
న్యూ ఢిల్లీ : ఢిల్లీ హై కోర్టు జడ్జి యశ్వంత్ సిన్హా ఇంట్లో పెద్ద ఎత్తున నగదు అగ్నికి ఆహుతి కావటం వెనక వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో ఒక ఉన్నత స్థాయి విచారణ సంఘాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించారు. ఈ సంఘం తమ విచారణలో యశ్వంత్ సిన్హా మీద వచ్చిన ఆరోపణలు నిరాధారం కాదని నిర్ధారించింది. ఈ విచారణ సంఘంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ షీలా నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిఎస్ సన్ధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరాంలు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ వేయబోయే ముందు జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టులో తన సీనియర్ సహచర న్యాయమూర్తులతో సంప్రదించి వారి అనుమతి కూడా తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు ద వైర్‌కు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ సిన్హాను రాజీనామా చేయమని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే నెల 13వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు.
1999లో ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడు ఆంతరంగిక దర్యాప్తు జరిపేందుకు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు అందరూ కలిసి కావాల్సిన విధి విధానాలను రూపొందించారు. గతంలో ఎన్నడూ లేని విధం గా ఈ వివాదం పై ఢిల్లీ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికె ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికను కూడా బహిర్గతం చేశారు.
ఈ నివేదికలో తన అధికారిక నివాసంలో ఉన్న సామానుల గదిలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగటం అందులో భారీగా నగదు నోట్లు దొరకడంపై జస్టిస్ యస్వంత్ సిన్హా ఇచ్చిన వాంగ్మూలం కూడా ఉంది. దర్యాప్తు కమిటీ నియమించిన వెంటనే యశ్వంత్ సిన్హాను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ ఆరోపణల నేపధ్యంలో జస్టిస్ సిన్హా రాజీనామా చేస్తారా లేక న్యాయ పోరాటం చేస్తారా అన్నది వేచి చూడాలి.
జస్టిస్ సిన్హా బాధ్యతల్లో కొనసాగటం అనుమతించరానిదని, ఒకవేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఆదేశాల మేరకు రాజీనామా చేయటానికి తిరస్కరిస్తే అపుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒక వేళా సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయ మూర్తి రాజీనామా చేయటానికి నిరాకరిస్తే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సదరు నిందిత న్యాయమూర్తిపై రాజ్యాంగం ప్రకారం తదుపరి చర్యల నిమిత్తం ప్రధాని, రాష్ట్రపతిలకు నివేదించాల్సి ఉంది.
మనీష్ చిబ్బర్
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.