
ఇంగ్లిష్ ప్రపంచ వాణిజ్య భాష. మనం ఎవరిని ఇష్టపడం, వ్యాపారం ఎలా జరుగుతుంది? జపాన్, చైనా, జర్మనీ, రష్యా, అంతర్జాతీయ మార్కెట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఇవన్నీ ఆంగ్లంలోనే చేస్తున్నాయి. ఇంగ్లీష్ ప్రపంచ వాణిజ్య భాషే కాదు, ప్రపంచ కమ్యూనికేషన్ భాష కూడాని గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ జ్ఞాన భాష, జ్ఞానానికి మూలం. అయితే, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ డాక్యుమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు తెలుగులో కావాలి. అంతా తెలుగులోనే ఉంటుందా? తెలుగులో సుప్రీంకోర్టు తీర్పు వస్తుందా? సుప్రీంకోర్టు తీర్పులో గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఎన్ని తెలుగులో వాడుతున్నారు. అసలు తెలుగులో ఇప్పటికి ఎన్ని తీర్పులు వచ్చాయి? వైజ్ఞానిక పరిశోధన, వైద్య పరిశోధన తెలుగులో ఉందా? ప్రపంచానికి ఆంగ్లంలో పరిజ్ఞానం ఉంది, వాస్తవంలో అది ఆధిపత్యం చెలాయిస్తుంది. మన కోరిక సరే కాని అది వాస్తవం.
చైనా, జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో సొంత భాషనే వాడుకుంటున్నారని తెలియడం లేదా? రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆంగ్ల విద్యను అభ్యసించాలి. పేద పిల్లలకు ఇంగ్లిష్ విద్య దొరకదు. మన తెలుగు మాట్లాడే‘తెలుగు దేశమా’అని చెప్పగలరా? ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తెలుగు మీడియం కావాలనీ, తెలుగు సులభంగా నేర్చుకోవచ్చనీ. ఇది కుల భాషా కాదనీ, అందరి తెలుగు భాష అని అంటున్నారు. తెలుగు చదివే వారందికీ వారిదే తెలుగు భాష అవుతుంది. అది అధికార భాష కేవలం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండాలి. త్రిభాషా సూత్రం(ఇంగ్లీషు, హిందీ, ప్రాంతీయ భాషలు)అనీ మనమే అంటున్నాం. మరి ‘‘జాతీయ భాష’’ అనేమాట ఎక్కడునుంచి వచ్చింది?
ఆర్టికిల్ 343 కీలకం
ఆర్టికల్ 343 కింద రాజ్యాంగ పరిషత్తు చర్చలలో ఈ ప్రశ్న ప్రస్తావన వివరంగా వచ్చింది. బ్రిటిష్ ఇండియాలో విదేశమన్నా, స్వదేశమన్నా జాతీయ అన్నా అంతర్జాతీయం అన్నా అది 1947 ముందు నుంచి ఇప్పడిదాకా ఇంగ్లిష్ వాడుకుంటున్నాం. తెలియకపోయినా ముక్కలు ముక్కలుగానైనా వాడుతున్నాం. హిందీతో సహా సమానంగా అన్ని భాషలను కాపాడుకోవాలనే ఆలోచనే వీరికి లేదు. పైగా శాసనసభలో ఉపన్యాసాలు దంచుతున్నారు. బ్రిటిష్ వారు విదేశీ భాష నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన తరువాత కూడా ఆంగ్లం అధికార భాషగా అవతరించింది. అనేకానేక రాష్ట్రాలలో ఇంగ్లీషు అధికార భాషగా ఉంది మరి ప్రజలు వాడుకునేదేమిటి? అది జాతీయ భాష అనేమాట ఎక్కడ నుంచి ఉంది? ఎంత అన్యాయం.
రాజ్యాంగ పరిషత్తులో చర్చ
భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులుగా ఉన్న రాజనీతి వేత్తలు, నేతలు వారి ప్రతినిధులు హిందీ అనేది భారతదేశానికి ‘‘చెందిన భాష’’ మాత్రమేనని స్పష్టం చేశారు. కోట్లాది మందిలో ఇది హిందీయేతర రాష్ట్రమని రాజ్యాంగ రచయితలో ప్రముఖులైన గోవిందాస్ అన్నారు. హిందీ దేవనాగరి, ద్రావిడ భాషల నుంచి వస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం కన్నడ లిపి పూర్తిగా భిన్నమైన ద్రావిడ భాషలో ఉన్నాయి. ఈ రెండు భాషలు హిందీ, దేవనాగరి లిపిలో ఉన్నాయి.
