
ఆరెస్సెస్ శతజయంతి లక్ష్యం గా తెలంగాణ లో నాలుగువేల అదనంగా శాఖలను విస్తరింప చేయాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలను టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది.
ఈ కథనం ప్రకారం వచ్చే దసరా నాటికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఇంటింటికీ ఆరెస్సెస్ సాహిత్యాన్ని చేర్చేందుకు కూడా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.
ఆరెస్సెస్ శతజయంతి ని పురస్కరించుకుని రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కు రూపకల్పన జరిగింది. మార్చి 25 న జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆర్ఎస్ఎస్ శాఖ అధ్యక్షులు కంచం రమేష్ ఈ విషయాలు వెల్లడించారు..
ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లా రాష్ట్ర కేంద్రాల్లో భారీ ప్రచార సభలు నిర్వహించనున్నామని, ఈ సభల్లో ప్రముఖ ఆరెస్సెస్ అగ్రనేతలు పాల్గొననున్నారని రమేష్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ లో 1839 ప్రాంతాల్లో 3117 శాఖలు పని చేస్తున్నాయని, గతం కంటే 392 శాఖలు పెరిగాయని ఆయన తెలిపారు. నెలకు కనీసం 382 సమావేశాలు జరుగుతున్నాయని, విద్యార్థి యువజన శాఖలు ఈ కాలంలో బాగా. విస్తరించాయనీ ఆయన తెలిపారు. ఆరెస్సెస్ నిర్మాణం కోసం ప్రతి పదివేలమంది జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు. తమ శ్రేణులను విస్తృతంగా సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనెలా ప్రోత్సహిస్తామని రమేష్ తెలిపారు. 2925 సెప్టెంబర్ నుండి 2026 ఆగస్టు వరకు లక్ష కేంద్రాల్లో వారానికి ఒక సారి శాఖా కార్యక్రమాలు జరుగుతాయని రమేష్ ప్రకటించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.