తమకు చైనా నుండీ ఎటువంటి ఆందోళన కలిగించే వార్తా రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలియజేసింది. ఇప్పటి వైరస్ కొత్తదీ కాదు, అలాగని కోవిడ్ లాంటిది కూడా కాదు. కానీ దీనితో ఇండియా అంతటిలో ఒక భయాందోళన వ్యాప్తికి దారి తీసిందనిపిస్తోంది.
న్యూ ఢిల్లీ: ప్రధాన స్రవంతి మీడియా గురించి కొత్త సంవత్సరం లో చెప్పాలంటే 2025 మొదటివారంలో ఒక సంవత్సరం క్రిందటి ఒక అనాహ్లాద కరమైన వాతావరణాన్ని గుర్తుచేసింది . రెండు సందర్భాల్లో కూడా ప్రజలలో భయానక పరిస్థితిని వ్యాప్తి చేసింది. ఇదంతా చైనాలో కొత్త వైరస్ బయలుదేరి, ఇండియాలో కూడా విజృంభిస్తుందంటూ ప్రజలు భయాదోళనకు గురవడానికి మీడియా బాగా దోహదం చేసింది.
జనవరి 6వ తేదీనాడు రోజంతా అన్నీ ఇండియా టీవీ చానెళ్లలో హెచ్ ఎమ్ పి ఏ వైరస్ కేసులు బయటపడ్డాయని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి. జనవరి 6 తేదీ సాయంత్రం వరకూ ఐదు కేసులు వచ్చేయి. దాదాపు ఈ కేసులన్నీ పిల్లలవే. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు ల్లో ఈ కేసులను పరీక్షల ద్వారా ధ్రువీకరించారు.
2023 నవంబర్ లో చైనా ఒక వింతైన ఆందోళన కలిగించే వైరస్ విజృంభణ ను ఎదుర్కొంటోందని వివిధ న్యూస్ ఛానెళ్లు ప్రకటించేయి. పర్యవసానంగా ప్రజలు ఆందోళన చెందినట్టు సామాజిక మాద్యమాల్లో స్పష్టంగ కనపడింది.
అయినప్పటికీ నవంబర్ 2023లో గానీ, జనవరి 2025లో గానీ చైనా లో కొత్త వైరస్ ఏదీ విజృంభించ లేదు. రెండూ సందర్భాల్లోనూ ఊపిరి తిత్తుల వైరస్ లు సమిష్టిగా విజృంభించడం జరిగింది. సాధారణంగా శీతాకాలంలో ఇలా జరుగుతుంటుంది.
ఈఏడాది ఈ అతిశయం అప్పుడే ఎంతవరకు వెళ్లి దంటే అక్కడక్కడా ఒకటి కొన్ని చానెళ్లు గతంలో వొచ్చిన కోవిడ్ వైరస్ కీ, ఇప్పుడూ వస్తున్న వైరస్ కీ పోలికలు, తేడాలు చూపి చెప్పడం మొదలుపెట్టాయి. ఫలితంగా ప్రజల్లో భయాందోళనలు వ్యాపించడం జరిగిపోయింది
మరికొందరైతే మళ్ళీ మహమ్మారి వ్యాపించేసిందని ప్రకటిస్తున్నారు
ఒక సామాన్య మైన సులభతరమైన, శాస్త్రీయమైన, వివరణతో కోవిడ్-19 ని కలుగజేసిన సార్స్-కోవ్-2 కి హెచ్ ఎమ్ పి వి కి తేడా మనం తెలుసుకోవచ్చు.
సార్స్-కోవ్-2 వైరస్ ఎలా పుట్టుకొచ్చిందో ఎవరికీ తెలియలేదు. అంతకుముందు ఆ వైరస్ గురించిన వివరాలు ఎవరికీ తెలిసి ఉండకపోవడం చేత, దానికి కొత్త అని అర్ధం వొచ్చే నావెల్ కరోనా వైరస్ అని పేరుపెట్టారు. అలాగే 2020 ఏడాది సార్స్- కోవ్ –2 మొట్టమొదటిసారి చెలరేగింది. మరోవైపు, ఈ వైరస్ మొదటిసారిగా 2021 లోనే వొచ్చింది అని క్షణాల్లో గూగుల్ సెర్చ్ చెబుతోంది.
