
జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే జీవితం ఆధారంగా తీయబడిన “ఫూలే” చిత్రం జ్యోతిబా ఫూలే జయంతి ఏప్రిల్ 11న విడుదల కావాల్సింది. కానీ బ్రాహ్మణ సంఘాల అభ్యంతరం తర్వాత చిత్రం నుంచి కులాన్ని సూచించే అనేక పదాలను తీయాలని సీబీఎఫ్సీ సూచించింది. దీని తర్వాత ప్రస్తుతం చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు.
న్యూఢిల్లీ: బ్రాహ్మణ సంఘాల అభ్యంతరం తర్వాత కులసూచక శబ్దాలను “ఫూలే” చిత్రంలో తొలిగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చిత్ర నిర్మాతలకు చెప్పింది. దీని పర్యావసానంగా చిత్రం విడుదల వాయిదా పడింది.
జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రను ఆధారంగా “ఫూలే” చిత్రాన్ని చిత్రీకరించారు. దీనిని జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 11) విడుదల చేయాలి అనుకున్నారు. దేశవ్యాప్తంగా జ్యోతిబా ఫూలే పుట్టినరోజును ఫూలే జయంతిగా జరుపుకుంటుంటారు.
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం వివాదం వల్ల చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. చిత్రంలో నటుడు ప్రతిక్ గాంధీ ఫూలే, నటి పత్ర్లేఖా సావిత్రిబాయి పాత్రలో నటించారు.
మహర్, మాదిగ, పేశ్వా ఇంకా “మను కులవ్యవస్థ” లాంటి పదాలను చిత్రంలో నుంచి తీసివేయాలని సీబీఎఫ్సీ సూచించింది. అంతేకాకుండా ఈ పదాలను “సున్నితం” అయినవిగా సెన్సార్ బోర్డ్ తెలిపింది.
చిత్రం ‘కులతత్వాన్ని పెంచుతుంది’, బ్రాహ్మణులను ‘ప్రతికూల వెలుగు’లో చిత్రిస్తుందని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఆనంద్ దవే ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఎఫ్సీ చిత్రబృందానికి పలు సూచనలు చేసింది.
కుల ఆధారంగా వివక్షను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని దవె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇది మహాత్మా ఫూలే సంస్కరణ ప్రయత్నాలను బలపరిచిన బ్రాహ్మణుల సహకారాన్ని కనుమరుగు కూడా చేస్తుందని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాఢీలోని ఎన్సీపీ(శరద్ పవార్)పార్టీ ఫూలే చిత్రంలోని కొన్ని దృశ్యాలను తీసివేసే సీబీఎఫ్సీ నిర్ణయాన్ని తప్పుపడుతూ విమర్శించింది.
చరిత్రను తుడిచి వేయలేమని, దాని నుంచి కేవలం నేర్చుకోవడం జరుగుతుందని ఎన్సీపీ(శరద్ పవార్) నాయకుడు జితేంద్ర అవ్హాద్ అన్నారు. అంతేకాకుండా “మహాత్మ జ్యోతిరావు ఫూలేతో ముడిపడిన “ఫూలే” చిత్రంలో ఏదైతే చూపించడం జరిగిందో అది ఒక చారిత్రక సత్యం. సత్యాన్ని తిరస్కరించడం, మార్చడం జరగదు. ఈ దేశ సంఘ సంస్కర్తలలో మహాత్మ ఫూలే, సావిత్రిబాయి ఫూలే పేర్లు అందరి కంటే ముందు ఉన్నాయి. ఏదితై నిజమో, దానిని చూపించాలి” అని చెప్పుకొచ్చారు.
లోతైన పరిశోధన తర్వాత ఫూలే చిత్రం చిత్రీకరించబడిందని చిత్ర దర్శకుడు అనంత్ మహదేవన్ అన్నారు. ఇంకా ఈ చిత్ర కథావిషయం అనేక పుస్తకాలు, చారిత్రక మూలల నుంచి తీసుకోవడం జరిగిందని తెలిపారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.