రాహుల్ గాంధీకి ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని, అర్బన్ నక్సలైట్లతో పోలుస్తూ ఆయన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎర్రపుస్తకాన్ని పట్టుకుని, రాజ్యాంగ ప్రతిని జేబులో పెట్టుకుని ‘అర్బన్ నక్సలైట్లు, అరాచకవాదుల’ మద్దతు కోరుతున్నారని మహారాష్ట్ర డెప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. రాజ్యాంగంపై 2024 నవంబర్ 7వ తేదీన నాగ్ పూర్ లో జరిగిన ఒక సదస్సు సందర్భంగా ఈ ఆరోపణ చేశారు.
బీజేపీ దురాక్రమణ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయ పోరాటాన్ని అప్రతిష్టపాలు చేయడంలో భాగంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు.
గడిచిన లోక్ సభ ఎన్నికల నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ నొక్కిచెపుతూ, భారత గణతంత్ర విలువలను పున: ప్రతిష్టించాలని కోరుతూ పనిచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని శక్తులు హిందుత్వ సిద్ధాంతాలతో ముడిపడిన అధికసంఖ్యాకుల ఎజెండాను తీసుకురావడానికి రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్నారు.
ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో, న్యాయయాత్రలతో ఆయనలో ఒక మార్పు కనిపించింది. అది ‘‘నేనూ హిందువునే’’ వంటి అమాయకత్వం నుంచి, ఈ యాత్రలతో అట్టడుగు వర్గాల వారి ఆశాకిరణంగా గుర్తింపు పొందారు. ఇలా తనను తాను మార్చుకోవడం ద్వారా, సంప్రదాయంగా వస్తున్న ధోరణికి భిన్నంగా బీజేపీకి ఒక సవాలు విసిరేలా తన స్థితిని ప్రతిష్టించుకున్నారు.
సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం ఎన్నికల విజయంగా పరిణామం చెందవలసి ఉంది. అది చెప్పుకోదగ్గ స్థాయిలో బిజేపి ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి, భారత రాజకీయాలు మారడానికి దోహదం చేస్తుంది. రాహుల్ గాంధీపై ఫడ్నవీస్ చేసిన విమర్శలు హిందుత్వ శిబిరం ఆత్మరక్షణలో పడిపోవడాన్ని, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వాన్ని కోరే నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదగవలసిన అవసరాన్ని తమ శిబిరానికి గుర్తు చేసుకుంటున్నాయి.
అర్బన్ నక్సలైట్లుగా అసమ్మతి వాదులు
మావోఇస్టుల తరపున పనిచేస్తున్నరన్న ఆరోపణపై ప్రొఫెసర్ జి.న్. సాయిబాబా, అరున్ ఫెరారె వంటి అనేక మందిని అరెస్టు చేసిన తరువాత 2010 నుంచి ‘అర్బన్ నక్సలైట్లు’ అనే పదం ప్రధాన స్రవంతిని ఆకర్షించింది.
భద్రత, విధానాల విశ్లేషణలో భాగంగా 1990-2000 నుంచి పట్టణ ప్రాంతాలపై వామపక్షవాదుల ప్రభావం, నక్సలైట్లతో సంబంధాల గురించి చర్చకు వచ్చాయి.
కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు చేయదలుచుకున్న నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయాలన్నది ఈ విధానం ఉద్దేశ్యం. వాస్తవానికి ఈ డాక్యుమెంట్లు మావోయిస్టుల (ఎత్తుగడలు, వ్యూహాల) ఆకాంక్షలుగా కనిపిస్తున్నాయి. వారు దశాబ్దాలుగా స్వేచ్ఛగా(వారికి రహస్య స్థావరాలు ఉన్నప్పటికీ) తిరుగాడుతున్నారని వారికి అర్బన్ నక్సలైట్లని పేరుపెట్టారు. అక్రమంగా వారిని ఏళ్ల తరబడి నిర్బంధించారని భావించిన న్యాయస్థానాలు, వారిపైన చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేల్చి , వారిని నిర్దోషులుగా విడుదల చేశాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున గొంతెత్తే వారిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి, వారి అరెస్టులను సమర్థించుకోవడానికి రాజకీయంగా కట్టుకథలను అల్లుతోంది.
