
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడు, ప్రపంచ సాంకేతిక కుబేరుడు, వివాదాస్పద రాజకీయ నాయకులకు మద్దతు ఇస్తూనే ఉంటాడు. ప్రపంచంలో జరిగే ఎన్నికలపై ఆయనకున్న ఆసక్తి అంతా ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమేనని ఒక విహంగావలోకనం స్పష్టం చేస్తోంది.
జర్మనీ మితవాద పార్టీ ‘ఆల్టర్ నేటివ్ ఫుర్ డియుట్స్ చ్ లాండ్’(ఏఎఫ్ డీ)ని ప్రపంచ కుబేరుడు ఎలన్ ముస్క్ కీర్తిస్తూ, దాని చాన్స్ లర్ అభ్యర్థి ఎలైస్ వీడెల్ తో ఇటీవల సంభాషించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ప్రపంచ రాజకీయాలను ఆయన ప్రభావితం చేయడం పున:ప్రారంభించారని ప్రపంచ వ్యాప్తంగా భావిస్తున్నారు.
మరో నెల రోజుల్లో జర్మనీలో ఫెడరల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘‘‘ఆల్టర్ నేటివ్ ఫుర్ డియుట్స్ చ్ లాండ్’(ఏఎఫ్ డీ) మాత్రమే జర్మనీని రక్షించగలదు’’ అని తన సొంత వేదిక ‘ఎక్స్’నుంచి ముస్క్ ప్రకటించారు. ఎలైస్ వీడెల్ తో మాట్లాడుతున్నప్పుడు దీన్ని మరింత బలపడేలా చేస్తామని చెప్పడమే కాక, నాజీ పార్టీ నుంచి వలసలవరకు, మాట్లాడే స్వేచ్ఛ నుంచి ‘భగవంతుడి ఉనికి’ వరకు చర్చించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడు, ప్రపంచ సాంకేతిక కుబేరుడు, వివాదాస్పద రాజకీయ నాయకులకు మద్దతు ఇస్తూనే ఉంటాడు. ప్రపంచంలో జరిగే ఎన్నికలపై ఆయనకున్న ఆసక్తి అంతా ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమేనని ఆయనపైన చేసిన విహంగావలోకనంలో స్పష్టమవుతోంది.
‘‘ప్రభుత్వం అతిగా క్రమబద్దీకరించడం, తక్కువ పన్నులు, మార్కెట్ ను పున: క్రమబద్దీకరణ చేయకుండా ఉండడం’’ అనే ఏఎఫ్ డీ పథకాలను కీర్తిస్తూ జర్మనీ లో ప్రసిద్ధ వార్తా ప్రతిక ‘డై వెల్ట్’ లో ముస్క్ ఒక కథనం రాశాడు. ఒక వేళ ఏఎఫ్ డీ అధికారంలోకి వస్తే ప్రత్యక్షంగా ఈ ఆర్థిక విధానాలకు ప్రయోజనం కలిగించే విధంగా బ్రాండెన్ బర్గ్ లో టెస్లా ప్లాంట్ ను నెలకొల్పాడు.
బాహాటంగా ఒక రాజకీయ పార్టీకి కానీ, ఒక అభ్యర్థికి కానీ ముస్క్ మద్దతు తెలపడం ఇది కొత్త కాదు.
కాస్త వెనక్కి వెళ్ళినట్టయితే, 2022లో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాక, స్వేచ్ఛగా మాట్లాడాలనే తన ఆలోచనకు అనుగుణంగా, ఎన్నికల అనంతరం ట్రంప్ లెక్కలను పునరుద్ధరించాడు. అప్పటి నుంచి ప్రతి ప్రచారంలో ట్రంప్ ను ముస్క్ కీర్తించడమే కాకుండా, అవకాశం దొరికినప్పుడల్లా నిష్క్రమిస్తున్న బైడెన్ పరిపాలనను దుమ్మెత్తి పోశాడు.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి పావు బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు. రిపబ్లికన్ నాయకుడిని ప్రోత్సహించడాన్ని కొనసాగిస్తూ,- అంచెలంచెలుగా చేసే ‘ఎక్స్’ సహాయం తో అందరికంటే ముస్క్ ను పైకెత్తడం వల్ల- ట్రంప్ కు కుడి భుజంలా తయారు కానున్నాడు.
ట్రంప్ గెలిచినట్టు ప్రకటన వెలువడగానే ‘‘ఒక నక్షత్రం మొదలైంది-ఎలన్’’ అని ఆయన ప్రకటించాడు.
