
కేంద్రీకృత సౌర విద్యుత్తు ఉత్పత్తికి కేంద్రాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనివ్వటం, బొగ్గు సరఫరా మార్కెట్ ను వివిధ రకాల కుతంత్రాలతో అనుకూలంగా మార్చుకోవడం, రాష్ట్ర ప్రభుత్వాల పైన వత్తిడి తెచ్చి అయిష్టంగా నైనా సరే రాష్ట్రాల మీద (వినియోగదారుల మీద) భారాలు మోపే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మీద సంతకాలు పెట్టించడం వంటి చర్యల ద్వారా కార్పొరేటు సంస్థలు చేసిన పైరవీలు వినియోగదారుల ప్రయోజనాలను కాలరాశాయి.
న్యూఢిల్లీ : 2030 నాటికి 450 గిగావాట్ స్థాపిత సామర్థ్యాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునరుత్పాదక ఇంధనం విధానం, దాని అమలు కోసం దూకుడుగా వేస్తున్న అడుగులు ప్రభుత్వ విధానాలు వినియోగదారుల కంటే అదానీ గ్రూప్ వంటి పెద్ద సంస్థలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మరియు భారత సౌరశక్తి కార్పొరేషన్ (సెకి) నుండి గణనీయమైన సబ్సిడీల మద్దతుతో ప్రభుత్వం పెద్ద, కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్లపై నిర్మాణంపై దృష్టి పెట్టడం వల్ల వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ప్రయోజనాలు నామమాత్రమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
మొదటది: సౌర విద్యుత్ ఉత్పత్తిలో వికేంద్రీకృత వ్యవస్థలు వినియోగదారులకు ఉత్పత్తిపై నియంత్రణను ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం చేసి, విద్యుత్ రంగంలో విధానాలను ప్రభావితం చేయగల కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యానికి అడ్డుగోడగా నిలుస్తాయి.
రెండవది: వినియోగదారులు మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, దానిని తిరిగి గ్రిడ్‌కు అమ్మవచ్చు. తద్వారా అదపు ఆదాయ వనరును సృష్టించవచ్చు.
మూడవది: ఎవరికి వారు గృహావసరాలకు తీర్చుకోవడానికి స్వంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా వినియోగదారులు గ్రిడ్‌పై భారం తగ్గుతుంది. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం కూడా తగ్గుతుంది.
కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్లపై ప్రభుత్వం మొగ్గు చూపటాన్ని జాతీయ ప్రణాళికా సంఘంలో ఇంధన రంగ మాజీ ప్రధాన సలహాదారు ఈ ఎ ఎస్ శర్మ విమర్శించారు. ది వైర్‌తో మాట్లాడుతూ ఈ విధానం ‘‘తప్పుదారి పట్టించేది, చివరికి వినియోగదారులకు హానికరం’’ అని ఆయన అన్నారు.
‘‘కేంద్రీకృత ప్రాజెక్టులు బహుముఖ వైఫల్యాలు, అసమర్థతలతో సతమతమౌతూ ఉంటాయి. అవి పూర్తి సామర్ధ్యంతో పని చేయలేవు. అంటే గంటకు వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్ పెట్టినప్పటికీ ఆచరణలో ఆ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగదు. భారీ ప్లాంట్లు దేశంలో పరిమిత ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే సదరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి దేశవ్యాప్తంగా సరఫరా చేయటానికి కావల్సిన సదుపాయాలు కల్పించటం భారీ ఖర్చుతో కూడుకున్న పనవుతుంది. అంతస్థాయిలో దూరాబారాలకు విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్సిమిషన్ నష్టాలు ఎక్కువగా ఉంటాయి’’ అని శర్మ అన్నారు. ‘‘ఈ సమస్యల కారణంగా వినియోగదారులకు అందే విద్యుత్తు ఖరీదు పెరుగుతుంది. రాజకీయ అవకతవకలకు గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. అంతిమంగా ఈ అసమర్థతలన్నింటివల్ల పెరిగే వినియోగదారులు ఆర్థిక భారాన్ని భరిస్తారు’’.
ఈ కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్లను నడపగలిగేలా, లాభదాయకంగా మార్చడానికి, ప్రభుత్వం కార్పొరేషన్లకు గణనీయమైన సబ్సిడీలను అందించింది.