ఇంకా చూస్తే, సార్స్- కోవ్.2 వైరస్ కు ఆర్ ఎన్ ఏ(RNA) వైరస్ మూలాలు ఉంటే, హెచ్ ఎమ్ పి వి కి డిఎన్ఏ(DNA) మూలాలు ఉన్నాయి . ఇందువల్ల రెండిటికీ మధ్యలో స్వభావరీత్యా చాలా తేడా ఉంది. ఆర్ ఎన్ ఏ మూలంతో ఉద్భవించడంచేత సార్స్. కోవ్-2 లో పదే పదే మార్పు చెందే గుణం ఉంటే, అందుకు భిన్నంగా డిఎన్ఏ మూలంతో ఉద్భవించడం చేత, హెచ్ ఎమ్ పి వి కి అంత త్వరగా మార్పు చెందే గుణం స్వాభావికంగా చాలా నెమ్మదిగా ఉంటుంది.
ఇప్పటివరకు శాస్త్రీయంగా చూస్తే హెచ్ ఎమ్ పి వి కి అంత త్వరగా మార్పు చెందడం కానీ, గతంలో లాగా ఇప్పుడు కుడా భయానకంగా చెలరేగి పోవడానికి గానీ తగిన ఆధారాలు లేవు.
ఏ వ్యాధి అయినా విశ్వవ్యాప్తమైనప్పుడే మహమ్మారి వ్యాధి అవుతుంది. ప్రపంచం అంతటా వ్యాపించడానికి అది కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ అయితేనే అంతగా త్వరగా వ్యాపిస్తుంది. ఏ నిర్వచనం ప్రకారం చూసినా ఈ హెచ్ ఎమ్ పి వి కి ఆ స్వభావం లేదు.
ఏదైనా ఆరోగ్య మేధో సమూహం గానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ ప్రస్తుత వైరస్ ప్రమాదంపై ఎటువంటి జాగ్రత్తలు, ఆందోళన నివారణ చర్యలూ జారీ చెయ్యలేదు.
ఈ విషయాన్ని గూర్చి వైర్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ను సంప్రదించినప్పుడు, “ఇప్పటివరకు చైనా నుండి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారి సంఖ్యలో అసాధారణ పెరుగుదల విషయంలో ఎటువంటి నివేదిక ప్రపంచ ఆరోగ్య సంస్థకి రాలేదు” అని స్పందించింది.
ఈ భౌగోళిక ప్రాంతంలో శ్వాసకోశ వ్యాధులు, వాటి కారకాల గురించి నిరంతరం నివేదికలు తెప్పించుకుంటూనే ఉంటుంది. వైరస్ లోని వివిధ రకాల సాధ్యమయ్యే నిర్మాణాలు, వాటి మారిన రూపాలు నిరంతరంగా చురుగ్గా పరిశీలిస్తూ, వ్యాది వ్యాపించడాన్ని గమనిస్తూ, ఎక్కడ విజృంభించేదీ అంచనా వేస్తూ త్వరితంగా అందుకు తగిన చర్యల్ని చేపడుతుంది”అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
ఆవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన వివరణ యిచ్చింది. ప్రస్తుత వైరస్ కు మునుపటిలా త్వర త్వరగా మార్పు చెందే స్వభావం గానీ, త్వరగా వ్యాప్తి చెందే శక్తి గానీ ఈసారి లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
ఐక్య రాజ్య సమితి కుడా ఈవిధంగా వివరించింది: “ఇంతవరకు చైనా లోని వ్యాధుల పరిశీలన, వాటి నియంత్రణ , నివారణ సంస్థ (చైనా డిసీజ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్(China CDC) నివేదికల ప్రకారం 2024 డిసెంబర్ ‘ 16 నుండి 22 తేదీల మధ్యకాలంలో శ్వాస కోశ వ్యాధులతో బాధ పడేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినప్పటికీ వీటిలో చలికాలంలోని చలి కారణంగా ప్రతీ సారీ వచ్చే ఇన్ఫ్లుఎంజా, రైనో వైరస్ వ్యాధి, హెచ్ ఎమ్ పి వి, రెస్పిరేటరీ సిన్సి షియల్( దీన్నే RSV అంటారు) వంటి వ్యాదులు ఉన్నాయి. ఇవన్నీ మరీ ముఖ్యంగా చైనా ఉత్తర ప్రావిన్స్ లలో ఉన్నాయి. ఈ వైరస్ లు అన్నీ కూడా ఇంతకు ముందు నుండీ ఉన్నవే. అనేక ఏళ్లుగా వ్యాప్తి చెందుతున్నాయి.
