
భారత్ పాకిస్తాన్ల మధ్య సాయుధ ఘర్షణ మొదలైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుధ వ్యాపారులు దళారులు ఏ దేశం ఏ ఆయుధాలు ఉపయోగిస్తుంది వాటి పనితీరు ఎలా ఉంది లక్ష్యాన్ని చేదిస్తున్నాయా లేదా వంటి విషయాలపై దృష్టి సారించారు.
ఈ కోణంలో తొలి వార్తలు ప్రచురించిన సంస్థ రాయటర్స్ వార్తా సంస్థ. భారత వాయుసేన ప్రయోగించిన రాఫెల్ యుద్ధ విమానం కూలి పోయింది అన్న వార్తను ప్రచురించింది. ఈ వార్త బయటకు రావడంతో రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ షేర్లు 3.3 శాతం పడిపోయాయి. ఘర్షణ ప్రారంభం కావడానికి ముందు 373.8 డాలర్లుగా ఉన్న దసాల్ట్ ఏవియేషన్ షేర్ ధర రాయటర్స్ వార్త ప్రచురించిన తర్వాత 362.05 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ షేర్ దర్లు 30 శాతం పెరిగాయి. పాకిస్తాన్ వాయిసేన ఉపయోగించే జె 10 సి మరియు జె 17 తరహా యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీ చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్. రాయటర్స్ కథనం ప్రకారం చైనా కంపెనీ తయారుచేసిన యుద్ధ విమానాలు ఫ్రాన్స్ కంపెనీ తయారుచేసిన యుద్ధ విమానాన్ని కూల్చాయి.
అంతర్జాతీయ ఆయుధ మార్కెట్ దళారులు భారతదేశానికి మిత్రులుగా ఉన్న కొందరు తామేమి వెనుకబడలేదు అని నిరూపించుకునే ప్రయత్నంలో రష్యా నుంచి భారతదేశం కొనుగోలు చేసిన ఎస్ 400 శ్రేణి క్షిపణులు పనితనాన్ని మార్కెట్లో పెట్టారు. భారత ప్రభుత్వ అధికారిక కథనం ప్రకారమే పాకిస్తాన్ ప్రయోగించిన యుద్ధ విమానాలు డ్రోన్ ల నుంచి భారత గగనతలాన్ని రక్షించుకోవడానికి ఎస్ 400 క్షిపణులు సుదర్శన చక్రం లాగా పని చేశాయి. దాంతో రష్యా తయారు చేసిన ఈ క్షిపణులు గురించిన ప్రయోజకత్వాన్ని ఆయుధ వ్యాపారులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ క్షిపణులు కొనుగోలు చేస్తే భారతదేశంపై అంక్షలు విధిస్తామని గతంలో అమెరికా బెదిరించింది. పాకిస్తాన్ కూడా భారతీయ వాయుసేన ప్రయోగించిన డ్రోన్లు, యుద్ధ విమానాలను నిలువరించడానికి చైనా తయారుచేసిన పి.ఎల్ 15 క్షిపణులను ప్రయోగించింది.
భారత్ పాకిస్తాన్ ల మధ్య సాయుధ ఘర్షణ ముదురుతూ ముందుకెళ్తూ ఉంటే అదే సమయంలో ఇజ్రాయిల్ నుంచి భారతదేశానికి టర్కీ నుంచి పాకిస్తాన్‌కు ఆయుధాలు దిగుమతి అయినట్లుగా మీడియా కథనాలు వచ్చాయి. పనిలో పనిగా అమెరికా రంగ నిపుణులు విశ్లేషకులు భవిష్యత్తులో భారతదేశం అమెరికా తయారుచేసే ఆయుధోత్పత్తులు కొనుగోలు చేయడం మంచిదని చర్చ మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ బహిరంగంగానే అమెరికాలో తయారయ్యే ఎఫ్ 35 విమానాలు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. భారత వాయుసేన కు పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు అవసరం. భారత ఆయుధ మార్కెట్లో వాటా కోసం అమెరికా ఫ్రాన్స్ రష్యా స్వీడన్లు పోటీ పడుతున్నాయి.
తాజాగా విరమించిన భారత్ సాయుధ ఘర్షణలో పాల్గొన్న భారత వాయిసేన తన అవసరాలు తీర్చుకోవడానికి సాయుధ సంపత్తిని ఆధునీకరించడానికి ఏ ఏ ఆయుధ ఉత్పత్తులు కొనుగోలు చేయనున్నది అన్న దాన్నిబట్టి అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో కదలికలు మొదలవుతాయి.
