
నేను చైనా గోడను లేపాను కానీ దానిమీద నా పేరు లేదు
తాజ్ మహల్ కట్టాను కానీ దానిమీద నా పేరు లేదు
లాల్ ఖిల్లా కు రంగులు వేశాను కానీ దాని మీద నా పేరు లేదు
మక్కా మస్జిదు కు రాళ్లు ఎత్తాను కానీ వాటి మీద నా పేరు లేదు
చార్మినార్ లను నిలబెట్టాను కానీ వాటి మీద నా పేరు లేదు
పాతబస్తీ చారిత్రాత్మక కట్టడాల కైనా హైటెక్ హంగులకైనా నేనే ఆయువు పట్టును
కానీ నా పేరు వాటి మీద లేదు
గోల్కొండ నే కాదు అనేక కోటగోడలు కట్టింది నేనే కానీ వాటి మీద నా పేరు లేదు
ఎన్నో కాలువలను ఎన్నో చెరువులను తవ్వాను కానీ ఎక్కడ నా పేరు నశిలా ఫలకం లేదు
ఆకాశ హార్మ్యాలను నిలబెట్టాను
కాని వాటి మీద నా పేరు లేదు
నా వల్లే పల్లెలు గ్రామాలు నగరాలు విలసిల్లుతాయి కానీ నా పేరు ఎక్కడా కానరాదు
అందమైన ఉద్యాన వనాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు
రైలు మార్గాలు మెట్రోలు
రోడ్లు అన్నింటికి నేనే చెమటోడ్చాను కానీ నా పేరు ఎక్కడా కానరాదు
నేనే నిర్మాతను నేనే శ్రమజీవిని
అయినా నేను అగోచరుణ్ణి అనామకుణ్ణి నిస్వార్థపరుణ్ణి
నేను ఒక కార్మికుడను ప్రపంచ కార్మికుడను
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు:
కూలీ వానిచెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి
మొహమ్మద్ అబ్దుల్ రషీద్ తెలుగు రచయిత అనువాదకుడు కవి ,సాహిత్య భూషణ్, తెలుగు కీర్తి ప్రతిభా పురస్కారం,ఎన్టీఆర్ లెజెండరీ, పద్మ ప్రతిభ అవార్డు గ్రహీత
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.