‘రెవల్యూషనరీ ప్యాషన్స్ షో దట్ భగత్ సింగ్’ – హిందూ మితవాధ ధోరోణితో కాంగ్రెస్ కు, గాంధీకి విరుగుడుగా ఉన్నారు- కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా ఉండడమే కాదు, హిందుమతం పట్ల కూడా విమర్శనాత్మకంగా ఉన్న మనిషి పుస్తకం నుంచి.
కకోరి కుట్రకేసు వల్ల చాలా మంది నాయకులు అరెస్టు అయ్యారు. వారిలో కొందరు ఉరికంబాలెక్కడం, కొందరు జైలుపాలు కావడంతో విప్లవోద్యమాన్ని నడపగలిగే నాయకత్వం లేకుండా పోయింది. ఆనాటి చైతన్యవంతమైన యువతరం ఆ పరిస్థితులను సమీక్షించుకోవడం వేరే విషయం. ఆ తరంలో ఒక బలమైన యువకుడు భగత్ సింగ్ ఆ సమీక్షకు ఒక ఫలితం. పంజాబ్ లోని ల్యాల్ పూర్ కు చెందిన ఒక సిక్కు కుటుంబంలో పుట్టిన భగత్ సింగ్ పై ఆర్యసమాజం, గదర్ పార్టీ ప్రభావం ఉండేది. భగత్ సింగ్ పిన్న వయస్కుడుగా ఉన్నప్పుడు, ఆయన చిన్నాయన అజిత్ సింగ్ ను లాలాలజ్ పతి రాయ్ తో పాటు మాండలే జైలుకు పంపారు. భగత్ సింగ్ లాహోర్ లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు. జలియన్ వాలాబాగ్ లో 1919లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టనపెట్టుకున్న మారణహోమానికి భగత్ సింగ్ చలించిపోయాడు. అందరిలాగానే భగత్ సింగ్ కూడా సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ, మహాత్మాగాంధీ ఆ ఉద్యమాన్ని రద్దు చేసుకున్న తరవాత విప్లవోద్యమంలో పయన మయ్యాడు. మత రహిత సోషలిస్టు సమాజాన్ని నిర్మించడం కోసం 1926లో నౌజవాన్ భారత్ సభను ఏర్పాటు చేసి, యువతరం దృష్టిని ఆకర్షించడానిక ప్రయత్నించాడు. సహజంగానే బ్రిటిష్ వారు భగత్ సింగ్ పైన దృష్టి సారించారు. మూఢనమ్మకాల్లో చిక్కుకున్న స్వదేశీయులే ఈ పరిస్థితికి కారణమని భగత్ సింగ్ భావించాడు.
‘‘రావిచెట్టు కొమ్మలు నరకడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాగితపు గుమ్మటాల బొమ్మను ఒక పక్క చించడం వల్ల ‘అల్లాహ్’ కు కోపమొచ్చింది; విశ్వాసం లేని హిందువుల రక్తం తప్ప సంతృప్తి చెందడతను. మృగం కంటే మనిషిఎక్కువ దృష్టి సారించాలి. భారత దేశంలో ప్రజలు బలిపశువుల్లా తమ తలలు నరుక్కుంటారు.’’
హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్ ఆర్ ఎస్ ఏ)ను 1928లో స్థాపించాక కూడా, సామ్యవాదం, మానవతా వాదం, జాతీయతావాదం భగత్ సింగ్ లో బలపడ్డాయి. కమ్యూనిజాన్ని విపరీతంగా ఆరాధించే సుఖదేవ్, మంచి చదువరి అయిన సుకుమార్ సిన్హా, మిలటరీ ఆపరేషన్ల బాధ్యులైన శివవర్మ, చంద్రశేఖర్ ఆజాద్ వంటి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నాయకుల్లో భగత్ సింగ్ కీలకమైన వ్యక్తిగా గుర్తింపుపొందాడు. ఉద్యమం బలంగా నిలదొక్కుకున్న పంజాబ్, యునైటెడ్ ప్రావెన్ సిస్, బీహార్ లలోని ప్రతినిధులతో కేంద్రకమిటీని ఏర్పాటు చేశారు. ఈసంస్థను రెండు భాగాలుగా విభజించారు ; ఒకటి సైద్ధాంతికమైనది, రెండవది మిలటరీకి సంబంధించింది. భగత్ సింగ్ తొలుత ఈ సంస్థకు చుక్కానిలా పనిచేశాడు. ఆ తరువాత కూడా కొనసాగాడు. లాలాలజ్ పతి రాయ్ మృతికి కారణమైన పోలీస్ చీఫ్ జె.ఏ.స్కాట్ అనుకుని పొరపాటున జే.ఏ.సాండర్స్ ని హత్య చేసిన సంఘటనలో భగత్ సింగ్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ లాహోర్ ను సందర్శించిన సందర్భంగా నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ నాయకులతో పాటు ఆర్యసమాజస్తుడు లాలాలజ్ పతి రాయ్ పై న జరిపిన లాఠీ చార్జిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆ తరువాత ప్రాణాలు వదిలాడు. పంతొమ్మిదవ శతాబ్దపు తీవ్రవాదుల్లాగా సాండర్స్ ను చంపుతామని హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ బహిరంగంగా ‘‘భారత దేశం ఇంకా బతికే ఉందని ప్రపంచం తెలుసుకోవాలి. యువకుల రక్తం గడ్డకట్టిపోలేదు. ఈ పందెంలో దేశ గౌరవాన్ని కాపాడడానికి యువకులు తమ ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడరు.’’ అంటూ అధికారికంగా ప్రకటించింది.
