
నాగరికమైనా అనాగరికమైనా అన్ని మతాలు రెండు లక్షణాలను అనివార్యంగా కలిగి ఉంటాయి. ఒకటి చారిత్రాత్మకత రెండు మానసిక స్వాంతన కలగించడమని బీఆర్ అంబేడ్కర్ ఖచ్చితంగా ప్రకటించారు. వీటిని ఆ తరువాత మతానికి సంబంధించిన తాత్వికతగా చిత్రీకరిస్తారు. నిజానికి ముందే ఏర్పాటైన ఈ చిత్రీకరణకు భిన్నంగానే తత్వశాస్త్ర సారాంశం ఉంటుంది. ఏ మతానికైనా స్వరూపాన్నిచ్చే మౌలికాంశం భ్రమ/పురాణం.
వెండి డెనిగెర్ మాటల్లో చెప్పాలంటే నిజంకాదని తెలిసినా అనేక మంది ఈ పురాణ గాధను నమ్ముతారు. పురాణ సారాంశం కప్పబడి ఉంటుంది. కాబట్టి ప్రజలు దాన్ని పట్టించుకోరు. లేదా అవగాహన చేసుకోలేరు. అట్లాగ పురాణం సంకలితమైన క్రతువులతో కలసి వ్యక్తికి సమాజానికి మధ్య ఒక సమతుల్యం ఏర్పరచడానికి సహాయపడుతుంది. ఒక కపట అర్ధంలో ఒక వ్యక్తి లేదా బృందం ఈ తత్వశాస్త్ర శక్తిని ఉపయోగించుకుని వారి ఆధిపత్యాన్ని స్థాపించడం ద్వారా సామాజిక క్రమాన్ని పురుషాధిక్య భావపు బలాన్ని వాడి నిర్వహించడానికి ఇవి దారి తీస్తాయి.
ప్రతీకాత్మకత, మార్మికత, పురాణం(భ్రమ), ఆధ్యాత్మికత క్రతువులు, మతాత్మకత, తాత్వికత అనేది భారత ప్రజల జీవన విధానంలో భాగం. వారివారి మతాల తాత్వికతను పాటించడం అనుసరించడం అనేవి క్రతువులు నిర్వహించడంతోనూ ఈ కల్పిత పురాణాలని నమ్మడంతోనూ అనుసందధానించబడి ఉన్నాయి. వీటిని ప్రచారం చేసే సంస్థలని కానీ ప్రతీకలని కానీ సాంప్రదాయమైన/రుద్దబడిన/ ప్రకటిత అధికారులని కానీ ప్రశ్నించకుండా అనుసరించడం దీనిలో భాగం. ఈ సంక్లిష్టతలు, అనేక పొరల మతపు విభిన్న సిద్దాంతాల గతితార్కికతను ఒక విశిష్టమైన ఆధునికాంతర పద్ధతిలో అది కూడా స్థానికమైన సాహితీ ప్రక్రియతో విడగొట్టి చూసే పనిని రాఘవేంద్ర పాటిల్ సాహితీ అకాడమీ బహుమతి పొందిన నవల “తీరు”లో చేశారు.
తీరు వంశావళి సమాచారం..
“తీరు” అంటే ఇంగ్లీష్‌లో ఛారియట్(రథం) మత తత్వశాస్త్ర నిఘంటువు ప్రకారం చూస్తే ఈ రథం అనే చిత్రం విభిన్నమైన వాఖ్యానాలకు(పోమన్ ఎఫెక్ట్) తావిస్తుంది.
బౌద్ధుల అఖిల దేవతా గణంలో ఇది “దమ్మ” చక్రానికి ప్రతీక ఇది పురోగతికి కొనసాగింపు. హిందువుల సర్వదేవతల్లో ఇది యుద్ధాన్ని సూచిస్తుంది. రామాయణం మహాభారతాల్లో చూసినట్టుగా పౌరాణికంగా కానీ, వాస్తవ చరిత్ర కానీ, లేదా పౌరాణిక చరిత్ర రంగంలో లోపాలుగా ఒక కాలం నుంచి మరొక కాలానికి మారుతున్నప్పడల్లా ఈ చిత్రం గుణాత్మక అర్ధాల్లోకి వివర్తనం చెందుతుంది.
