
వొవెల్ హౌస్లో జరిగిన వాడివేడి మాటల యుద్ధం తర్వాత ట్రంప్ మరింత దూకుడు పెంచి సుంకాల సమరానికి తెరతీసాడు. ఏప్రిల్ 2 నుండి అమలువుతుందని అమెరికా ప్రకటన. తాజాగా ప్రపంచదేశాలు గట్టిగా ప్రతిఘటించడంతో సుంకాల సమరం రగులుతూనే ఉంది. చైనా అమెరికాకు గట్టిగా బదులిస్తూ చైనా ఎట్లాంటి యుద్ధానికైనా సై అంటూ మాటల యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకుపోయింది. చైనా మాటల్లో అనేక అర్థాలు ఏకకాలంలో ధ్వనించాయి. అది వాణిజ్య యుద్ధం కావచ్చు, సుంకాల యుద్ధమే కావచ్చు, ఇంకా నిజమైన యుద్ధమే కావచ్చు. దీనికి తగ్గేదేలే అన్న చైనా పలుకులతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఏ విధంగా మలుపులు తీసుకుంటుందన్నడే ఇప్పుడు ఆసక్తికరం!
ట్రంప్ టారిఫ్ కు బయపడేది లేదని మెక్సికో, కెనడా, చైనా ఇట్లా అనేక దేశాలు స్వరం కలుపుతున్నాయి.
ట్రంప్ సుంకాల పెంపు సమర్థిస్తూ…
సింథటిక్ డ్రగ్ వెల్లువలా వచ్చిపడుతున్నాయని వాటికి కళ్లెం వేయాలంటే సుంకాల పెంపుదల అనివార్యమని, తిరుబాటు స్వరాలు ప్రతిఘటనా సుంకాలు కెనడా 25% సుంకాలను మోపుతామని 30 బిలియన్ డాలర్ల అమెరికన్ ఉత్పత్తులపై తక్షణం నుంకాల విధింపు ఉంటుందని, 120 బిలియన్ డాలర్ల అమెరికన్ ఉత్పత్తులపై రానున్న 21 రోజుల్లో సుంకాల విధింపు ఉంటుందని కెనడా ప్రకటించింది.
ట్రంప్ చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను 10% నుండి 20% వరకు పెంచడంతో చైనా కూడా దానికి తగ్గట్టుగా మోత మోగించింది.
సుంకాల ప్రభావం ప్రధానంగా ఆహార ఉత్పత్తులు ఎలక్ట్రానిక్స్, ఆటబొమ్మలు, కార్లు, కార్ల విడిభాగాలు అనేక విడి భాగాలపై ప్రభావం పడుతుంది.
ఇండియా 100% సుంకాలను ఆటోమొబైల్ దిగుమతులపై విధిస్తున్నట్టు ప్రకటించింది.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ అమెరికా నుంఠాల స్పందనకు వెంటనే తిరిగి ప్రకటించాడు.ట్రంప్ వివిధ దేశాల నుండి అమెరికా దిగుమతి చేసుకుంటున్న సరుకుల పై చైనా నుండి దిగుమతులపై 20% (10% నుండి 20% దాకా), కెనడా నుండి గుమతి చేసుకుంటున్న వస్తువులపై 25% వరకు మెక్సికో నుండి దుగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించాడు.
చైనా 10% లేక 16% వరకు అనేక రకాల దిగుమతి సరుకులపై సుంకాలను విధిస్తామని చెప్పింది. అట్లాగే కెనడా 30 బిలియన్ డాలర్లు, అమెరికా నుండి కెనడా దిగుమతి చేసుకునే సరుకులపై సుంకాలను విధిస్తామని, అధనంగా 125 బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులపై మార్చి 25లోగా విధిస్తామని బదులిచ్చింది.
