
సర్దార్ పటేల్ అధికారులను మన దేశపు ‘‘ఉక్కు చట్రం’’ అని పిలిచారు కాని వారిలో కొద్ది మంది అనాగరికత వలన దాని సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
‘‘తెల్లవాడి భారం’’ ‘‘నాగరికరించే కర్తవ్యం’’ వంటి పద బంధాలను అసహనంగా వలసవాద భావజాలాన్ని తీవ్రంగా నింధించ పూనుకున్నపుడు ఒక పూర్వవలస దేశంగా వాడటం తద్వార వలసవాద వ్యతిరేక నిబద్దతను సమర్దించుకోవడం మనకు ఇష్టం. కాని అపుడపుడు ఈ మొత్తం వ్యవహారం ఎంత పైపూతగా, ఎంత బోలుతనంగా ఉందో ప్రదర్శించుకుంటూనే వుంటాం.
తెలిసో తెలియకో వలసవాదపు నర మేధానికి అధిక శక్తిని సమకూర్చిన అసమానత్వ సూత్రాన్ని మనం పూర్తిగా ధృవీకరిస్తాం. ఇటీవల ముగ్గురు అధికారులు ఎవరయితే వారు ప్రజా జీవితంలో చేయమని ప్రమాణం చేసారో అవే పనులు సిగ్గులేకుండా చేస్తూ దొరికారు. వాళ్ళు సేవలు చేయాల్సిన ప్రజల పట్ల కులపరమయిన, వర్గపరమైన, లింగపరమయిన అభిప్రాయాలు కలిగివుండి, వారు వారి కర్తవ్య నిర్వహణలో వీటి ప్రభావానికి లోను కావడం స్పష్టంగా కనబడుతుంది. ఈ విపరీత ప్రవర్తనలు ఈ ఉక్కుచట్రంలో లోతుగా పట్టిన తుప్పుకు ప్రతిఫలం. వారికి ఈ బిరుదిచ్చిన సర్దార్ పటేల్ తన సమాధిలో తిరగబడి ఉండొచ్చు.
మహిసాగర్ జిల్లా కలెక్టరు నేహాకుమారీ దుబే ఆఫీసులో జరిగినది మొదటి సంలఘటన. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా తాలూకా స్థాయిలో సమస్యలు పరిష్కారం కావటం లేదు. దళితుడయిన న్యాయ విద్యార్ధి విజయ కుమార్ ఆమె వద్దకు వచ్చాడు. అక్టోబరు 23న ‘‘లూనావాడ’’ లో ఏర్పాటయిన ఈ కార్యక్రమం పేరు ‘‘స్వాగత్ ’’. కొన్ని నెలల క్రితం తన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చర్యా తీసుకోలేదనీ తన ఫిర్యాదుకి కూడా అదేగతి పడుతుందా అని ప్రశ్నించిన ఈ విద్యార్థిని ఆ అధికారి అత్యంత అనాదర స్వరంలో తిడుతున్నట్టుగా ఒక వైరల్ వీడియోలో కొంత కనపడి తర్వాత వినబడింది.
