
ఏదో గుండెల్లో కొన్ని పిడుగులు పడ్డట్టు తోస్తున్నది.
మెరుపులు లేని ఈ శబ్దములేమిటి?
అది రానున్న వర్షానికి సంకేతమేనా!?
లేదా ఇంకెక్కడో ఇప్పటికే ఆ వర్షం మొదలైనదా!?
ముసురుకున్నవి మేఘములా?
లేక వాటి నెపమున చీకట్లా?
బతకలేక చస్తే ఆరడుగుల బొంద;
చావు రాక బతికుంటే
కడుపుకింత పిడికెడు అన్నం!
నేను కన్న పిల్లలకు,
నన్ను కన్న తల్లిదండ్రులకు
నా బాధ్యతా ఋణం తీర్చుకొనివ్వరా?
హజార్లలో పెరుగుతున్న
ద్వేషకారులు
తమ జెండాలన్నీ పక్కన పెట్టి
ఈ ఎజెండానే కసిగా
అమలుపరుస్తూ
రాలుతున్న పిట్టల సంఖ్యను
లెక్కల్లో నమోదు చేసి
తాత్కాలిక విజయంతో విర్రవీగుతున్నారు.
ఇది ఏం కాలం?
సాయంకాలం మాత్రం కాదు
ద్రోహ కాలం
హింసాత్మక కాలం
చలన శీలత ప్రకృతి లక్షణము కూడా కదా!?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.