
వాడూ! నేనూ!
వాడూ నేనూ బాల్య మిత్రులం
పెరిగి పెద్దయ్యాక దారులు వేరయ్యాయి,
వాడూ నేనూ కవులయ్యాం
వేదశాల వాడంటే! వేధశాల నేనంటా!
కీర్తి కొలనుల్లో బంగరు పద్మాలవెంటవాడు
కార్మిక జనావళిలో వూరి పేద వాడల్లో నేనూ
వేద పురాణాలు, ఉపనిషత్తులు వాడు ప్రవచిస్తుంటే
వేదనలూ, రోదనలూ పోరాటాలూ నేను రచిస్తుంటే
కలవని మా భావాలు రైలు పట్టాల్లా ఉన్నై!
ధనికులు, ధర్మకర్తలంటాడు వాడు
శ్రామికులే చరిత్ర నిర్మాతలంటాను నేను
మతం మత్తులో వాడు
మానవతా జగత్తులో నేనూ
పుటం పెట్టిన బంగారంలా ‘‘సత్యం’’ నిలుస్తుంది
విశ్వమంతా సైన్స్- శాస్త్రీయత వెంట నడుస్తుంది
భావాలు వేరైనా! దారులు వేరైనా! నమ్మకాలు ఏవైనా!
విశ్వ ప్రేమిక ప్రేమలో కలుసుకొన్నాం
సమత, మమత, శాంతి, సోపతి తోడైనాయి.
తంగిరాల చక్రవర్తి (ఎంఏ)
రచయిత, కవి
ఫోన్ నెం: 9393804472
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.