
– బీహెచ్‌యూ కోర్టు అధ్యక్ష నామినిగా రాజీవ్ సిజారియా
– జేఎన్‌యూ బి- స్కూల్స్ మాజీ డీన్‌గా బాధ్యతల నిర్వహణ
– సిజారియాపై కేసు నమోదు చేసిన సిబిఐ
న్యూఢిల్లీ: 2016 వరకు రాజీవ్ సిజారియా ఎక్కడైతే తాను బోధించారో ఆ బిజినెస్ స్కూళ్లలో ఉత్తమ ఫ్యాకాల్టీ అవార్డులను, కిర్లోస్కర్ డీలర్స్ ఆఫ్ రాజస్థాన్‌లో ‘అవార్డ్ ఆఫ్ హనర్’ను అందుకున్నారు. ఈ చెప్పుకోదగ్గ మైలురాళ్లను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైబ్సైట్లో సిజారియా మెన్షన్ చేశారు.
దీనికు ముందు, సిజారియా తక్కువ కాలంలోనే చాలా తొందరగా వృద్ధిలోకి వచ్చారు. ఆయన జేఎన్‌యూలోని అటల్ బిహారి వాజ్‌పేయి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ (ఏబీవీఎస్ఎంఈ)లో డీన్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఈ-లెర్నింగ్ ప్రత్యేక శిక్షణా కేంద్రానికి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇవి రెండు పదవులు ఆయనకు 2018లో వచ్చాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ కోర్టు, ద నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్టి శిబ్పూర్) వీటికి అతిథి నామినిగా ప్రాతినిధ్యం వహించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) సీఎంటీ సలహాదారు కమిటీలో ఆయన సభ్యులుగా ఉన్నారు. ఆయన పని విధానం మీద సొంత డిపార్ట్మెంట్ తోటి ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో ఆయనను డీన్ పదవి నుంచి తొలగించారు.
తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సిబిఐ) అరెస్ట్ చేసిన పది మందిలో సిజారియా కూడా ఉన్నారు. అంతేకాకుండా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులను కూడా అధికారులు అదుపులోకి తీసుకు ఉన్నారు. వీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డీమ్డ్ విశ్వవిద్యాలయానికి హైయ్యర్ గ్రేడింగ్ మార్పు కోసం లంచం డిమాండ్ చేశారని సమాచారం.
న్యాక్ తనిఖీ ప్యానెల్ సహాయకునిగా జేఎన్‌యూ ప్రొఫేసర్ రాజీవ్ సిజారియా పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన వైబ్సైట్లో సిజారియా ఆఫీషియల్ ప్రొఫైల్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు- రాజకీయ పక్షాలైన బీజేపీ, ఏబీవీపీతో ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నట్టుగా అర్ధం అవుతుంది. ఉపాధ్యాయ సంఘమైన అఖిల భారతీయ రాష్ట్రియ శైక్షిక్ మహాసంఘ్ తో కూడా దగ్గరి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది.
సిబిఐ ఎఫ్ఐఆర్, 2016 తర్వాత అభివృద్ధి..
సిబిఐ ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం, తమ తనిఖీ బృందానికి 1.80 కోట్లు ఇవ్వాలని బృందం సభ్యులు డిమాండ్ చేశారు. సిజారియా జోక్యం చేసుకొని తగ్గించి, దర్యాప్తు కమిటీ చైర్మన్‌కు 10లక్షలు, కమిటీ సభ్యులకు మూడేసి లక్షలు, ఒక్కో ల్యాప్‌టాప్‌తో పాటు అదనంగా ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని ప్రైవేటు కళాశాలలను ఒప్పించినట్టు సిబిఐ దర్యాప్తు నివేదిక వెల్లడిస్తోంది.
జెఎన్యూ వైబ్‌సైట్, సిజారియా సోషల్ మీడియా ఖాతాలను చూపిస్తున్న సమాచారం ప్రకారం విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిజినెస్ స్కూల్లో డిసెంబర్ 2020న జాయినై 2023లో డీన్ అయ్యారు. పలు నివేదికల ప్రకారం ఆయనను ఆ పోస్ట్ నుంచి తర్వాత తీసివేశారు.
