
అపూర్వానంద్ఝా పదోన్నతి విషయంలో సీనియారిటీ అతిక్రమణకు గురికావడం అనేది ఒక నగరంలో, ఒక విశ్వవిద్యాలయంలో హిందీ విభాగాధిపతిగా ఎవరు నియమించబడతారు అనే ప్రశ్న కంటే చాలా పెద్ద విషయంగా పరిగణించాలి. ఎందుకంటే ఇది మొత్తం భారతీయ ఉన్నత విద్యావ్యవస్థ తలరాతకు సంబంధించిన అంశం.
ఉద్యోగ నియామకాలలో సీనియారిటీ ప్రాముఖ్యత, ప్రధాన న్యాయమూర్తులు కానివ్వండి, సైనికాధికారుల, విశ్వవిద్యాలయ విభాగాధిపతుల విషయం కానివ్వండి, ప్రస్తుత పాలకుల సంతృప్తి కోసం, వలసపాలనా వ్యవస్థ ఏర్పరుచుకున్న వింతైన అవశేషం ఎంత మాత్రం కాదు. ఇది ఏ సంస్థకైనా స్వతంత్రతను, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కల్గించే అనివార్య నియమం. ఒకసారి ఈ సీనియారిటీ సూత్రాన్ని ఉల్లంఘిస్తే ‘ఎవరికేది తోస్తే, అది’ అన్న చందంగా తయారవుతుంది.
పాలక పక్షభావజాలానికి విధేయంగానో, వ్యక్తిగత రాగద్వేషాలతోనో ప్రతిభ, బాధ్యతలు పక్కకు పోతాయి. అన్ని రంగాలలో, సంస్థలలో పనిచేసే సభ్యులలో విధులు- బాధ్యతల కంటే వారి వ్యవహార శైలి, వ్యక్తీకరణ స్వేఛ్చ, చర్యలు అధికారంలో ఉన్నవారిని ఎంత మేరకు సంతృప్తి పరుస్తున్నామనే ధ్యాస ఎక్కువగా ఉండటం చూస్తున్నాం.
1973లో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను పక్కకు పెట్టి జస్టిస్, ఎఎన్ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలాగే 1977లో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాను పక్కన పెట్టి జస్టిస్ ఎమ్హెచ్ బేగ్‌ను నియమించడంలాంటివి ప్రస్ఫుటంగా కన్పించే ఆత్యవసర కాలం నాటి పెడధోరణులుగా మనకు ఇంకా గుర్తున్నాయి.
ఇప్పుడు చాలామంది హైకోర్టు న్యాయమూర్తులు, చాలామంది సీనియర్లను పక్కకు పెట్టి, సుప్రీంకోర్టుకు పదోన్నతులు పొందుతున్నారన్నది తాజా వ్యవహారం. ఈ విషయంలో కొలీజియం ప్రాంతీయ ప్రాతినిధ్యం పేరిట తమ నిర్ణయాలను సమర్ధించుకునే ప్రయత్నమైనా చేస్తున్నారు.
2017లో లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి, లెఫ్టినెంట్ జనరల్ పిఎమ్ హరీజ్‌లను కాదని చేసిన లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను సైనికదళాల అధిపతిగా నియమించిన సంగతి కూడా చాలా వివాదాస్పదమయింది. దీనికంటే ముందున్న ఏకైక సీనియారిటీ నియమ ఉల్లంఘన సందర్భం, స్వాతంత్య్రం పొందిననాటి నుంచి 1983లో లెస్టినెంట్ జనరల్ యస్‌కె సిన్హాను కాదని అరుణ్వైద్యను సైనికాధికారిగా నియమించడం, ఆపై జనరల్ యస్‌కె సిన్హా నిరసనగా వెంటనే రాజీనామాచేయడం మనకు తెల్సిందే. ఈ మధ్యకాలంలో సైనిక దళాలలో సీనియారిటీకున్న ప్రాముఖ్యత విషయంపై తలెత్తిన వివాదం హత్యకు దారితీసిన ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టు సీనియారిటీని సమర్ధించింది.
ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ హిందీ విభాగం అధిపతిగా అపుర్వానంద్ను పక్కకు తప్పించి, సుధాసింగ్‌కు ఆ పదవి కట్టపెట్టారు. ఈ ఘటన యూనివర్సిటీ రికార్డులో మనం మర్చిపోలేని మచ్చగా మిగులుతుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ భావజాల ఎజెండా సేవలో తరిస్తున్న యూనివర్సిటీ, సాంప్రదాయానికి ఇది ఒక ప్రతీకాత్మక ఉదాహరణగా చెప్పవచ్చు.