బాలీఉడ్ కు చెందిన వివేక్ అగ్నిహోత్రి 2018లో రాసిన ‘అర్బన్ నక్సల్స్ : ద మేకింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ట్రాఫిక్ జామ్’ అన్న పుస్తకంతో ‘అర్బన్ నక్సలైట్’ అన్న పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ప్రభుత్వ విధానాలకు తోడు, ‘నక్సలిజం దేశానికి అతి పెద్ద ఆంతరంగిక ముప్పు’ అని 2009 లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనతో పాటు, ఈ పుస్తకం కూడా ఒక రకమైన మానసిక భయాన్ని కల్పించింది.
పట్టణాలు, నగరాల్లో(వార్తా ప్రసార మాద్యమాలు, విశ్వవిద్యాలయాలు, వాలంటరీ ఆర్గనైజేషన్ల లో పనిచేస్తూ) రహస్యంగా నక్సలైట్ల ఆలోచనను సమర్థిస్తూ, ప్రచారం చేసే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ‘అర్బన్ నక్సలైట్’ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అలహాబాద్ యూనివర్సిటీ, ఐఐటీ మద్రాస్, జాదవ్ పూర్ యూనివర్సిటీల వంటివి అర్బన్ నక్సలైట్లకు స్థావరాలుగా ఉన్నాయని ముద్ర వేశారు.
అఫ్జల్ గురును ఉరితీసి ఏడాదిగడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సమావేశం ద్వారా కన్హయ్య కుమార్ వెలుగులోకి రావడంతో అతనిపైన తప్పుడు కథనాలు ప్రచారం చేసి ‘అర్బన్ నక్సలైట్’ అన్న ముద్ర వేశారు.
‘కశ్మీరీ ఫైల్స్’ పేరుతో ఒక నాసిరకం సినిమా తీసిన అగ్నిహోత్రి ఇస్లామ్ పైన తప్పుడు వర్ణనలు చేశాడు. దీన్ని నరేంద్ర మోడీ తప్ప మరొకరెవరూ ప్రచారం చేయలేదు.
సంఘపరివార్ శక్తుల అమ్ముల పొదిలో ఉన్న వాక్పటిమతో చేస్తున్న ఇస్లామ్, ముస్లిం వ్యతిరేక ప్రచారానికి తోడు ‘అర్బన్ నక్సల్స్’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమ పై ఉన్న అసమ్మతిని తొలగించుకుని అధికారాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఎత్తుగడే ఇది.
ఎర్రపుస్తకంగా రాజ్యాంగం
ఒక సెమినార్ నోట్ బుక్ ను ఫడ్నవీస్ ఎర్ర అట్టతో ముడిపెట్టడం నక్సలైట్లతో సంబంధం ఉన్నదని చెప్పే ఎత్తుగడ. తద్వారా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కించపరుస్తోందని చెప్పడం కూడా బీజేపీ వ్యూహంలో ఒక భాగమే. ఇతరులు అకృత్యాలకు పాల్పడుతున్నారని చేసే ఆరోపణ ఇది. ఒక ఖాళీ నోట్ బుక్ కు రాజ్యాంగాన్ని పోలిన ఒక అట్ట వేయడం ద్వారా కాంగ్రెస్ దాన్ని కించపరుస్తోందని ఫడ్నవీస్ ఆరోపణ. రాజ్యాంగ సూత్రాలను తక్కువ చేస్తోందని తరచూ బీజేపీ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పనికి పాల్పడింది.
స్వాతంత్ర్యానంతర భారత దేశ విలువలను, చిహ్నాలను కించపరిచిన చరిత్ర ఆర్ ఎస్ ఎస్ కు ఉందన్న విషయం నమోదైంది. జాతీయ పతాకంపైన, జాతీయ గీతంపైన, భారత రాజ్యాంగం పైన దాని అయిష్టత కూడా నమోదైనవే.
