
మొదటిగా వాస్తవాలు చూద్దాం.
బీహార్ శాసనసభ పదవీకాలం 2025 నవంబర్ 22 తో ముగుస్తుంది. అంటే ఆలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి.
కేంద్ర ఎన్నికల సంఘం సమన్య సమంజసం అని భావిస్తే ఏ నియోజకవర్గంలోనైనా లేదా ఏదైనా నియోజకవర్గంలో ఒక భాగంలో నేనా ఓటర్ల జాబితాను సవరించడానికి ప్రత్యేకమైన అధికారాలు 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 21(3) ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయి. అయితే అటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి ప్రేరేపించిన కారణాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేయాల్సి ఉంది.
1960 నాటి ఓటర్లు జాబితా నమోదు నిబంధనలు లో రూల్ 25 కూడా ఈ అధికారాన్ని ధ్రువీకరిస్తుంది. ప్రజా ప్రాప్తికి చట్టం సెక్షన్ 21 సబ్ సెక్షన్ రెండు ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ల జాబితాను సమగ్రంగా గాని, సారాంశం గానీ సవరించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయవచ్చు.
2025 జూన్ 24 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నాలుగు పేజీల పత్రికా ప్రకటన లో
1. బీహార్ లో ఓటర్ల జాబితాలను సమగ్రంగా సవరించుకొని ఆదేశించింది.
2. 01.07.2025 మొదలుకుని ఓటర్ల జాబితా లో ప్రత్యేకమైన సమగ్ర సవరణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 19 పేజీల ఉత్తరం రాసింది. ఇందులో మూడు పేజీలు లేఖ అదనంగా నాలుగు అనుబంధాలు జోడించింది.
ఆ) ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించిన ఆదేశం మూడు పేజీలు
ఆ) తొమ్మిది పేజీల నిడివిలో ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తు కు మార్గదర్శకాలు
ఇ) రెండు పేజీలు నమోదు పత్రం, ధ్రువీకరణ ప్రకటన
ఈ) మరో రెండు పేజీల ధ్రువీకరణ పత్రం – ఇందులో ధృవీకరణతో పాటు సదరు ఓటరు ఓటర్ల జాబితా సవరణ అధికారికి సమర్పించే పత్రాలు జాబితా (ఒక్కొక్క ఓటరు తనకోసం తన తల్లిదండ్రుల కోసం వేరువేరు అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఈ అఫిడవిట్లు లో 2003 జనవరి ఒకటో తేదీ నాటికి ఆయా సభ్యులు ఏయే నియోజక వర్గాలలో ఓటర్లు గా ఉన్నారో ఈ వివరాలు కూడా ఆధారాలతో జత చేయాలి)
రాష్ట్ర ఎన్నికల అధికారికి రాసిన లేఖ లో ఏడో పేర లో బీహర్ ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం క్రింద ప్రస్తావించిన టైమ్ టేబుల్ ప్రకారం పూర్తి కావాలి అని ఆదేశించింది.
ఈ టైమ్ టేబుల్ ప్రకారం జూన్ 25 న పని మొదలు కావాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఉదయం మొదలు పెట్టాలన్న లేఖ రాసింది జూన్ 24. మొదలు పెట్టాల్సి గడువు జూన్ 25. ఈ కార్యక్రమం పూర్తి చేయటానికి చేపట్టాల్సిన చర్యలు ఇవి :
ఓటరు నమోదు అధికారులు నమోదు ఫారాలు అచ్చు వేయించాలి. వీటిని పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు అందజేయాలి. రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉంటే అంత మందికి సరిపడా నమోదు ఫారాలు అచ్చు వేయించాలి.
నమోదు ఫారాలు నింపటానికి, నింపిన ఫారాలు తనిఖీ చేయటానికి సంబంధించి పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలి.
ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు ఫారాలు ఓటర్లకు అంద చేయాలి
ఇంటింటికి తిరిగి నింపిన ఫారాలు సేకరించాలి
ఉన్నతస్థాయి అధికారులు ఈ ఫారాలు తనిఖీ చేయాలి
పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ, పోలింగ్ స్టేషన్ల హద్దులు ఖరారు చేయటం
ఆగష్టు ఒకటో తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయాలి
ఓటర్ల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు అంటే తెలియజేసేందుకు గడువు ఇవ్వాలి
అభ్యంతరాలు కు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించి తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30 నాటికి సిద్ధం చేయటం
ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అవసరం సందర్భం
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం
” వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న వలసలు, తొలి తరం ఓటర్లు, మరణాల వివరాలు సమగ్రంగా నమోదు కాకపోవడం, విదేశాలనుండి అక్రమంగా వచ్చిన వారికి ఓటు హక్కు దఖలుపర్చడం వంటి కారణాల రీత్యా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అవసరం అయ్యింది. ఈ కసరత్తు ద్వారా లోపరహితమైన ఓటర్ల జాబితాను చేయటానికి ఈ కసరత్తు అవసరం” అని పేర్కొన్నది.
జూన్ 24 వ తేదీ జారీ చేసిన ఆదేశంలో ” ఈ లక్ష్యానికి అనుగుణంగా ఎన్నికల సంఘం గతంలోకూడా 1952-1956, 1957, 1961, 1965, 1966, 1983-84, 1987-89, 1992, 1993, 1995, 2002, 2003, 2004 లో కూడా ఈ కసరత్తు దేశవ్యాప్తంగా గానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు కానీ జరిగింది. బీహార్ కు సంబంధించినంత వరకు చివరిసారిగా ఈ సమగ్ర సవరణ 2003 లో జరిగింది. ”
ఈ వివరణ మరికొన్ని సమస్యలు ముందుకు తీస్తోంది.
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న వలసలు, తొలి తరం ఓటర్లు, మరణాల వివరాలు సమగ్రంగా నమోదు కాకపోవడం, విదేశాలనుండి అక్రమంగా వచ్చిన వారికి ఓటు హక్కు దఖలుపర్చడం వంటివి నిరంతరం జరుగుతున్న లేదా కొనసాగుతున్న పరిణామాలా ? లేక గత కొంతకాలంగా మాత్రమే చోటు చేసుకుంటున్న పరిణామాల ? అన్నవి ఈ ప్రశ్నలు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారమే 1952 నుండి 2004 వరకు ఎన్నో సార్లు ఓటర్ల జాబితా సమగ్ర సవరణలు జరిగినపుడు మరి గత పన్నెండేళ్ల గా ఈ కసరత్తు ఎందుకు చేపట్టలేదు !
2004 నుండి నేటివరకు ఏమి జరిగింది ఏమీ జరగలేదు ఎందుకు అన్న ప్రశ్నలకు ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు బాధ్యులు కాదు అన్న సమాధానం చెప్పొచ్చు కానీ ఈ సమాధానం దేశ ప్రజలను సంతృప్తి పర్చలేవు. ఎందుకంటే ఎన్నికల సంఘం శాశ్వతమైన సంస్థ. మధ్యలో అధికారులు వస్తారు వెళ్తారు. ఎవరు ఉన్నా లేకున్నా సంస్థాబాన్న తర్వాత దానికంటూ ఓ చరిత్ర అనుభవాలు వారసత్వం ఉంటాయి. 21 సంవత్సరాలు అన్నది ఏమీ తక్కువ కాలం కాదు.
ఈ టైమ్ టేబుల్ ఆచరణ సాధ్యమా ?
పైన ప్రస్తావించిన మొత్తం టైమ్ టేబుల్ ఆచరణ సాధ్యం కాదు.
పోలింగ్ బూత్ అధికారులు జూన్ 24 వ తేదీ ఆదేశాలు అందుకున్న వెంటనే నమూనా ఓటరు నమోదు ఫారాలు తయారు చేసి అచ్చువేసే తెల్లారేసరికి ఓటర్లకు చెరుస్తారని నమ్ముతున్నారా లేక అందరినీ ఓటరు నమోదు ఫారాలు వాట్సాప్ లో పంపితే ఓటర్లు అందరూ తెల్లారేసరికి ప్రింట్ అవుట్ తీసుకుని వివరాలు నింపి తిరిగి పోలింగ్ బూత్ అధికారులకు అంద చేయటానికి క్యూ కట్టి నిలబడతారు అనుకుంటున్నారా ? ఒకవేళ ఇవన్నీ సాధ్యమే అనుకున్నా రాష్ట్రమంతా రెండు దఫాలుగా ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు ఫారం లో ఉన్న వివరాలు తనిఖీ చేసి పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్లను పునః పంపిణీ చేయటం తదనుగుణంగా ఓటర్ల జాబితా ఖరారు చేయటం సాధ్యమవుతుందా ?
