
Indira Gandhi, circa 1973. Photo: Wikimedia Commons
ఇందిరాగాంధీ నియంతృత్వం, జయప్రకాష్ నారాయణ్ గజిబిజి రాజకీయాలు, వాటి నుంచి ఆర్ ఎస్ ఎస్ తెలివిగా ఎలా లబ్ది పొందిందనే విషయాల గురించి క్రిస్టఫర్ జఫర్ లాట్, ప్రతినవ్ అనీల్ ‘ఇండియస్ ఫస్ట్ డిక్టేటర్ షిప్- ద ఎమర్జన్సీ 1975-77’ అనే తమ తాజా పుస్తకంలో చర్చించారు.
దేశ వ్యప్తంగా 1975, జూన్ 26న ఎమర్జెన్సీ ప్రకటించడంతో భారత దేశం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. హెబియస్ కార్పస్ ను రద్దు చేశారు. వార్తా ప్రతికలు సెన్సార్ షిప్ కు గురయ్యాయి. ఎమర్జెన్సీ ప్రకటించి ఇప్పటికి 46 సంవత్సరాలు పూర్తయింది.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీజం వేసి, దేశ రాజకీయ చరత్రనే మార్చివేసిన 1975-77 ఎమర్జెన్సీ పైన తగినంత దృష్టి సారించలేదు.
ప్రతి ఏడాదీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు వస్తుంది. దీనిపైన అనేక పుస్తకాలు వచ్చాయి. 1977 జనవరిలో ఎన్నికలు ప్రకటించగానే వెంటనే అనేక పుస్తకాలు మార్కెట్ ను ముంచెత్తాయి. అసలు లోపల ఏం జరిగిందనేదానిపైన నాటి రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు, ఇందిరాగాంధీ తరపు వారు కూడా పుస్తకాలు రాశారు. వీటిలో ఏ పుస్తకమూ అందుబాటులో లేదు.
ఫ్రాన్స్ కు చెందిన భారతీయ పండితుడు క్రిస్టొఫి జఫర్ లాట్ అనే శాస్త్రవేత్త, ఆక్స్ ఫర్డ్ నుంచి పీహెడి చేసిన ప్రతిన్వ అనిల్ దీనిపై సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఈ పుస్తకంలో జఫర్ లాట్ దృష్టి పూర్తిగా దర్శనమిస్తుంది. జఫర్ లాట్ భారత దేశాన్ని, భారత రాజకీయ పరిణామాలను చాలాకాలంగా పరిశీలస్తున్న వ్యక్తిగానే కాదు, ఇప్పటికీ జరుగుతున్న అనేక సామాజిక గమనాలను అర్థం చేసుకున్న వ్యక్తి.
ఈ పుస్తకం చదివితే ఆ పజ్జెనిమిది నెలల్లో ఏంజరిగిందో తెలుసుకోవడమే కాదు, ఆ కాలంలో నిజంగా ఏం జరిగిందో పాఠకులు అంచనా వేసుకోగలుగుతారు.
ఈ పుస్తకంలో రెండు విషయాలపైన విస్తృతంగా ఉంది. ఒకటి ఇందిరా గాందీ నియంతృత్వ ధరోణి, జయప్రకాష్ నారాయణ్ ప్రజాస్వామ్యం కోసం పోరాడడం. ఇద్దరూ ఏళ్ల తరబడి తమ ప్రభావం నిలిచిపోయేలా ఉండాలనుకున్నారు. వాళ్ల ఉద్దేశ్యాన్ని ప్రశ్నల రూపంలో సంధించారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సంజయ్ గాంధీ ప్రోత్సాహంతో ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జగ్ మోహన్ పేదల ఇళ్లను తొలగించడానికి చర్యలు చేపట్టారు. మురికి వాడలను శుభ్రం చేసే పనిలో జరిగిన దారుణాల గురించి జఫర్ లాట్, అనిల్ లోతుగా వివరించారు.
పారిస్ నగరాన్ని సుందరీకరించిన బారన్ హౌస్ మాన్ లాగా జగ్ మోహన్ ను అభిమానించిన సిబ్బంది కూడా ఆయన రాజధాని సుందరీకరణను అనుసరించారు.
