
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి రెండు రోజులలో భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పదవీవిరమణ తర్వాత లభించే ఏ పదవినైనా తీసుకోనని ఆయన అన్నారు.
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, తన నివాసంలో విలేకరుల సమావేశంలో జస్టిస్ గవాయి మాట్లాడుతూ ఈ మాట చెప్పారు.
“నాకు ఎటువంటి రాజకీయ కోరిక లేదు, పదవీవిరమణ తర్వాత నేను ఎటువంటి బాధ్యతను తీసుకోను” అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు.
అయితే, మాజీ సీజేఐతో గవర్నర్ పదవి బాధ్యతలు తీసుకోవాలనే అంశాన్ని లేవనెత్తారు. దీంతో “నేను ఇతరుల తరఫు నుంచి చెప్పలేను” అని ఆయన అన్నారు. కానీ మాజీ సీజేఐ కోసం గవర్నర్ పదవి “ప్రోటోకాల్‌లో సీజేఐ పదవి కంటే కిందస్థానంలో ఉంటుంది” అని గవాయి తెలియజేశారు.
2013 నుంచి 2014 వరకు జస్టిస్ పీ సదాశివం ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2014లో కేరళ గవర్నర్‌గా ఆయన నియమించబడ్డారు. అంతేకాకుండా ఆయన 2019 వరకకు ఈ పదవిలో కొనసాగారు. ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను 2023లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు.
ఇదే విధంగా మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గోగోయి పదవీకాలం ముగిసిన తర్వాత, 2020లో రాజ్యసభ కోసం ఆయనను ఎంపీగా నామినేట్ చేశారు.
న్యాయమూర్తుల ద్వారా రాజకీయనేతలతో పాటు ఇతరులను కలిసే దాని గురించి అడగబడిన ప్రశ్న మీద “ఒక న్యాయమూర్తిగా మీరు వేరే ప్రపంచంలో ఉండరు. ఇంకా వివిధ ప్రాంతాల వ్యక్తులతో మీరు ఎప్పటి వరకైతే కలవరో అప్పటి వరకు వారిని ప్రభావితం చేసే విషయాలను మీరు అర్ధం చేసుకోలేరు.” అని గవాయి చెప్పారని పీటీఐ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది.
సంక్షోభిత మణిపూర్‌కు సంబంధించిన ఇటీవలి తన పర్యటన గురించి కూడా గవాయి మాట్లాడారు.
పార్లమెంటు ఆధిపత్యంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చేసిన వాదనల నేపథ్యంలో పార్లమెంటుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న సంఘర్షణపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. “రాజ్యాంగం అత్యున్నతమైనది. కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఇది చెప్పబడింది.” అని ఆయన చెప్పారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.