త్రివర్ణ జాతీయ పతాకం పట్ల తన వ్యతిరేకతను ఆర్ ఎస్ ఎస్ తెస్తున్న ‘ఆర్గనైజర్’లో స్పష్టంగా వ్యక్తం చేశారు. ‘‘అ దృష్టం తంతే ఎవరైతే అధికారంలోకొచ్చి పడ్డారో, వారు మన చేతుల్లో పెట్టిన త్రివర్ణాన్ని హిందువులు ఎన్నటికీ గౌరవించలేరు, సొంతం చేసుకోలేరు. ఆ పదమే చాలా చెడ్డది. మూడు రంగులు ఉన్న జెండా చాలా చెడు మానసిక ప్రభావాన్ని కలగచేసి, దేశాన్ని గాయపరుస్తుంది’’ అని ఆర్గనైజర్ పత్రిక 1947 జులై 22వ తేదీన రాజ్యాంగ సభ జాతీయ పతాకం గురించి నిర్ణయించిన సందర్భంగా రాసింది.
అలాగే ‘బంచ్ ఆఫ్ థాట్స్ ’ లో గోల్వాల్ కర్ కూడా త్రివర్ణం పై తృణీకార భావంతో రాయడమే కాకుండా, అదొక మేధోపరమైన శూన్యంగా అభివర్ణించారు.
త్రివర్ణ పతాకం పట్ల ఆర్ఎస్ ఎస్ వ్యతిరేకత 2001 వరకు కొనసాగింది. నాగ్ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయంపైన జాతీయ జెండాను ఎగరవేయాలని బాబా మెంఢే నాయకత్వంలో రాష్ట్ర ప్రేమి యువదళ్ కార్యకర్తలు ఒత్తిడి చేశారు. ఫలితంగా త్రివర్ణ పతాకం పట్ల ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేకతకు ఒక సవాలు విసిరనట్టయింది.
రాష్ట్ర ప్రేమి యువదళ్ కార్యకర్తలను అరెస్టు చేసి పదకొండేళ్ళ తరువాత నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ, ఇదొక పెద్ద వివాదాస్పదమవడమే కాకుండా, పార్లమెంటులో దీనిపై ప్రశ్నలు కూడా లేవనెత్తిన స్థితికి వచ్చింది. భారత జాతీయ జెండా కోడ్ 2002లో రావడంతో, 52 ఏళ్ల తరువాత ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయంపైన జాతీయజెండా రెపరెపలాడింది.
తొలుత రాజ్యాంగాన్ని కూడా ఆర్ ఎస్ ఎస్ అంగీకరించలేదనేది కూడా ప్రబల సాక్ష్యంతో ఉంది. రాజ్యాంగంలో హిందువులకు చెందిన మనుస్మృతిని పట్టించుకోకుండా మినహాయించారని కూడా వాళ్లు విమర్శించారు. ‘‘ప్రాచీన భారత దేశంలో అభివృద్ధి చెందిన ఏకైక రాజ్యాంగం గురించి మన రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. మనుస్మృతిలో పేర్కొన్న చట్టాల గురించి స్పందిస్తూ, వాటిని ఉదహరిస్తూ, ఈ రోజు ప్రపంచం దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటోంది. కానీ, మన రాజ్యాంగ పండితులకు మాత్రం అవి తలకెక్కలేదు’’ అని 1949 నవంబర్ 30 న ఆర్గనైజర్ తన సంపాదకీయంలో పేర్కొంది.
కుల ప్రాతిపదికగా జరిగే వివక్షకు వ్యతిరేకంగా, లౌకిత తత్వం, మానవీయ సమాజం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయం కనుక, ప్రభుత్వ తరహా హిందూ సంప్రదాయ చట్టంలో వీటిని పరిగణనలోకి తీసుకోలేదు.
