
తిరుపతి లోని పద్మావతి పార్క్ వద్ద ఈ నెల 8న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.
తొక్కిసలాట ఘటనలో శ్రీవారి భక్తులు ఆరుగురు చనిపోయారు. ప్రమాద ఘటనపై విచారణకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా తొక్కిసలాట ఘటనపై విచారణ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉత్తర్వు లో వెల్లడించారు. ఇందులో భాగంగా న్యాయ విచారట సంఘాన్ని నియమించినట్టుగా చెప్పింది.
సెక్షన్-3 కమిషన్ ఆఫ్ ఇంక్వైరీస్ యాక్ట్, 1952 ప్రకారం పలువురు అధికారులను కమిషన్లో నియమించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి నాయకత్వంలో ఏక సభ్య కమిషన్ గా నియమించబడ్డారు. ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి వేడుకనాడు జరిగిన చొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణ విచారించనున్నారు. విచారణలో టోకెన్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఏర్పడిన పరిస్థితులను తెలుసుకోనున్నారు. అంతేకాకుండా టోకన్స్ ఇచ్చే చోట ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో, ఏర్పాట్లలలో ఏమైనా లోపాలు జరిగాయోనని విచారిస్తారు. సదరు వైఫల్యాలకు సంబంధించిన బాధ్యులను కూడా గుర్తించనున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం కోరింది.
ఆర్నెల్ల లో విచారణ కమిషన్ తన నివేదిక సమర్పించాలని ఉత్తర్వు లో పేర్కొన్నారు.
ఈ విచారణ సంఘం విచారణ లో బాగంగా సంబంధిత అధికారులను ఎవరినైనా సాక్షిగా పిలిచేందుకు, విచారణలో భాగంగా సంబంధిత సమాచారం, వస్తువులు, సాక్ష్యాలు సేకరించేందుకు కమిషన్ కు అధికారాలున్నాయని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ది వైర్ తెలుగు స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.