‘‘ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రధానాధికారి తన ఆలోచనలకు అసలు అడ్డు లేకుండా చేశారు. ఢిల్లీ నగరం మధ్యలో ఉన్న మురికివాడల పైనే కాదు, ‘‘మురికి వాడల సంస్కృతి’’ పైన కూడా తన ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీలో తన పాత్రను నిలిచి ఉండాలనే ఉద్దేశ్యంతో రాసిన పుస్తకంలో ‘‘మురికి వాడల సమస్య పరిష్కారానికి అక్కడి ప్రజలను మురికి వాడల నుంచి దూరంగా తీసుకెళ్లడం కాదు, అసలు మురికి వాడల్లో ప్రజలు లేకుండా చేయాలి’’ అని భావించాడు. దానికి పరిష్కారం ఏమిటి? ‘‘పేదలు నివసించే ప్రాంతాన్నంతా’’ నగర సరిహద్దులకు దూరంగా తీసుకెళ్లాలనుకున్నాడు. ‘‘పునరావాస కాలనీల్లో’’ ఉపాధి పొందడం చాల కష్టమని రుజువైంది. అయినప్పటికీ పేద ప్రజలు దాన్ని ఇష్టపడతారనుకున్నాడు జగ్ మోహన్. పైగా వాళ్లకు ‘‘స్వచ్ఛమైన గాలి, వెలుతురు, స్వచ్ఛమైన నీరు, పచ్చదనం’’ లభిస్తుందని భావించాడు. ‘‘మన అవసరాలను, వనరులను సమతౌల్యం’’ చేయవచ్చని, ‘‘పట్టణ జీవనానికి, గ్రామీణ జీవనానికి స్వల్పమైన తేడా’’ మాత్రమే ఉంటుందని భావించాడు.
మురికి వాడల్లో నివసించే వారిదగ్గరకు ఆ బృందం ప్రతీకారంతో వెళ్లింది. వాళ్లలో ఎక్కువగా మైనారి మతానికి చెందిన వారు. యువనాయకుడు సంజయ్ గాంధీ మానస పుత్రికైన ఈ ప్రాజెక్టు కోసం బలప్రయోగం చేశారు. దీనికి ఇందిరాగాంధీ ఆశయాలతో పాటు అభ్యంతరాలూ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ రాజకీయ నాయకులు, వారి విధేయుల సహకారంతో ఆమె కుమారుడు తన సొంత ఎజెండాతో ముందకు పోయాడు. మురికి వాడల విధ్వంసానికి ఇందిరాగాంధీ కూడా ఆమోదం తెలిపింది.
‘‘సంజయ్ గాంధీ సరికొత్త కార్యక్రమం పూర్తి స్థాయిలో చేపట్టడానికి ఒక విధానంగా అసంఖ్యాకమైన ప్రభుత్వ విభాగాలను దింపారు. ప్రభుత్వ కర్తవ్యాలుగా ప్రజలపైకి వారిని దింపారు’’ అని రచయిత రాశారు.
ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాలపై విచారించడానికి జనతా ప్రభుత్వం షా కమిషన్ ను వేసింది. కమిషన్ ఎవరినైతే పిలిచిందో ;మినిష్టర్లు, పోలీసు అధికారులు, పౌర అధికారులు, ఇందిరాగాంధీ విధేయులు అంతా కమిషన్ ముందు సాక్ష్యం చెపుతూ అందరికీ వారు(ఇందిరా గాంధీ కార్యదర్శి ఆర్.కె.ధావన్ వంటి ముఖ్యులు) ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
హెచ్. ఆర్. గోఖలే, టీ.ఏ. పాయ్ వంటి పాత మంత్రులు తమని తాము తప్పించుకోవడానికి కొన్ని నిర్ణయాలను తాము వ్యతిరేకించామని, కానీ ఆమె అధికారిక పెత్తనం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఈ అకృత్యాలకు సంజయ్ గాంధీనే కారణమని చాలా మంది ఆరోపించారు.
షా కమిషన్ నివేదిక ఎక్కడికెళ్లిందో తెలియదు. ఏ ఒక్క ఆరోపణనూ నాటి జనతా ప్రభుత్వం రుజువు చేయలేకపోయింది. తనపై కక్షసాధింపులకు పాల్పడ్డారని ప్రజలనుంచి ఇందిరాగాంధీ సానుభూతి సంపాదించడమే కాదు, తనను వెంటాడారు, వేటాడారని చెప్పింది. జనతాపార్టీ నాయకులతో పాటు మొరార్జీ దేశాయ్ వంటి సోషలిస్టు నాయకులు సైతం ఆమె పై వ్యక్తగత కక్షలు పెంచుకున్నారు. జనతాపార్టీలో ఎవరికి వారు వ్యక్తి గతంగా ప్రధాని కావాలని ఉబలాటపడడం పట్ల జయప్రకాష్ నారాయణ్ కు బాధ కలిగించింది. ప్రభుత్వం ఆమెను ప్రాసిక్యూట్ చేయలేదు.
ఇందిరాగాంధీ 1980లో తిరిగి అధికారంలోకి వచ్చాక షా కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేసేసింది. ఆ నివేదిక గురించి ఇప్పుడెవరూ గుర్తుచేసుకోవడం లేదు.