ఇలాంటి చరిత్ర గల ఆర్ ఎస్ఎస్ అసలు రాజ్యాంగాన్నే మార్చాలని పట్టుబడుతోంది. దీంతో పాటు జాతీయ వాద ఆవేశంతో పాటు, రాజ్యాంగంలోని ఉదారవాద సూత్రాలైన సామాజిక న్యాయం, లౌకికత, ఫెడరలిజం పట్ల అది సంశయాత్మకంగానే ఉంది. జేబులో పట్టే రాజ్యాంగాన్ని ఫడ్నవీస్ రెడ్ బుక్ గా అభివర్ణించడం, 1960 నాటి మావో రెడ్ బుక్ ను గుర్తుకు తెస్తుంది. వ్యవస్థకు వ్యతిరేకమైన ఒక విధ్వంసకర అసమ్మతి అని, అది జాతి ఐక్యతకు భంగకరమనేలా వర్ణించడాన్ని సూచిస్తుంది.
బిజేపీని కలవరపెడుతున్న రాహుల్ రాజకీయాలు
రాహుల్ గాంధీ తాజా రాజకీయధోరణిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. అసమానతలు, సామాజిక న్యాయం వంటి సమస్యల పట్ల ప్రాధాన్యత గల నాయకుడిగా తన స్థాయిని స్థిరపరుచుకుంటున్నారు. ఈ పరిణామం రాజకీయ ప్రత్యర్థుల్లో, ముఖ్యంగా బీజేపీ శిబిరంలో స్థిరపడలేదు. ఆర్థిక అసమానతలు, సామాజిక మినహాయింపులు, అట్టడుగు వర్గాల వారికి సాధికరత వంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు విస్తృత ప్రజాబాహుళ్యానికి అవి చేరుతూ, ఆర్థికాభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన కలుగుతోంది.
అర్బన్ నక్సలైట్లతో అతనికి సంబంధబాంధవ్యాలున్నాయని, రాజ్య వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారనే ఆరోపణలతో అతని చర్యలకున్న చట్టబద్దతను తగ్గించే యత్నం జరుగుతోంది. ఇలాంటి ఆరోపణల వల్ల అతను లేవనెత్తిన ముఖ్య మైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని జాతీయ, సామాజిక సమగ్రతలను సమర్థించే వైపు మళ్లించే అవకాశం ఉంది.
మోడీ నాయకత్వంలోని బీజేపీకి జాతీయవాద వాక్పటిమ, సంప్రదాయవాదంతో కూడిన సంస్మృతి, మతంతో గుర్తింపు పొందిన రాజకీయాల పునాది ఉంది. ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయం వంటి ప్రజానుకూల విధానాలను నొక్కి చెప్పడానికి సవాలుగా ఆకాంక్షలతో వాస్తవ స్థితిలో జీవించండని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఇందిరా గాంధీ వంటి నాయకులు భారత రాజకీయాలను ప్రభావితం చేసినట్టు రాహుల్ గాంధీ వ్యూహాలు వారిని పునరాలోచించేలా చేస్తున్నాయి.
సామాజిక న్యాయం అనేది మౌలికమైన సిద్దాంతంగా ముందుకు వస్తోంది. బీజేపీ అనుసరించే మత విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా విడిపోయిన కులాల మధ్య, మతాల మధ్య ఐక్యతను తీసుకురావాలన్నది రాహుల్ గాంధీ వ్యూహం. ఉనికి కోసం చేసే ఆరాటం నుంచి వర్గ దృక్ఫథం వైపునకు ప్రజల దృష్టిని మళ్లిస్తోంది. పెరుగుతున్న అర్థిక అసమానతలను అది ప్రతిఫలిస్తోంది.
రూపుదిద్దుకుంటున్న రాహుల్ గాంధీ దృక్పథం ప్రజల దృష్టిని మతం, సాం స్కృతిక విభజన నుంచి ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రైతులు, హక్కులు, సామాజిక న్యాయం వైపు మళ్లిస్తోంది. ఈ ధోరణి సంప్రదాయ రాజకీయ సరిహద్దుల నకిలీ కూటములను అధిగమిస్తుంది
రాహుల్ గాంధీ ప్రజానుకూల మైన ధోరణి విజయవంతమైతే, అప్పుడప్పుడూ మతపరమైన గుర్తింపుకు ఇచ్చే పిలుపు వంటి బీజేపీ సంప్రదాయ వ్యూహాలు చెదిగిపోతాయి. రాహుల్ గాంధీ వంటి ప్రధాన స్రవంతి నాయకులు అతనిలా ‘అర్బన్ నక్సలైట్లు’ గా ఒక ఎత్తుగడగా చట్టబద్దమైన ప్రజాస్వామిక అసమ్మతికి, తీవ్రవాద సిద్దాంతానికి మధ్య సన్నని విభజన రేఖలా ఏర్పాటు చేసి పనిచేయడం ఒక దృశ్యం.