‘‘నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, సెకీలు సంయుక్తంగా ఈ సబ్సిడీలను ప్రారంభించాయి, ఇవి పన్ను చెల్లింపుదారుల డబ్బే. అంటే పౌరులు స్వయంగా ఈ కార్పొరేట్ నేతృత్వంలోని ప్రాజెక్టుల లాభదాయకతకు నిధులు సమకూరుస్తున్నారు’’ అని శర్మ విశ్లేషించారు.
2022`23కు గాను విద్యుత్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ప్రకారం గ్రిడ్‌తో సంబంధం లేకుండా దూర ప్రాంతాలకు (గ్రిడ్ నెట్వర్క్ అందుబాటులో లేని) ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయటంలో సౌరశక్తి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పథకం కీలకపాత్ర పోషిస్తుంది. అంతగా లాభసాటి కాని ప్రాంతాల్లో అమలుకు ఉద్దేశించిన రెండు పథకాలు ` వికేంద్రీకృత సౌర విద్యుత్పత్తి పథకం, వీధి లైట్ల విద్యుదీకరణ కోసం ఉద్దేశించిన అటల్ జ్యోతి యోజనలను ఉపసంహరించుకోడం వలన నష్టం జరిగింది. ఈ పథకానలు పునరుద్ధరించి వాటిని గ్రిడ్‌తో అనుసంధానించేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. అదనంగా రైతులు కూడా అదనపు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకానికి కావల్సిన నిధులు నియోజకవర్గ అభివ్దృద్ధి కోసం పార్లమెంటరీ సభ్యులకు కేటాయించే నిధుల (ఎంపీ లాడ్స్) నుండి కూడా సమకూర్చుకునే విధంగా సవరించాలని సిఫార్సు చేసింది.
పునరుత్పాదక ఇంధన శాఖ, పర్యావరణ, జల, ఇంధన మండలి (క్యూ)ల సంయుక్త నివేదిక కూడా సార్వత్రిక విద్యుదీకరణ పథకానికి సౌరశక్తి ఆధారిత వికేంద్రీకృత విద్యుత్ ఉత్పత్తి విధానమే ముఖ్యమని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు సమర్ధనగా అర్జెంటీనా, బొలీవియా, బంగ్లాదేశ్, కెన్యా దేశాల సార్వత్రిక విద్యుదీకరణ విధానాలను కూడా ప్రస్తావించింది.
ఈ ప్రతిపాదనలను పేరుగాంచిన పరిశోధనా సంస్థలు కూడా సమర్థిస్తున్నాయి. డౌన్ టు ఎర్త్ ఇండియా సంస్థ ఈశాన్య భారత రాష్ట్రాలోల స్వఛ్చ ఇంధనం సరఫరా అంశంపై నిర్వహించిన జాతీయ సెమినా కూడా ఈ రాష్ట్రాల్లో వికేంద్రీకృత విద్యుత్ సరఫరా పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంధన సమృద్ధితో పాటు స్వయం ఉపాధికి కూడా కీలకమైన సాధనంగా ఉంటుందని నిర్ధారించింది. ఆయా కుటుంబాలకు విద్యుత్ కొరత తీర్చే క్రమంలో సరసమైన ధరలకు విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమం చేస్తుందని కూడా అభిప్రాయపడింది. ఇటువంటి పథకాలు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ కొరతను నివారించటంలో ముఖ్యమైన పాత్ర పోషించటంతో పాటు విద్యుత్ కొతర ఎదుర్కొనే ప్రాంతాల్లో విద్యుత్ నిల్వలకు కావల్సిన వనరులు సిద్ధం చేస్తాయని కూడా ఆయా దేశాల అనుభవాలనుండి నిర్ధారించింది. భారతదేశంలో వాయుకాలుష్యానికీ, జల కాలుష్యానికీ కారణమవుతున్న డీజిల్ ఆధారిత పంప్ సెట్ల స్థానంలో సౌరవిద్యుత్ ఆధారిత పంపుసెట్లతో వ్యవసాయం చేయటం కాలుష్య నియంత్రణకు సాధనంగా ఉకరిస్తుందని కూడా అభిప్రాయపడింది. వికేంద్రీకృత సౌర విద్యుత్ పథకం చౌకైన విద్యుత్ సరఫరాతో పాటు కాలుష్యానికి తావులేని విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం చేస్తుందని స్పష్టం చేసింది. ఇటువంటి విద్యుత్ సరఫరా అణగారిన కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని అందించటానికి ఉపకరిస్తుందని కూడా నివేదిక అభిప్రాయపడింది.