” చైనా లో ఈ వ్యాధుల వ్యాప్తి, వాటి తీవ్రత గురించి చెబుతూ, గత ఏడాది తో పోలిస్తే, ఈ ఏడాది వీటి బారిన పడిన వారి సంఖ్యా, వాటి తీవ్రతా తక్కువే ” నని, అందుచేత, ఇప్పుడే దీనిగురించి ఆందోళన పడవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.
వైర్ కి ఈ సమాచారం అందిన ముందురోజే యాదృచ్చికంగానే, ఎప్పటికప్పుడు తాజా లెక్కలు తనకు కావాలని ఇండియా ప్రపంచ ఆరోగ్య సంస్థ ను గట్టిగా అడిగింది. మరేదేశమైనా ఈ విధమైన డిమాండ్ పెట్టిందేమో ఇప్పుడే తెలీదు.
ప్రబలుతున్న వ్యాధుల్ని పర్యవేక్షించడానికి , అందరూ పాల్గొనడానికి వీలుగా ఉన్న ‘ప్రో మెడ్ ‘ అనే వేదిక , కార్యక్రమం ఉంది . ఎప్పటికప్పుడు ప్రపంచంలో వ్యాప్తిచెందే వ్యాధుల గురించి ఈ వేదిక నివేదికలు ఇస్తుంది. డిసెంబర్ 28న విడుదలైన ప్రో మెడ్ నివేదిక ప్రకారం, చైనా నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ (NDCPA) అధికారిక పత్రికా సమావేశంలోఇచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 16-2 4తేదీల మధ్య వ్యాధులు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ 2025లో అన్నీ కలిపి నమోదయిన కేసులు కూడా గతంలో నమోదైన కేసుల కంటే తక్కువగానే ఉన్నాయి.
ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ను గానీ, చైనా ప్రకటనను గానీ ప్రజాబహుళ్యంలో ఎక్కడా ఎవరూ సందేహించలేదు.
ఆసక్తికరంగా, అంతర్జాతీయ వార్తా సంస్థలు గానీ, ప్రపంచ వ్యాప్త పత్రికలుగానీ నివేదించని కొత్త వ్యాధి ఉత్పన్నం, ఉధృతంతో ఏర్పడిన ఈ ‘‘భయానక పరిస్థితి’’పై కేవలం ఇండియా ప్రసార మాధ్యమాల్లోనే ప్రజలు ఆందోళనకు గురయ్యే వార్తలు వచ్చాయి. డిసెంబర్ 27న, కొత్త గా ఉత్పన్నమయ్యే వైరస్ లు, వాటివల్ల వొచ్చే వ్యాధులను చైనా అధ్యయనం చేయడానికి తను ఒక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు రాయిటర్స్ వార్తాసంస్థ రాసింది. శ్వాసకోశ వ్యాధులు పెరగడం గురించి ప్రొమెడ్ హెచ్చరికలో భాగమైన NDPCA అధికారి ప్రకటనను కూడా రాయిటర్స్ ఉటంకించింది. అయితే రాయిటర్స్ ఇదో అసాధారణమైన విషయంగా తన రిపోర్ట్ లో పేర్కొన లేదు.
చలి కాలంలో ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా వచ్చే ‘సాధారణ జలుబు’ ఎక్కువ సంఖ్యలో ప్రజలకు రావడం ఇండియా లో ఒక భయానక మానసిక పరిస్థితి కి దారితీయలేదు. కాబట్టి ఒక వేళ హెచ్ ఎమ్ పి వి వలన వొచ్చే శ్వాసకోశ వ్యాధులు ఏమాత్రం ప్రబలినా అది ఒక దిగ్భ్రాంతికర విషయంగా పేర్కొనటం ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ఫ్లుఎంజా కూడ ఒక శ్వాసకోశ వ్యాధే .