దక్షిణ భారతదేశం నుంచి హిందీయేతర రాష్ట్రాల వరకు రాజ్యాంగ పరిషత్తులో తీవ్ర చర్చ జరిగింది. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలకమైన అంశాలు చెప్పారు. జాతీయ భాష అంటే దేశంలోని ప్రతి ప్రాంతంలో భాష వాడుకునే శక్తి ఉండాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నా, కొందరికి మాత్రమే తెలిస్తే అది జాతీయ భాష అవుతుందా? అది కేవలం అధికార భాష అవుతుందని రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ వివరించారు. అందరు ఒప్పుకుంటే, మెజారిటీ ఉంటే అది జాతీయ భాష అయ్యే అవకాశం ఉంటుంది. చట్ట బద్ధత వస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
నిబంధనలు చర్చ
భారత రాజ్యాంగంలో అధికారిక భాషకు సంబంధించినవి XVII భాగంలో చాలా ఉన్నాయి. XVII భాగంలో మరో నాలుగు అధ్యాయాలు, తొమ్మిది ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికిల్స్‌లో ‘అధికారిక భాష’ (ఆర్టికల్స్ 343, 344); ‘ప్రాంతీయ భాషలు’ (ఆర్టికల్స్ 345-347) అని రెండు భాగాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రాల అధికార భాషలకు ప్రాంతీయ భాషలని పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల భాష, చట్టాలు (ఆర్టికల్ 348) చేయడానికి వాడే భాష అని విడిగా ఉందనుకోవలసిందే. నిజానికి చట్టాల భాష అని జనం భాష అని వేరే వేరే ఉంటే ఇంకా కష్టం అవుతుంది.
‘జాతీయ భాష’ కాదు
రాజ్యాంగం XVII భాగంలో అధికారిక భాషకు నిబంధనలు ముఖ్యమైనవే ఉన్నాయి. పార్లమెంటు (భాగం V, అధ్యాయం II) రాష్ట్ర శాసనసభలు (భాగం V, అధ్యాయం III) గురించి చెప్పే అధ్యాయాల్లో, శాసనసభా ప్రక్రియల భాషకు సంబంధించి, ఆర్టికల్స్ 120, 210లు నిబంధనలు వివరిస్తున్నాయి. III భాగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలోని ఆర్టికల్స్ 29, 30 సంస్కృతిక విద్యా హక్కులను గురించి పేర్కొన్నాయి. భాషాపరమైన తక్కువమందున్న మైనారిటీల హక్కులకు గ్యారంటీ ఇస్తున్నాయి. ఎనిమిదవ షెడ్యూల్ కొన్ని భారతీయ భాషలకు ‘అధికారిక’ హోదాను కల్పించింది.
ఒకే భాషలో మైనారిటీ సమస్య: ఆర్టికిల్ 3
‘‘ద ఆక్స్ ఫర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ ద ఇండియన కాన్స్టిట్యూషన్’’ అనే ఉద్గ్రంధాన్నిఎడిట్ చేసిన ముగ్గురు ప్రముఖులలో ఒక రచయిత సుజిత్ చౌదరీ రాజ్యాంగంలో భాషకు సంబంధించిన వివరమైన వ్యాసం రాశారు. అందులో భాష కోసం మనం ప్రత్యేకంగా అనకపోయినా ఆర్టికిల్ 3 వంటి నిబంధనలో కూడా ప్రస్తావన ఉంది. ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన. ఆర్టికల్ 3, ఇది పార్లమెంటుకు రాష్ట్రాల భౌగోళిక పరిమితులను మార్చడానికి కొత్త రాష్ట్రాలను సృష్టించడానికి అధికారాన్ని ఇస్తుంది. ఇక్కడ భాషాపరమైన మైనారిటీల హక్కులు ఉపయోగపడింది తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల విషయంలో రాజ్యాంగమైన, న్యాయమైన అంశాలు ఉన్నాయి.