ఎప్పుడో 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ ప్రభుత్వాలపై సైనిక పారిశ్రామిక సముదాయాల పట్టు పెరుగుతోంది జాగ్రత్త అని అమెరికా పౌరులను హెచ్చరించారు. “ప్రభుత్వంలో ఉన్న మనం ఆయుధ బేహార్ల ప్రభావాలకు లొంగకూడదు. లొంగిపోతే ఆర్థిక వ్యవస్థ పై పౌర జీవనంపై ఆయుధ బేహార్లు ఆయుదోత్పత్తుల కంపెనీల పట్టు బిగిస్తుంది” అని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పరిశ్రమ విస్తరణలోనూ, వివిధ ప్రభుత్వాలను ప్రభావితం చేయటంలోనూ ఈ హెచ్చరికలు ఏమీ పెద్దగా పనిచేయలేదు. 1961 నుండి 2025 మధ్యకాలంలో వందల సంఖ్యలో చిన్న పెద్ద యుద్ధాలు జరిగాయి. యుద్ధాలన్నింటిలోనూ అమెరికా రష్యా యూరోపియన్ దేశాలు వైరిపక్షాలకు ఆయుధాలు సరఫరా చేశాయి. ఈ వ్యాపారం లోకి చైనా ఈ మధ్యకాలంలోనే ప్రవేశించింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజకత్వాన్ని నిరూపించేందుకు అవసరం అవుతున్న కొత్త యుద్ధాలు
ఏ యుద్దమైనా యుద్ధోత్పత్తుల యజమానులకు ఆ ఉత్పత్తులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసిన వారికి వాటి ప్రయోజకత్వాన్ని పరిశీలించే సందర్భమే. రోజురోజుకీ విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పనితీరును పరిశీలించడానికి కొత్త యుద్ధాలు ఆక్కరకు వస్తాయి. శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి తయారీపై దృష్టి పెడతారు. దానికి కావాల్సిన పెట్టుబడులు సమకూరుస్తారు. యుద్ధాలు జరిగినపుడు ఈ పరిజ్ఞానాలను ప్రయోగించి సాధించిన విజయాలపై ఆధారపడి లాభాలు సంపాదిస్తారు. తాజాగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఘర్షణలో చర్చకు వస్తున్న ఆయుధ కంపెనీలు సాంప్రదాయకంగా అధిపత్యం కలిగిన సంపన్న దేశాలకు చెందిన కంపెనీలు కావు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన చైనాకు సంబంధించిన కంపెనీలు తయారుచేసిన ఆయుధాలు. ఉక్రేయిన్ యుద్ధంలో కూడా చైనా ఆయుధ సంపత్తిని పరీక్షించే అవకాశం వచ్చినప్పటికీ చైనా అందుకు సిద్ధపడలేదు. అమెరికా ఆంక్షలు విధిస్తుందేమో అన్న సందేహం దానికి ఒక కారణం. కానీ భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఘర్షణ లో అటువంటి సందేహాలకు తావు లేకుండా చైనా తన ఆయుధ సంపత్తి సామర్థ్యాన్ని పరీక్షకు పెట్టుకుంది.
భారత్ పాకిస్థాన్ విషయంలో దురదృష్టకరమైన వాస్తవం ఏమిటంటే తమకు కావాల్సిన ఆయుధ సామాగ్రిని రెండు దేశాలు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. రెండు దేశాలు దేశీయంగా ఆయుధ తయారీ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ నిజంగా యుద్ధం జరిగితే మాత్రం రెండు దేశాలు యుద్ధంలో ఉపయోగించడానికి వీలైన పొత్తుల కోసం ప్రపంచం మార్కెట్ వెంట పరుగులు తీయాల్సిందే. అందుకే అంతర్జాతీయ ఆయుధ తయారీ పరిశ్రమలు గణనీయంగా ఉన్న దేశాలు భారత్-పాకిస్తాన్లతో చెలిమిని కొనసాగిస్తూనే ఉంటాయి. అమెరికా రష్యాలు భారత్ పాక్ రెండు దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ చైనా పాకిస్థాన్‌కు మాత్రమే సరఫరా చేస్తుంది ఇజ్రాయిల్ భారతదేశానికి మాత్రమే చేస్తుంది. ఇక ట్రాన్స్ విషయానికొస్తే కొనే వాళ్ళు ఉంటే ఎవరికైనా అమ్ముతుంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాకిస్తానీ ఆర్థికవేత్త, అంతర్జాతీయ దౌక్యవేత్త, కొంతకాలం పాటు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన దివంగత మెహబూబ్ ఉల్ హక్ ఈ విషయానికి సంబంధించి చెప్పిన ఒక కథ నాకు ఇంకా గుర్తుంది. నేను జీవితంలో ఒక్కసారే పాకిస్తాన్ వెళ్లాను. 1997లో. ఆ పర్యటనలో నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వారి ఆహ్వానం మేరకు పాకిస్తాన్ వెళ్లాను. అప్పుడు ఆయన నాతో పంచుకున్న విషయం ఇది. బెనజీర్ భుట్టో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆమె ఫ్రాన్స్ నుండి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సి ఉంది, మన దగ్గర ఉన్న డబ్బులు దానికి సరిపోతాయా అని అడిగారట. అంత అర్జెంటుగా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా బెనజీర్ భుట్టో ” నేను పారిస్ వెళ్లాలనుకుంటున్నాను. మనం పారిస్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే ఫ్రెంచ్ ప్రభుత్వమే మన పర్యటనకు అధికారిక ఆహ్వానం పంపుతుంది. పర్యటనకు కావలసిన అని ఏర్పాట్లు చేస్తుంది”అన్నారట.
