
ది వైర్ డిజిటల్ న్యూస్ పోర్టల్ ప్రారంభించి పదేళ్లు అవుతున్న సందర్భంగా thewire.inజాతీయస్థాయి లఘు చిత్రాల పోటీలకు ఆహ్వానం పలుకుతోంది. చలనచిత్ర రంగంలో పనిచేసే ఔత్సాహికులు, దర్శకులు, విద్యార్థులు ఈ లఘు చిత్రాల పోటీలో పాల్గొనవచ్చు. లఘు చిత్రాల రూపకల్పనకు “మారుతున్న దశదిశ” అన్న అంశాన్ని కథా వస్తువుగా ది వైర్ సంపాదకమండలి నిర్ణయించింది. అయితే ఈ కథా వస్తువును లఘు చిత్ర నిర్మాతలు, దర్శకులు, విద్యార్థులు తమకు నచ్చిన అర్థవంతమైన రీతిలో చిత్రీకరించవచ్చని ది వైర్ సంపాదకమండలి తెలిపింది.
భారతదేశంలో సృజనాత్మకత భావ ప్రకటన స్వేచ్ఛల పరిరక్షణను బలోపేతం చేయడానికి ది వైర్ కృతనిశ్చయంతో ఉన్నదని, అందులో భాగంగానే ఈ లఘు చిత్రాల పోటీలకు ఆహ్వానం పలుకుతున్నామని ది వైర్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. డిసెంబర్ 2025లో జరిగే లఘు చిత్రోత్సవ పోటీ కోసం చిత్రాలను పంపించాలని ప్రకటించింది.
లఘు చిత్రాల రూపకల్పనకు “మారుతున్న దశదిశ” అన్న అంశాన్ని కథా వస్తువుగా ది వైర్ సంపాదకమండలి నిర్ణయించింది. అయితే ఈ కథా వస్తువును లఘు చిత్ర నిర్మాతలు, దర్శకులు, విద్యార్థులు తమకు నచ్చిన, అర్థవంతమైన రీతిలో చిత్రీకరించవచ్చని ది వైర్ సంపాదకమండలి తెలిపింది. పోటీకి సమర్పించే లఘు చిత్రం సగటు నిడివి 20 నిమిషాల వరకు ఉండవచ్చని సూచించింది. ఈ లఘు చిత్రాలను కెమెరా ద్వారా లేదా ఫోన్ ద్వారా చిత్రీకరించి పంపిన ఎంట్రీలుగా స్వీకరిస్తామని వివరించింది.
లఘు చిత్రాల పోటీకి పాయల్ కపాడియా నేతృత్వంలో చలనచిత్ర రంగంలో నిష్ణాతులైన సభ్యులతో కూడిన బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ బృందంలో డైరెక్టర్ ఫైజా అహ్మద్ ఖాన్ వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ పోటీలో భాగంగా ఎంపిక చేసిన అత్యుత్తమ ఆరు లఘు చిత్రాలను ది వైర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక్కడ thewirefilmfestival@gmail.com సూచించిన ఈ-మెయిల్ ద్వారా ఎంట్రీలను అక్టోబర్ 31వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.