అవమానానికి గురయిన ఆ అధికారి కోపంగా నీవేం చేసుకుంటావో చేసుకో అన్న ధోరణిలో కోర్టుకు పొమ్మంది. తర్వాత సెక్యూరిటీ అధికారితో అతని మొబైల్ ఫోన్ గుంజుకుంది. ఆ తరువాత జరిగింది మరింత ఆందోళనకరంగా కలవరం కలిగించేదిగా వుంది. దళిత సమాజం గురించి మూస నమూనాల గురించి హానికరమయిన వ్యాఖ్యలు దుబే చేసింది. చట్టప్రకారం వారికి లభించిన రాజ్యాంగ రక్షలను దురుపయోగం చేస్తున్నారని ఈ సందర్భంలో మహిళల గురించి మాట్లాడిరది. తన అధికార కార్యాలయంలో కూర్చుని నమోదయిన అత్యాచార కేసుల్లో 90 శాతం తప్పుడు కేసులని రకరకాల స్వార్థ ప్రయోజనాలతో దళిత ఆదివాసీయేతర ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో పెట్టినవేనని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె అభిప్రాయాన్ని నిరూపించే వాస్తవాలు గణాంకాలు ఆమె ఇవ్వలేదు. వైవాహిక కృారత్వం నుండి స్త్రీలను రక్షించడానికి ఉద్దేశించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షను 498 ఎ కింద కేసుల విషయంలో కూడా ఆమె ఇదే తర్కం ఉపయోగించారు. చాలా కేసుల్లో వాళ్లనుభవించిన చిత్రహింస కారణంగా కేసులు పెట్టిన స్త్రీల భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ధైర్యంగా ఆమె నోరు జారడం నిరర్ధక పదాలతో మొదలయి ‘‘ఈ రకం అయిన అర్ధం పర్ధం లేని వాళ్లకు వేరే పనేం లేదనడంతో ముగిసింది.’’ అయితే ఆమె అటువంటి వాళ్ళకు గాని వారి ఫిర్యాదులకుగాని భయపడనని చెప్పింది. దళిత సంఘాలు ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళనలు చేసాక పర్మార్ దళిత సమాజాన్ని ముందుకు నెట్టి తన దుష్ప్రవర్తనను కప్పిపుచ్చాలనుకుంటున్నాడనీ, అధికార యంత్రాంగం ఎన్నడూ కులతత్వాన్ని ఏర్పాటు వాదాన్ని అంగీకరించదని ఒక హస్యాస్పద ప్రకటన చేయటంతో పాటు ఆ అధికారిణి ఆ ఇద్దరు సోదరులపై క్రిమినల్ కేసులు పెట్టింది.
రెండవ ఘటన రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి గాయత్రి రాధోడ్‌కి సంబంధించినది. ఆమె ఒక నిరుద్యోగ యువకుడిని తన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ ‘‘నువ్వు పుట్టడానికి ముందు ప్రభుత్వాన్ని అడిగి పుట్టావా (అంటే సమయానికి ఉద్యోగం దొరుకుతుందా లేదా అని) అడగటం కనిపించింది. వైరల్ అయిన ఒక వీడియోలో కొత్తగా ఆరోగ్యశాఖకు నియమించబడిన ఈ సీనియర్ అధికారిణి జైపూర్‌లోని స్వాస్ద్యభవన్ ఎదుట నిలబడి, మీడియా ఉండగా ఉద్యోగం కోసం దరకాస్తులు యిచ్చెందుకు వచ్చిన నిరుద్యోగులను కవ్విస్తుంది. మీడియా చుట్టు ముట్టడం వల్లనో, నిరుద్యోగ యువకుల ఊరేగింపు వల్లనో గాని ఆమెకు బాగా కోపం వచ్చినట్టు కనబడిరది. ఉద్యోగం కోసం వయస్సు మీరిపోతుందనే ఆందోళనలో ఆ యువకుడు ఆమెను జోక్యం చేసుకోమని కోరగానే ఆమె ఇలా తన కోపాన్ని తీర్చుకుంది.
ఇక మూడో సంఘటన పై రెండు ఘటనల మాదిరిగా అశ్లీల మాటల యుద్దం లేకపోవడంతో అనాగరికంగా అనిపించకపోవచ్చు కాని వాటికంటే ఇది తక్కువేంకాదు. 2015 లో ఆల్ ఇండియా సర్వీసెస్ పరిక్ష లో ప్రధమస్థానం పొందిన అధికారిణి టీనా డాబి బార్మేర్ జిల్లా కలెక్టరుకి భారతీయ జనతా పార్టీ నాయకుడు సతీష్ పూనియాకి మధ్య జరిగింది. అతను రాగానే స్వాగతంగా ఆమె అత్యంత విధేయంగా మాటమాటకి తలదించి చేతులు జోడించడం కన్పిస్తుంది. కొద్దికాలం క్రితమే బార్మెర్ దుకాణాదార్లని వాళ్ళ దుకాణాల చుట్టూతా శుభ్రంగా ఉంచకపోతే వ్యాపారాలు మూయించేస్తానని ఆమె హెచ్చరిస్తున్న దృశ్యం మీడియాలో ప్రదర్శితం అయ్యింది.