ఈ విషయంలో ఎన్నికల సంఘం తమ అత్యాశ ఎంతటిదో అర్థం చేసుకోవడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సైన్సెస్ పని తీరును ఒక్కసారి గమనిస్తే ఉపయోగంగా ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ కసరత్తు మొదలు పెట్టే టైమ్. ఓటర్ల జాబితా సమగ్రంగా సవరించడం ఉపయోగమే. ఈ కసరత్తు ఇంకా తగినంత ముందుగానే మొదలైతే మరింత అర్థవంతంగా పూర్తి చేయటానికి వీలయ్యేది.
ఎన్నికల సంఘం జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఈ కసరత్తు సజావుగా పూర్తి చేయటానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్నీ సంపూర్ణంగా సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
అంతేకాదు. ” ఏ ఎన్నికల క్రమంలోనైనా ఓటర్లు పార్టీలు అసలైన పాత్రధారులు. ఇంతటి భారీ కసరత్తు సమర్ధవంతంగా సజావుగా పూర్తి కావాలంటే ఈ పాత్ర ధారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలి.
ఎన్నికల సంఘం దృష్టిలో ఓటర్లు పార్టీలు కీలకమైన పాత్రధారులు అయినపుడు ఇంత మహత్తరమైన కసరత్తు కు సంబంధించిన ప్రణాళిక తయారీలో వారిని భాగస్వాములను చేయటం అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం భావించలేదా?
చట్టపరమైన సమస్యలు – ఆచరణాత్మక సమస్యలు
కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 24 న ఇచ్చిన ఆదేశంలో ” గత సవరణ 2003 లో జరిగింది కనుక జనవరి 1, 2003 ను ప్రామాణిక తేదీ గా పరిగణించి తాజా సవరణ జరగాలి. 2003 నాటికి ఓటర్ల జాబితా లో ఉన్న వాళ్లను యధాతధంగా ఓటర్లుగా గుర్తించాలి. వారిని పౌరులు గా గుర్తించాలి ” అని ప్రకటించింది.
అంతే కాదు.
” 2003 నాటికి ఓటర్ల జాబితాలో లేని వారు అనేక ప్రభుత్వ దృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సదరు పౌరులు ఓటర్లుగా నమోదు అయ్యే అర్హత పొందుతారు.
ఈ రెండు పేరాలు కలిపి చదివితే (చట్టపరమైన వ్యాఖ్యానం పక్కన పెట్టి) 2003 నాటికి ఓటరు కానీ వారిని భారతీయ పౌరులుగా గుర్తించరు అన్నది సారాంశం.
ఇది పెద్ద మాట గా కనిపించవచ్చు కానీ అదే లేఖ లో 11 వ పేరా చూడండి. ఈ పేరాలో ఎన్నికల సంఘం “పౌరసత్వ ధ్రువీకరణ తో సహా 2003 జనవరి 1 నాటికి ఓటరు కానీ వారు తమ ధ్రువీకరణ ను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది”.
అటువంటి వారు తమ పౌర సత్వాన్ని తద్వారా ఓటరు హక్కును ధృవీకరించుకోవడానికి అనేక పత్రాలు జమ చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని పత్రాలు పౌరసత్వ ధ్రువీకరణ కూడా చేసుకోవాల్సినవి ఉంటాయి.
ఇక్కడ మూడు ప్రశ్నలు అర్థం కాకుండా ఉన్నాయి.
మొదటిది : 2003 జనవరి ఒకటో తేదీ నాటికి ఓటర్లుగా నమోదు కాకుండా తర్వాత కాలంలో నమోదు అయితే తాజా ఆదేశాల ప్రకారం వారిని ఓటర్లుగా ఎన్నిక సంఘం గుర్తించడం లేదా? అటువంటపుడు 2003 నుండి గత పాటికెళ్లలో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓట్ల పరిస్థితి ఏమిటి ? ఆ ఓట్లు ఆధారంగా గెలిచిన అభ్యర్థులకు ఉన్న చట్టబద్ధత ఏమిటి ? ఈ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి ?
