
బీజేపీకి 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ అందజేసిన కంపెనీ పేరు సెయిల్ వందల కోట్ల కుంభకోణంలో ముందుకు వచ్చింది. కుంభకోణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేసిన అధికారి రాజీవ్ భాటియాను సెయిల్ ముందే సస్పెండ్ చేసింది. తన పదవీకాలం పూర్తి అయ్యే ఏడు సంవత్సరాల కంటే ముందే ఆయనను సెయిల్ అధికారులు పదవీ విరమణ చేయించారు.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ యాజమాన్య స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్ఏఐఎల్)కు అవినీతి వల్ల కోట్ల నష్టం జరిగిందని గడిచిన కొన్ని ఏళ్లలో లోక్‌పాల్‌కు ఫిర్యాదులు అందాయి. ఇటువంటి కొన్ని విషయాలలో సెంట్రల్ విజిలెన్స్ కమీషన్(సీవీసీ)తో ప్రాథమిక విచారణ చేయించిన తర్వాత సీబీఐకు లోక్‌పాల్ అప్పజెప్పింది. మరికొన్ని కేసులలో లోక్‌పాల్ నేరుగా సీబీఐకు అందజేసింది.
2023 జూలైలో సీవీసీ ద్వారా లోక్‌పాల్‌కు ప్రాథమిక విచారణను అప్పజెప్పారు. సీబీఐ ద్వారా 2024 అక్టోబర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లో బీజేపీకు చందా ఇచ్చిన ఆప్కో ఇంఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు వచ్చింది. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ భారత కలను సాకారం చేసే ప్రముఖ భాగస్వాములలో ఆప్కో ఒకటి”గా ఉందని ఈ సంస్థ వైబ్‌సైట్ తెలియజేస్తుంది.
2025 మార్చి 14న ఎన్నికల కమిషన్ ద్వారా ప్రచురితమైన గణంకాల ప్రకారం ఈ కంపెనీ 2020 జనవరి నుంచి 2023 అక్టోబర్ మధ్య 30 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసింది. ఇంకా ఈ మొత్తాన్ని బీజేపీ ఉపయోగించుకుంది.

వెంకటేష్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(వీఐపీపీఎల్)తో కలిసి సెయిల్‌కు భారీ నష్టం చేసినట్టుగా ఆప్కో మీద ఆరోపణలు ఉన్నాయి. 2024 జనవరి 10న లోక్‌పాల్ తన తీర్పులో ఈ కంపెనీలను ఇంకా సెయిల్ కూటమి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. “సెయిల్ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించబడలేదు. దీని పర్యవసనంగా వీఐపీపీఎల్ ఇతర వినియోగదారుల పోలికలో తక్కువ ధర మీద వస్తువులు ఇవ్వడం జరిగింది” అని న్యాయమూర్తి అభిలాషా కుమారీ, అర్చనా రామాసుందరం ఇంకా మహేందర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వినిపించింది.
“ఇది కేవలం ఆర్థిక నష్టానికి సంబంధించిన ప్రశ్నే కాదు. బదులుగా వ్యవస్థకు తెలిసీతెలిసీ నష్టం తలపెట్టాలని, ఇంకా కంపెనీకి లాభం చేకూర్చాలనే కారణాన్ని ఛిన్నాభిన్నం చేయడం కూడా ఇందులో కీలకమైనది. అంతేకాకుండా ఉక్కుపరిశ్రమ అనుభవజ్ఞులైన వాణిజ్యఆటగాళ్లు, సెయిల్ అధికారుల కుట్రతో వ్యవస్థలో అలజడి సృష్టించే అవకాశాలు ఉన్నాయి.”
ఉక్కుపరిశ్రమ ఆటగాళ్లు ఎవరు?
ది వైర్ చేపట్టిన ఈ ప్రత్యేక విచారణ సెయిల్‌లో జరుగుతున్న అక్రమాలు ఇంకా దాని అధికారుల కూటమిని వెలుగులోకి తెస్తుంది.