జెఎన్‌యూలోని అతని బాధ్యతలతో పాటుగా సిజారియా పలు కేంద్రియ విశ్వవిద్యాలయాల అతిథి నామినిగా పనిచేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యూ) కోర్టులో 2017 నుంచి మూడు సంవత్సరాలు తన సేవలను అందించారు.
సిజారియా లింక్డిన్, ట్విట్టర్ ఖాతాలలోని బయో ప్రకారం మొత్తం నిట్ విద్యాలయాలకు, పశ్చిమ బెంగాల్‌లోని శిబ్పూర్ ఐఐఈఎస్టికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది.
బిజెపితో దగ్గరి సంబంధాలు..
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా వేదికలలో సిజారియా తనకు తాను మ్యానేజ్మెంట్ టీచర్‌గా తెలిపారు. అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్, మేధావి, సామాజిక కార్యకర్తగా చెప్పుకొచ్చారు. సంఘంపరివార్తో దగ్గరి సాన్నిహిత్యం ఉన్నట్టుగా సిజారియా సోషల్ మీడియా కార్యకలాపాలు సూచిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఎబివిపి సభ్యులు సునీల్ అంబేకర్‌తో సిజారియా వేదికను పంచుకున్న ఫొటో ఇన్‌స్టా, ఫేస్బుక్ ఖాతాల ముఖచిత్రంగా ఉంది.
ట్విట్టర్లో సిజారియాకు సంబంధించిన దాదాపు పూర్తి సమాచారం మనకు దొరుకుతుంది. జెఎన్‌యులో ఎబివిపి నిర్వహించిన అహల్యబాయి హోల్కర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్ట్‌ను తాజాగా ఆయన రిపోస్ట్ చేశారు. అంతేకాకుండా ఎబివిపికి కొత్తగా నియమించబడిన నేతలను ఉద్దేశించి ఓ పోస్ట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఎబివిపిపై చర్యలు తీసుకున్నందుకు గాను మరో పోస్ట్‌కు రిప్లై ఇస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సిజారియా ఘాటుగా విమర్శించారు.
2020లో విద్యాసంబంధమైన లాల్ బహదూర్ శాస్త్రి ఆర్టికల్ ఏబివిపి మౌత్‌పీస్, రాష్ట్రియా ఛత్ర శక్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2016లో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ శైక్షిక్ సమ్మాన్ పురస్కారాన్ని అందించింది.
సిజారియా నేపథ్యం..
జెఎన్యూలో జాయిన్ అయ్యేదాని కంటే ముందు పలు బిజినెస్, టెక్ స్కూళ్లలో సిజారియా బోధించారు. ఇన్సిట్యూట్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, సీసీఎస్‌యూ మీరుట్లోని సర్ ఛోటు రామ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ,హెచ్ఆర్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఘజియాబాద్ అండ్ యునైటెడ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మ్యానెజ్మెంట్, గ్రేటర్ నొయిడాలో కూడా ఆయన తన సేవలను అందించారు. విద్యాసంబంధమైన, పరిపాలనపరమైన మొత్తం 21 ఏళ్ల అనుభవం సిజారియాకు ఉంది. మిగితా నాలుగు సంవత్సరాలు కార్పోరేట్ సంస్థలలో పనిచేశారు.
వినియోగుదారు ప్రవర్తనలో ఓ పిహెచ్డి, మార్కెటింగ్ మ్యానెజ్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వ్యవస్థాపక, స్టార్ట్అప్స్ వంటి వాటిలో ఆయనకు అనుభవ నైపుణ్యం ఉంది. తనకు తానుగా మూడు పుస్తకాలు రాసినట్టుగా సిజారియా చెప్పారు. మరో ఐదింటిని సవరించినట్టుగా, 12 అధ్యయనాలను నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఆయన కొన్ని పేటేంట్లు, కాపిరైట్లను కలిగి ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.