
న్యూ ఢిల్లీ: 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలో మహాయుతి సంఘటన ఎన్నడూలేని ఆధిక్యతతో విజయం సాధించింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలను ఎత్తి చూపుతూ “జరిగింది చిన్న మోసం కాదు, భారీ ఎత్తున జరిగిన రిగ్గింగ్” అన్నారు. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని ఎన్నికల సంఘం కొట్టిపడేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అవకతవకలు జరిగిన విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే అనేక సందర్భాల్లో చాలాసార్లు పరోక్షంగా ప్రస్థావించారు. 2025 జూన్ 7న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనికి సంబంధించిన రాహుల్ గాంధీ వ్యాసాన్ని ప్రచురించింది. పాలకపార్టీ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి “మన జాతీయ సంస్థలను” అదుపులో పెట్టుకునేందుకు పరోక్షంగా ప్రణాళికలను రచించిందని భావిస్తున్నట్టుగా గాంధీ చెప్పారు. రాబోయే బీహార్ ఎన్నికలలో కూడా ఈ విధంగా “తొత్తడం” జరుగుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తొత్తడం ఎలా జరుగుతోంది?
“2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతంత్రం ఎలా తొత్తడం చేయబడిందో చూపే నమూనాగా నిలుస్తుంది. ఇదెలా సాధ్యపడిందో నా వ్యాసం దశలవారీగా తెలియజేస్తుంది” అని తన వ్యాసం ప్రచురితమైన సందర్భంగా గాంధీ ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు.

“మహారాష్ట్ర ఎన్నికలలో గెలవడానికి బీజేపీ ఎందుకింత తెగించిందో ఊహించడం కష్టం కాదు. అయితే తొత్తడం అన్నది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది. ఎవరు మోసం చేస్తారో వాళ్ళు గెలవవచ్చు. కానీ అది సంస్థలను నాశనం చేస్తుంది. ఎన్నికల ఫలితాలపై ప్రజల నమ్మకాన్ని ధ్వంసం చేస్తుంది” అని పేర్కొన్నారు. అంతేకాకుండా “మీరే న్యాయ నిర్ణయం చేయండి , మీరే సమాధానాలు తెలుసుకోండి” అని ప్రజలను ఆయన కోరారు.
“మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన తదనంతరం బీహార్‌లో జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ ఓడిపోయే ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుంది. ఎన్నికల మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది ప్రజాస్వామ్యానికి విషం వంటిది” అని రాహుల్ హెచ్చరించారు.
2025 జూన్ 7న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గాంధీ రాసిన వ్యాసం ప్రకారం, భారతీయ ఎన్నికలను తన అదుపులో పెట్టుకున్న విషయం 2023లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడే తెలిసిపోయింది. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి “ఒక మధ్యేవాద మధ్యవర్తిని” నియమించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర గృహమంత్రి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు. ప్రధాన న్యాయమూర్తిని ప్యానల్ నుంచి తొలగించడంతో ప్రతిపక్షానికి చెందిన మూడో వ్యక్తి ఎవరికి ఓటు వేసినా అది 2:1 అవుతుంది. ఎన్నికల క్రమంలో మెజారిటీ పాలకుల వైపే ఉంటుంది.
“మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏదైనా ఒక ప్రధానమైన సంస్థ నుంచి మధ్యేవాద మధ్యవర్తిని ఎందుకు తొలగిస్తారు? జవాబు పొందడం కోసం ఈ ప్రశ్న అడిగాను” అని అన్నారు.
అంతకుముందు 2024 మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో, ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ “తెగించింది” అని అభిప్రాయ పడుతున్నానని ఆయన వివరించారు .
మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల కంటే ఐదేళ్ల కాలంలో కేవలం 31 లక్షలు మాత్రమే ఓటర్లు పెరగగా, ఆ తర్వాత కేవలం అయిదు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 41 లక్షల మంది ఓటర్లు పెరిగారని ఈసీఐ ఇచ్చిన డేటా తీసి చూపారు.
“ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తరువాత 7.83% ఓటర్లు అంటే 76 లక్షల మంది, ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇది కూడా ఈసీఐ ఇచ్చిన డేటా ప్రకారమే. 2009 నుంచి పోలింగ్ జరిగిన తీరును పోల్చి చూస్తే, సాధారణంగా 5 గంటల తరువాత చాలా కొద్దిమంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నట్టు తెలియవస్తుంది” అన్నారు.
“ఇంతకంటే ఎక్కువ అవకతవకలు జరిగాయి. మహారాష్ట్రలో ఒక లక్ష పోలింగ్ కేంద్రాలున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకి గెలవడానికి సరిపడా ఓట్లు రాని 85 లోక్‌సభ నియోజకవర్గాలలోని కేవలం 1200 బూత్‌లను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే సాయంత్రం 5 గంటల తరువాత ప్రతి బూత్‌లో 600 ఓట్లు అధికంగా వేయడం జరిగింది” అని చెప్పుకొచ్చారు.