100 కంటే ఎక్కువ కంపెనీలకు కారుచౌకగా 11,00,000 కంటే ఎక్కువ మెట్రిక్ టన్నుల స్టీల్‌ను అమ్మినట్టుగా సెయిల్ మీద ఆరోపణ ఉంది. అయితే ఈ స్టీల్ ఏ రకంగాను ఉపయోగకరంగా లేదు. కానీ నిర్మాణ పనుల పేరు మీద సెయిల్ నుంచి దొరికే తగ్గింపును పొందుతోంది. ఇదే కాదు, ఈ కంపెనీలు సెయిల్ నుంచి తక్కువ ధరకు కొన్న స్టీల్‌ను ఎక్కువ ధరకు ఇతర కంపెనీలకు అమ్ముతున్నారు. సెయిల్ ఎంఓయూ ప్రకారం స్టీల్ కొనేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలకు “వడ్డీ లేని ఋణం” అందిస్తుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ ఈ సౌకర్యం లాభాన్ని తీసుకోకపోతే, దానికి అంతే మొత్తంలో తగ్గింపు లభిస్తుంది.
లోక్‌పాల్‌కు అందిన ఫిర్యాదుల మేరకు ఈ అక్రమాల నుంచి సెయిల్‌కు 400 కోట్ల కంటే ఎక్కువ నష్టం జరిగింది.
అన్నిటికంటే ఎక్కువ లాభాలను పొందే కంపెనీ..
దర్యాప్తు సంస్థల విచారణ ప్రకారం, ఈ అక్రమాల నుంచి కీలకంగా లాభాన్ని వీఐపీపీఎల్ పొందింది. ఇంకా ఈ కంపెనీతో ముడిపడిన అవినీతి ఆరోపణలలో ఆప్కో పాత్ర కూడా ఉంది.
ఆప్కో విడుదల చేసిన సర్టిఫికేట్ ఆధారంగా ఈ కథ మొదలైంది. దీని ప్రకారం 2020 అక్టోబర్ 20న వీఐపీపీఎల్కు ఒక సంవత్సరంలో 1,50,000 మెట్రిక్ టన్నుల స్టీల్ సప్లయ్ చేయడానికి సెయిల్ ఒప్పందం చేసుకుంది. వీఐపీపీఎల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాదనే ఆరోపణ ఉంది. అయినా కానీ దానికి కన్స్ట్రక్షన్ కంపెనీల కంటే ఎక్కువ తగ్గింపు దొరికింది. ఒప్పందం ప్రకారం, వీఐపీపీఎల్ ఈ స్టీల్‌ను నిర్మాణ పనుల కోసం చేయాల్సి ఉంది. కానీ వీఐపీపీఎల్ అలా చేసిందా?
వాస్తవానికి, వీఐపీపీఎల్ ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టడం లేదు. దర్యాప్తు సంస్థల ప్రకారం ఇది చౌకగా సెయిల్ నుంచి స్టీల్ తీసుకొని మార్కెట్లో ఎక్కువకు అమ్ముకుంది.
కానీ ఇలా ఎందుకు జరిగింది? సెయిల్‌కు ఈ కంపెనీ గురించి తెలియదా ఏంటి?
సెయిల్ అధికారులు వీఐపీపీఎల్తో ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకునే ముందు ఈ కంపెనీ గురించి దర్యాప్తు చేయలేదని సీవీసీ దర్యాప్తు తెలియజేస్తుంది. వీఐపీపీఎల్ ఏర్పాటు 2020 అక్టోబర్ 12న జరిగింది. అంటే కేవలం ఎనిమిది రోజుల ముందు ఏర్పాటైన కంపెనీ దేశ టాప్ స్టీల్ కంపెనీతో పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది.