కర్నాటక వాయివ్య ప్రాంతంలో మహారాష్ట్రకు సరిహద్దుల్లోని బెలగావి ప్రాంతంలో ఈ నవల కథనం జరుగుతుంది. నవల కేంద్ర ప్రదేశం ధర్మావట్టి గ్రామమైనా నవలలోని ఘటనలు మల ప్రభ, ఘట ప్రభ, క్రిష్ణ నదుల చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నింటిలోనూ జరుగుతాయి. పీష్వాల పరిపాలనా కాలం నుంచి ఎమర్జెన్సీ తర్వాత వరకూ కాలాన్ని నవల చిత్రిస్తుంది. రెండు సామాజిక ప్రయాలని అది పాఠకుల ముందుంచుతుంది. స్వాతంత్రానికి పూర్వ భారతదేశపు బ్రాహ్మణ భూస్వామ్యం ఒకటయితే, స్వాతంత్య్రానంతర ప్రజాస్వామ్య భారతంలో భూస్వామ్య పునరుజ్జీవం రెండోది. అయితే నవలలో భాగస్వాములు వ్యక్తులు, కుటుంబం, సమాజం.
చివరిగా ఈ క్రమంలో ఎవరైనా గట్టిగా ఆలోచించి వీటి గురించి పునరాలోచించి ఒక దేశం అనే భావన దగ్గరికి ఎట్లా చేరగలరో జవాబు చెప్పాలి. ఈ ఆకృతుల వర్ణనల ద్వారా పాటిల్ ఒక తోలుబొమ్మలాంటి వృత్తిగా అనుసరించే తక్కువ కులపు “కిల్లిక్యాత” కుటుంబపు తరతరాల గాథను పాఠకుల ముందుంచుతాడు.
కథ పీష్వా కాలంలో ప్రారంభమై పితృస్వామిక వారసత్వాన్ని అనుసరిస్తుంది. ఈ కథ ఒక కుటుంబం చుట్టుతూ తిరిగినా ఇది సామాజిక నీతిలో నిబిడీకృతమైన సంకుచితత్వపు రూపాంతరీకరణకు సంబంధించిన ప్రత్యామ్నాయ గాధ.
పీష్వాల భూస్వామ్యం- కల్పిత పురాణాల తయారీ..
పీష్వాలు వారి బ్రాహ్మణ ప్రతినిధుల ఆధ్వర్యంలో కుల భూస్వామ్యంలో పండరీపురం విఠలుడి పేరిట భక్తి ఆధ్యాత్మికతల ముసుగులో ఒక రథ ఉత్సవాన్ని ప్రారంభించింది. కింది కులాల రక్తం మీద వికసిస్తున్న పీష్వాల భూస్వామ్యం నిలబెట్టడం అనేది ఈ ఉత్సవ క్రతువు ప్రధాన ఉద్దేశ్యం. వ్యవస్థీకృతమైన కుల భూస్వామ్యం చర్చ అంతా ఆర్థిక అప్రజాస్వామ్యాన్ని పెంచిపోషిస్తుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి తన జీవనోపాధిని ఎంచుకునే స్వేచ్ఛ ఎంత అనేది ఆ వ్యక్తి సామాజిక హోదా నిర్ణయిస్తుంది.
కిల్లిక్యాత కుటుంబం ఈ భూస్వామ్య క్రమంలోని సాంప్రదాయికమైనా భక్తి పైనే అభివృద్ధి చెందుతుంది. “ఒక గౌరవప్రదం నిర్దేశించబడింది” పైగా రానున్న తరాలకు పరివ్రత ప్రసాదించబడుతుందనే ఎరలో చిక్కుకుంటుంది. (క్రింది కులాల) వారి కొడుకును బలి ఇవ్వాలనేది వారికి దీని కోసం ఇచ్చిన ఒప్పందం. ఇది పితృస్వామిక భూస్వామ్య వ్యవస్థ లైంగిక- కుల నిర్మాణాల చిత్రాలను అతి సూక్ష్మంగా వాడుకుంటూ చేసిన మోసపూరిత ప్రతిపాదన. దీనిలో మతం పేరిట తాత్విక ఆధ్యాత్మిక క్రతువు ముసుగులో ఉన్మాదానికి ఒక వ్యవస్థీకృత పద్ధతి ఎలా ఏర్పాటవతుందో మనకు కనబడుతుంది. ఇది ఒక పౌరాణిక గాథగా మారుతుంది. భవిష్యత్ తరాలు ఒక సముద్ర సర్పంలాంటి మతపూరిత శక్తిని ఉపయోగించి దీన్ని నిర్దారించాలనే ఆకాంక్ష. ఇది ఆమె స్వేచ్ఛకు, ఎంపికలకు వ్యక్తిత్వ అస్తిత్వానికి ఒక చావుదెబ్బగా మారి సామాజిక మత శక్తులకు ఆమె లొంగి పోయేలా చేస్తుంది.
