
– ఎండోమెంట్ శాఖ ముసుగులో ప్రైవేట్ భూమి కబ్జా
– సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి వద్ద ఘటన
– కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం
– జాయింట్ సర్వేకు ఆదేశం ఇచ్చినా ఆగని ఆక్రమణ!
హైదరాబాద్: భూకబ్జాదారులకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. ఖాళీ భూమి కనిబడితే సరి ప్రైవేటు భూమినా లేకా ప్రభుత్వ భూమినా అని చూడాకుండా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా భూకబ్జాకు దిగుతున్నారు. అయితే, వీరికి ప్రభుత్వ అధికారుల, బడాబాబుల తోడు ఉండడంతో వారి నీడలో ఈ పనులకు దిగుతున్నట్టుగా కొన్ని ఘటనలతో అర్థమవుతుంది.
తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సర్వే నంబర్ 265లో తెలంగాణ ఉద్యమకారుడు, చిత్ర దర్శకుడు సయ్యద్ రఫీ ఎల్లమ్మ గుడికి నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమిని దానం చేశారు. ‘సోదరభావంతో ఆలయానికి మేము భూముని దానం చేశాం, ఇప్పుడు ఆ భూమి విలువ సుమారు ముప్ఫై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పలుకుతోంది. దాని పక్కనే ఉన్నటువంటి మిగిలిన మా భూమి మీద కన్నేసి కబ్జా చేస్తున్నారు’ అని రఫీ తెలియజేశారు.
సర్వే నంబర్ 264లో 32 1/2 గుంటల తమ సొంత భూమిని గుడి ఈవోతో పాటు మరికొందరు కలిసి కబ్జా చేస్తున్నారని సయ్యద్ రఫీ ఆరోపించారు. రెండవ శనివారం, ఆదివారం రోజుల్లో రాత్రివేళ లైట్లు పెట్టి మరీ ఎండోమెంట్ ముసుగులో తమ భూమిని కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రఫీ సంప్రదించి, వినతి పత్రం అందజేసి ఫిర్యాదు చేశారు.
అయితే సెప్టెంబర్ 2024లో అడ్వకేట్, కమిషనర్ ఆధ్వర్యంలో తమ భూమి సర్వే జరిగిందని రఫీ మంత్రి సురేఖకు తెలిపారు. సర్వే సమయంలో హద్దు రాళ్లుగా పెట్టిన వాటిని తీసేసి మరి, పిల్లర్లు నిర్మించడం మొదలు పెట్టారని అన్నారు. ‘కబ్జా విషయం మీద హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. ఇద్దరు ఒకటై, భూకబ్జాకు పాలుపడుతున్నారేమో’ అని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రఫీ నుంచి ఫిర్యాదు తీసుకున్న మంత్రి కొండా సురేఖ స్పందించారు. అక్కడ జరుగుతున్న పనిని ఆపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జాయింట్ సర్వే చేయించాలని దేవాదాయ శాఖ కమిషనర్ని మంత్రి ఆదేశించారు.
అయినా కానీ, అక్రమ నిర్మాణం కొనసాగుతూనే ఉండడంతో రఫీ ఆవేదనవ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ చర్యలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
– – సయ్యద్ రఫీ (చిత్ర దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.