ఎమర్జెన్సీ గురించి వివరంగా రాసేటప్పుడు నిజానికి అసలు ఏం జరిగిందనే తగిన ముఖ్యమైన ప్రశ్నలను వేశారు:
‘‘అంతా జరిగాక, పజ్జెనిమిది నెలల తరువాత ఎమర్జెన్సీని ఎత్తేశారు. ఈ పుస్తకంలోని మూడవ భాగం ఈ గందరగోళం గురించి చర్చిస్తుది. ఇందిరాగాంధీ 1977లో ఆకస్మికంగా ఎన్నికలను ఎందుకు ప్రకటించారు? ఈ విషయంలో ప్రతిపక్షాల పాత్ర ఏ మాత్రం లేదు. తొమ్మిదవ చాప్టర్ లో చూపించినట్టు, ఎమర్జెన్సీ అదుపునకు పత్రికారంగం, న్యాయవ్యవస్థ తగినంత సమతౌల్యత సాధించలేకపోయాయి. వాటి అసమ్మతిని ఇందిరా గాంధీ పరీక్షకులు, పరిరక్షకులు అడ్డుకున్నారు. పత్రికారంగానికున్న విస్తృతమైన అవకాశాలు చాలా దుర్భరమైపోయాయని ‘‘మిమ్మల్ని కేవలం ఒంగమంటే, నిదానంగా పాకడం మొదలు పెట్టారు.’’ అని అద్వానీ రాశారు. ప్రతిపక్షాలు ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేవు. సంగ్ పరివార్ సహా అంతా రుజువు చేయడంలో విఫలమై, ప్రతిఘటించడానికి, లొంగి పోవడానికి మధ్య ఊగిసలాడారు.’’
ఎమర్జెన్సీ ఎత్తివేతకు దారి తీసిన విషయాల గురించి జఫర్ లాట్, అనిల్ కొన్ని విషయాలు వివరించారు.
‘‘..ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ విదేశీ ఒత్తిడి పనిచేసింది. ఇందిరా గాంధీ వ్యక్తిగతంగా తన తప్పును గుర్తించి, ఎమర్జెన్సీ కార్యక్రమాన్ని అమలు చేయడంలో సంజయ్ గాంధీ అతిగా వ్యవహరించడంతో అది హింసాత్మకంగా తయారైందన్న విషయం గ్రహించారు. అన్నిటికంటే ముఖ్యమైంది ఎన్నికల్లో తనను ఎవరూ ఒడించలేరని మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం.’’
కానీ, ఇవ్వన్నీ ఆమె నిర్ణయాల్లో భాగమే. దాన్ని నిరోధించే అవకాశం ఉంది. తాను ప్రజాస్వామిక వాది, పైగా నెహ్రూ కుమార్తె అన్న స్పృహ కూడా ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే ఆమె తండ్రి ఏం చెప్పారు, ఆమెను ఏవి ఇబ్బంది పెట్టి ఉంటాయి-వాటిని అమలు చేయడంలో మొదట్లోనే ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. ప్రజల గొంతును వినాలన్న దానికి తాను దూరంగా వెళ్లిపోయినట్టు ఆమె భావించి ఉండవచ్చు. దేశ ప్రజాస్వామిక సంప్రదాయం, దృఢమైన రాజ్యాంగ విజయంగా ఆమె ఎన్నికల ఫలితాలను ఆమోదించి పదవి నుంచి దిగిపోయారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 154 స్థానాలు వచ్చాయి. వాటిలో ఎక్కువగా దక్షిణ భారత దేశంలో వచ్చినవే. జనతాపార్టీకి 295 స్థానాలు వచ్చాయి. మూడేళ్ల తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 353 స్థానాలు రాగా, జనతా పర్టీకి 31 స్థానాలు, జనతా పార్టీ (సెక్యులర్)కి 41 స్థానాలు వచ్చాయి.
జయప్రకాష్ నారాయణ్ గురించి ఏమిటి?
జయప్రకాష్ నారాయణ్ ధోరణి, ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయాలకు చాలా కాలం నుంచి దూరం అయ్యాక మళ్లీ రావడానికి ఏ రాజకీయ కారణాలు కదిలించాయి? రాజకీయాలకు దూరంగా ఉండడానికి విషయం ఏమీ లేదా? భారతీయ పద్ధతులనే పథకాల్లో, ఎన్నికల గోదాలోకి దిగకుండా, రాజకీయాలను కలుషితం చేయకుండా ఆ కోర్కె అనే ధర్మం కోసం పని చేయడమే. ఒక మనిషి తన వ్యక్తిగత ఆకాంక్షను వ్యక్తం చేయకుండా తిరస్కరించడాన్ని భారతీయులు ఆరాధిస్తారు. ఒక పార్టీలో చేరి ఎన్నికల్లో నిలబడడం కంటే రాజకీయాలు చాలా గొప్పవి. అవినీతికి వ్యతిరేకంగా గుజరాత్, బీహార్ లలో సాగిన నవనిర్మాణ్ ఉద్యమం రాజకీయాల కంటే గొప్పది. ఆ తరువాత దశలో అది అనివార్యంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చెప్పుకోదగిన విధంగా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సాగింది.
రచన: సిద్ధార్థ భాటియా
అనువాదం : రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.