మళ్లీ ఒకసారి అంబేడ్కర్‌ను తలుచుకుంటే, మతం తన హేతువాద జ్ఞాన తాత్వికతలో(ఆకాంక్షించిన విధంగా) వ్యక్తికి వాటిని అందించాలి దానికి వ్యతిరేకంగా కాదు. కానీ ఈ కథలో మత తాత్వికత సమాజంలోని కొన్ని వర్గాల ప్రయోజనకారిగా ఉండటానికి తయారు చేయబడి ఒక హేతుబద్ద మానవుని పట్ల వైఫల్యం చెందుతుంది. ఈ రకమైన సూక్ష్మమైన ఆధిపత్య తాత్విక ఉపదేశాలు మానసికంగా ఇంకిపోయినప్పుడు అది సామాన్యత గల దుర్మార్గాలని సాధారణీకరిస్తాయి. సాంప్రదాయం పేరిట రుద్దబడుతున్న క్రతువులని ఆచరించమన్నప్పుడు అవి పవిత్ర పిడివాదపు క్రూరమైన శక్తితో జరిగితే ప్రేమభావన పోతుంది. ఇది స్వతంత్య్రానంతర ప్రజాస్వామ్య నేపథ్యంలో జరుగుతుంది. ప్రస్తుత కాలపు కిల్లిక్యాత(నేను కావాలనే కులం పేరు వాడాను. ఒక వ్యక్తిని ఆమె కులానికి అనేది బ్రాహ్మణత్వపు కుదింపు ప్రజాస్వామ్య భారతంలో కొనసాగుతున్నది) ఒక దొంబర కులం అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రేమకంటే మత క్రతువుల ప్రాధమ్యాల వలన ఏర్పడ్డ కులపిడివాద నియమాలు ముఖ్యం అయిపోతాయి.
ఒక వ్యక్తి ప్రేమపై మత- కుల నీతులు పెత్తనం చేయటం అంటే మనుగడ పైన సారాంశం విజయం సాధించడమే. తాత్విక క్రతువుల ప్రపంచ అప్రజాస్వామిక రాజ్యంలో ప్రేమ భావనను కోల్పోయాక కిల్లిక్యాత వ్యక్తిత్వం వెలివేయబడిన ప్రజ(కుష్టు రోగులు- ఒక స్థాయిలో ప్రక్కకునెట్టి వేయబడిన వీరితో ప్రేమ ప్రతిపాదన ఓడిన వ్యక్తి తననుతాను పోల్చుకోరడం కావచ్చు)లకు సేవ వేయటంతో తన విముక్తిని సాధిస్తుంది.
ఈ నవలలో సాహిత్య సౌందర్యానికి విపరీతంగా అవకాశం దొరికింది. స్థానిక భాష శక్తిని ప్రయోగించడం, విభిన్న కథనాలు, విశ్వసనీయత- అవిశ్వాసనీయతల గతితార్కిక సంబంధం, లైంగికత, కులం, మతం, ప్రాంతం విభిన్నహారాల వలన ఏర్పడిన అనేక దేశాలు వగైరాలు కాని ఒక విషయం కచ్చితంగా చెప్పొచ్చు. నవల చదవడం పూర్తయ్యాక పాఠకులు తప్పనిసరిగా విషాధ భావననను అనుభవిస్తారు. ప్రేమను కోల్పోయిన ఒక సాధారణ వ్యక్తిపై మతం విజయం సాధించడంపై ఒక లోతయిన మత ఆధ్యాత్మిక వ్యక్తి శోకించే పని చాలా అరుదుగా జరుగుతుంది.
మళ్లీ డా అంబేడ్కర్ ఏమన్నారో నెమరు వేసుకోక తప్పదు. “గౌరవ అధిరోహణా భారంలోను ఏహ్యత అవరోహణా భావంలోనూ కలిస్తే ఒక సహానుభూతి గల సమాజాన్ని సృష్టించగలిగితే అది న్యాయవ్యస్థ సమాజం” అవుతుంది.
ఈ వెలుగుల్లో ఈ కోల్పోయిన ప్రేమని లేదా సహానుభూతిని మనం తిరిగి ఎట్లా వెలిగించగలం? మనం మళ్లీ ఆ ప్రేమను, సహానుభూతిని పొందగలమా? ఈ ప్రశ్నలకు మనకు మనమే జవాబు చెప్పుకోవాలి. “తీరు” నవల పాఠకులు కూడా అదే చేయాలి.
నిఖిల్ సంజయ్- రేఖా అడ్యూలె
అనువాదం: దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.