
ఫైల్ ఫొటో: పీటీఐ
మౌనీ అమావాస్య వేళ అలహాబాద్ మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, 60 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రాష్ర్ట బీజేపీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ లెక్కలను ఆ తర్వాత మళ్లీ అప్డేట్ చేయలేదు. ఈ ఘటనలో తక్కువలో తక్కువ 82 మంది చనిపోయినట్టుగా బీబీసీ విచారణలో వెలుగు చూసింది.
న్యూఢిల్లీ: అలహాబాద్‌లో నిర్వహించబడిన మహాకుంభ మేళ సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 29న మౌనీ అమావాస్య వేల జరిగిన తొక్కిసలాటలో “తక్కువలో తక్కువ 82మంది చనిపోయారు”. ఈ విషయం ఒక విచారణలో వెలుగు చూసింది.
బీబీసీ రిపోర్ట్ ప్రకారం, జనవరి 28న రాత్రివేళ సంగం నోజ్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, ఇంకా 60 మంది గాయపడ్డారని తొక్కిసలాట జరిగిన దాదాపు పదిహేను గంటల తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత ఈ గణంకాలు మళ్లీ అప్డేట్ చేయబడలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు కుంభమేళలో చనిపోయినవారి మొత్తం సంఖ్యను కూడా తెలియజేయలేదు.
అయినప్పటికీ, మరణించిన వారి కుటుంబాలకు రూ 25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ చనిపోయిన వారి వాస్తవ సంఖ్య విషయంలో నిరంతరం ప్రశ్నలు ఉత్పన్నవుతూనే ఉన్నాయి.
ఈ దుర్ఘటన మీద ఇటీవల స్పందించిన అలహాబాద్ హైకోర్టు కుంభమేళలో చనిపోయినవారి మొత్తం సంఖ్యను బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి చెప్పింది.
బీబీసీ విచారణ ప్రకారం, ఎవరికైతే ప్రభుత్వం చేత 5- 5 లక్షల రూపాయల నగదు అందించబడిందో అటువంటి 26 కుటుంబాలను బీబీసీ కలిసింది. చనిపోయినవారిలో 5 లక్షల రూపాయల నగదును పొందిన వారి పేరు నమోదు చేయబడలేదని తెలిసింది.
50 జిల్లాల్లో బీబీసీ ఈ విచారణను చేసింది. దీని కోసం దాదాపు 100 కుటుంబాలను కలిసింది. దీని తర్వాత ఈ తొక్కిసలాటలో తక్కువలో తక్కువ 82 మంది చనిపోయినట్టుగా నిర్ధారించారు.
తెలియాల్సిందేంటంటే, ఈ సారి 45 రోజులు కొనసాగిన మహాకుంభమేళలో 66 కోట్ల మంది పాల్గొన్నారని, ఇది ఒక మహత్తరమైన విజయమని కేంద్ర- ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించుకున్నది. ఈ కార్యక్రమానికి 7,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయబడింది. ఈ విషయంలో ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో తొక్కిసలాట ఘటన మీద మాట్లాడారు. 30 మంది చనిపోయినట్టుగా, 29 మృతదేహాల గుర్తింపు జరిగినట్టుగా ఆయన అంగీకరించారు.
అక్కడ భక్తులు కొద్దిగా ఇబ్బంది పడ్డారని, కొన్ని స్థానాలను “ప్రెజర్ పాయింట్” అంటూ ఆయన తెలియజేశారు. బీబీసీ తన పరిశోధనాత్మక విచారణలో ఈ “ప్రెజర్ పాయింట్”లోని నాలుగు స్థానాల వద్దే మృత్యువాత జరిగిందని గుర్తించింది.
ఈ రిపోర్ట్‌లో బాధితులను మూడు శ్రేణులలో వర్గీకరించారు. మొదటి శ్రేణిలో అధికారికంగా 25 లక్షల రూపాయల పరిహారం పొందిన వారు ఉన్నారు. ఎవరైతే 5 లక్షల నగదు పొందారో వాళ్లు రెండవ శ్రేణిలో ఉన్నారు. ఎవరికైతే ఎటువంటి పరిహారం అందించబడలేదో వాళ్లు మూడవ శ్రేణిలో ఉన్నారు.
ప్రభుత్వం ద్వారా ఇటువంటి విషాద సంఘటనలకు పరిహార రూపంలో నగదు ఇచ్చే మాటేదైతే ఉందో, దానికి సంబంధించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఫిబ్రవరిలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారి కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేసిన విధానం మీద కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి.
కేంద్ర రైల్వేమంత్రిత్వ శాఖ ద్వారా కుటుంబసభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని ప్రకటించారు. ఈ ప్రకటనలో భాగంగా 100, 50 రూపాయల నోట్ల కట్టలను అధికారులకు అందజేశారు.
అయినప్పటికీ, మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారిలో 37 మందికి 25 లక్షల రూపాయిలను డైరెక్ట్ కుటుంబ సభ్యుల అకౌంట్లలో వేశారు. లేదా వారికి చెక్ రూపంలో అందించారు.
మరోవైపు మరో 26 కుటుంబాలకు 5- 5 లక్షల నగదు ఇవ్వడం జరిగింది. లబ్ధిపొందిన కుటుంబాలకు ఈ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో నిర్ధారించడం కష్టంగా ఉందని బీబీసీ పేర్కొన్నది. ఈ మొత్తం డబ్బులను కలుపుకొని ఒక కోటి 30 లక్షల నగదుగా చెప్పొచ్చు.
విచారణలో ఎవరినైతే నిర్ధారించారో వారికి నగదు ఇవ్వబడింది. అందులో ఎక్కువమంది వద్ద డబ్బులు అందించే వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఎక్కువ కేసులలో డబ్బులు అందించే పనిలో యూపీ పోలీసులు భాగస్వామిగా ఉన్నారని రిపోర్ట్‌లో పేర్కొనబడింది.
తొక్కిసలాటలో తమవారిని కోల్పోయిన తక్కువలో తక్కువ 19 కుటుంబాలకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయం అందలేదని గుర్తించడంలో తమ సమర్థతను చాటుకుంటున్నట్టుగా బీబీసీ తెలియజేసింది.
ప్రత్యక్షసాక్షులు, ఫొటోలు, ప్రభావిత పార్టీలతో మాట్లాడిన వాటి అనేక వివరాలు విచారణలో నమోదు చేయబడ్డాయి.
బీబీసీ తన రిపోర్ట్ చివరిలో తెలియజేసిందేంటే, తొక్కిసలాటలో చనిపోయినవారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ బీబీసీ 82అనే నిర్ధారించగలదు. ఎందుకంటే, వీటికి సరైన సాక్ష్యాల, ప్రత్యక్షంగా చూసినవారి మాటాల ఆధారంగా నిర్థారించడం జరిగిందని పేర్కొన్నది.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.