
అప్పుకు సంబంధించిన ఒక ఘటనలో పౌర కేసుకు బదులుగా క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు యూపీ పోలీసులకు మొట్టికాయ వేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఏదైతే జరుగుతుందో అది తప్పని విమర్శించింది. ప్రతిరోజూ యూపీలో సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడం జరుగుతుందని, ఈ వ్యవహారం పూర్తిగా చట్ట ఉల్లంఘన అని తెలిపింది.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి నుంచి 25 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించని ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. దీని మీద స్పందించిన సుప్రీంకోర్టు ఈ చర్యను తప్పుపట్టింది. ఇది ముఖ్యంగా ఒక పౌరవివాదం అని తెలిపింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత బెదిరింపు ఇంకా నేరపూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న పిటిషన్‌దారు దేబు సింగ్, దీపక్ సింగ్ మీద నమోదయిన ఎఫ్ఐఆర్ కొట్టేవేయాలని కోరిన వ్యాజ్యం అలహాబాద్ హైకోర్టు తిరస్కరించడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేసే అపీలును విచారిస్తుంది.
ఈ నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నాయకత్వం వహించారు. ”యూపీలో ఏదైతే జరుగుతుందో అది తప్పు. ప్రతీరోజు పౌరసంబంధిత కేసులను క్రిమినల్ కేసులలోకి మార్చడం జరుగుతుంది. ఇది చట్టాన్ని పూర్తిగా ఉల్లఘించడమే అవుతుంది.” అని జస్టిస్ ఖన్నా అన్నారు.
సీజేఐ కాకుండా ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవీ విశ్వనాథన్ కూడా భాగస్వామిగా ఉన్నారు. షరీఫ్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో ఇవ్వబడిన ఆదేశాలకు ఇది విరుద్ధంగా ఉందని న్యాయమూర్తులు అన్నారు. ఛార్జ్షీట్లోని అన్ని కాలమ్‌లు సరిగా నింపబడి ఉన్నాయని విచారణ అధికారి నిర్ధారించాల్సి ఉంటుందని న్యాయస్థానం చెప్పింది. దీంతో ఏ నిందితుడు, ఏ రకమైన నేరం చేశాడు, ఫైల్ మీద ఏ సాక్ష్యం అందుబాటులో ఉందనే విషయాలను న్యాయస్థానం సరిగా అర్థం చేసుకోవడానికి కుదురుతందని పేర్కొంది.
”పరిగణన స్వీకరించే ఉత్తర్వు, సమన్ల ఉత్తర్వు, దాఖలు చేసిన చార్జిషీట్ రెండూ షరీఫ్ అహ్మద్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ కేసులలో వెలువరించిన తీర్పులకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది” అని బెంచ్ తెలిపింది. ”దీన్ని దృష్ట్యా ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇంకా పోలీసు స్టేషన్ ఇంచార్జ్/దర్యాప్తు అధికారి నుంచి తీర్పులో ఇచ్చినటువంటి నిర్దేశాల సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్ సమర్పించాలని ఆశిస్తున్నాము” అని పేర్కొన్నది.
ఈ అఫిడవిట్ రెండు వారాల లోపల సమర్పించాలని, అప్పటి వరకు నిందితులందరికి వ్యతిరేకంగా ట్రయల్ కోర్టులో కార్యకలాపాలు వాయిదా వేయబడతాయని ధర్మాసనం తెలిపింది.
”ఈ కేసులో విచారణ నెగోషియేబుల్ ఇన్స్ట్రూమెంట్స్ యాక్ట్ అర్టికల్ 138 ప్రకారం కొనసాగుతుంది, ఇది ప్రస్తుత వాజ్యానికి సంబంధించిన అంశం కాదు.” అని కోర్టు చెప్పుకొచ్చింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం, పిటిషనర్ తండ్రి బల్జిత్ సింగ్, ఆయనకు వ్యర్థాలకు సంబంధించిన వ్యాపారం ఉండేది, దీపక్ బహల్ అనే వ్యక్తి నుంచి బల్జిత్ 25 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దీని తర్వాత బల్జిత్ సింగ్ ఇచ్చిన మాట ప్రకారం సమయానికి డబ్బులు చెల్లించడానికి నిరాకరించాడు. అప్పుడు దీపక్ బహల్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అడిగాడు. ఈ నేపథ్యంలో దీపక్ బహల్‌ను సజీవ దహనం చేస్తానని బలజీత్ సింగ్ బెదిరించాడు.
అయితే, తమ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరిన బల్జిత్ సింగ్ వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. గుర్తించదగిన నేరం వెల్లడించబడిందని తిరస్కరణ సమయంలో కోర్లు తెలిపింది. అందుకే ఎఫ్ఐఆర్ను కొట్టివేసే దరఖాస్తును విచారించడం కుదరదని వెల్లడించింది.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.