వీఐపీపీఎల్ కన్స్ట్రక్షన్ పని చేస్తుందా లేదాని దీని విచారణ సెయిల్ ఎందుకు చేయలేదంటే, తమ ఎంఓయూలో దీనికి సంబంధించిన ఎటువంటి ప్రొవిజన్ లేదని సెయిల్ పేర్కొన్నది.
దీనికి సమాధానంగా “ఈ కంపెనీ సెయిల్ స్థాపిత కస్టమర్ కాదు, వీఐపీపీఎల్ ద్వారా అందజేయబడిన సర్టిఫికేట్ల మీద కళ్లు మూసుకొని గుడ్డిగా నమ్మేకంటే, తగిన శ్రద్ధను అమలు చేయాల్సి ఉండేది.” సీవీసీ తెలిపింది.
ఆరోపణల గొడవ ఇక్కడితో ముగియదు..
ఫిర్యాదు ప్రకారం సెయిల్ నుంచి కొన్న ఎక్కువ ఉక్కు(దాదాపు 1 లక్ష 24 వేళ మెట్రిక్ టన్నులు)ను వీఐపీపీఎల్ తన “కన్స్ట్రక్షన్ సైట్” మీద తెచ్చుకోకుండా వేరే కంపెనీల పేర్లు, ఇంకా చిరునామాకు తెప్పించుకుంది. దీంతో వీఐపీపీఎల్ సెయిల్ నుంచి స్టీల్ కొని వేరే కంపెనీలకు సరఫరా చేస్తుందని అర్థమవుతుంది.
వీఐపీపీఎల్, సెయిల్ ఒప్పందం అసలు కారణం: ఆప్కో సర్టిఫికేట్
వాస్తవానికి, వీఐపీపీఎల్తో ఒప్పందం సెయిల్ తన పాత కస్టమర్ ఆప్కో(కన్స్ట్రక్షన్ పని చేస్తుంది)ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ ఆధారంగా జరిగింది.
వీఐపీపీఎల్ ఏర్పాటు 2020 అక్టోబర్ 12న అయ్యింది. కానీ ఆప్కో 2020 సెప్టెంబర్ 12వ తేదీనే సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అందులో వీఐపీపీఎల్ తమతో 11 ప్రాజెక్ట్స్(అందులో ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి)లో పని చేస్తుందని, వాళ్ల పనితీరు సంతోషకరంగా ఉందని తెలియజేసింది.
ఈ అవినీతి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సెయిల్ విజిలెన్స్ 2023 మార్చి 23న ఆప్కోను సంప్రదించింది. ఇంకా వీఐపీపీఎల్కు ఇచ్చిన వర్క్ఆర్డర్ ప్రతులు, సర్టిఫికేట్ జారీ చేయడానికి కారణం అడిగింది. ఈ క్రమంలో ఆప్కో ఏప్రిల్ 22న సమాధానం ఇచ్చింది. వీఐపీపీఎల్ ప్రమోటర్ ఏక్తా అగర్వాల్‌తో వారికి సంబంధం ఉంది. ఇంకా ఈ కంపెనీ ముందు వెంకటేష్ స్టీల్ పేరుతో విధులను నిర్వహించేది. వీఐపీపీఎల్ పేరును ఎంసీఏ(మినిస్ట్రీ ఆఫ్ కార్పొరరేట్ ఎఫైర్స్) 2020 సెప్టెంబర్ 7న అనుమతిని ఇచ్చింది. దీని తర్వాత ఆప్కో పాత ఆర్డర్‌ను ఈ కొత్త కంపెనీకు ట్రాన్స్ఫర్ చేసేశారు.
కానీ, తాము పాత వర్క్ ఆర్డర్ అందుబాటులోకి తేలేమని, ఎందుకంటే అందులో నుంచి ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు మూసివేయబడ్డాయని ఆప్కో చెప్పింది.