భగత్ సింగ్ మాత్రం తీవ్రవాదం నుంచి విప్లవం వైపు పరివర్తన చెందాడు. తన చివరి రచనలో, 1931 ఫిబ్రవరి లో తాను చెప్పే విధానంలో తన గత చర్యను ఇలా గుర్తు చేశాడు.
‘‘నేను తీవ్రవాదిలా వ్యవహరించినట్టు కనిపించాను. నేను తీవ్రవాదిని కాదు. ఒక సుదీర్ఘమైన కార్యక్రమం ఉన్న ఆలోచన కలిగిన విప్లవకారుణ్ణి. నా విప్లవ జీవితం మొదలైన కొత్తల్లో మినహా, నేనెప్పటికీ తీవ్రవాదిని కాదని నా సర్వశక్తులతో ప్రకటించనీయండి.’’
కొన్ని అరుదైన రచనలను చదవడం ద్వారా భగత్ సింగ్ ప్రాపంచిక దృక్పథం పునర్మిర్మాణం జరిగింది. అతని గ్రంథాలయంలో అనేక మంది పశ్చిమ దేశాల రచయితల పుస్తకాలున్నాయి. అక్కడ మార్క్స్, ఏంజెల్స్, ట్రాట్ స్కీ, థామస్ పెయిని, అప్ టోన్ సిన్ క్లేర్, మోరిస్ హిల్ క్విట్, జాక్ లండన్, విక్టర్ హ్యూగో, దోస్తోవ్ స్కీ, స్పినోజా, బెర్ట్రెన్డ్ రజుల్, జాన్ స్టువర్ట్ మిల్, థామస్ జఫర్ సన్, కౌట్స్కీ, బుకారిన్, బుర్కె, లెనిన్, థామస్ డి అక్విన్, డాంటన్, ఒమర్ ఖయ్యామ్, టాగూర్, ఎన్. ఏ. మోర్ జోవ్, హుర్బర్ట్ స్పెన్సర్, హెన్రీ మెయినీ, రౌసియ్యూ.
వీరి పుస్తకాలను భగత్ సింగ్ అరెస్టు కాకముందునుంచే కాకుండా జైల్లో కూడా చదివేవాడు. తనను తాను ఒకహేతువాదిగా, సామ్యవాదిగా మలుచుకున్నాడు. జైల్లో రాసిన ‘వై అయామ్ ఎన్ ఎథీస్ట్’(నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను) పుస్తకం రాయడం ద్వారా మతాన్ని తిరస్కరిస్తున్నానని ఉరితీయడానికి కాస్త ముందు ప్రకటించిన తొలి విప్లవకారుడయ్యాడు. ఇక ముందు జీవిస్తానని ఏ మాత్రం నమ్మకం లేని సమయంలో భగత్ సింగ్ ఆ విషయాన్ని విస్పష్టంగా ప్రకటించాడు.