రెండు : 2003 తర్వాత ఓటర్లుగా నమోదు అయినా వారిని తాజా ఆదేశాల ప్రకారం ఓటర్లుగా గుర్తించక పోతే వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించినట్లేనా ? అలా జరిగితే అనేక తీవ్ర పరిణామాలు పర్యవసానాలు తలెత్తనున్నాయి.
ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలు 21 ఎ ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. తదనుగుణంగా పాటించాల్సిన విధి విధానాలు కూడా స్పష్టం గా నమోదు అయి ఉన్నాయి. ఏ ఓటరు పేరు తొలగించాలని ఎన్నికల అధికారి నిర్ణయించుకుంటే సదరు ఓటరు కు తన వాదన వినిపించుకునేందుకు సంపూర్ణ అవకాశం ఇవ్వాలి.
అంటే జనవరి 1, 2003 నాటికి ఓటర్లుగా నమోదు కానివారు ఆ తర్వాత ఓటర్లుగా నమోదు ఆయన వారికి తాజా ఆదేశాల ప్రకారం తమ పేర్లు తొలగించటానికి ముందు లేదా తొలగించినట్లు పరిగణించటానికి ముందు కనీస వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వలేదు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓటరు హక్కు రద్దు అయిన పౌరులు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే తుది పర్యవసానం కోర్టు తీర్పు పై ఆధారపడి ఉంటుంది.
మూడు : ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించిన సమస్య. జూన్ 24 వ తేదీన జారీ చేసిన ప్రకటన కు ముందు ఓటరు నమోదు చేసుకోదల్చుకున్న వ్యక్తి ఎవరైనా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రింది డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది :
నాకు తెలిసినంతవరకు ఈ క్రింద తెలిపిన విషయాలు వాస్తవాలు.
1. నేను భారతీయ పౌరుడిని. ….గ్రామం/…. తాలూకా …. జిల్లా …. రాష్ట్రం లో పుట్టాను.
2. నా సాధారణ నివాసం…..
3. మరే ఇతర నియోజకవర్గంలోనూ నేను ఓటరుగా నమోదు చేసుకోలేదు.
4. ఇప్పటివరకూ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఓటరుగా నమోదు కాలేదు.
అని కానీ లేదా
నా పేరు ….. నియోజక వర్గంలో నమోదు అయి ఉంది. నా పేరు సదరు ఓటరు జాబితా నుండి తొలగించాలని కోరుతున్నాను.
ఫారం 6 లో తల్లితండ్రుల గురించిన వివరాలు ఏమీ తెలియజేయాల్సిన అవసరం లేదు.
కానీ తాజా ప్రకటన ప్రకారం ఓటరుగా నమోదు కాదల్చుకున్న వ్యక్తి తమ విజ్ఞప్తి తో పాటు కొన్ని పత్రాలను జత చేయాల్సి ఉంటుందని సూచించింది. తల్లి తండ్రుల గురించి తన గురించి స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
ఇంత మౌలిక మార్పు జరుగుతున్నపుడు ఈ మార్పు అవసరం గురించి కానీ ఆచరణ సాధ్యత గురించి కానీ కనీస ప్రాథమిక చర్చ కూడా జరగలేదు.
ఆచరణకు సంబంధించిన సమస్యలు
పత్రికా ప్రకటనలో ఈ క్రింది విషయాలు ప్రధానమైనవి ఎన్నికల సంఘం ప్రకటించింది.
– జూన్ 24 తేదీ నాటికి ఓటర్ల జాబితాలో ఎంత మంది ఉన్నారో అన్ని ఫారాలు అచ్చు వేయాలి. వాటిని బూత్ స్థాయి అధికారులకు చేర్చాలి.
– పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఈ ఫారాలు ఓటర్ల కు అంద చేయాలి.
– ఓటర్ల జాబితా లో పేర్లు ఉన్నవారంతా ఎన్నికల సంఘం వెబ్సైట్ నుండి ఈ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి అందించవచ్చు.
వెబ్సైట్ లో ఈ ఫారాలు అందుబాటులో ఉండటం మంచిదే. కానీ ఎంత మంది వెబ్సైట్ నుండి ఫారం డౌన్లోడ్ చేసుకునే అవగాహన కలిగి ఉన్నారు ?