సహానుభూతితో సమర్ధతతో నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన బాధ్యతగల అధికారులు ఒకరితర్వాత ఒకరు ఇలా అనాగరికంగా ప్రవర్తించడం ‘‘ఉక్కుచట్రం’’లో ఎంత దాకా తుప్పు వ్యాపించి పోయిందా అనే ప్రశ్నకు తావిస్తుంది. అవి అంతర్లీనం చేసుకోవాల్సిన రాజ్యాంగ విలువలు. ఈ ఘటనలు మినహాయింపా లేక సర్వసాధారణమా? ఈ వ్యవస్థ ఎల్లప్పుడూ ఇంతగా తుప్పు పట్టివుందా? లేక మారుతున్న సామాజిక రాజకీయ వాతావరణం వలన ప్రభావితం అయ్యిందా? ఇది కేవలం తర్కం కోసం అడిగే ప్రశ్నలు కాదు.
భీతి కోల్పోతున్న ఈ రకం అయిన ప్రవర్తన రెండు సమస్యలు వెలికి తీసింది. కష్టించే ప్రజల పట్ల ఉన్నత వర్గాలకున్న పూర్తి ఎగతాళి ధోరణి దానికి సమాంతరంగా అధికారంలో ఉన్న వారి పట్ల సానుభూతి. యుపియస్సీ పరీక్షలు రాయడం కోసం ఈ అధికారులు వైవిద్యభరితమైన సంక్లిష్టమయిన ఈ దేశంలో జరుగుతున్న జీవన పోరాటపు వాస్తవాల గురించి తేల్చుకోవడానికి ఏం చదివివుండి వుంటారు? ముఖ్యంగా ఈ రకం అయిన ఆమోదయోగ్యం కాని భావాలను దూరం చేయడానికి వీరికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి? అయితే ఒక దశ తర్వాత వారిని కూడా తప్పు పట్టలేం.
‘‘లెటరల్ ఎంట్రి ’’ వంటి అభిప్రాయాలు గల ప్రభుత్వ విధానాల నేపథ్యం ఇది. ఈ అనారోగ్యానికి కారణం వేరే చోట వుంది. దాన్ని చర్చించే ముందు ఈ అధికారులు వాడిన భాష పర్యవసానాలు పరిశీలిద్దాం. మొదటి రెండు ఘటనల్లో కించపరచడం, మూడోది కుంగిపోయేలా చేసి లేపనం పూసే ప్రక్రియ.
కుల ఆధారిత హింసకు సంబంధించిన అత్యధిక కేసులు తప్పుడు ఉద్దేశ్యం గలవని విచక్షణ లేకుండా మాట్లాడటం అనేది శతాబ్దాలుగా భయంకరమయిన అణిచివేతను అనుభవించిన సమూహాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణల పట్ల అసంతృప్తితో వున్న అగ్రకులాల భావాల ప్రతిఫలం. ఈ రకమయిన ప్రతిస్పందన అనేది కేవలం ఈ రక్షణ వ్యవస్థలకే కాదు మానవ గౌరవానికి, సమానత్వానికి కూడా వ్యతిరేకం. స్వతంత్య్ర భారతావనిలో కన్పించే అత్యంత వికృతమయిన అభివ్యక్తీకరణలు. ఇవి 1981- 85 మధ్యకాలంలో గుజరాత్లో మండల్ వ్యతిరేక ఉన్మాదం సందర్భంగా జరిగిన రెండు నెత్తురు పారిన రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల సందర్భంగా చూశాం.
ఎంతో దైర్యం కూడగట్టుకుని దాడి చేసిన వారిని కోర్టుకీడ్చిన మహిళల్లో అధిక శాతాన్ని దురుద్దేశ్యాలు గల శాడిష్టులుగా ఆ అధికారిణి, దుబే ముద్ర వేయటం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆమె వాడిన భాష కేవలం ఆమె ముందున్న వారిని ఉద్దేశించినదే కాదు, ఆ మొత్తం సమాజాలు / సమూహాలు చట్ట వ్యతిరేకంగా జన్మించిన తెలివిలేని నీతిమాలిన వాళ్లను మూస ముద్రలకి సంబంధించినది. ప్రత్యేకించి ‘‘హరామి’’ అంటే అక్రమంగా పుట్టినది అనే మాట స్త్రీల లైంగికతకు పహారా కాయని, మానవ జన్మకు వివాహపు సక్రమత్వం కోరని గొప్ప అసంఖ్యాక సమూహాలు సంస్కృతులకు తూష్ఠీకరణ.
