
పంచకుంటే పరువు తగ్గుద్ది
పొగ వస్తుందంటే ఎక్కడో నిప్పున్నట్టే లెక్క
కాలుతుంది చిత్తు కాగితమో నోట్ల కట్టలో
కనిపెట్టి లోకం కళ్ళు తెరిపించాల్సిన
మీడియా కళ్ళు మూసుకుంది
గట్టిగానే ముట్టినాక
న్యాయమూర్తి గారు సెలవు మీద వెళ్ళారు
ఇంతలో ఇంట్లో అగ్గిలం పుట్టింది
అంతా సెలవు సెలవు అని గోల పెట్టారు
అగ్ని ఆర్పేందుకు బూడిదను మాపేందుకు అగ్నిమాపక దళం రంగ ప్రవేశం చేసింది
నిప్పులారిన తర్వాత చూస్తే
బయట పడ్డాయి నోట్ల కట్టలు,
ఆశ్చర్యమే కదా అగ్నిమాపక దళానికి..
ఆ సొమ్మంతా మై లార్డ్ దే అనుకున్నారు
అయినవాళ్లకి పంచకుండా
ఏమిటీ కక్కుర్తి అని విసుక్కున్నారు
అలాంటి సహాయ నిరాకరణలకు,
నిరాకరుణలకు బుద్ధి చెప్పాలనుకున్నారు..
అయినవాళ్లో..
అందులో వాటా అందాల్సిన వాళ్ళో మరి..
బదులు శిక్షగా మై లార్డ్ జన్మ స్థానానికి వెళ్తారు
దోచుకోవడం నేరమే..
దాచుకోవడం ఇంకా ఘోరం..
ముఖ్యంగా ఇలాంటివి
పంచుకుంటే బరువు తగ్గింది
పంచకుంటే ఇలాగే పరువు తగ్గుద్ది..
అర్థం చేసుకునే అలాంటి వారికి
ఢిల్లీ అగ్ని ప్రమాదం నేర్పుతున్న పాఠం ఇదే..
పొగ వెనక ఉన్న నిప్పును చూద్దాం..
కొండూరి వీరయ్య
(డిల్లీ న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం ఘటనపై కవితాత్మక స్పందన)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.