
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసుకునే భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితి లోకి వెళ్లింది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు, ఓపీటీ (OPT )(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రామ్ ను రద్దు చేయాలని చూస్తోంది. ఈ పాలసీ మార్పు వల్ల, అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 3 సంవత్సరాలు పని చేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న 3 లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఇది పెద్ద షాక్.
ఓపీటీ అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది?
అంటే ఇది అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఒక ప్రత్యేక అనుమతి. దీని ద్వారా, ఎఫ్-1 విద్యార్థి వీసా ఉన్నవారు తమ కోర్సు పూర్తి అయిన తర్వాత 12 నెలల పాటు ఏదైనా పని చేసుకోవచ్చు. స్టెమ్ (STEM) (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో చదివుకున్న వారికి అదనంగా 24 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఈ సమయంలో, విద్యార్థులు హెచ్ -1 బీ వీసా కోసం అర్హత సాధించడానికి ప్రయత్నిస్తారు.
భారతీయ విద్యార్థులకు ఓపీటీ ఒక వరం.ఇది లేకపోతే, వారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వెంటనే అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇది వారి కెరీర్ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది.
ట్రంప్ ఎందుకు ఓపీటీ ని రద్దు చేయాలనుకుంటున్నారు?
ట్రంప్ ప్రభుత్వం, ఓపీటీ విదేశీ విద్యార్థులు అమెరికన్ల ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆరోపిస్తోంది. కానీ నిజానికి, స్టెమ్ (STEM )రంగాల్లో అమెరికాలో నైపుణ్యం కలిగిన శ్రమికుల టోటు చాలా ఉంది. భారతీయులు మాత్రమే H-1B వీసాల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. సిలికాన్ వ్యాలీలో అనేక టెక్ కంపెనీలు భారతీయల ప్రతిభ పై ఆధారపడి ఉన్నాయి.
ఈ ఓపీటీ రద్దు అయితే ఏమవుతుంది?
——
డిగ్రీ పూర్తి అయిన తర్వాత వెంటనే అమెరికా ను వదిలి వెళ్లాల్సి వుంటుంది. ఇది చాలా మంది విద్యార్థులకు భారీగా ఆర్థిక నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే వారు చదవుకోవడానికి భారీ మొత్తంలో బ్యాంకు ఋణాలు తీసుకుంటారు.
అమెరికా యూనివర్శిటీలకు కూడా నష్టమే:
——
అమెరికా విశ్వవిద్యాలయాలు సుమారు 9 బిలియన్ డాలర్ల విదేశీ విద్యార్థుల ఫీజులపై ఆధారపడి నడుస్తున్నాయి.ఇప్పటికిప్పుడు ఓపీటీ రద్దు అయితే, భారతీయ విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఈ చర్య అమెరికా
టెక్ పరిశ్రమకు కూడా షాకే. మన ఓపీటీ హోల్డర్లు టెక్నాలజీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు లేకపోతే, అక్కడ ఇన్నోవేషన్ నెమ్మదిస్తుంది.
ఇప్పుడు మనం విద్యార్థులు ఏమి చేయాలి?
ఈ బిల్లు ఇంకా ఆమోదం పొంద లేదు, ట్రంప్ ఒక్కోక్క విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎందుకైనా మంచింది విద్యార్థులు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలి. ధైర్యంగా ఉండాలి.రానున్న పరిస్థితులను ముందుగా అంచనా వేసుకోవాలి. కొందరు ఇతర దేశాలలో అవకాశాలు అన్వేషిస్తున్నారు, మరికొందరు ఇండియాలోనే జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనుకుంటున్నారు.
అమెరికా మొదటి నుంచీ ప్రతిభను ఆదరించే దేశంగా పేరు పొందింది. కానీ ఇప్పుడు, అది ఇప్పుడు ట్రంప్ పాలనలో తలుపులు మూసుకుంటోంది.ఓటీపీ రద్దు భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదు, అమెరికా ఎకానమీకి కూడా నష్టం కలిగిస్తుంది. ఈ నిర్ణయం వల్ల, ప్రపంచంలోనే టాలెంట్ మైగ్రేషన్ పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. ట్రంప్ కు హితవు చెప్పేవారు లేరు.చెప్పినా వినిపించుకోని మొండి ఘటం.కనుక మన విద్యార్థులు బెంబేలు పడకుండా ఇప్పుడు రానున్న పరిణామాలు అంచనా వేసి జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన సమయం ఇది.
DR. కోలాహలం రామ్ కిశోర్. 9849328496
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.