బెదిరిపోయి వున్న యువకుడి పైన రెండో అధికారి రాధోడ్ విషపూరిత పోటు ఒక తరగతి ప్రజలందర్ని ఎగతాళి చేస్తుంది. ఇది కుందేళ్ళ మాదిరిగా కంటారనే చర్చిత అవమానంతో సమానం. ఒక నిరుద్యోగాన్ని అతని వుట్టుకతో అనుసంధానించడం, ఆ వక్రతర్కాన్ని ప్రజల్ని అంచనా వేయడానికి వాడటం అనేవి కేవలం వలస వాద మానసికత మాలిమే చేయగలదు. ఈ ‘‘అన్య(అధర్)’’ లక్షణాలు ప్రాచుర్యంలో వ్యామోహంగా వాడటం, కార్యాలయాలలో, నలుగురు కలిసేచోట్ల ప్రతిసారి పోటిపడి మరీ యిటువంటి అనాగరికత వ్యక్తపరచడం ఆందోళన కలిగించే అంశం. ఇదిప్పుడు ఒక జాతీయ క్రీడ.
ఈ అనాగరికత ఎక్కడ నుండి వచ్చింది?
చరిత్రకారుడు అయిశ్వరి కుమార్ ఈ లక్షణాన్ని భాగ్యహీనులైన పేదల పట్ల వారసత్వంగా పొందిన ఒక నయా ఉదారవాద ద్వేషాన్ని వారసత్వంగా పొందిన ‘‘నయా ప్రజాస్వామ్య స్థితి’’కి అన్వయించారు. దీనితో సాంప్రదాయ అర్థంలో అస్తిత్వ రాజకీయాలు కూలిపోతాయని ఆయన అంటారు.
నయా ఉదారవాద వ్యవస్థ వంచనా పూరిత శైలి వలన తోటి మానవులతో సంఫీుభావం కలిగిన గుర్తింపు నిర్మించుకోవడం ఉన్నత వర్గాలకు కష్టతరం అవుతుంది. ఫలితంగా ఉదాసీనపు రాజ్యాల్లో గుర్తింపులు ఎంపిక చేయబడతాయి. ఈ రాజ్యం ‘‘అవాంఛనీయుల్ని అలక్ష్యం చేయమని తన పౌరులకు నేర్పుతుంది. మరోవైపు దాన్ని ద్వంసం చేయాలనుకుంటుంది. ఈరకమయిన స్వీయ వైరుధ్యం గల మనస్థత్వంతో ఈ ప్రజలు వారి అధిక సంఖ్యాక గుర్తింపు పొదడానికి ప్రయత్నిస్తారు. అదే సహజం అవుతుంది. అయితే విశిష్టమయిన ఈ సంక్షేమ గుర్తింపు, దాని ప్రక్రియ చివరికి ఏ రకమయిన మానవత, నీతి, రాజ్యాంగ బద్దత లేకుండా ముగుస్తుంది.
ఈ విధంగా భూమ్మీద నీచమయిన వారిని భౌతికంగానూ, ప్రతీకాత్మకంగాను కూడా వారి యిళ్ల నుండి వెళ్ళగొట్టడానికి నయా ఉదారవాద యుగం సాక్షిభూతమవుతుంది. అంతే కాకుండా మాథ్యు డెస్మండ్ అన్నట్లు ఇది ఒక ‘‘ఒక బాధాపూరిత తిరస్కారం, కనీస మౌలిక మానవ అవసరాలు ఇవ్వక పోవడం ఒక అతి సున్నితమయిన లజ్జాకర అనుభవం అవుతుంది.’’