ఇక వలసల సమస్య కూడా తీవ్రైనదే. బతుకుదెరువు కోసం వలసలు వెళ్లే బీహరీల గురించి అందరికీ తెలిసిందే. వలస కార్మికుల కష్టాలు గురించి కూడా మనకు తెలిసిందే. పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు కోసం వెళ్లిన కార్మికులు బూత్ స్థాయి అధికారి తనిఖీ కోసం ఇంటికి వచ్చినపుడు ఇంటిదగ్గర అందుబాటులో ఉండలేరు. అటువంటి వాళ్ళు ఎన్నికల సంఘం వెబ్సైట్ లోంచి ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి తిరిగి అప్లోడ్ చేయగల సాంకేతిక అవగాహన భౌతిక పరిస్థితి లో అంటారా ?
తాజా ఆదేశాలతో ఇలాంటి ఎంతమంది అభాగ్యులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఎదుర్కోనున్నారో!
పారదర్శకత
పత్రికా ప్రకటనలో నాల్గో పెరా లో ఉన్న విషయాలు మరింత ఆసక్తికరమైనది.
” పారదర్శకత కోసం బూత్ పోలింగ్ అధికారులు సేకరించే వివరాలు అన్నిటినీ ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. అయితే గోప్యత సమస్యల నేపథ్యంలో ఈ వివరాలు కొంతమంది ఎన్నికల సంఘం అధికారులు మాత్రమే
ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన పారదర్శకత.
అందరికీ అందుబాటులో ఉండటానికి ఆన్లైన్ లో అప్లోడ్ అయ్యే వివరాలు కొందరికి మాత్రమే చూసే వీలు కల్పించడం ఏ రకమైన పారదర్శకత ?!
మరో కోణం
జూన్ 25 వ తేదీ జాతీయ పత్రిక రాసిన సంపాదకీయంలో :
” 2004 తర్వాత పుట్టిన వారి జనన ధ్రువీకరణ పత్రం తో పాటు తల్లి తండ్రులకు సంబంధించిన దృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి రావడం అనేక గందర గోళం కి దారి తీసే ఆ ఆకాశం ఉంది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజెపి చేతిలో పావుగా మారిన అక్రమ వలసదారుల నినాదం రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన తరగతులు వారిని, ముస్లింలను లక్ష్యం గా మార్చుకోవడానికి రంగం సిద్ధం అవుతుందా అన్న సందేహం కలిహుగుతుంది
బీహార్ లో పేద ఓటర్లు తామూ ఓటర్ల మే చట్టబద్ధమైన పౌరులమే అని నిరూపించుకోవడానికి తిరగాల్సి రావడం సరైనది కాదు. అది రూడా ఋతుపవవాలు సమీపిస్తున్న తరుణంలో ఇది అసలు పనికిరాని పరుగులాట” అని వ్యాఖ్యానించింది.
ఏరకంగా చూసినా ఎన్నికల సంఘం ప్రకటించిన సంహర్ ఓటరు సవరణ కసరత్తు ఉన్న ఫలంగా పూర్తి చేయటం ఆచరణ సాధ్యం కాదు. ఈ రకమైన హడావుడి కసరత్తు రాష్ట్రంలో లక్షలాదిమంది ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. సమగ్ర ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దీర్ఘకాలంగా అమలు చేస్తూ వచ్చిన విధి విధానాలనే తుంగలో తొక్కుతోంది. ఈ నిర్ణయం అనేక న్యాయ పరమైన సమస్యలను ముందుకు తెస్తోంది.
చివరి మాట
2003 తర్వాత కాలంలో ఓటర్లుగా నమోదు అయిన వాళ్ళు తమ ఓటు హక్కు కాపాడుకోవడానికి గాను చూపించాల్సిన అనేక కాగితాల జాబితాను పరిశీలిస్తే చివరకు బీహార్ కూడా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమం ఇచ్చిన పిలుపు మేము కాగితాలు చూపించం ఆన్న నినాదాన్ని అందుకోవాల్సిన సమయం వచ్చినట్టు కనిపిస్తోంది..
జగదీప్ ఎస్ చోకర్
అనువాదం కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.