సౌర విద్యుత్ ఆధారి భారీ ప్రాజెక్టులు ఆర్థికంగా మన్నికైనవిగా మార్చటానికి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు ఇస్తోంది.
ఉదాహరణకు, సెకి ప్రారంభించిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అజూర్ పవర్ ఇండియా వరుసగా రూ. 663 కోట్లు మరియు రూ. 186.4 కోట్ల సబ్సిడీలను పొందాయి. ముఖ్యంగా, అజూర్ పవర్ ఇండియా తో చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం తరువాత అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్‌కు బదిలీ చేయబడింది.
అయితే తెలుగుదేశం, భారత కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు వేయటం వలన ఈ బదిలీ చాలా ఆలస్యమైంది. సెకి ఈ కేసులను వ్యతిరేకించింది. అజ్యూర్ పవర్ రంగం నుండి నిష్క్రమించటం విశాల జనహితానికి విరుద్ధమని వాదించింది. అంతేకాదు. అజ్యూర్ కంపెనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ నిర్ధారించుకున్న పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యాన్ని చేరుకోవడాన్ని అడ్డుకుంటుందని వాదించింది.
2333 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నుండి అజ్యూర్ పవర్ నిష్క్రమించినప్పటికీ విద్యుత్ సరఫరా ప్రణాళికకు కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లటానికే సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ న్యాయ ప్రతినిధి సోలిసిటర్ జనరల్ నుండి న్యాయపరమైన సలహా పొందిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణను కేంద్ర సౌర ఇంధన కంపెనీ అదానీ కంపెనీకి బదలాయించింది. విచిత్రం ఏమిటంటే ఈ ప్రాజెక్టు సాధించటానికి అదానీ పవర్ కంపెనీ కూడా టెండర్ వేసింది. కానీ టెండర్ గెలిచిన కంపెనీ ప్రాజెక్టు నుండి వైదొలగిన వెంటనే కొత్తగా టెండర్ పిలవడానికి బదులు అదే షరతులు, నియమ నిబంధనలతో అదే ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రేట్లు యథాతథంగా అదానీ కంపెనీకి దక్కాయి.
‘‘ఇటువంటి గణనీయమైన సబ్సిడీల అవసరం ఈ కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్ల అంతర్గత అసమర్థ ఆర్థిక స్వభావాన్ని సూచిస్తుంది’’ అని శర్మ వాదించారు. ‘‘ఈ ప్రాజెక్టులు ప్రాథమికంగా అసమర్థమైనవి మరియు పన్ను చెల్లింపుదారుల నిధుల మద్దతు లేకుండా తమను తాము నిలబెట్టుకోలేవు. ప్రభుత్వం తన పౌరుల సంక్షేమం కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ.’’
మద్దతు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులు ఆర్థికంగా నిలకడగా లేవు. ఇంధన యూనిట్ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకపు ధరలు అధికం అవుతాయి. దీని ఫలితంగా మార్కెట్ డిమాండ్ తక్కువ అవుతుంది.
తొలుత కేంద్ర సౌర విద్యుత్ కంపెనీ యూనిట్ విద్యుత్ సరఫరాకు ఓ ధర నిర్ణయించటం, ఆ ధరకు కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ సరఫరా కంపెనీలు ముందుకు రాకపోవడంతో సదరు ధరను తగ్గించటం కేంద్ర ప్రభుత్వ విధానంగా మారింద.ఇ ఫలితంగా బయటికి ఈ కంపెనీలు స్వఛ్చదంగానే ధరలు తగ్గించినట్లు కనిపిస్తుంది కానీ నిజానికి ఇదంతా ఓ జిమ్మిక్కు.. ఏతావాతా గత రెండేళ్లలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (%ణIూజూవీ%లు) శక్తిని కొనుగోలు చేస్తాయని ఆశించి కొనుగోలుదారులు లేనప్పుడు కంపెనీలు స్వచ్ఛందంగా ధరలను తగ్గించడానికి అనుమతించడం ద్వారా %ూజుజI% దీనిని పరిష్కరించడానికి ప్రయత్నించింది. గత రెండు సంవత్సరాలలో, 9,046 మెగావాట్ సామర్థ్యం కలిగిన 19 లేదా 20 ప్రాజెక్టులు ప్రతిపాదించిన ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విఫలమఅవి కోట్ చేసిన బిడ్ సుంకాల వద్ద వినియోగదారులను పొందడంలో విఫలమయ్యాయి.