నిజానికి ఇటీవలి కాలంలో పౌరసత్వ చట్టాలు సృష్టించిన కల్లోలంతో భారీగా ఇటువంటి తొలగింపులు జరుగుతున్నాయి. వలస పాలన నాటి అంటువ్యాధుల చట్టం-1897లోని అంశాలను తిరగదోడి అతి తక్కువ వ్యవధినిచ్చిన జాతీయ లాక్‌డవున్ ఇటువంటిదే. దీన్ని సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే వారి సంక్షేమానికి, సంరక్షణకు బాధ్యత వహించాల్సిన రాజ్యాధికారం, పరిపాలనా యంత్రాంగ సంస్థలు ఈ తొలగించబడిన వారు పరిత్యజించవలసిన వారని చట్టబద్ధంగా స్పష్టంగా రాశారన్నమాట. ఎటియన్నే బలిబార్ మనకు గుర్తు చేసినట్లుగా, ప్రజాస్వామ్యం యొక్క దారుణమైన సందిగ్ధతలో, క్రమశిక్షణా/సంస్థాగత యంత్రాంగాలు, వక్రీకరించబడిన ప్రాతినిధ్య రాజకీయాల ద్వారా బహిష్కరించబడినవారు, మినహాయించబడినవారు మానవత్వం అంచున ఉన్న ‘అసాధారణ‘ లేదా రాక్షసులుగా ‘ఉత్పత్తి చేయబడ్డారు‘.
ఇంకా యవ్వనంలోనేవున్న భారతదేశపు నయా ఉదారవాదం సమిష్టి సుప్తచేతనను వికృత పరిచేస్థితిలో (అది ఇప్పటికే అలా ఉండి ఉండక పోతే ) లేదని నేననుకుంటాను. లోతులకు పోయి చూస్తే ఈ అధికారుల తుచ్ఛమయిన ప్రవర్తనా ధోరణి ‘‘వివక్షత’’ పైన నిలబడింది. ఇది వేల సంవత్సరాలు ‘‘కులం’’ పేరిట జరిగిన వంచనల పునాది. ఇక్కడ కులం శబ్దాన్ని ఇసాబెల్ విల్కర్సన్ వాడిన విశాల అర్థంలో వాడుతున్నాను. కులం సమానత్వ నిరాకరణ పైనే మనగలుగుతుంది. దీన్ని డా॥బి.ఆర్.అంబెద్కర్ తప్పు పట్టలేనంత చక్కగా వివరించారు. ‘‘కులం అనేది ఆరోహణ క్రమంలో పురస్కారం, అవరోహణా క్రమంలో తిరస్కారం’’. ఇద్దరు అధికారుల మాటలు కిందిస్థాయి సమూహాలపై తిరస్కారాన్ని సూచిస్తాయి. తన రాజకీయ యజమానికి మూడో అధికారి ఇచ్చిన గౌరవాన్ని కేవలం కులం యొక్క కుత్రిమమైన ద్వేషపూరిత యుక్తుల నుండే వివరించగలం.
ఈ రకం అయిన యుక్తులు విషపూరిత అస్తిత్వ రాజకీయాల్లో పుట్టి పెరుగుతాయి. ఇక్కడ ఇతరుల అస్తిత్వాలకు హానికలిగించి మూసలుగా చేసి తమ ఉన్నత అస్తిత్వాలు కల్పించుకుంటారు. లెక్క ప్రకారం చేసే ఈ కించ పరిచే అమానవీయ ప్రక్రియలో ‘‘ఇతరుల’’ నిర్దిష్ట లక్షణాలు, సారాంశాల వైరుద్యంలో ఒక ఉత్కృష్టమైంది ఎంపికవుతుంది.
చారిత్రకంగా చూస్తే భారత సమాజపు అణగారిన తరగతుల శరీరాలు, నైపుణ్యాలు, జ్ఞానం, ప్రాపంచిక దృక్పథాల్ని తక్కువగా చూడటం ద్వారా వారిని వేరుపరచడం (అన్యులుగా చేయటం / పరాయి చేయటం) ద్వారా కులం కొనసాగుతుంది. నేటికాలంలో ఒకామె ప్రభుత్వ కార్యాలయంలో అడుగు పెట్టే ముందుగా ఆమె సెల్‌ను బయట ఉంచమని అడగటం ద్వారా ఏమాత్రం హాని కలిగించని విధంగా దాన్ని సాధించడం జరుగుతుంది. ఏ నిబంధనావళిలోనూ రాయని, రాజ్యాంగం కోరని ఈ రకమయిన ఆనతి ఆమెకు ఒక పౌరురాలిగా హామీ యిచ్చిన సమాన హక్కు. రాజ్యంతో వ్యవహరించేటప్పుడు దక్కకుండా చేస్తుంది. జ్ఞానం, సమతావాదపు అమరికలు గల ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఇది జరుగుతుంది. అంబేద్కర్ చాల చక్కగా వివరించినట్టు కులం నిటబెట్టబడుతుంది. స్త్రీల లైంగికతకు కాపలాకాయటం, కులంలోపల మాత్రమే వివాహాలు జరిగేలా చూడటం ద్వారా కులం స్థిరీకరించబడుతుంది.