అనేక టీవీ చానెళ్లు చైనా లోని ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడుతున్నట్టు చూపిస్తూ ఈ వీడియో లను అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి కానీ అవేమీ నిర్ధారణ కాలేదు.
ఈలోగా, అనేకమంది వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రసారమాధ్యమాల్లో ఇందులోని వాస్తవాల్ని చెబుతూ ప్రకటనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని యిక్కడ చూడవచ్చు:
డాక్టర్ అబ్దుల్ గఫూర్, డాక్టర్ మౌలిక్ షా లు ఇలా చెప్పారు:
“శీతాకాలంలో శ్వాసకోశ వ్యవస్థ ను ప్రభావితం చేసే వైరస్ లు ఎక్కువ కావడం ఇండియాలోను, ప్రపంచ వ్యాప్తంగాను సర్వసాధారణమే. ఒక దేశం వీటిమీద ఎన్ని పరీక్షలు జరిపితే అన్ని వ్యాధులు బయటకు వస్తూ ఉంటాయి”అని జన్యు శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న విండో స్కారియా అన్నారు. కాబట్టి, చైనా లో వ్యాధిగ్రస్తుల పెరుగుదల అనూహ్య మైనదేమీ కాదు. ముఖ్యంగా తీవ్రత లేని జబ్బులతో పెద్ద సంఖ్య లో కేసులు రావడం ఏమాత్రం ఆందోళన పడనక్కర లేని విషయమని ఆయన అన్నారు.
ప్రజారోగ్య దృక్కోణం నుంచీ మనం జాగ్రత్తగా ఉంటూ, సాధ్యమైనన్ని పరీక్షలు జరపడం మంచిది. అంతేకానీ ఏదైనా వాస్తవంగా కనిపిస్తే తప్ప ఈ విధంగా ఆందోళన పడడం ఆహ్వానించ దగినది ఎంతమాత్రం కాదు“అని డా.స్కారియా అన్నారు.
” హెచ్ ఎమ్ పి వి ఎప్పటినుండో ఉన్న వైరస్. పైగా మనలోని అందరం ఎప్పుడో ఒకప్పుడు తెలిసో తెలియకో ఆ వైరస్ బారిన పడిన వాళ్ళమే”. డా. స్కారియా. అలా చెప్పి అయన మన అందరిలో హెచ్ ఎమ్ పి వి తో తలపడే ఏంటి బాడీస్ మనలో ఉన్నాయని తెలియజేశారు.
డా. స్కారియా గారి విశ్లేషణ ప్రకారం, శీతాకాలం లో మనలో సర్వ సాధారణంగా వొచ్చే వ్యాధులే ఈ సమయంలో పెరుగుతాయని మరిన్ని ఉదాహరణ లు చూపవచ్చు.
ఉదాహరణ కి, ఎన్ హెచ్ కే వరల్డ్ డిసెంబర్ 27న ఇలా రిపోర్ట్ చేసింది: ‘జపాను లో శ్వాసకోశ వ్యాధుల వైరస్ కారణంగా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదవుతున్నాయి‘ అని ముందుగా మనం చెప్పుకున్నట్టు ప్రకటించింది.
అయినప్పటికీ, అటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఇండియాను అప్రమత్తం చెయ్యడానికి , హెచ్ ఎమ్ పి వి, జికా వైరస్ లు పరీక్షించడానికి కావలసి పరికరాలను ఆమోదించలేదని డా. స్కారియా అన్నారు.
” ఏదైనా ప్రైవేట్ ల్యాబ్ తన సొంతంగా హెచ్ ఎమ్ పి వి వైరస్ ని పరీక్షించి, దానిని తన ఉపయోగం కోసం ఆర్ టి – పిసిఆర్ లేక అటువంటి మరేదో కిట్ తో ఈ వైరస్ కు టెస్ట్ చేసుకోవచ్చు. ఈ కిట్లు కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉండవచ్చు. కానీ, బహిరంగ మార్కెట్ లో అమ్మడానికి వీలు లేదు. కాబట్టి వాటిని పెద్దఎత్తును ఉపయోగించటానికి వీలులేదు.
