
కేంద్రం నుంచి నిధులు సరిగా అందకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొన్ని పథకాలను అమలు చేయడానికి నిధులు సరిపోక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలానా పథకాలను అమలు చేయలేమని లబ్ధిదారులకు ముక్కుసూటిగా తెలియజేసింది. ముఖ్యమంత్రి మాటతో లబ్ధిదారుల ఆశలు ఆవిరయ్యాయి.
హైదరాబాద్: పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందవుతోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని అన్ని కీలక ప్రాజెక్టుల కోసం “న్యాయమైన”, “ఉదారవాద” సహాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత రేవంత్ స్పందించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను లబ్ధిదారులకు ఎత్తి చూపారు.
ఈ నెల జూన్ 16న ఓ కాకర్యక్రమం జరిగింది. ఆ సభలో రేవంత్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారిందని పేర్కొన్నారు.
“రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వడం కష్టంగా మారింది. కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం కష్టంగా మారింది. అంతేకాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేయడం కష్టంగా మారింది” అని రేవంత్ తెలియజేశారు.
ఏదిఏమైనా ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ‘రైతు భరోసా’ పథకం కింద తొమ్మిది రోజుల్లో దాదాపు రూ 9,000 కోట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం బదిలీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
“వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించడానికి 1.49 లక్షల ఎకరాల్లో 70,11,984 మంది రైతులకు, తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ 9,000 కోట్లు ఇవ్వడానికి నేను ఇక్కడికి రైతుల కోసం వచ్చాను” అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం, రాష్ట్రాన్ని “ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల” ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని రేవంత్ గతంలో అన్నారు.
మే నెలలో నీతిఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఉదారవాద, న్యాయమైన కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతూ రేవంత్ ప్రసంగించారు.
“దేశ రాజధానిలో జరిగిన నీతిఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఈరోజు హాజరయ్యాను. ప్రధానమంత్రి, అనేక మంది కేంద్ర మంత్రులు ఇంకా ఇతర ముఖ్యమంత్రులతో కలిసి భారతదేశ దార్శనికత, భవిష్యత్తు గురించి చర్చించాను” అని రేవంత్ సోషల్ మీడియా వేదిక తన ఎక్స్ హ్యాండిల్లో రాశారు.
“2018 తర్వాత ఈ వేదికలో తెలంగాణ మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రసంగిస్తున్నాను. తెలంగాణ రైజింగ్- 2047ను ప్రదర్శించాను. మా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఉదారవాద, న్యాయమైన కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నాను. పహల్గాంలో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, సరిహద్దు ఉగ్రవాదం- మన దేశ శత్రువులపై పోరాడాలనే సంకల్పంతో, భారతదేశం కలిసి ఉందని ఇంకా ఒకే గొంతుతో మాట్లాడుతుందని పునరుద్ఘాటించాను” అని ఆయన చెప్పుకొచ్చారు.
“జాతీయ భద్రత, అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి విషయాలలో, ఎటువంటి పక్షపాతానికి భేదానికి అవకాశం ఉండకూడదు. రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే విక్షిత్ భారత్- 2047 ప్రాజెక్టు సాకారం అవుతుంది. తెలంగాణరైజింగ్-2047 (#TelanganaRising 2047) ఒక ముఖ్యమైన భాగం, భారతదేశం ముందు, ప్రజలు ముందు అనే నినాద స్ఫూర్తితో కేంద్రం దీనికి పూర్తిగా మద్దతు ఇవ్వాలి” అని రేవంత్ అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.