‘‘ఇక్కడే విద్యుత్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని కార్పొరేట్ అవకతవకలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది’’ అని శర్మ అన్నారు.
‘‘2003 విద్యుత్ చట్టంలోని సెక్షన్ 11 కింద ఆదేశాలు జారీ చేయడం ద్వారా మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగా సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరాల్లో అవినీతికి అవకాశం కల్పించింది. ఈ ఆదేశాలు విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ విద్యుత్ అవసరాలలో కనీసం 10% అదానీ గ్రూప్ మరియు విదేశీ ఆధారిత అజూర్ వంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్ల నుండి కొనుగోలు చేయాలన్న షరతును విధిస్తున్నాయి’’
ఈ ఆదేశాలు ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా, రూఫ్‌టాప్ ప్యానెల్ల వంటి వికేంద్రీకృత సౌర విద్యుత్ ఉత్పత్తి కి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను విస్మరించి, సౌర విద్యుత్ ఉత్పత్తిని సమూలంగా కార్పొరేషన్లకు అప్పగించాయి. ఇది అధిక విద్యుత్తు ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపుతూ కార్పొరేట్లు లాభదాయకమైన కాంట్రాక్టులను పొందేందుకు వీలు కల్పించిందని ఆయన అన్నారు.
శర్మ తన విమర్శలను సౌర విద్యుత్ రంగానికే పరిమితం కాలేదు. బొగ్గు మరియు రైల్వే మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేస్తున్న విద్యుత్ మంత్రిత్వ శాఖ, విదేశాలలో బొగ్గు గనులను కలిగి ఉన్న కార్పొరేషన్లకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశపూర్వకంగా కృత్రిమ బొగ్గు సంక్షోభాన్ని సృష్టించిందని ఆయన ఆరోపించారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సరఫరా అడ్డంకులు మరియు రవాణా పరిమితులను సృష్టించారని, ఖరీదైన దిగుమతి చేసుకున్న బొగ్గును – ప్రధానంగా అదానీ వంటి కంపెనీల నుండి – కొనుగోలు చేయమని రాష్ట్రాలను బలవంతం చేశారని అన్నారు.
బొగ్గు మార్కెట్‌ను ఈ విధంగా తారుమారు చేయడం వల్ల వినియోగదారులకు ఇంధన ధరలు, కార్పొరేట్ లాభాలు గణనీయంగా పెరిగాయి.
పునరుత్పాదక ఇంధన విషయాలతో పాటు ఈ కృత్రిమ బొగ్గు సంక్షోభం ఖరీదైన సౌరశక్తికి మార్కెట్‌ను ఖాయం చేసింది. ఖర్చు ప్రభావంతో సంబంధం లేకుండా లాభదాయకతను నిర్ధారిస్తుందని శర్మ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకి అదానీ వంటి పెద్ద కార్పొరేషన్లు, రాష్ట్ర విద్యుత్ సరఫరా కంపెనీల మధ్య బ్రోకర్‌గా వ్యవహరించడం ద్వారా కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యవర్తిత్వం ఖరీదైన సౌర విద్యుత్తు అమ్మకాలను సులభతరం చేసింది. అదే సమయంలో అధిక ధరలను ప్రత్యక్ష వినియోగదారులు ప్రతిఘటించకుండా కంపెనీలను సెకీ కాపాడింది.
‘‘ప్రభుత్వం ఒత్తిడితో రాష్ట్రాలు 25 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేయవలసి వచ్చింది’’ అని శర్మ అన్నారు. ‘‘భవిష్యత్తులో సాంకేతిక పురోగతి ఇతర ఇంధన వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం, ఖర్చు తగ్గే వీలు ఉన్నప్పటికీ, ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు రాష్ట్రాలకు మరియు వినియోగదారులకు స్థిర ధరలలో సౌర విద్యుత్తును కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.’’
