
యూపీలోని బరేలీలో ముగ్గురు పోలీసులు ఒక ఏడాది నుంచి నకిలీ పోలీసు స్టేషన్‌ను నడుపుతున్నారు. తప్పుడు ఆరోపణలతో అమాయక ప్రజలపై కేసులు పెట్టి, వారిని విడుదల చేయడానికి డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో తప్పుడు ఆరోపణలతో ఒక రైతును అరెస్ట్ చేశారు. ఆ రైతు కుటుంబీకులు సీనియర్ అధికారికులకు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో అప్పుడు ఈ తతంగమంతా బయటపడింది. దీంతో ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ నగరంలో మగ్గురు పోలీసులు ఒక సంవత్సరం వరకు నకిలీ పోలీసు స్టేషన్‌ను నడిపారు. వాళ్లు అమాయక ప్రజలను తప్పుడు ఆరోపణలతో కేసులలో ఇరికించి అదుపులోకి తీసుకునేవారు. ఇంకా వారి వద్ద నుంచి విమోచన క్రయధనం డిమాండ్ చేసేవారు. ఈ క్రమంలో ఒక బాధితుడి కొడుకు సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వాళ్ల బాగోతం బయటపడింది.
అయితే, రైతు ఘటనలో పోలీసులు ముందు విమోచన క్రయధనం అడిగారు. ఆ తర్వాత మరోసారి డబ్బులను డిమాండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబానికి అనుమానం వచ్చింది.
నకిలీ పోలీసు స్టేషన్ ఎలా నడిచేది?
ద టెలీగ్రాఫ్ ప్రచురించిన కథనం ప్రకారం, పోలీసు నిందితులు కస్బా చౌకీలో మోహరించారు. ఈ నకిలీ పోలీసులు ఆ ప్రాంతంలోని ఒక రబ్బర్ ఫ్యాక్టరీ భాగాన్ని ఆక్రమించి, దానిని పోలీసు స్టేషన్లా మార్చారు. అంతేకాకుండా అందులోనే ఒక నకిలీ లాకప్‌ను కూడా తయారు చేశారు. వాళ్లు పూర్తి ఏడాది పాటు ఈ మోసపూరిత ఆటను ఆడుతూ వచ్చారు.
బహిర్గతం ఎలా అయ్యింది?
సబ్-ఇన్స్పెక్టర్ బలవీర్ సింగ్, కానిస్టేబుల్ హిమాంశు తోమర్, మోహిత్ కుమార్ అందరూ కలిసి భిటౌరా గ్రామానికి చెందిన ఒక రైతు ఇంటికి చేరుకున్నారు. డ్రగ్స్, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని దగ్గర పెట్టుకునే అసత్య ఆరోపణలను వాళ్లు రైతు కొడుకు మీద మోపారు.
తన పేరును గోప్యంగా ఉంచాలనే షరతు మీద బాధిత రైతు స్థానిక మీడియాకు జరిగిన విషయాన్ని తెలిపారు. ”వాళ్లు నా కొడుకు వద్ద ఒక చట్టవిరుద్ధ తుపాకీని పెట్టారు. ఆపై వీడియోను తీసి మమ్మల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మమ్మల్ని నకిలీ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి లాకప్‌లో వేశారు.” అయితే, పోలీసు స్టేషన్‌ను చూసిన తర్వాత అది నకిలీలా తమకు తోచలేదని కూడా ఆయన చెప్పారు.
దర్యాప్తు- చర్యలు..
నిందితులు పరారీలో ఉన్నట్టుగా బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య్ తెలిపారు.
”కస్బా పోలీసు స్టేషన్ ఇంచార్జ్ ఎవరినో అదుపులోకి తీసుకొని వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా మాకు సమాచారం అందింది. మేము వెంటనే దర్యాప్తు చేయించాము. దీంతో ఆ ఆరోపణ నిజమని తేలింది. దీని తర్వాత ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయబడింది.” అని అనురాగ్ చెప్పారు.
నిందితులైన ముగ్గురు పోలీసులు సస్పెండ్ చేయబడ్డారు. కిడ్నాప్, చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, బెదిరింపు, దోపిడి, దాడి చేయడం ఇంకా నేరపూరిత ఉద్దేశ్యంతో చొరబాటులాంటి అనేక తీవ్రమైన ఆరోపణలు వాళ్లపై నమోదుచేయబడ్డాయి.
ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన..
”సబ్ ఇన్స్పెక్టర్ బలబీర్ సింగ్ హీరోయిన్ను అక్రమరవాణా చేస్తున్నాడని కొన్ని నెలల క్రితం ఉత్తరాఖండ్ పోలీసు యూపీ పోలీసుకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తిని ఉత్తరాఖండ్ పోలీసులు కారుతో పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ అతను తప్పించుకున్నాడు” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
”ఆ సమయంలో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ జరగలేదు.” అని ఆయన చెప్పుకొచ్చారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.