
ప్రస్తుతం పాకిస్తాన్- భారత దేశాల మధ్య యుద్థ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ మతగురువు తన అనుయాయులను అడిగిన ప్రశ్నకు ఎటువంటి సమాధానం దొరకలేదు. అయితే, భారతదేశానికి పాకిస్తాన్‌కు మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడతారాని ఇస్లామాబాద్‌లోని లాల్ మస్జీద్కు చెందిన వివాదాస్పద మతగురువు మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ ప్రజలకు అడిగిన ప్రశ్నకు ఎవరు చేతులెత్తలేదు. దీంతో ఒక ప్రతీకాత్మకమైన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ, ఇస్లామాబాద్‌లోని లాల్ మస్జీద్కు చెందిన ఒక వివాదాస్పద మతగురువు. తన ప్రేక్షకులను “భారత్‌తో జరిగే యుద్ధంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడతారా?” అని అడిగిన ప్రశ్నకు ఊహించని నిశ్శబ్దాన్ని చూడాల్సి వచ్చింది. ఎందుకంటే సమావేశంలోని ఒక్కరు కూడా తమ చేతులను ఎత్తలేదు.
జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 22న హింసాత్మక ఉగ్రదాడి జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ దౌత్య, సైనిక పరిణామాలకు సిద్ధమవుతుండగా, పాకిస్తాన్ మత- సామాజిక నిర్మాణంలో భిన్నాభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఉగ్రవాదానికి, రాష్ట్ర ఘర్షణకు దీర్ఘ సంబంధం ఉన్నటువంటి లాల్ మస్జీద్ దగ్గర తన విద్యార్థులను, అనుయాయులను ఉద్దేశ్యించి ఘాజీ ప్రసంగించారు. “మీకోసం నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. ఒకవేళ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోరాడితే, ఎంతమంది పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడి, దేశం కోసం పోరాడతారు?” అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి ఒక్కరు కూడా స్పందించలేదు.
“ఇది సరిపోతుంది అర్థచేసుకోవడానికి” అని ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతేకాకుండా ఇంకా ముందుకు వెళ్లి పాకిస్తాన్ ఆవిర్భవాన్ని విమర్శించారు. “ప్రస్తుతం, పాకిస్తాన్ అవిశ్వాస వ్యవస్థతో కూడుకొని ఉంది- ఇది ఓ క్రూరమైన, ఉపయోగానికి రాని వ్యవస్థ. ఇది భారతదేశం కంటే అధ్వాన్నంగా ఉంది” అని ఘాజీ ఘాటుగా అన్నారు.
బలుచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో చోటుచేసుకున్న దౌర్జన్యాలను మత గురువు ఉదహరించారు. పాకిస్తాన్ తమ సొంత ప్రజలపైనే బాంబులను వేసిందని ఆరోపించారు. “బలుచిస్తాన్‌లో ఏం జరిగింది? వాళ్లు పాకిస్తాన్ ఇంకా ఖైబర్ పఖ్తున్ఖ్వా వ్యాప్తంగా ఏం చేశారు? ఇవి దౌర్జన్యాలు. ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు, దేశం తన సొంత పౌరులపైనే బాంబులు వేసింది.” అని చెప్పుకొచ్చారు.
మే 2న జామియా హఫ్సా, లాల్ మస్జీద్ వద్ద రికార్డయిన వీడియో పాకిస్తాన్ సోషల్ మీడియాలో సుడిగాలిలా చక్కర్లు కొడుతూ దుమారం రేపింది. ఇది కేవలం పౌర సైనిక నాయకత్వం పట్లనే కాకుండా, భారత దేశం పట్ల దాని సైద్ధాంతిక వైఖరి పట్ల పాకిస్తాన్లో పెరుగుతున్న భ్రమకు ప్రతిబింబంగా ఈ సందర్భం నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
లాల్ మస్జీద్కు చెందిన మత గురువు ఎప్పుడైతే, ఒక అతివాద ఉద్రేకపూరితమైన పిలునిచ్చాడో తనకు భారతదేశ వ్యతిరేకంగా యుద్ధానికి ఎటువంటి మద్దతు దొరకలేదు. పాకిస్తాన్లో లోతైన బీటలకు ఇది సంకేతమని చెప్పవచ్చు. ఇస్లామాబాద్‌లో ఇటీవలి అణ్వాయుధ స్థానం, భయాందోళనతో కూడిన దౌత్యంతో జతచేయబడిన అంతర్గత అసమ్మతి, జాతీయ- అంతర్జాతీయ వేదికపై తమపై పెరుగుతున్న అనిశ్చితికి దారితీస్తున్న దేశ చిత్రాన్ని ఈ ఘటన చిత్రీకరిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.