Reading Time: < 1 minute
(అడవిలోని చెట్ల కొమ్మలపైన)
అప్పుడప్పుడు
అడవిలోని చెట్ల కొమ్మలపై
కొన్ని అక్షరాలు మొలుస్తుంటాయి
కానీ అవి పదాలుగా., కవిత్వంగా
వికసించవు.
ఈ మొక్కలు పెరగడానికి ఏ రకమైన ఆహారమూ అందదు.
వాటి వేర్లు భూమిలో సురక్షితంగా ఉండడానికి
కనీసం వాటికి కుండీలు కూడా దొరకవు.
ఆ మొక్కలు నిర్దాక్షిణ్యంగా వీధుల్లో విసిరి వేయబడతాయి
దుమ్ము.. ధూళి.. ఆకలి
బిక్షాటనల మధ్య,
సహాయం అర్థిస్తూ.,
బిక్కుపోయి చూస్తుంటాయి
ఆఖరికి… ఆ మొక్కలు మురికినాల్లాల్లోకి నెట్టబడతాయి.. అక్కడ వాటికి నీరూ.. మట్టి దొరుకుతాయి. సరిగ్గా అక్కడే ఇంకో దళిత మొక్క పెరగడం మొదలవుతుంది.