తాము సర్టిఫికేట్ సెయిల్ కోసం ఇవ్వలేదని ఆప్కో పేర్కొన్నది. కానీ ఒకవేళ సర్టిఫికేట్ సెయిల్‌కు సంబంధించి ఉండకపోతే, మరీ అలాఎలా ఒకే సారి కొత్త కంపెనీకి సరఫరాను తక్కువ ధరకు సెయిల్ చేసింది?

సర్టిఫికేట్స్ ఇస్తున్న సమయంలో ఆప్కో అవాస్తవాలు తెలిపిందని సీవీఓ-సెయిల్ పేర్కొన్నారు. అంతేకాకుండా సర్టిఫికేట్లో వీఐపీపీఎల్, ఆప్కో కలిసి మొత్తం భారత దేశంలో 11 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో రీన్పోర్స్మెంట్, స్ట్రక్చరల్ స్టీల్ పని చేస్తుంది. ఇందులో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంబంధించిన అనేక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ నిరాధారమైనవిగా సీవీసీ కనుగొనింది.
ఆప్కో తమతోని మూడు ప్రాజెక్టులు చేస్తుందని సీవీఓ- సెయిల్‌కు ఎన్హెచ్ఏఐ తెలిపింది. కానీ ఎందులో కూడా వీఐపీపీఎల్ సబ్-కాంట్రాక్టర్ లేడు. ఈ వాస్తవాలను సీవీఓ- సెయిల్ నమోదు చేసింది, “ఆప్కోతో వీఐపీపీఎల్కు దీర్ఘకాలంగా సంబంధం ఉందనే ఆరోపణ ఉంది. ఇంకా వాళ్లు ఆప్కో కోసం పని చేశారు. ఇది విశ్వసనీయమైనదిగా అనిపించడం లేదు.” సెయిల్ సీవీఓ(చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్) “వీఐపీపీఎల్, ఆప్కో మధ్య వ్యాపార పొత్తు ఈ విషయానికి సంబంధించిన వేరుగా ఉంది”అని అండర్లైన్ చేశారు.

ఆప్కోతో బీజేపీకి కనెక్షన్..
ఎన్నికల సంఘం ప్రకారం, లక్నో చిరునామా మీద రిజిస్టర్ ఆప్కో 2020 జనవరి 15 నుంచి 2023 అక్టోబర్ 12 మధ్య 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్‌ను కొన్నారు. ఇంకా వీటిని బీజేపీ నగదుగా మార్చుకొని ఉపయోగించింది. ఈ కంపెనీ మీద బీజేపీ కృపాకటాక్షాలు ఉన్నాయని ఆ రోజుల్లో మీడియా రిపోర్ట్స్ తెలియజేసేవి. ప్రస్తుత సంవత్సరాల్లో ఆప్కోకు అనేక పెద్ద, ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు దొరికాయి, వాటి ఖర్చు వేల రూపాయలలో ఉంది.
భారత దేశంలోని 10 ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టుల మీద పని చేస్తున్నట్టుగా కంపెనీ వెబ్సైట్ తెలియజేస్తుంది. అందులో దేశంలోని మొదటి 14- లైన్ ఎక్స్‌ప్రెస్‌వే(ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే) కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రతిష్టాత్మకమైన Z- మోడ్ సొరంగం ప్రాజెక్ట్, ముంబైలో కేబుల్ స్టే బ్రిడ్జ్, ఇంకా ఢిల్లీ/ఎన్సీఆర్లో ఎలివేటెడ్ వాయాడక్ట్ మెట్రో ప్రొజెక్టులాంటి ప్రముఖ పనులను కూడా చేస్తోంది.
సీబీఐ ఎఫ్ఐఆర్..