కాబట్టి కులం సరిహద్దులు దాటి సంబంధం ఏర్పరచుకున్న స్త్రీ శీలం లేనిదిగానూ, ఆమె సంతానం ఇదే తర్కం ప్రకారం తక్కువ వారి గానూ పరిగణించబడతారు. (కుల, వలసవాద) రాజ్యాన్ని సంప్రదించకుండా జన్మించిన వాడు హరామి. అటువంటి సంప్రదాయాన్ని ఆమోదించే సంస్కృతి స్వయంచాలకంగా వెనుకబడిపోతుంది.
Finding fault with the uncivil officers as individuals is naïve for it’s not them but the hydra-headed demon of caste, sexism, neoliberalism and colonialism within them which is blabbering indecencies in public space. They are just dummies of a dangerous ventriloquist, which makes them forget that India had chosen a path to self-conception, fundamentally different from the ethno-nationalist trajectories of European nation-states.
వ్యక్తులుగా ఈ అనాగరిక అధికారులను తప్పు పట్టడం అమాయకత్వం అవుతుంది. నేరం వీళ్ళది కాదు. హైడ్రా మాదిరి అనేక తలలతో కులం, లింగ వివక్షత, నయా ఉదారవాదం, వలసవాదం కల్సి బహిరంగ ప్రదేశాల్లో ఈ అశ్లీలతను కక్కుతున్నాయి. ప్రమాదకరమయిన బొమ్మలతో క్రుతకంగా మాట్లాడించే వాడి చేతిలో బొమ్మలు వీళ్లు. జాతి,జాతియత పధంతో నడిచే ఐరోపా దేశాలకు భిన్నంగా భారతదేశం తనను తాను ఆవిష్కరించుకునే మార్గాన్ని ఎంచుకుందని వీళ్లు మర్చిపొతుంటారు.
పౌరులందరికీ సమానత్వం, గౌరవం కల్పించడానికి ఒక బలమైన దేశాన్ని నిర్మించడం కోసం రాజ్యంగం ఈ బొమ్మలతో మాట్లాండించే వారి అధికార పరిధిని నాశనం చేసింది. ఈ రాజకీయ సైద్ధాంతిక సర్వవ్యాప్త తెగులుకు చరమాంకంపాడే బాధ్యతను రకరకాల సంస్థలకూ, ఈ ఉక్కుచట్రానికి అప్పగించింది. కానీ ఈ చట్రాన్ని రక్షించే బాధ్యత విద్యాసంస్థలకు కేటాయించబడిరది. ఆ బాధ్యత నిర్వహాణలో అవి విఫలం అయ్యాయి.
During the quarter of a century since freedom, Indian universities have worked overtime to produce generations of citizens in whom inequality as an overarching worldview has sustained in one form or the other. As a result, today we have independence, not swaraj; we are a sovereign nation, but with her fragments invisibilized, whom Partha Chatterjee calls “the outside” of the political society, the riffraff who cannot make effective claims on governance. Our failed education system has spawned a bunch of people, the dummies of caste and neoliberal orders, who cannot even frame the right question when confronting a complex situation, just like the senior IAS officer in Rajasthan.