‘‘భగవంతుడిపైన నమ్మకమున్న హిందువు తిరిగి రాజులా పుడతాననుకుంటాడు. ముస్లిం కానీ, క్రైస్తవుడు కానీ స్వర్గంలో విలాస వంతంగా జీవిస్తానని, తన బాధలకు, తన త్యాగాలకు బహుమతి లభిస్తుందని కలలు కంటాడు. కానీ నేనేం అంచనావేస్తాను? నాకు తెలుసు నా మెడకు తాడు కట్టగానే కాళ్ల కిందది తొలగించేస్తారు. అవే చివరి క్షణాలు. అవే ఆఖరి క్షణాలు. భూభౌతిక పదజాలంలో చెప్పినట్టు నేను,నా ఆత్మ అక్కడితో ముగిసిపోతుందని స్పష్టంగా xఉన్నాను. అంతకుమించి ఏమీ లేదు. ఆకర్షణ ముగింపు లేని ఈ చిన్న జీవిత పోరాటం. ఆ వెలుగులో దాన్ని స్వీకరించే ధైర్యం ఉంటే అదే నాకు బహుమతి. అంతే. ఎలాంటి స్వార్ధ చింతన లేకుండా, లేదా ఇప్పుడు, ఇక నుంచి బహుమతి ఇస్తారని, పూర్తిగా ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా నా జీవితాన్ని స్వాతంత్ర్యం కోసం అంకితం చేశాను. అది కాకుండా ఏమీ చేయలేను. ప్రజలకు సేవ చేయడం, బాధపడుతున్న మానవ జాతికి విముక్తి ప్రసాదించడం తప్ప, పెద్ద సంఖ్యలో స్త్రీలు, పురుషులు తమని తాము దీనికి తప్ప వేరే దేనికీ అంకితం చేయమనే మనస్తత్వం వచ్చినప్పుడు, అది స్వేచ్ఛా యుగమని ఆ రోజు పండగ జరుపుకుందాం.’’
భగత్ సింగ్ మత తిరస్కారం, పెట్టుబడిదారి విధానం, కులతత్వం అనే రెండు విధానాలను సామ్యవాద విమర్శతో చూసినప్పుడు ప్రజల్ని అది పరాయీకరణ చేస్తుంది. దానికి ముందు పెట్టుబడిదారీ విధానం, వలసవాదాన్ని ఎదుర్కోవడమే భారత విప్లవకారుల ముందున్న కర్తవ్యం.
‘‘విప్లవం అంటే ప్రస్తుతం ఉన్న సమాజిక వ్యవస్థ విధానాన్ని కూలదోసి, ఆ స్థానంలో సామ్యవాద విధానాన్ని స్థాపించడం’’ అని చెపుతూ భగత్ సింగ్ 1931 ఫిబ్రవరిలో మార్క్సీజాన్ని ఆవాహనం చేసుకోవాలని యువకులకు పిలుపునిచ్చాడు. ‘‘దాని కోసం వెంటనే మనం అధికారాన్ని చేజిక్కించుకోవడమే తక్షణ కర్తవ్యం. వాస్తవానికి ప్రభుత్వ యంత్రాంగం అనేది పాలకవర్గాలు తమ ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి వారి చేతిలో ఉన్న ఆయుధం. మన ఆలోచనలను వినియోగించడానికి దాన్ని సరిగా ఉపయోగించాలి. అంటే మార్క్సిజం పునాదిగా నూతన సామ్యవాద వ్యవస్థ పునర్నిర్మాణం చేపట్టాలి.’’
నిజానికి భగత్ సింగ్ ది జనస్ (రోమన్ పురాణాల ప్రకారం రెండు వైపులా ముఖాలున్న దేవత) లాంటి ముఖం. భిన్న మూలాల నుంచి వచ్చిన స్ఫూర్తి ప్రకారం కొందరికేమో మార్క్సిస్ట్, మరికొందరేమో అరాచకవాదని ‘‘ఆచరణలో ప్రచారం’’. అతని చివరి శ్వాస చెప్పిన సాక్ష్యం ఇలా ఉంది. బి.కె.దత్ తో కలిసి భగత్ సింగ్ కేంద్ర పార్లమెంటులో రెండు బాంబులు విసిరాడు. ‘చెవిటి వాళ్లకు చెప్పడం కోసం’ అని రాసిన కరపత్రాలను పార్లమెంటులో విసిరేశాడు. ఫ్రెంచ్ అరాచకవాది అగస్టి వెయిలెంట్ నుంచి ఈ పద్ధతిని అనుకరించాడు. ఒక పెద్ద ఎత్తుగడలో భాగంగా భగత్ సింగ్ ఈ పనికి పూనుకున్నాడు. భారత కార్మికులకు శిక్ష విధించడానికి నిర్దేశించిన పబ్లిక్ సేఫ్టీ అండ్ ట్రేడ్ డిస్పూట్ బిల్లు కు అసెంబ్లీ ఓటువేయడాన్ని నిరాకరించాలని ఈ చర్యకు పూనుకోవడం మొదటి కారణం. ఈ పార్లమెంటు సహచర్యంతో బ్రిటిష్ పాలకులు నడవడానికి నిరసనగా ఈ చర్యకు దిగడం రెండవ కారణం. లాలాలజ్ పత్ రాయ్ మృతికి ప్రతీకారం తీర్చుకోవడం చివరి కారణం. ఈ విరణలన్నీ సోషలిస్టు ధ్యేయాలను సాధించడానికి అరాచకవాద విధానాన్ని అనుసరించినట్టయింది. నాణానికి మరొక కోణం ఏమిటంటే, భగత్ సింగ్ హింసకు విలువివ్వలేదు. దత్ తో కలిసి పార్లమెంటు సెంట్రల్ హాలులో విసిరేసిన కరపత్రం పూర్తిగా చదివితే భగత్ సింగ్ రాజకీయ తాత్వికత పూర్తిగా అర్థమవుతుంది.