ట్విట్టర్ ను ఎలెన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అదొక విధ్వంసంగా తయారైంది. ట్రంప్ మళ్ళీ ఎన్నికైనప్పటి నుంచి ట్విట్టర్ విలువ 80 శాతం పడిపోగా, లాభాలు రెట్టింపయ్యాయని ఒక అంచనా.
ఓహియో కేంద్రంగా ఉండే పెట్టుబడి దారుడు, మరో మితవాద నాయకుడు వివేక్ రమణ స్వామి తో పాటు, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రతిభా విభాగం(డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎపిషియన్సీ) కు అధిపతిగా అధ్యక్షుడిచేత ఎంపిక వ్వాలనుకుంటున్నాడు.
అమెరికా ఎన్నికల్లో విజయాలు రుజువవడంతో తన వ్యూహాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి దోహదం చేస్తాయి.
బ్రిటన్ పై దష్టి
ముస్క్ కు బ్రిటన్ లో కూడా ప్రయోజనాలున్నాయి. బ్రిటన్ లో జరగనున్న ఎన్నికలకు ముందే స్టార్ మర్ ను అస్తిరపరిచడానికి ముస్క్ పరిశీలిస్తున్నాడని ‘ద ఫైనాన్స్ టైమ్స్’ రాసింది. బ్రిటన్ లో మరొక మితవాద ప్రసిద్ధ ‘రిఫార్మ్ యూకె’ అనే పార్టీకి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నాడని ఆ పత్రిక పేర్కొంది.
‘రిఫార్మ్ యూకె’ పార్టీ నాయకుడు నైజెల్ ఫరాగె 2024 జాన్ లో అప్ లోడ్ చేసిన వీడియో కు ముస్క్ సమాధానంగా ‘‘మితవాదానికి దూరంగా ఉన్నారని మీడియా మిమ్మల్ని ఎందుకంటోంది?’’ అని అడిగితే, ‘‘ఎందుకంటే, కుటుంబ వ్యవస్థను, దేశాన్ని, బలమైన సరిహద్దులు ఉండాలని మేం కోరుతున్నాం కనుక.’’ అని పరాగె చెప్పారు.
తరువాత డిసెంబర్ లో, ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్- ఆ- లాగో లో పార్టీ కోశాధికారి నిక్ క్యాండి తో ముస్క్ ఉన్న ఫొటోలో కనిపించాడు. ఈ కుబేరుడు వంద మిలియన్ డాలర్లను ‘రిఫార్మ్ యూకె’ పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్టు పుకార్లు షికారు చేశాయి.
ఏది ఏమైనప్పటికీ , ఇటీవల కాలంలో ముస్క్ ఫరాగెకి దూరమయ్యాడు. వారిద్దరి మధ్య విభేదాలు చెలరేగి, ముస్క్ ‘‘రిఫార్మ్ పార్టీకి కొత్త నాయకుడు అవసరం. ఫరాగె దానికి తగిన వాడు కాదు’’ అని ‘ఎక్స్’ పైన పోస్టు చేశాడు.
‘‘ఇది ఆశ్చర్యకరం’’ అని రిఫార్మ్ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించాడు.
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20న ఇద్దరూ కలవబోతున్నారు. ప్రపంచ కుబేరుడితో ‘‘బంధాలేమైన తెగిపోతే వాటిని చక్కదిద్దాలనుకుంటున్నాను’’ అని ఫరాగె అన్నాడు.
ఆందోళన చెందాల్సిన అవసరం ?
ఒకటైతే వాస్తవం. ఎలన్ ముస్క్ ఒక దక్పథాన్ని అమ్ముతున్నాడు. టెస్లా, స్టార్ లింక్ వంటి ముస్క్ కంపెనీలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయన్నది వాస్తవం. ప్రయోజనాల్లో విభేదాలున్నాయి. రాజకీయ సంబంధాలను గెలుచుకోవడం ద్వారా తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించ దలిచాడా? తన రాజకీయానికి తన వ్యాపార ఆలోచన సహాయపడుతుందా?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, సామాజికమాధ్యమాల్లో సింహభాగం కలిగిన వ్యక్తి, ప్రభుత్వాలను శాసించాలని చూస్తున్నాడు. ఈ భయాందోళనలు ఇంకా పూర్తిగా కనిపించడం లేదు.
జర్మనీలో హిట్లర్ తరువాత ముందుకు దూసుకొస్తున్న మితవాద పార్టీ ఏఎప్ డీ ఇప్పటికే ప్రాంతీయ ఎన్నికల్లో విజయం సాధించింది. దానికి తోడు దాని నాయకుడు బ్జోర్న్ హాకే తురింజియాలో గెలిచాడు. రాజకీయ కార్యక్రమాల్లో ఉద్దేశ్యపూర్వకంగా నాజీ పార్టీ నినాదాలు చేయడంతో ఇప్పటికే అతనికి రెండు సార్లు శిక్ష పడింది.