సెకి నిర్ణయాత్మక ప్రక్రియను ప్రభావితం చేయడానికి మరియు అనుకూలమైన ఒప్పంద నిబంధనలను పొందేందుకు అదానీ గ్రూప్ లంచాలను ఉపయోగించిందని ఇటీవల అమెరికాలో అభియోగం మోపబడిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ నిష్క్రియాత్మకత గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని తిరస్కరిస్తున్నామని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ కాకుండా ఇతర కంపెనీలు ఇలాంటి ఉల్లంఘనలకు పరిణామాలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.
ఉదాహరణకు, నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించినందుకు ఆర్ పవర్ అనే కంపెనీపై చర్య తీసుకుంది. దీని ఫలితంగా భవిష్యత్ కాంట్రాక్టులపై బిడ్డింగ్ చేయకుండా ఐదు సంవత్సరాల నిషేధం విధించబడింది.
అయితే, ఢల్లీి హైకోర్టు ఈ ఉత్తర్వును నిలిపివేసింది ఎందుకంటే సెకి ఫిర్యాదులు మాతృ సంస్థపై కాకుండా అనుబంధ సంస్థపై ఉన్నాయి. అనుబంధ సంస్థ ఆర్ పవర్ ఐడిబిఐ బ్యాంక్ నుండి నిజమైన బ్యాంక్ గ్యారెంటీని అందించినప్పటికీ, సెకి ఎటువంటి కారణం లేకుండానే తిరస్కరించింది. ఈ పరిస్థితి సెకి పక్షపాతంతో వ్యవహరిస్తుందనీ, విధి విధానాలను విచక్షణా రహితంగా అమలు చేస్తోందన్న విమర్శలకు తావిచ్చింది.
ఇతర సందర్భాల్లో, విదేశీ నియంత్రణ సంస్థల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా భారత అధికారులు కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. విదేశీ అవినీతి పద్ధతుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెరికా న్యాయ శాఖ అభియోగం మోపిన తరువాత, భారత రైల్వే బోర్డు 2008లో భవిష్యత్ టెండర్లలో పాల్గొనకుండా వాబ్టెక్ను నిషేధించింది.
అదేవిధంగా, మెక్సికోలో వాల్‌మార్ట్ కార్యకలాపాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై న్యాయ శాఖ దర్యాప్తును వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలుగులోకి తెచ్చింది. ఈ కథనం ప్రకారం వాల్‌స్ట్రీట్ భారతదేశంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాలను వెలికితీసింది. ఈ నివేదిక ఆధారంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించింది. అయితే తరువాత ఢల్లీి హైకోర్టు నిర్దిష్ట ఆధారాలు లేకపోవడంతో విచారణను పక్కన పెట్టింది.
అంతేకాకుండా, సిడిఎం స్మిత్ ఉద్యోగులు 2011 ` 2015 మధ్య భారతదేశంలోని అధికారులకు లంచాలు చెల్లించారని న్యాయ శాఖ కనుగొంది. ఈ నిర్ధారణలు ఫలితాల ఆధారంగా, నేషనల్ హైవేస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సిడిఎం స్మిత్‌ను భవిష్యత్ ప్రాజెక్టుల నుండి నిషేధించింది.
అయితే, కంపెనీకి షో-కాజ్ నోటీసు జారీ చేయనందున ఢల్లీి హైకోర్టు డిబార్మెంట్ను పక్కన పెట్టింది. అంతేకాకుండా, సెకి కాంట్రాక్టులు జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017లోని రూల్ 175(1)లో పేర్కొన్న సమగ్రతా నియమావళికి లోబడి ఉండాలి. ఇది ప్రభుత్వ సేకరణలో లంచం మరియు అవినీతి పద్ధతులను నిషేధిస్తుంది. ఇంధన కాంట్రాక్టులను పొందుపరచడానికి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ అదానీపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగపత్రం ఈ నియమావళిని ఉల్లంఘించడాన్ని సూచిస్తుంది.