స్వాతంత్య్రానంతరం, మన విశ్వవిద్యాలయాలు ఒక పాతికేళ్ళపాటు ‘అసమానత్వం’ అనేది వికృతమైనదనే ప్రాపంచిక దృక్పథం ఏదో ఒక రూపంలో ఇమిడ్చుకున్న పౌరుల తరాన్ని తయారు చేయడానికి అధిక సమయం వెచ్చించి పనిచేసాయి. ఫలితంగా మనకు స్వతంత్య్రం ఉంది కాని స్వరాజ్యం లేదు. మనది సార్వబౌమాధికార దేశం, కానీ దాని శకలాలు కనిపించకుండా చేయబడ్డాయి. దీనినే పార్దా చటర్జీ ‘‘రాజకీయ సమాజానికి ‘బయటవున్నవారు’’’ అని అన్నారు. ఈ నిమ్న వర్గాలకు పాలనలో భాగస్వామ్యం లేదు. మన విఫలమైన విద్యావ్యవస్థ, రాజస్థాన్‌లోని సీనియర్ ఐఏఎస్ అధికారి లాగా, సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు సరైన ప్రశ్నను కూడా రూపొందించలేని కుల, నయా ఉదారవాద క్రమాలు కొంతమంది వ్యక్తులను నకిలీలుగా సృష్టించాయి.
దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత, నా ఆన్లైన్ కవితా సర్కిల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల బృందాన్ని భూసావల్కు వెళ్తున్న 16 మంది వలస కార్మికులను గూడ్స్ రైలు ఢీకొన్న విషాదం గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు, అందరూ మౌనంగా ఉండిపోయారు. మరింత విచారించినప్పుడు, ‘దురదృష్టకర‘ బాధితుల పట్ల క్లుప్తంగా సానుభూతి వ్యక్తం చేసిన తర్వాత, వారు ఎందుకు ప్రయాణిస్తున్నారని, ‘సామాజిక దూరం‘ నిబంధనలను పాటించడం లేదని ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. కుల వివక్షత అనే అర్థం ఉన్నప్పటికీ, ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరూ మహమ్మారి అంతటా ఉపయోగించిన పదబంధం ఇది. లాక్డౌన్ ప్రకటించడం అందరికీ అనుకూలంగా లేదా? వారు మరెక్కడా కాకుండా పట్టాలపై పడుకోవాలని ఎలా నిర్ణయించుకున్నారు?
నేను ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఇవి అన్ని మధ్యతరగతి ప్రదేశాలలో అడిగే ప్రశ్నలే. వారిని ముందుగా సంప్రదించలేదని లేదా ప్రభుత్వం వారిని చూడలేదని ఎవరూ ‘చూడలేకపోయారు‘. వారివి అక్షరాలా దేశాన్ని ‘నిర్మించిన‘ చేతులు. సామాజిక మాద్యమాల్లో, వార్తల్లో సహాయం కోసం వాళ్ళుచేసిన ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదనీ వీరెవరికీ కనిపించలేదు. మహమ్మారి రెండవ కెరటం ముగిసిన తర్వాత, నేను ఒక ఉన్నత విశ్వవిద్యాలయంలోని న్యాయ విద్యార్థుల తరగతితో మాట్లాడుతున్నాను. గ్రామీణ భారతదేశంలోని తమ ఇళ్లకు లాక్డౌన్ సమయంలో వేల మైళ్లు నడిచి వెళ్ళిన వలస కార్మికుల దుస్థితి వైపు చర్చ మళ్లింది. తరగతిలోని ఐ-ప్యాడ్‌ను కలిగి ఉన్న చాలా మంది సహస్రాబ్ది తరం(మిలీనియల్స్) దీనిని అవసరమైన దశ అని, ఒక కోటి మందికి పైగా వలసదారుల బాధలు ‘గొప్ప మంచి‘ కోసం జరిగిన అనివార్యమైన ఆవశ్యకత అని భావించారు . ఈ విద్యార్థులు తయారీలోవున్న ఉక్కు చట్రం. ఒకరి ప్రేరణలను పట్టించుకోకపోవడం ఒక తోలుబొమ్మ లక్షణం. దేశ నిర్మాణం ఒక తోలుబొమ్మలాట కాదు. ఉక్కు చట్రం తయారీదారులు వింటున్నారా?
ఈ వ్యాస రచయిత హేమాంగ్ అశ్విన్‌కుమార్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ద్విభాషా కవి, అనువాదకుడు, సంపాదకుడు మరియు సాంస్కృతిక విమర్శకుడు.
– అనువాదం దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.