లోక్‌పాల్ ఆదేశం మీద సీబీఐ 2024 అక్టోబర్ 10న ఈ విషయంలో ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. అందులో వీఐపీపీఎల్తో పాటు ఆప్కో పేరు కూడా ఉంది. సెయిల్ అధికారి, వెంకటేశ్ ఇన్ఫ్రా ప్రోజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ ఇంకా ఆప్కోను సీబీఐ ఎఫ్ఐఆర్ దోషిగా చూపిస్తుంది. ఈ కేసు నేరపూరిత కుట్ర, మోసం, నకిలీ పత్రాల ఉపయోగం, ఇంకా అవినీతి నివారణ ప్రకరణంలో భాగంగా నమోదు చేయబడింది.
నకిలీ ప్రాజెక్టుల పేరు మీద సెయిల్ నుంచి అవినీతికరంగా లాభం పొందే కంపెనీలు ఇవి మాత్రమే కాదు. వీఐపీపీఎల్లా గత కొన్ని సంవత్సరాలలో కన్సట్రక్షన్ పేరు మీద సెయిల్ నియమాల నుంచి చెడు ప్రయోజనాన్ని పొందే మొత్తం 43 కంపెనీల మీద ఫిర్యాదు లోక్‌పాల్‌లో చేయడం జరిగింది. ఇదేకాకుండా ఇలాంటి అనేక కంపెనీల ఫిర్యాదులు సీవీసీ, సెయిల్ ప్రధాన విజిలెన్స్ అధికారి(సీవీఓ-సెయిల్) వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
లోక్‌పాల్ ఆదేశం..
“సెయిల్ అధికారులు అవసరమైన విచారణ చేయలేదు. దీని పర్యవసానం వీఐపీపీఎల్కు మిగితా సామాన్య కస్టమర్ల బేరీజులో సామాగ్రి తక్కువ ధర మీద లభించింది. దీని కారణంగా సెయిల్ ఎక్కువ లాభం పొందే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో కొందరు అధికారులు వీఐపీపీఎల్తో కుట్రలో భాగంగా ఉండే అవకాశం ఉంది” అని లోక్‌పాల్ పేర్కొన్నది.
దీనికి సమాధానంగా “అంచనాపరంగా ఇంకా సాంకేతికంగా ఎటువంటి నష్టం జరగలేదు. సెయిల్ ద్వారా వీఐపీపీఎల్కు టీఎంటీ బార్ అమ్మే ప్రస్థావనను అనుమతించడానికి ఎటువంటి భంగం లేదు. ఎందుకంటే వీఐపీపీఎల్ నకిలీ కంపెనీ కాదు, ఇంకా షేల్ కంపెనీ, స్టీల్ మార్కెట్లో ఒక వాస్తవిక, క్రీయాశీల వ్యాపారం చేస్తుంది.” సెయిల్ తెలియజేసింది.
కానీ లోక్‌పాల్ వాదనను తిరస్కరిస్తూ “సెయిల్ అధికారుల ద్వారా తగిన జవాబు తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీఐపీపీఎల్కు ఇతర కస్టమర్ల బేరీజులో తక్కువ ధర మీద సామాగ్రి ఇవ్వడం జరిగింది.” అన్నారు.
ఉన్నతాధికారుల నుంచి సీబీఐ వరకు ఫిర్యాదులు ఎలా అందాయి?
2022 నవంబర్ 17న సెయిల్- సీఎంఓ కేంద్రకార్యాలయం(కలకత్తా)లో జనరల్ మేనేజర్, మార్కెటింగ్ అండ్ ప్రొడెక్ట్ మేనేజర్, రాజీవ్ భాటియ, తాత్కాలిక సెయిల్ అధ్యక్షులు సోమా మండల్, డైరెక్టర్ కమర్షియల్ వీఎస్ చక్రవర్తికు మూడు ఫిర్యాదులను పంపించారు. మొదటి ఫిర్యాదు వీఐపీపీఎల్కు సంబంధించింది. ఫిర్యాదు చేసిన ఒక వారం తర్వాత 2022 నవంబర్ 24న రాజీవ్ భాటియాను చెప్పపెట్టకుండా సస్పెండ్ చేశారు. ఆయన పది నెలల వరకు సస్పెండ్ చేయబడి ఉన్నారు. సస్పెండ్ సమయంలో భాటీయా 2022 డిసెంబర్ 1న ప్రధానమంత్రికు లేఖ రాసి విషయాన్ని తెలియజేశారు. ఇంకా ఈ విషయం మీద విచారణ చేయాలని కోరారు.