‘‘ఒక గొప్ప పవిత్రత ఉన్న మానవ జీవితంతో జతచేసి ఉన్నామని ఒప్పుకోవడానికి చింతిస్తున్నాము. బంగారు భవిష్యత్తు ఉందని ఎవరైతే కలలు కంటారో, ఎప్పుడైతే మానవులు సంపూర్ణమైన శాంతిని, పూర్తి స్వేచ్ఛని అనుభవిస్తారో, అలాంటి వారు మానవ రక్తం చిందించడానికి పురికొల్పారు.’’
ఈ మాటలు వారు హింసను తిరస్కరించారని సూచిస్తాయి. భగత్ సింగ్ , దత్ కలిసి న్యాయమూర్తి ముందు చాలా గొప్పగా చేసిన ఈ ప్రకటన హింసను తిరస్కరించినట్టయింది. మనుషులు లేని ఖాళీ కుర్చీలపైకి తాము బాంబులు విసిరేశామని నొక్కిచెప్పారు. వారు ఒక గొప్ప రసాయన శాస్త్రవేత్తల్లా న్యాయమూర్తికి వాటి వివరాలన్నీ సమర్పించారు. నిజానికి వారాపనిని అయిష్టంగా చేశారు. మరింత బలమైన పేలుడు పదార్థాలు పెట్టినట్టయితే, విధ్వంసకరమైన గుండ్లతో, బాణాలతో నింపినట్టయితే, పార్లమెంటులో అత్యధికులు నామరూపాలు లేకుండా పోయేవారు.
హింసకు వ్యతిరేకంగా భగత్ సింగ్, దత్ తమ చర్యలను తాము చాలా బలంగా సమర్థించుకుంటూ, చాలా బలంగా మాట్లాడారు.
‘‘ ఎవరూ చేయనంతగా మేం మానవత్వాన్ని ప్రేమించాం. దుర్బుద్ధితో ఏ ఒక్క వ్యక్తికీ వ్యతిరేకంగా వ్యవహరించ డానికి మేం దూరంగా ఉన్నాం. మానవ జీవితాన్ని మాటలకు అతీతమైన పవిత్రమైనదిగా మేం గుర్తిస్తాం. ‘చెవిటి వారికి వినిపించడం’, బుర్రలేని వారిని హెచ్చరించడమే మా ఉద్దేశ్యం. దురాక్రమణకు బలం ఉపయోగించడమనేది ‘హింస’ కాబట్టి, నైతికంగా అది అన్యాయం. న్యాయబద్ధమైన కారణంతో ముందుకు సాగడానికి దాన్ని ఉపయోగిస్తే, దానికి తనదైన నైతిక న్యాయబద్దత ఉంటుంది.’’
గాంధీ లాగానే జీసస్ క్రీస్ట్ కూడా భగత్ సింగ్ కు ఆదర్శం. ‘‘జీసస్ క్రీస్ట్ ఉద్దేశ్యాన్ని పక్కన పెట్టినట్టయితే, ఆయన శాంతికి విఘాతం కల్పించేలా, తిరుగుబాటును కోరే వ్యక్తిలాగా, చట్టం దృష్టి లో ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ మనం అతన్ని ఆరాధిస్తాం. మన హృదయాల్లో తనకొక గొప్ప గౌరవ స్థానం సంపాదించాడు. అతని గురించిన ఊహలో ఆధ్యాత్మిక శక్తి నిండి ఉంటుంది.’’
భగత్ సింగ్ చేసింది మాత్రమే కాదు, నిజమైన మినహాయింపుగల విప్లవకారుడు హిందూ మతంపైన ఎప్పటికీ ఆరోపణలు చేయలేడు, కానీ ఆయన అహింసకు ఎక్కు వ విలువనిచ్చాడు.
క్రిస్టొఫర్ జెఫర్ : లాట్ పారిస్ లోని(పీఓ, సీఎన్ ఆర్ ఎస్) సీఈఆర్ఐ సైన్సెస్ లో సీనియర్ రిసెర్చ్ ఫెలో
రచన: క్రిస్టొఫి జఫర్ లాట్,
అనువాదం : రాఘవ