ఓట్లు పెరగడం గురించి ఎన్నికల కమిషన్ ప్రస్థావిస్తూ “యువకులు ఓట్లు వేయడానికి రావడం స్వాగతించదగినది ” అని ఓట్లు పెరగడానికి కారణం కొత్తగా వచ్చిన యువ ఓటర్లని పేర్కొన్నది. దీని రాహుల్ స్పందిస్తూ “ఈ ఆహ్వానించదగ్గ పరిణామం కేవలం 1200 బూత్‌లకే పరిమితమయింది. మిగిలిన 88,000 బూత్‌లకు విస్తరించలేదు. ఇదే ఇందులో దురదృష్టం కాకపోవచ్చు. కానీ, చతురత అని మాత్రం చెప్పుకోవాలి ” అన్నారు.
“అటువంటి సీట్లలో ఒకటి కాంతి. దీనిని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. కాంగ్రెస్‌కు సాధారణంగా వచ్చే ఓట్లు ఇక్కడ వచ్చాయి. దాదాపు 1.35 లక్షల ఓట్లు. లోక్ సభలో, శాసనసభ ఎన్నికలలో కూడా. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంతిలో బీజేపీకి సాధారణంగా వచ్చే ఓట్లు 1.9 లక్షలు అయితే, ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో అమాంతం 1.75 లక్షలకు పెరిగాయి. అంటే 56 లక్షల ఓట్లుపెరిగాయి” అని గుర్తుచేశారు.
” రెండు ఎన్నికల మధ్య కొత్తగా నమోదైన ఓట్ బ్యాంకు నుంచి ఈ పెరుగుదల ఊడిపడింది. మరో విషయం, కొత్తగా నమోదైన 35,000 ఓట్లు అమాంతంగా ఆయస్కాంతం ఆకర్షించినట్టు దాదాపు బీజేపీ వైపుకే ఆకర్షించబడ్డాయి. బీజేపీ కమలం గుర్తు ఆకర్షణను పరిశీలించడం కష్టమేం కాదు.” అని చమత్కరించారు.
ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు చూపుతున్న చుట్టూ ఉన్న పరిమాణాలు, రుజువులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ “మౌనంగా” ఉండిపోయారు లేదా “దాడి” చేశారు.
బాహాటంగా గాంధీ లేవనెత్తిన ఈ ప్రశ్నలు భారతదేశ ఎన్నికల ప్రక్రియలోని న్యాయానికి సవాలుగా నిలుస్తాయి. ఇది ప్రతిపక్షానికి పాలక పక్షానికి మధ్య ఉన్న మరో వైరానికి ఆజ్యం పోసే పరిస్థితికి దారి తీయవచ్చు. ప్రతిపక్షంలోని అనేకమంది ఇటువంటి విషయాలు జరగవచ్చనే ఆందోళనలను వ్యక్త పరచినా ప్రతిపక్ష నాయకుడు మొదటి సారిగా అధికారికంగా తన అసమ్మతిని కేంద్రానికి వ్యతిరేకంగా నమోదు చేశారు. అంతేకాకుండా భారతదేశ ఎన్నికల కమిషన్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేశారు.
భారతదేశ ఎన్నికల కమిషన్ ప్రతిస్పందన..
ఎన్నికల కమిషన్ గాంధీ లేవనెత్తిన ప్రతి అంశాన్నీ ఖండించింది. తన వాదనలన్నీ వాస్తవాల మీద ఆధార పడినట్టు చెప్పుకుంది. “2024 డిసెంబర్లోనే భారత జాతీయ కాంగ్రెస్ లేవనెత్తిన అన్ని అంశాలకు ఎన్నికల సంఘం సమాధానాలు చెప్పింది. ఆ సమాధానాలు ఎన్నికల సంఘం వెబ్ సైట్లో ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ అవే అంశాలు లేవనెత్తుతుండడం అంటే ఈ వాస్తవాలాన్నీ పూర్తిగా విస్మరించబడ్డాయని భావిస్తున్నాము” అని పేర్కొన్నది.
తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టరీత్యా అగౌరవపరచడం అవుతుందని కూడా చెప్పుకొచ్చింది.
“ఏ తప్పుడు సమాచారం అయినా ఎవరైనా ప్రచారం చేయడం అంటే చట్టం పట్ల అగౌరవంగా వ్యవహరించడమే కాదు. వారు నియమించిన వేలాది వారి రాజకీయ పార్టీ ప్రతినిధులను కూడా అప్రతిష్టపాలు చేయడం. అది అవిశ్రాంతంగా, పారదర్శకంగా పనిచేసిన లక్షలాది ఎన్నికల ఉద్యోగులను నిరుత్సాహ పరుస్తుంది. ఓటర్ల ద్వారా ఎన్నో ఎన్నికల్లో అపజయాలను చవి చూసిన తర్వాత వారు ఎన్నికల సంఘం రాజీపడిందని ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అసంగతమైనది” అని కొట్టిపారేసింది.
అనువాదం: ఉషా రాణి కె
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.