కెనడా, మెక్సికో, చైనా అమెరికన్ ప్రధానంగా నూనెలు, ఎలక్ట్రానిక్స్, కార్లు, ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఆ వస్తువులు అమెరికన్ వినియోగదారులకు ప్రియంగా మారతాయి. అంటే వాటి ధరలు పెరుతాయన్న మాట, అట్లాగే అమెరికా చైనాకు ఎగుమతిచేసే వ్యవసాయ ఉత్పత్తులపై చైనా దిగుమతి సుంకాలను విధించటం వల్ల వాటి ధరలు పెరుగుతాయి. సుంకాల మోతతో వాహన, సాంకేతిక పరిశ్రమల సప్లై చైన్ అనేక విధాల సమస్యల్లోకి నెట్టివేయబడుతుంది.
చైనా అమెరికా నుండి దిగుమతి చేసుకొనే ఆహార ఉత్పత్తులు కాటన్ మొ॥ వాటిపై దిగుమతి సుంకాలను పెంచుతుంది, 15% సుంకాలను కోడిమాంసం, గోధుమ, కాటన్ దిగుమతులపై విధిస్తామని చెప్పింది. ఇంకా 10% సుంకాలను ఇతర ఉత్పత్తులు జొన్న, సోయాబీన్స్, వందిమాంసం, గొడ్డు మాంసం, రొయ్యలు, పళ్ళు, పాల ఉత్పత్తులు, మొ॥ వాటిపై సుంకాలుంటాయని మార్చి 10 నుండి నుంకాలను విధిస్తామని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.
సుంకాలే కాకుండా 25% అమెరికా కంపెనీలపై ఎగుమతి ఆంక్షలను, పెట్టుబడులను నియంత్రిస్తామని. చెప్పింది. మెక్సికో కూడా చైనా బాటలో నడిచి సుంకాలను పెంచుతామని ప్రకటించింది.
కెనడా, చైనా, మెక్సికో దేశాల నుండి వచ్చే దిగుమతులపై ట్రంప్ టారీఫ్లను 25% విధిస్తూ ఇది మార్చి 4 నుండి అమలు చేస్తామని ప్రకటించాడు. ఇతర సుంకాలను ఏప్రిల్ 2 నుండి అమలులోకి వస్తాయని ప్రకటించడంతో ఒక్కసారి ప్రపంచదేశాలన్ని ఆలోచనలో పడి అవి కూడా ప్రతిఘటనా సుంకాల విధింపుదిశగా దృష్టి సారించాయి. ఏళ్ళుగా వ్యాపార అసమతౌల్యం ఉందని దాన్ని సరిచేయాలని అమెరికాను. అన్నిదేశాలు వాడుకున్నాయని ట్రంప్ ఉద్ఘాటన!
యూరోపియన్ యూనియన్ చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాలు అమెరికా ఎగుమతులపై సుంకాలను మోపాయని ఇది ఆసమంజనం ఇండియా 100% సుంకాలను విధించిదని కనుక మేము దాన్ని సుంకాలతో సరిచేస్తామని ట్రంప్, మెక్సికో అధ్యక్షుడు షీన్బామ్ అమెరికా సుంకాల పెంపు నిర్ణయం మెక్సికో, అమెరికా, కెనడా ఒప్పందానికి తూట్లు పొడిచే విధంగా ఉందని, ఇది ఒప్పంద ఉల్లంఘనే అవుతుందని చెప్పడం గమనార్హం!.
ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య వ్యాపారాలు జరగాలని ప్రపంచీకరణలో అన్ని దేశాల భాగస్వామ్యం ఉందాలని చెప్పిన అమెరికానే ఇప్పుడు సుంకాల పేరుతో కొత్త యుద్ధానికి తెరతీసింది. అనేక దేశాలలో ఆ ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటే విధంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహరం చేసేటట్లు సుంకాల విధింపు నిర్ణయం పట్ల ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-డా. సుంకర రమేశ్
ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు
సెల్: 94921 80764
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.