ముస్క్ ను అనుసరించే వారు 212.4 మిలియన్ల మంది ఉండడం వల్ల, దశల వారిగా, ఆయన అభిప్రాయాలను పోగు చేసే ప్రత్యేకమైన ప్రేక్షకులుగా వారు ఏర్పడి – వారొక ఆకర్షణీయంగా తయారు కావచ్చు.
నూతన ఆలోచనల్లో భాగంగా ప్రస్తుత యూరోపియన్ ప్రభుత్వాలకు మైలు రాయిగా ఉన్న డిజిటల్ సర్వీస్ చట్టం అనే ఆన్ లైన్ విధానాన్ని తొలగించకతప్పదని ముస్క్ నొక్కి చెపుతున్నాడు. నిబంధనల మేరకు ముస్క్ కానీ, ‘ఎక్స్’ కానీ ఓటర్లను ప్రభావితం చేయడానికి తన ప్లాట్ ఫాంను వినియోగించుకున్నారని యురోపియన్ యూనియన్ దర్యాప్తులో తేలితే వారికి జరిమానా విధించక తప్పదు.
బ్రిటన్ కు సంబంధించి, ఎక్స్’ పైన ముస్క్ తన వాక్చాతుర్యంతో తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశాడని ఆరోపణ ఉంది. నూతన సంవత్సరం మొదలైనప్పటి నుంచి ముస్క్ నిరంతరాయంగా 200 ల వరకు పోస్టింగ్ లు పెడుతూనే ఉన్నాడు. వాస్తవానికి పాకిస్థాన్ సంతతి బ్రిటన్ వ్యక్తి పదేళ్ళ పిల్లలపైన లైంగిక దాడికి పాల్పడిన నేర సంఘటన అది.
ఇదే కాదు, గత జులైలో విజయాన్ని సాధించిన లేబర్ పార్టీ కెయిర్ స్టార్ మర్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి బ్రిటన్ లో ముస్లిం జనాభాపైన కూడా ముస్క్ అనవసరమైన వ్యతిరేకతను రెచ్చకొడుతున్నాడని విమర్శకులంటున్నారు. వలస వ్యతిరేక వైఖరి చేపట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వం బ్రిటన్ లో సంస్కరణలను చేపట్టిన విషయం విదితమే.
‘‘ఓట్ల కోసం సమూహిక అత్యాచారాలకు తీవ్రంగా సహకరిస్తున్నాడు’’ అని స్టార్మర్ మీద ముస్క్ ఒక ట్వీట్ లో ఆరోపించాడు. బ్రిటన్ లో మితవాద కార్యకర్త, ఇస్లాం ద్వేషి, రాజకీయ ఖైదీ అయిన టోమీ రాబిన్సన్ ని జైలు నుంచి విడుదల చేయాలని కోరాడు.
బ్రిటన్ లో గత ఆగస్టులోచెలరేగిన మతకల్లోలాల సందర్భంగా ‘ఎక్స్’ తన మాటలతో హింసను రెచ్చగొట్టాడు. ‘మాట్లాడే స్వేచ్చ’ కోసమే నిలబడ్డానని చెప్పుకునే ముస్క్, అనుమానితులను గుర్తించడం, వారి జాతీయత, మతం, వలస స్థితి వంటి వాటితో హింసను పెంచడానికి ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు.
ముస్క్ ట్విట్టర్ ను చేపట్టినప్పటినుంచి మితవాదుల అకౌంట్ల పైన కూడా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం పైన భయాందోళనలు, దర్యాప్తులు పునరావృతమవుతున్నాయి. ఒక మిలియన్ మంది అనుసరిచే వారున్నప్పటికీ, అమెరికాలో 14మంది సంప్రదాయ వాదులపైన కూడా సెన్సార్ షిప్ విధించినట్టు ఆరోపణలున్నాయి. తాము ‘ఎక్స్’ పైన బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జస్ లతో పాటు నోట్ల విలువను కూడా పోగొట్టుకున్నామని వారి ఆవేదన.
టెక్ ఇండస్ట్రీ గురించి తాను ముస్క్ ను విమర్శించిన రెండు రోజులకే ‘ఎక్స్’ ట్రంప్ కు సన్నిహితురాలు, మితవాద కార్యకర్త లౌరా లూమర్ ఆర్థిక విలువను తగ్గించేశాడు. ‘‘ట్రంప్ అసలైన వలస విధానాలకు మద్దతు తెలిపినందుకు ఎలన్ ముస్క్ మౌనందాల్చినట్టు కనిపించాడు’’ అని ఆమె ‘ఎక్స్’ కు రాసింది.