ప్రధానమంత్రి మోడీ ఈ సంవత్సరం మార్చిలో జరిపిన అమెరికా పర్యటన కూడా దగ్గర దగ్గరగా బెనజీర్ భుట్టో పారిస్ పర్యటనలాగే ఉంది. ఈ పర్యటనలో వాణిజ్య సుంకాల విషయంలో అగ్గి మీద గుగ్గిలం లాగా మండిపడుతున్న ట్రంప్ ను మచ్చలు చేసుకోవడానికి అమెరికా నుండి మరిన్ని ఆయుధ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారతదేశం సిద్ధపడ్డట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. 2005లో భారత్ అమెరికాల మధ్య రక్షణ సంబంధిత విషయాల పై అవగాహన ఒప్పందం కుదిరినప్పటి నుంచి భారతదేశానికి వీలైనంత ఆయుధాలు ఎగుమతి చేయడానికి అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 2006 నుండి 2010 సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం భారతదేశం దిగుమతి చేసుకునే ఆయుధాలు యుద్ధోత్పత్తులలో అమెరికా నుండి కేవలం ఒక శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటూ వచ్చింది. 2020- 2024 మధ్యకాలంలో భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు మోతాదు మొత్తం భారతదేశ దిగుమతి చేసుకొన్న ఆయుధాలు ఆయుధ ఉత్పత్తుల మోతాదులో శాతానికి పెరిగాయి. అప్పటివరకు 75% ఆయుధ ఉత్పత్తులు రష్యా నుండి దిగుమతి అయ్యేవి. ఇపుడు భారతదేశం ప్రస్తుతం ఆదేశం నుంచి 35% మాత్రమే కొనుగోలు చేస్తుంది.
పాకిస్తాన్ కూడా ఇదే మాదిరిగా వ్యవహరించింది. పాకిస్తాన్ కు అవసరమైన మొత్తం ఆయుధ ఉత్పత్తులు ఆయుధాలు దిగుమతులు 36% ఫ్రాన్స్ నుంచి వచ్చేవి. ప్రస్తుతం ఆ స్థానాన్ని చైనా ఆక్రమించింది. పాకిస్తాన్ కి చైనా చేసే ఆయుధ ఎగుమతులు 36% నుంచి 81 శాతానికి పెరిగాయి. భారతదేశంలో ఆధునిక ఆయుధాలు దిగుమతి చేసుకోవడానికి ఇజ్రాయిల్ కూడా మరో పెద్ద సరఫరాదారు. అదే విధంగా పాకిస్తాన్ కు టర్కీ ముఖ్యమైన సరఫరాదారుగా మారింది. దీని అర్థం ఏమిటి? దక్షిణాసియాలో రెండు ప్రధాన దేశాలు యుద్ధంలోకి దిగి పరస్పరం చంపుకుంటూ ఉంటే అమెరికా ఫ్రెంచ్ రష్యా చైనా ఇజ్రాయిల్ టర్కీలకు చెందిన ఆయుధోత్పత్తి పరిశ్రమల యజమానులు ఈ రెండు దేశాలకు ఆయుధాలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు.
గత కొంతకాలంగా ఆత్మ నిర్భర భారత్ విధానంలో భాగంగా దేశీయ ఆవిధ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ వచ్చింది. ఆమేరకు విదేశాలపై ఆధారపడటం తగ్గింది. ఇప్పుడు భారతదేశం కూడా ఆయుధాలు ఎగుమతి చేస్తూ ఉంది క్షిపణులు, చిన్న మధ్య తరహా ఆయుధాలు ఈజిప్ట్ ఫిలిప్పీన్స్, వియత్నాం పోలాండ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. డ్రోన్ల తయారీలో భారతదేశం ప్రావీణ్యం సంపాదించింది. 2017 2018 మజ్జి గౌరవం నుండి దేశీయంగా డ్రోన్లు తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన ఘర్షణలో దేశంగా తయారైన డ్రోన్లే సరిహద్దుల్లో స్వైర విహారం చేశాయి.
సంజయ్ బారు సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్నారు. యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లో గా పనిచేస్తున్నారు.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.