మత రాజకీయాలకు ఒక తటస్థత ఏర్పాటుచేసి, అది భద్రతకు సంబంధించిన సమస్య అని, రాహుల్ ఇచ్చిన పిలుపును పైకి రానీయకుండా అదొక ప్రత్యామ్నాయ రాజకీయ ధోరణి అనేది ఈ వ్యూహం ఉద్దేశ్యం.
అందులోనే అడ్డంకులు
రాహుల్ గాంధీ రాజకీయ పునరుజ్జీవనానికి బీజేపీ కంటే కాంగ్రెస్సే ప్రధాన అడ్డంకి. రాహుల్ గాంధీ తనను తాను సమర్థవంతుడిగా పున: ప్రతిష్టించుకుంటున్నప్పటికీ, సామాజిక, ఆర్థిక సమస్యలు పరిష్కరించాలన్న నిబద్దత అనే తాదాత్మ్యంలో ఉన్నానని ప్రదర్శించుకుంటున్నప్పటికీ, వాటిని బీజేపీ నీరు కార్చే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీలో వ్యక్తిగా వస్తున్న మార్పులు నిర్మాణాత్మకంగా మారలేదు.
పాత ఎత్తుగడలతో పాతుకుపోయిన కాంగ్రెస్ వృద్ధ నాయకత్వమే రాహుల్ గాంధీకి అసలైన సవాలై కూర్చుంది. వాళ్ల వ్యవహారం సర్వసాధారణంగానే ఉంటుంది. మీడియాను ఉపయోగించుకుని ఎలా ప్రచారం చేయాలన్న విషయంలో బీజేపీ అనుసరించే ఆధునిక పద్ధతులను పాటించడంలో వాళ్లు చాలా వెనుకబడ్డారు. బీజేపీతో పోటీపడడానికి కొత్తపద్ధతులు స్వీకరించి, వ్యూహాల అన్వేషణను నిర్మొహమాటంగా అనుసరించడానికి కాంగ్రెస్ వృద్ధ నాకయత్వం సంకోచిస్తోంది.
కాంగ్రెస్ ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యామ్నాయం కావాలంటే, దానికి నిర్మాణాత్మక మరమ్మతులు జరగాలి. కనీసం మూడు విషయాలకు ప్రాధాన్యతనివ్వాలి.
తొలుత యువనాయకత్వం పైన దృష్టి కేంద్రీకరించాలి. ఓటర్ల ప్రాతిపదికగా యువకులు చేరాలని క్షేత్ర స్థాయి నుంచి పార్టీని నిర్మించాలి. అందుకవసరమైన సాధికరత గల కొత్త తరం రావాలి.
ఎక్కడైతే పార్టీ స్పష్టంగా నిలదొక్కుకోవాలనుకుందో, ఏ మాత్రం అస్పష్టత లేకుండా కీలకమైన సమస్యలను, ఓటర్లలో అస్పష్టత ఉదాసీనత లేకుండా వ్యూహాలు రచించాలనేది రెండవ ముఖ్యమైన అంశం.
చివరగా, ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని నిలువరించడానికి స్థానికంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా నిలదొక్కుకోడానికి స్థానికి సంబంధాలు చాలా అవసరం.
సంప్రదాయ ఎన్నికల ఎత్తుగడలు, మర్యాదగల కూటములు వంటి కాలం చెల్లిన పద్ధతులతో కాంగ్రెస్ కొనసాగినట్టయితే, దాని వల్ల వచ్చే ఇబ్బందిని గ్రహించకపోతే, అది సంబంధాలు తెగిపోయి ఘనీభవించి పోతుంది. చురుగ్గా తన వ్యూహాలను మార్చుకుంటూ పోయే బీజేపీని ఎదుర్కోవాలంటే సమస్యే. రాహుల్ గాంధీలో వచ్చిన మార్పును, దృక్పథాన్ని కాంగ్రెస్ అందుకోలేకపోతే, బీజేపీకి సమర్థవంతంగా సవాలు విసరడం చాలా కష్టం.