హిందీని ప్రభుత్వ అధికార భాషగా స్వీకరించాలంటే వ్యతిరేకత చాలా కాలం నుంచి ఉంది, ఇది అందరికీ తెలుసు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. విస్తృత వైవిధ్యాన్ని కలిగిన ప్రపంచంలో భారతదేశ సమగ్రతను కాపాడేందుకు అనేక భాషలను అధికారిక భాషలుగా ప్రకటించారు. దానికి అనేక అనుభవాలు, సామాజిక, ప్రాంతీయ, రాజకీయ అనుభవాలు నేపథ్యంగా ఉన్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాల ప్రజలు హిందీకి ప్రాధాన్యత ఇచ్చి ప్రాంతీయ భాషలకు అధికారిక హోదా కల్పించడం అవసరం అనుకున్నారు. అది నిజమే కూడా. ఆర్థిక, రాజకీయ అధికారాన్ని హిందీ మాట్లాడేవారి వైపు బలవంతరంగా మళ్లించేవిధంగా విధానాలు అమలు చేయకూడదని అన్నారు. కాబట్టి కేంద్రంలో ఇంగ్లీష్‌ను ఉపయోగించే కొనసాగించేందుకు, ప్రాంతీయ భాషలకు అధికారిక హోదాను కల్పించేందుకు పోరాడారు. అదే ఇప్పటికీ పనిచేస్తుంది. దాని అవసరం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.
”భారతదేశ భాషా రాజకీయాలలో భాషా స్థితి మార్పుల వెనుక ఉన్న ముఖ్యమైన అంశాలు పరిగణించాలి. అంతేకాకుండా భౌతిక వనరుల పట్ల పోటీ గురించి కూడా ఆలోచించాలి. అధికారిక భాషపై చర్చలు కేవలం సాంస్కృతిక విభేదాలను మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాల కోసం జరిగే పోటీని కూడా చూడాలి. కాబట్టి అందులో సమస్యలు తీవ్రంగా ఉంటాయి” సుజిత్ చౌదరీ అన్నారు.
భారత రాజ్యాంగంలోని భాషా నిబంధనలు రాజ్యాంగ రూపకల్పన దాని అమలుకు సంబంధించి అనుభవాలు చెప్పే పాఠాలు ఏంటంటే, అధికారిక భాషను అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో తప్పనిసరిగా ఉపయోగించి తీరాలనే అభిప్రాయాన్ని భారత రాజ్యాంగం ఒప్పుకోలేదు. స్పష్టంగా తిరస్కరిస్తుంది. దీనిలో అధికారిక భాష ఎంపికను వాడుకోవాలి, స్థానిక స్థాయిలో భాషను ఏవిధంగా ఉపయోగించాలి. ప్రత్యేకమైన విధానాలు సాధనాలు ఉపయోగించడం సాధ్యమా అని ఆలోచించాలి. కాబట్టి మొత్తం దేశానికి ఒకే భాష సాధ్యం కాదు. మరికొన్ని అధికార భాషాలు చేర్చడం ‘మన రాజ్యాంగ రాజీ’సాధించడానికి సాధనంగా మారుతుంది.
రాజ్యాంగంలో XVII భాగంలోని ప్రత్యేక నిబంధనలు రాజ్యాంగ రాజీని సాధించడానికి వివిధ వ్యూహాలను ఉపయోగించాయి(ఆర్టికల్ 343, ఆర్టికల్ 344, ఆర్టికల్ 345, ఆర్టికల్ 3 పరిశీలించండి). అధికారిక భాష రాజకీయాలకు ప్రాముఖ్యమైన వేదికలు రాజ్యాంగ సభ, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు అయినప్పటికీ, కోర్టులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ముఖ్యంగా మైనారిటీ భాషా విద్యపై కేసుల పరిష్కారంలో ఆర్టికల్ 30 ఉపయోగపడింది. న్యాయాస్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా భాషను ఏ విధానాల ద్వారా నిర్ణయించగల హక్కును, దానితో మైనారిటీ భాషా విద్యాహక్కుల మధ్య సంబంధాన్ని తీర్పులలో సమర్థవంతంగా విశ్లేషించాయి.