భారత కథ
భారత దేశానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మోడీ పైన బీబీసీ డాక్యుమెంటరీ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ముస్క్ సహాయం చేశాడు. మణిపూర్ అంతటా లాక్ డౌన్ విదించినప్పుడు స్టార్ లింక్ తో అతని ఇంటర్ నెట్ సేవలను వినియోగించాడని ఆరోపణలున్నాయి.
భారతీయ మార్కెట్ లోకి ముస్క్ ప్రవేశించడానికి అనుగుణంగా మోడీ ప్రభుత్వంతో ఏళ్ళ తరబడి స్నేహం నెరిపినప్పటికీ అదంత సజావుగా సాగ లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో తాజాగా 2015లో సమావేశమైనప్పుడు, ఆయన్ని తెస్లా మోటార్స్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ‘‘ఆయన దృష్టిని అర్థం చేసుకున్నాను’’ అని చెప్పాడు.
ఐక్యరాజ్య సమితా భద్రతా మండలిలో భారత దేశానికి స్థానం లభించాలని గత ఏడాది జనవరిలో ‘ఎక్స్’ లో పోస్ట్ చేసిన ముస్క్ , ఈ భూమి పైన ఇంత ముఖ్యమైన దేశానికి భద్రతా మండలిలో స్థానం లేకపోవడం ‘అసంబద్ధం’ అని వ్యాఖ్యానించాడు.
రెండు నెలల తరువాత ముస్క్ ఈవీ కంపెనీకి తక్కువ టారిఫ్ లభించడమే కాదు, మహరాష్ట్ర, గుజరాత్, తమిళనాడులలో తన ఫ్యాక్టరీలకు స్థలాలను అన్వేషించాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో మోడీ గెలిచినందుకు గత ఏడాది జూన్ లో ఆయన్ని అభినందించాడు. మహరాష్ట్ర, జార్ఖండ్ రాష్టాల శాసన సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి ఒక రోజు ముందు భారత ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు విధానాన్ని కాలిఫోర్నియాతో పోలుస్తూ కీర్తించాడు.
‘‘భారతదేశం 640 మిలియన్ల ఓట్లను ఒకే రోజులో లెక్కించింది.’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించగా, రాష్ట్ర ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాత్రం ‘ఇది చాలా సులువైంది’ అని ప్రకటించారు.
ఆంతరంగిక రాజకీయాల్లో ముస్క్ జోక్యం చేసుకుంటున్నాడని, తాను ఎంపిక చేసుకున్న వాటిలో తన పునాదిని ఏర్పాటు చేసుకుంటున్నాడని ఫ్రాన్స్ అధినేత ఎమాన్యెయెల్ మాక్రో, నార్వే ప్రధాని జోనస్ ఘర్ స్టోర్, జర్మన్ ఛాన్స్ లర్ ఓలాఫ్ ష్కోల్జ్ విమర్శించారు.
‘ముస్క్ అపరమేధావి’ అని, డోనాల్డ్ ట్రంప్ తో రాజకీయంగా అతను కలిసి ఉండడం వల్ల అతన్ని ‘రాక్షసుడు’ అని తప్పుగా చిత్రిస్తున్నారని ఇటలీ అధినేత జార్జి మెలోని అంటాడు. వలసలపైన మెలొని ఖఠిన వైఖరి అనుసరిస్తూ, తన పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఆయన పై చర్య తీసుకున్న ఇటలీ న్యాయవ్యవస్థను ముస్క్ విమర్శించాడు.
ప్రపంచంలో మితవాదులు ఆధిపత్యం పెరుగుతున్న సూచనలు కనిపిస్తుండడంతో ముస్క్ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు.
‘‘అత్యున్నత అధికారం అత్యున్నత బాధ్యతల నుంచే వస్తుంది’’ అని అంకుల్ బెన్ అంటాడు.
స్వేచ్ఛా ప్రసంగం, పారదర్శకత వంటి నిబద్దతతోనే ముస్క్ కార్యకలాపాలుంటాయని అతని మద్దతుదారులంటుండగా, ఆత్మపరిశీలన లేని అతని వ్యవహారం ప్రజాస్వామిక వ్యవసస్థను దెబ్బ తీస్తుందని అతని విరోధులు అంటారు.
-షర్మితా కార్
అనువాదం : రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.