దీని తర్వాత భాటియా రెండు సార్లు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. అవి ఆప్కో గురించే కాకుండా ఇతర కంపెనీల గురించి కూడా ప్రస్తావిస్తాయి. కానీ ఎటువంటి ఫలితం లభించలేదు. దీని తర్వాత భాటీయా 2023 జనవరి 11న లోకపాల్ను ఆశ్రయించారు. లోక్‌పాల్ 2023 మార్చి 28న ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటూ సెంట్రల్ విజిలెన్స్ కమీషన్(సీవీసీ)ను ప్రాథమిక విచారణకు సంబంధించిన ఆదేశం ఇచ్చారు. మళ్లీ సీవీఓ- సెయిల్ విచారణ నివేదిక 2023 ఆగస్టు 24 వరకు సీవీసీ వరకు చేరింది.
2024 జనవరి 10వ తేదీన లోక్‌పాల్ సీబీఐకు విచారణ చేయాల్సిందిగా ఆదేశాలను ఇచ్చింది. వెంటనే 2024 జనవరి 19న ఉక్కు మంత్రిత్వశాఖ 29 అధికారులను సస్పెండ్ చేసింది. అందులో ఇద్దరు సెయిల్ అధికారులు, వీఎస్ చక్రవర్తి(దర్శకుడు – వాణిజ్య), శ్రీ ఏకే తులసియానీ(దర్శకులు- ఆర్థిక)తో పాటు ఒక ఎన్ఎండీసీ దర్శకులు వీ సురేశ్ కూడా అందులో ఉన్నారు.
ఇదేకాకుండా సెయిల్ అనేక ఇతర సీనియర్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆర్థిక- ఖాతాలు) సీఎంఓ, ఎస్కే శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(వాణిజ్య) వినోద్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సేల్స్- ఐటీడీ) అతుల్ మాథుర్, ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ సర్విసేస్) ఆర్ఎం సురేశ్ ఉన్నారు.
2024 సాధారణ ఎన్నికల తర్వాత 2024 జూన్‌లో సస్పెండ్ చేసిన అందరు అధికారులను వీధుల్లోకి తీసుకున్నారు.
కానీ ఫిర్యాదు చేసిన రాజీవ్ భాటియాను సెయిల్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 16న, మరికొందరు అధికారులను కలుపుకొని సమయం కంటే ముందే పదవీవిరమణను చేయించారు. సెయిల్ ప్రకారం ఈ అధికారులు “నమ్మకస్తులు, జవాబుదారీతనం”కు అనుగుణంగా ప్రవర్తించలేదు.
గమనించాల్సిందేంటంటే, రాజీవ్ భాటియా స్వయంగా ఈ కేసును వెలుగులోకి తెచ్చారు. కానీ ఆయనను ఏడు సంవత్సరాల కంటే ముందే పదవీవిరమణతో ఉద్యోగాన్ని వదిలేయాల్సిందిగా చెప్పారు.
నిందితులు ఏం అంటున్నారు?
ది వైర్ ఈ కేసుకు సంబంధించిన అందరిని సంప్రదించింది. అధికారికంగా దీనికి సంబంధించి ఏ విషయాన్నైనా మాట్లాడడానికి సెయిల్ నిరాకరించింది. మేము వీఐపీపీఎల్కు మెయిల్ పంపించాము. ఈ సంస్థ దర్శకులు ఏక్తా అగ్రవాల్‌ను సంప్రదించాము. ఆప్కోకు కూడా ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నలను పంపించాము. కానీ ఇప్పటి వరకు వేటికి సమాధానం రాలేదు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.