ఇదంతా ఎందుకంటే ఈ ప్రక్రియలో, స్వాతంత్య్రోద్యమం నుంచి ఏర్పడిన సమగ్ర భారతీయ పౌరసత్వ భావన, మనదేశానికి అన్ని భాషా సముదాయాలకు ఆధారమైన భూమిక అవుతుంది. మరో రకమైన పౌరసత్వ భావన అవసరమా లేదాని కూడా న్యాయాస్థానాలు చర్చించాయి. రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు (రాజ్యాంగ అసెంబ్లీ)లో ఏది అధికారిక భాష అనే అంశంపైనే పెద్ద వివాదం చెలరేగింది. బ్రిటిష్ పాలనలో ఒక్క శాతం మంది మాత్రమే ఇంగ్లీష్‌లో పరిపాలన సాగింది. దాదాపు పన్నెండు ప్రాంతీయ భాషలు ఉపయోగంలో ఉన్నాయి. అందులో హిందీని ఎక్కువమంది, దాదాపు 40 శాతం మంది మాట్లాడుతున్నారు. కొందరు మాత్రమే ఇతర భాషలు మాట్లాడగలరు. దక్షిణ ప్రాంతంలో చాలా తక్కువమందికి హిందీ తెలుసు. మన సొంత భాషలు ఉన్నాయి. పొరుగు భాషలు అర్థం కావు, వాడలేరు. అందరు ఇంగ్లీషు వచ్చినవారని అనలేం. కాబట్టి అనేకానేక భాషలను కలుపుకుంటూ ఇంగ్లీషు ద్వారా కోర్టుల్లో, డిల్లీలో అనుసంధానం చేస్తూ ఉంటున్నాయి. కనుక హిందీ, ఇంగ్లీషు అధికార భాషలు రెండూ ఉండాల్సిందే. కాని అది సరిపోదు. కనుక ఆర్టికిల్ 343 హిందీ అధికారిక భాష అని మొదట ప్రకటించారు. హిందీ విజయం సాధించింది అంటూ అక్కడ ఆపలేము. వెంటనే 343(2) అవసరమైంది. ఇంగ్లీషు స్థానంలో మరో భాషను తెచ్చుకోలేక, మొదట 15 సంవత్సరాల దాకా ఇంగ్లీషునే అధికారిక భాష కావలసిందే అని అర్థమైంది. 343(3) కింద నిరవధికంగా శాసన భాషగా ఇంగ్లీషు కొనసాగుతూ వచ్చింది. కనుక ఇంగ్లీషుతో మరొక భాష జతతో తాత్కాలిక ‘అధికార భాష’గా నడవాల్సిందని తప్పలేదు. ఆర్టికిల్ 348(1)(బి)(1) కింద ఇంగ్లీషు ప్రాథమిక భాషగా అంటూ, నిరవధికంగా ద్వితీయమైన భాషగా నడపవలసి వస్తుంది. హిందీగా ప్రత్యామ్న భాషగా ప్రకటించడానికి ఎన్నో ప్రయత్నాలు, కృషి అందరికీ హిందీ తెలుసుకునే పథకాలు అమలు చేసే పనేదీ చేయకుండా ‘‘తరువాత చూద్దాంలే’’ అని ప్రభుత్వాలు వాయిదావేయడం నిష్క్రియమైనది.
కేంద్ర, రాష్ట్రాల భాష..
ఆర్టికిల్ 346 కింద భారత కేంద్ర, రాష్ట్రాల మధ్య రచించే భాషను ఇంగ్లీష్ అని నిర్ణయించారు. ఇది అవసరం. లేకపోతే ఒక రాష్ట్ర భాషనుంచి మరో ప్రాంత భాషకు చెప్పడం సాధ్యం కాదు. ఒక రకంగా ఇంగ్లీషు వాళ్లు ఈ దేశానికి ఎంతో గొప్పమేలు చేశారు. ఆర్టికిల్ 343 దేశపాలనా భాష కూడా ఇంగ్లీషే. అయినా అది జాతీయ భాష కాదు. ఆర్టికిల్ 350 చూడండి. ప్రతివ్యక్తికీ తన భాషలో ఏ అధికారికైనా తన బాధ చెప్పుకునే హక్కు ఉందని ప్రకటించింది. కాని ఆర్టికిల్ 343 కింద దేశపాలనలో అంతర్గత భాష ఇంగ్లేషే అవుతుంది. ఆర్టికిల్ 344 కింద ఇంగ్లీషునుంచి హిందీలోకి మార్చడానికి ఒక ప్రత్యేక కమిషన్ నియమించింది. కాని బిగి ఖేర్ అధ్యక్షుడుగా ఉన్నపుడు కొట్టివేశారు.
ఐఎఎస్ వంటి పరీక్షలలో తప్పనిపరిగా ఇంగ్లీషులో ఉండాలని నిబంధన చేస్తే డిల్లీ హైకోర్టు ఆర్టికిల్ 14కు అది భంగకరమని మంచి తీర్పు ఇచ్చింది. లేకపోతే ఇతర భాషలపైన ఫెడరల్ సిద్దాంతానికి వ్యతిరేకమై, ఇంగ్లీషు నియంతృత్వం విధిస్తే అందరి భాషలు విధ్వంసమవుతాయని తెలియడం లేదా? ఆయా భాషల్లో పోటీ పరీక్షలు నేర్చుకోవడం ఉద్యోగాలు సాధించడం ఏ విధంగా జరుగుతుంది. చివరకు తెలుగులో బతకడమే అసాధ్యం చేస్తారా? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి జవాబు ఇస్తారా?
(రెండవ భాగం)
మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.