా గురించిన ఒక అధ్యయనం చేసేటపుడు కేవలం 300 మందిని ఎంచుకుని దాన్నే ప్రమాణంగా భావించి నిర్ధారణకు రావడం వృత్తి పరమైన పరిశోధకులు అనుసరించే ప్రమాణం కాదు. ముంబై లో ఆరోగ్య రంగ సంక్షోభం దీర్ఘకాలం నుండి ఉన్న సమస్య. ఈ సమస్య వలసదారుల వల్లనే తలెత్తింది అని నిర్ధారణకు రావడం అన్యాయం. నగరానికి వస్తున్న వలస కార్మికులు దేశంలోని అనేక రాష్ట్రాలనుండి వస్తున్నారు. వస్తున్నవారంతా ముస్లింలు అని నిర్ధారణకు రావడం అంటే వాస్తవిక స్థితిగతుల మీద వలసల శైలి మీద అవగాహన లేపోవడమే అని టిస్ కు చెందిన ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు..
ది వైర్ తెలుగు ప్రతేక కథనం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.