1988 నాటి అవినీతి నిరోధక చట్టం కింద నేరాలకు పాల్పడినట్లయితే లేదా కొనుగోలు సంస్థ సమగ్రత నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారించినట్లయితే, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనకుండా కంపెనీలు జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ లోని 151వ నియమం నిషేధించవచ్చు. అదానీపై మోపిన అభియోగంపైన సెకి డిబార్మెంట్ చర్యలను ప్రారంభించడానికి వీటిని తగిన కారణాలు పరిగణించవచ్చు.
విదేశీ నియంత్రణ సంస్థల నుండి వచ్చిన ఫలితాల ఆధారంగా, ముఖ్యంగా ఆ ఫలితాలు అవినీతి మరియు లంచానికి సంబంధించినవిగా ఉన్నప్పుడు, భారత అధికారులు గతంలో కంపెనీలపై చర్యలు తీసుకున్నారని ఈ కేసులు తెలియచేస్తున్నాయి. భవిష్యత్ కాంట్రాక్టుల నుండి డిబార్ చేయడం నుండి క్రిమినల్ ప్రాసిక్యూషన్ వరకు పరిణామాల తీవ్రత మారుతూ ఉంటుంది.
ఇంకా, టెండర్ ప్రక్రియలో సెకి నిబంధనలకు పదేపదే సవరణలు చేసింది. టెండర్ ప్రక్రియలో గడువులను పొడిగించింది. ఇవన్నీ అదానీకి ప్రయోజనం చేకూర్చటానికే అన్న సందేహాలున్నాయి. ఉదాహరణకు, తయారీ-సంబంధిత భాగం కోసం గడువును 48 నుండి 60 నెలల వరకు పొడిగించటంతో పాటు తయారైన విద్యుత్ ఉత్పత్తి సాధనాలను పనిలోకి తీసుకురావడానికి కూడా గడువులు మార్చుకుంటూ వచ్చింది ‘‘దేశీయ తయారీ’’ పై తేలికపాటి నిర్వచనాలను ప్రవేశపెట్టింది. దాంతో కంపెనీలు సెమీ-ప్రాసెస్డ్ భాగాలను దిగుమతి చేసుకుని, వాటన్నింటినీ అసెంబిల్ చేసి దానికి మేడ్ ఇన్ ఇండియా అని ముద్ర వేసి ప్రభుత్వం వద్ద రాయితీలు, సబ్సిడీలు కొట్టేయటానికి సెకి నిర్ణయాలు బాగా తోడ్పాటునందించాయి.
ఇది అదానీ గ్రూప్‌కు అనుకూలంగా ఉండే ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తుంది.
కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్లకు ఇచ్చిన ప్రాధాన్యత, బొగ్గు మార్కెట్‌ను తారుమారు చేశారనే ఆరోపణలు, ప్రతికూల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేయమని రాష్ట్రాలను ఒత్తిడి చేయటం – ఇవన్నీ కార్పొరేట్ లాబీయింగ్, పలుకుబడితో వినియోగదారుల ప్రయోజనాలను, న్యాయమైన మార్కెట్ పద్ధతులకు చెందిన సూత్రాలను అధిగమించే ఒక వ్యవస్థాగత సమస్యను సూచిస్తున్నాయి.
సెకి ఇతర కేసులలో చూపిన ఉత్సాహం అదానీపై చర్య తీసుకోవటంలో చూపకూడదా? లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సెకి అధికారులు ఇప్పుడు దర్యాప్తునెదుర్కుంటున్నారు. వీటన్నింటి కారణంగా సెకి సంస్థ కొన్ని కంపెనీల పట్ల పక్షపాతంతోనూ, స్వార్థప్రయోజనాలతోనూ వ్యవహరించిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.
అనువాదం : నెల్లూరు నరసింహారావు
(భారత సౌర ఇంధన సంస్థ అనుసరించిన విధి విధానాలు సౌర విద్యుత్ ఉత్పత్తి లో అదానీ కంపెనీ గుత్తాధిపత్యాన్ని ఎలా పునాదులు వేసిందో హిండెన్‌బర్గ్ తన పరిశోధనలో వెల్లడించింది. తాజాగా మార్కెట్ మోసాల పై, అవినీతి పై తాము ఇక మీద పరిశోధనలు చేయబోవడం లేదు అని హిండెన్‌బర్గ్ సంస్థ అధినేత ఆండర్సన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కథనాన్ని తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాము : ది వైర్ తెలుగు సంపాదకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.