అపూర్వానంద్ సుపరిచితుడైన మేధావి, పండితుడు, సాహిత్య విమర్శకుడు, అనేక వ్యాసాలు, గ్రంథాలు ప్రచురించారు. వార్దాలోని మహత్మగాంధీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయానికి పాఠ్యప్రణాళికను రూపొందించారు. 2005లో యన్సిఇఆర్టిలో, తన డిపార్డుమెంట్, ఢిల్లీ యూనివర్సిటీలో కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ మధ్యనే ఆయన రాసిన ‘కవితా మే జనతంత్ర’ పుస్తకాన్ని 2025లో రాజ్‌కమల్ వారు ప్రచురించారు. వీటన్నిటికి మించి రాజ్యాంగాన్ని సమర్ధించటంలో ఆయనకున్న తెగువ, రెండుభాషలలో మీడియాలో మతోన్మాద రాజకీయాలపై వస్తున్న ఆయన రచనలు, ఉపన్యాసాలు, మనందరికీ తెలుసు.
ఎవరైనా అన్యాయంగా సస్పెండైనప్పుడు, అరెస్టయినప్పుడు, లేదా వారి నిజాయితీతో కూడిన మేధోపరమైన ఆచరణ కారణంగా బెదిరింపబడినప్పుడు, వారి పక్షాన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనవంతు రావడం ఆయన బాధితుడవడం అశ్యర్యం కలిగించలేదు కానీ, యూనివర్శిటీల యాజమాన్యాల ఏకపక్ష చర్యకు ఒక ఉదాహరణగా ఇది అపూర్వానంద్ పదోన్నతి వ్యవహారం నిలిచిపోతుంది.
విశ్వవిద్యాలయ స్వతంత్రత ఎందుకు ముఖ్యం..
1966లో కొఠారి కమిటి ఉన్నత విద్య గురించి పేర్కొంటూ మూడు స్థాయిలలో విశ్వవిద్యాలయ స్వతంత్రత అమలు చేయడం ముఖ్యమని స్పష్టంగా చెప్పింది.
- ఒకే విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల స్వతంత్రత
- యుజిసికి సంబంధించి ఒక విశ్వవిద్యాలయం స్వతంత్రత
- రాష్ట్రకేంద్ర ప్రభుత్వాల నుంచి యుజిసితో సహా విశ్వవిద్యాలయ వ్యవస్ధ స్వతంత్రత
- ఈ చివరి సూత్రం ప్రైవేట్‌గా నిధులు సమకూర్చే వారికి కూడా వర్తిస్తుంది. ఒక మంచి విశ్వవిద్యాలయం తనకు నిధులు ఇచ్చే వారిని నియామకాలు, పాఠ్యపుస్తకాల విషయంలో తగినంత దూరంలోనే ఉంచుతుంది.
రెండవ సూత్రమైన విశ్వవిద్యాలయ స్వతంత్రత ఏనాడో వదిలివేయబడింది. ప్రతి చిన్న పని యుజిసి నిర్ణయించటం మొదలైంది. వాస్తవ ప్రతిభ పట్ల పెదవి విరుస్తూ ప్రతి సంవత్సరం యుజిసి నిర్ణయాలు చేస్తూనే ఉంది. ఒకానొకప్పుడు యుజిసి లిస్టులోని జర్నల్స్‌ని మాత్రమే అనుమతించే వారు. మరొక సంవత్సరం ఆ పనిని ఏ విభాగం వారు ఆ విభాగంలోనే చూసేవారు. ఆ తరువాత సంవత్సరం పుస్తకాలు కూడా అలాగే పరిగణించబడ్డాయి. విశ్వవిద్యాలయాల్లో బోధన అవకాశాలు దక్కించు కోవాలని ఆశపడుతున్న యువపండితులు, ఇప్పుడు తలేలేని కోళ్ళ మాదిరిగా అయిపోయారు. ఎందుకంటే ప్రతి పండితునికి తెలుసు ఇటు జర్నల్స్ కాని అటు పుస్తకాలు కాని ప్రచురించపడాలంటే సమయం పడుతుంది. అప్పటి పాలకుల ఇష్టాయిష్టాలను బట్టి అప్పటికప్పుడు వారిని సంతృప్తి పెట్టేందుకు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించటం అసాధ్యం. అటువంటి ప్రచురణలు కేవలం ముఖస్తుతి కోసమే వెలువడతాయి.
పాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ విశ్వవిద్యాలయం సెలక్షన్ కమిటీలో పనిచేసేందుకై ఆయా రంగాలలో నిపుణుల ప్రాధాన్యత ఉండేది. దాంతో అంతో ఇంతో ప్రమాణాలు ప్రస్తుత ఆ స్థాయి వరకైనా నిలిచాయి. గడచిన దశాబ్దంలో ఉపకులపతులు ఈ సూత్రాన్ని పూర్తిగా వదిలి వేసి, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీలకు ఎవరు దగ్గరగా ఉంటారో వారిని నిపుణులు అనే ముద్ర వేసి వివిధ కమిటీల్లో నియమించుకోవడం మొదలు పెట్టారు. నియామకాలు అక్కడక్కడా పక్షపాతం లేకుండా ఉన్నాయంటే అక్కడ ఆయా ప్రిన్సిపాల్లు ఆయా విభాగాల అధిపతులు, ఉపాధ్యాయులు చేసిన పోరాటం కారణంగానేనని భావించాలి.
ఆయా విభాగాల రకరకాల పద్ధతులలో తమ విద్యార్ధులను ఎంపిక చేసేవారు కాని అదికూడా వదిలివేసి ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ద్వారా ఒక కేంద్రీకృత ఎమ్సిక్యూ పద్ధతి ద్వారా చేయసాగారు. పాఠ్య ప్రణాళిక ఆయా విభాగాల వారే తమ ఫ్యాకల్టీ సమావేశాల ద్వారా చర్చించి నిర్ణయించేవారు, కానీ ఈ మధ్య అటువంటి చర్చకు అవకాశం లేకుండా ఈమెయిల్ల ద్వారా ఆన్లైన్లోనే అనుమతి తీసుకుంటున్నారు. ముఖ్యంగా సామాజిక శాస్త్రాల విషయంలో ఇతర విభాగాలకు చెందిన అధ్యాపకులు కూడా విశ్వజ్ఞానం పేరిట జోక్యం చేసుకోవటం బాగా పెరిగిపోయింది.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కంటే ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ మెరుగుగా ఉన్న ఒక అంశం ఏమిటంటే విశ్వవిద్యాలయం యాజమాన్యం, ఫ్యాకల్టీ మధ్య పోరాటం తీవ్రంగానే చేస్తుంది. ఈ పోరాటం వల్ల వచ్చే రక్షణ కారణంగా సిబ్బంది ఎంతో కొంత స్వయంప్రతిపత్తితో పని చేయటానికి అవకాశం దక్కుతోంది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్వయతంప్రతిపత్తి పాటిస్తున్న అధ్యాపకులకు పదోన్నతులు నిరాకరించబడ్డాయి. సెలవులు అత్యవసర విరామాలు కోల్పోతున్నారు. డీన్ల నియామకంలో సీనియారిటీ ఎప్పుడో దారితప్పింది. ప్రతి విద్యావేత్తకు అర్హమైన ప్రాథమిక హక్కులను పొందటానికి కూడా వారు కోర్టు గడప ఎక్కవలసి వచ్చింది.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కూడ ఇతర విశ్వవిద్యాలయాల్లో సాధార సమయంలో ఉన్నట్లుగానే అధ్యాపకుల అధిపతులు డీన్లు ఇద్దరు సీనియార్టీ పరంగానే నియమితులు అవుతారు. ఆర్డినెన్స్ XX॥। ప్రకారం, ఏ విభాగపు అధిపతి అయిన రొటేషన్ సూత్రాన్ని సాధ్యమైనంత మేరకు అనుసరిస్తూ ఉపకులాధిపతులను నియమిస్తారు. ఈ రొటేషన్ సూత్రం సీనియార్టీ క్రమంలో తదుపరి వ్యక్తి నుంచి ఇప్పుడు అధిపతిగా పని చేస్తున్న వ్యక్తి లేదా చేసిన వారికి వర్తిస్తుంది.