తుపాకితో ఫడ్నవీస్ పోస్టర్లు
మహారాష్ట్రలో ఇటీవల కాలంలో పోలీసు ఎన్ కౌంటర్ లు జరిగాక తుపాకీతో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ ఈ పోస్టర్ల నుంచి దూరంగా ఉన్నప్పటికీ, నేరాల పైన ఉక్కుపాదం మోపే ఒక నిర్ణయాత్మకమైన బలమైన ప్రభుత్వం ఉందన్నవిషయం ప్రదర్శించడానికి ఒక ఎత్తుగడగా వీటిని ప్రదర్శించారు.
న్యాయ వ్యవస్థ చాలా నిదానంగా పనిచేస్తోందని ఓటర్లు నిరాశ చెందుతున్న నేపథ్యంలో, అత్యాచారం చేసేవారి పట్ల, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఈ పోస్టర్లను ప్రదర్శించారు.
ఈ ఫొటోలు ప్రదర్శించడం ద్వారా నేరాలను అదుపు చేయడంలో ఫడ్నవీస్ కఠినంగా వ్యవహరిస్తారని, నేరాలకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తున్న వాడిగా ఆయన్ని చూపించడానికి ఈ ఫొటోలు ఉపయోగించుకున్నారు.
కూటముల విచ్చిన్నాలను, పార్టీల్లో ముఖ్యంగా శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సీపీ)లలో చీలికలను ఉపయోగించుకుని పార్టీలను చీల్చే పార్టీగా బీజేపీ పేరు సంపాదించుకుంది.
మహారాష్ట్ర రాజకీయ సంస్కృతి విలువల నాయకులు సమిష్టిగా న్యాయంతో దృఢంగా ఉన్నారు. తీవ్రమైన ఎత్తుగడలను వారి మద్దతు దారులను ఆకర్షిస్తున్నప్పటికీ, ఓటర్లు మాత్రం చట్టబద్ద పాలననే కోరుకుంటున్నారు. ఫడ్నవీస్ ఆకర్షణ గనక ఈ సూత్రాలను అణగదొక్కితే, అప్రమత్తమై మరో తరహాతో న్యాయం చేయాలని చూస్తే, ఒక మోస్తరుగా ఉన్న వారిలో, అభ్యుదయవాదులు ఉన్న ప్రాంతాల్లో అది ఎదురుదెబ్బ తీస్తుంది.
విచ్ఛినకర రాజకీయ ఎత్తుగడలతో ఉన్న బీజేపీ తన మర్యాదకు మరమ్మతులు చేసుకోవాలనుకుంటున్న సమయంలో ఈ పోస్టర్లు వచ్చాయి. దుందుడుకుగా చేసే పోస్టర్ల వ్యవహారం ప్రజాభిప్రాయాన్ని గౌరవించే వారి నుంచి బీజేపీని రక్షిస్తుందా, అవకాశవాదం కోసం తన ప్రతిష్టను పునరుద్ధరించుకుంటుందా అన్నది ప్రజల అవగాహనపైన ఆధారపడి ఉంటుంది. ప్రదర్శనాత్మకంగా ఉంటుందా, రాజకీయ ప్రయోజనకరంగా కనిపిస్తుందా, బలప్రయోగాన్ని ప్రదర్శించేకంటే ఎక్కువైన న్యాయానికి విలువ ఇచ్చే ఓటర్ల నుంచి దూరం అవుతారన్నది ఇబ్బందితో కూడుకున్నది.
(ఆనంద్ తెల్ తుంబ్డె పీఐఎల్ సీఈవో, ఖరగ్ పూర్ ఐఐటి, జీఐఎం లో ప్రొఫెసర్ , రచయిత, పౌరహక్కుల కార్యకర్త)
రచన: ఆనంద్ తెల్ తుంబ్డె
అనువాదం : రాఘవ