
జనవరి 21, 2025 న హైదారాబాద్ లో మరోసారి. ఆదాయపు పన్ను శాఖ హల్చల్ చేసింది. కాకపోతే ఈ సారి ఆదాయపు పన్ను శాఖ కన్ను సినీ రంగ ప్రముఖులు పై పడింది.
తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజుతో పాటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ల నివాసాలు ,కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంక్ ఖాతాలు కూడా పరిశీలించారు.
123తెలుగు వెబ్సైట్ సంచారం ప్రకారం జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ ల లోని దిల్ రాజు ఆఫీసులు తనిఖీ చేశారు. పనిలో పనిగా కలెక్షన్ల లో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆదాయపు పన్ను శాఖ ఆరాలు తీస్తోంది. ఇప్పటికే 1831 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినీ నిర్మాత, ప్రమోటర్స్ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు వీరిపై గురిపెట్టడం గమనార్హం. దిల్ రాజు నివాసం నుండి బ్యాంకు లాకర్లు కూడా తనిఖీ చేసినట్టు ఆయన భార్య తేజస్విని వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా ఈ మధ్య విడుదలైన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా కలెక్షన్లు వంద కోట్లు దాటాయని సినీ వర్గాల అంచనా. దిల్ రాజే నిర్మాతగా ఉన్న మరో సినిమా గేమ్ చెంజర్ కూడా జనవరి 2025 లోనే విడుదల అయ్యింది. దాదాపు 55 బృందాలతో సాగిన ఆ దాడులు సోదాలు దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మాంగో మీడియాల కు సంబంధించిన కార్యాలయాలపై కూడా జరిగాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.