సీనియార్టీ గురించిన వ్యాఖ్యానంపై కొంత వివాదం ఉండవచ్చు. గతంలో రాజనీతి శాస్త్రంలో తదుపరి వ్యక్తి విభాగపు అధిపతిగా పదోన్నతి ద్వారా కాకుండా నేరుగా నియమించబడ్డారు. కనీసం ఇక్కడ ఏదో ఒక కారణం చెప్పేవారు. కనీసం కారణం చెప్పి వ్యవహారాన్ని చాపకిందకు నెట్టడం ఓ అనవాయితీగా నడిచింది. మర్దన ముందుకు తేబడింది. హిందీ విభాగం విషయంలో అలాగే మనస్తత్వ శాస్త్రం విభాగ విషయంలో నిబంధనలను ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందన్న విషయంలో సమర్దించుకోవాల్సిన అవసరం కూడా పాలకులకు కనిపించటం లేదు. అపూర్వానంద్ విషయంలో విశ్వవిద్యాలయ తర్కం ఏమిటో చెప్పే ధైర్యం కూడా లేదు. వారికి నిజానికి విద్యా ప్రమాణాలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇందుకు ఎంతమాత్రము సంబంధం లేదు. సరైనదల్లా అపూర్వానంద్ సైద్ధాంతిక నిబద్ధత, అవగాహనల విషయం బిజెపి, ఆరెస్సెస్లకున్న తేడాలే. డిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డైరెక్టర్ పదవిని మూడువిభాగాల మధ్యలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మధ్య ఒక్కొక్కసారి ఒక్కో విభాగం ప్రతినిధిని నియమిస్తారు. ఎందుకంటే ఇది ఆర్ధిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, భౌగోళిక శాస్త్ర విభాగాల కృత్రిమ సమ్మేళనం కాబట్టి. కానీ మళ్ళీ గతదశాబ్దంలో ఆ పదవిని కేవలం ఆర్ధిక శాస్త్ర విభాగానికే కట్టబెట్టారు. ఆర్ధిక శాస్త్రమే ముఖ్యమైన విభాగమనే ఒక కృత్రిమ భావనను పెంపొందించారు.
సాధారణంగా వివిధ రకాల అధిపతులు ఉంటారు. నిర్వహణను ఆస్వాదించి ఒక సవాలుగా తీసుకుని, తమ సహోద్యోగులపై తమ నీచ నిరంకుశత్వాలను ప్రదర్శించే అవకాశంగా భావించేవారు ఓ తరగతి అయితే అటువంటి బాధ్యతలు కేవలం విధిగా భావించి ఆ పని ముగియగానే ఒక నిట్టూర్పు విడిచేవారు రెండో కోవకు చెందినవారు. ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యత వారికి ఉండవచ్చు కాని వారి భావజాలపరమైన వైఖరులతో సంబంధంలేకుండా, అందరిపై సమానంగా పడే ఒక భారం అది. ఒక్కసారి ఆ స్థానాన్ని నిర్వహణ వ్యవస్ధ, తన రాగ ద్వేషాలకు తగినట్లు అందించే ఒక తాయిలం స్థాయినికి కుదించినప్పుడు ఏ అధిపతీ కొద్ది పాటి స్వతంత్రతతో కూడ ఆ పనిని నిర్వహించలేడు.
ఒక విశ్వవిద్యాలయానికి ఒక కోచింగ్ కాలేజికి మధ్య ఉన్న తేడా ఏమిటి? రెండింటిలోను బోధనే సాగుతుంది. భావి ఉద్యోగాల కోసం యువకులకు రెండింటిలోనూ శిక్షణనిస్తారు. రెండూ సాంఘిక ఉన్నతికి దారులు వేస్తాయి. అయితే ఒక విశ్వవిద్యాలయం సమాజపు అనేక విషయాలపై ఒక విమర్శనాత్మక దృక్పథాన్ని అందించవలసి ఉంటుంది. విశ్వవిద్యాలయాలు ఒక సమస్యగా గుర్తించని అనేక విషయాలు సమాజంలో ఉంటుంటాయి. విశ్వవిద్యాలయ విద్యావేత్తలు చాలా ముందుచూపుతో ఆలోచించాలని తక్షణ భవిష్యత్తును దాటి చూడాలని కోరుకుంటారని, నేటి వర్తమానానికి ఏ గతం నుంచి చేరుకున్నామో విశ్లేషణ అందిస్తారని భావిస్తాము. ఇవేవి ఒక కోచింగ్ కాలేజికి అవసరం లేదు అది ఎప్పటికప్పుడు తదుపరి పరీక్షల షెడ్యూల్‌కు తననుతాను నిరంతరం పరీక్షించుకుంటుంది.
మిగతా సంస్థల వలె విశ్వవిద్యాలయాలు ఇటుక సిమెంటుపై ఆధారపడవు. తాము పందెం కాసే ర్యాంకులపై కూడ ఆశపడవు. వాటికి వ్యక్తులు, భావజాలాలు ముఖ్యం. విద్యావేత్తలకు ఆలోచించే స్వేచ్ఛ కావాలి అందుకే అపూర్వనంద్ఝాను నియామకాలలో పక్కకు తప్పించటం, ఒక నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో హిందీ విభాగపు అధిపతి ఎవరు అనే దానికంటే చాలా పెద్దవిషయంగా పరిగణించాలి. ఇది నిజానికి భారతీయ ఉన్నత విద్య తలరాతకు సంబంధించినది.
నందినీ సుందర్
అనువాదం: ఇవి రమణారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.