ఈ హెచ్ ఎమ్ పి వి, జికా వైరస్ లు ఎప్పటినుంచో మనమధ్య ఉంటున్నవే. వీటిపరీక్షల కోసం కిట్లు తయారు చేసుకోవటానికి తగిన సమయం మనకు ఉంది. ఏ సంవత్సరంలోనైనా ఆకస్మికంగా ఈ వ్యాదులు ప్రబలితే ఈ కిట్ల ఉత్పత్తిని మనం పెంచుకోగలగాలని స్కారియా అన్నారు. అటువంటి పరిస్థితిలో ఇండియా ఈ కొరతను ఎదుర్కోవలసి రావచ్చు.
హెచ్ ఎమ్ పి వి లక్షణాలు:
ఇంకొక శ్వాస కోశ వైరస్ ఆర్ ఎస్ వి వలే హెచ్ ఎమ్ పి వి వైరస్ పారమోక్సీ విరిడే అనే వైరస్ ల కుటుంబానికి చెందినది. రెండూ కూడా ఒకే సీజన్ లో వొచ్చే సమ లక్షణాన్ని కలిగి ఉన్నాయి. రెండింటిలో రోగ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు, ముక్కు కారడం, గొంతులో గుర గుర మొదలైనవన్నీ దాదాపు అన్ని శ్వాసకోశ వ్యాధుల లక్షణంగా ఉంటాయి.
పిల్లలు, ముసలి వారు, రోగనిరోధక శక్తి పెద్దగా లేనివారు ముందుగా ఈ హెచ్ ఎమ్ పి వి వైరస్ బారిన పడతారు. డ్రగ్స్ తీసుకునే వారిలో, రోగనిరోధక శక్తి క్షీణించిపోతుంది. అవయవ మార్పిడి చేసుకున్న వారిలో, ముందునుండి ఇతరత్రా వ్యాధులు ఉన్నవారే హెచ్ ఎమ్ పి వి కి బాధితులు గా మారుతారు.
అమెరికా లోని రోగ నియంత్రణ మరియు రోగ నివారణ కేంద్రాల ప్రకారం, హెచ్ ఎమ్ పి వి ఇతరులకు తుమ్ములు, దగ్గు ద్వార, వారి ముక్కు, గొంతుల నుండీ వెలువడే స్రావాల ద్వారా, వైరస్ ఉన్నవారితో దగ్గరగా , సన్నిహితంగా మెలగడం ద్వారా, వారితో చేతులు కలపడం, వారు తాకిన వస్తువులపై వైరస్ ఉండి, మరల వేరొకరు ఆ వస్తువు ఉపరితలాన్ని తాకి,అదే చేతితో తమ ముక్కును, నోటిని తాకడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
మిగతా అన్ని వైరస్ లకు వలె, హెచ్ ఎమ్ పి వి కి కూడా నిర్ధిష్టమైన యాంటీ బాడీస్ రోగనిరోధకాలు అంటూ ఏమీ లేవు. మిగిలిన వైరస్ వ్యాధుల్లాగే హెచ్ ఎమ్ పి వి కూడా చాలా వరకూ ఎవరికి వొస్తే వారితోనే ఆగిపోతుంది. ఆవిధంగా, దగ్గు జ్వరానికి ఏ చికిత్స ఐతే చేస్తారో, హెచ్ ఎమ్ పి వి కి కూడా అదే చికిత్స సరిపోతుంది. రోగ లక్షణాలు తీవ్రమైనా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయినా వైద్యుణ్ణి సంప్రదించమని అమెరికా శ్వాసకోశ నిపుణుల కమిటీ సూచించింది.
ఇక ఈ వైరస్ నివారణ కు మిగిలిన ఇతర వైరస్ లకు వలే ప్రత్యేకమైన వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే, ఈ హెచ్ ఎమ్ పి వి వ్యాధిని నిరోధించటానికి పరిశుభ్రమైన పరిసరాలు, దేహ పరిశుభ్రత పాటించడం , రోగలక్షణాలు ఉన్నవారితో కొంత దూరం పాటించడం, అవసరమైతే మాస్క్ ధరించడం సరిపోతుంది.
(అనువాదం: నెల్లూరు నరసింహారావు)