
మేడమ్ ..నా పెళ్లై సంవత్సరం అవుతున్నది నాకు 23 ఏళ్ళు. నా భర్తతో సెక్స్ జీవితం అంటేనే భయం గా ఉంటుంది.ఆయన ముట్టుకుంటేనే చమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది.నా భర్త నన్ను ముట్టుకోవడానికి కూడా భయ పడుతున్నాడు.అదే సమయంలో అసంతృప్తితో , చిరాకు కోపం ప్రదర్శిస్తున్నా డు. ఇద్దరి ఇళ్లల్లో ఎవరికీ తెలియదు.మా సమస్యకు పరిష్కారం తెలపండి.–లావణ్య కరీంనగర్
జవాబు: అమ్మా.., నీ సమస్యను ‘సెక్స్ ఫోబియా ‘ అంటారు.అనేక కారణాల వలన ఈ రకమైన భయం ఏర్పడుతుంది.దీనికి నువ్వు నీ వ్యక్తిత్వ వికాస సమయంలో, బాల్య,కౌమార,యవ్వన దశల్లో ఎలాంటి అనుభవాల మధ్య గడిపావు లేదా నీకు ఈ రకంగా సెక్స్ పట్ల భయం,విముఖత ఏర్పడ్డానికి ఎలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ నీకు దొరికింది అనేది ఆలోచించాలి.ఆశాస్త్రీయమైన,అపోహలతో కూడిన ,భయం,అసహ్యం కలిగించే సెక్స్ ఎడ్యుకేషన్ వివిధ మాధ్యమాల ద్వారా ఉదా: స్నేహితురాళ్లు, సినిమాల్లో రేప్&ప్రసవం దృశ్యాలు, హింసాత్మక పోర్న్ సైట్స్, తల్లిదండ్రుల భయాలు ఇవన్నీ అమ్మాయిల్లో పెళ్ళిఅన్నా సెక్స్ అన్నా భయాన్ని కలిగిస్తాయి.
బాల్యంలో తల్లిదండ్రులు లైంగిక అవయవాలు విధుల పట్ల అంటే,నెలసరి,టీనేజ్ లో సెక్స్ హార్మోన్స్ వల్ల మోదలయ్యే సహజమైన శారీరిక మార్పులు మోదలైన వాటి పట్ల నెగటివ్ ఆలోచనలను పిల్లల ముందు వ్యక్తం చేయడం,సెక్స్ అంటే పాపం గా,నీచంగా భావించడం ఇవన్నీ ఎదుగుతున్న పిల్లల సబ్ కాన్సియస్ మైండ్ మీద బలమైన ప్రభావాన్ని చూపించి సెక్స్ పట్ల ప్రతికూల ఆలోచనలు,భయలని,అసహ్యాన్ని కలగ చేస్తాయి.
అలాగే తాము అందంగా లేము,భర్తను ఆకర్షించలేము అనే నూన్యతా భావన కూడా దీనికి కొది కారణం.బాల్యంలో లైంగిక అత్యాచారాలకు లోనవడం, గర్భం వస్తుందేమో… చదువు కెరీర్ పాడవుతాయేమో…లేదా సెక్స్ లో విపరీతమైన నొప్పి ,రక్తస్రావం అవుతుందేమో అనే భయం వల్ల కూడా సెక్స్ ఫోబియాకు లోనవుతారు. నొప్పి తో కూడిన తమ తొలిరాత్రి అనుభవాలను స్నేహితురాళ్లతో పంచుకోవడం కూడా పెళ్లి తర్వాత సెక్స్ పట్ల భయాన్ని కలిగిస్తుంది చాలా సార్లు. మానసికంగా డిప్రెషన్, ఆందోళనా పూరిత న్యూరోసిస్ లతో బాధ పడడం.ఇక భర్త వైపు నుంచి కారణాలు…. భార్యతో శృంగారంలో అసహజ,మోటు,హింసాత్మక పద్ధతులు పాటించడం. గృహ హింస,శారీరిక హింస,అవమానించడం
విపరీతమైన శృంగార ఆసక్తి ఉండడం భార్య భయాలు,నొప్పితో సంబంధం లేకుండా ఆమెను పురుషాధిక్యతతో ఒక లైంగిక వస్తువుగా చూస్తూ వేధించడం
.
లక్షణాలు:
సెక్స్ లో తక్కువగా పాల్గొనడం, పూర్తిగా బహిష్కరించడం,చిన్న ,చిన్న స్పర్శలకు, ముద్దులకు కూడా చెమటలుపట్టి,గుండె దడ పెరిగేంత భయపడటం.
వాంతులు,విరోచనాలు అవడం.స్పృహ తప్పడం,ఏడవడం.
చికిత్స: నువ్వు నీ భర్తతో కలిసి sexologist , లేదా మారిటల్ థెరపిస్టు&సైకో థెరపిస్టును కలవాలి.
సెక్స్ పట్ల నీకున్న భయానికి మూలకారణాలను విశ్లేషించి… సెక్స్ పట్ల, లైంగిక అవయవాలు పనితీరుపట్ల శాస్త్రీయమైన అవగాహన కలిగించి…భయం పోగొట్టే సైకోతెరపీ,కౌన్సిలింగ్ ఇస్తారు.
కారణాలు నీ భర్తలో ఉంటే.. ఆయనకు భార్య పట్ల ఆధిపత్య హింసా ధోరణులను వదిలించే సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు.అతనికి మనోలైంగిక సమస్య ఉంటే చికిత్స ఇస్తారు.ఇద్దరికీ మారిటల్& రిలేషన్ షిప్ థెరపీ చాలా అవసరం.
డాక్టర్‌గారూ…నా వయసు 27 సంవత్సరాలు.నాకు చాలా ఏళ్ల నుంచీ హస్తప్రయోగపు అలవాటుంది. ఇంట్లో పెళ్లి చేదామని అనుకుంటున్నారు
ఇప్పటి వరకు ఏ స్త్రీతో శృంగారంలో పాల్గొనలేదు. కానీ ఈ మధ్య నాకు అంగస్తంభన పూర్తి స్థాయిలో కావడంలేదు. ఎందుకు నా అలవాటే దానికి కారణమా? గతంలో మద్యం అలవాటుంది. కానీ ఇప్పుడు మానేసాను. నాకు భయంగా ఉంది పెళ్లి చేసుకునే అర్హత నాకు ఉందా….అమ్మాయి జీవితం పాడు చేస్తానేమో అనే భయం కలుగుతున్నది.నేనేం చేయాలి చెప్పండి ..
–నర్సిం .మంచిర్యాల.
జవాబు: హస్తప్రయోగానికి, అంగస్తంభన లోపానికీ అంటే erectile dysfunction కి(ED/ఈడీ ) సంబంధం లేదు.మరీ హస్తప్రయోగం ఒక మానసిక అబ్సెషన్ గా మారితే తప్ప అంటే రోజుకు పదుల సంఖ్యలో చేసుకునే అలవాటు వలన హెచ్.పీ చేస్తే తప్ప అంగం గట్టిపడని మనోలైంగిక సమస్యకి వెళ్లిపోయే స్థితి అరుదుగా కొద్ది మందిలో ఉంటుంది.ఇక అంగం గట్టి పడకపోవడానికి శారీరిక కారణాలు చాలా ఉంటాయి.బీ.పీ,షుగర్, గుండె జబ్బులు,థైరాయిడ్ సమస్య,కోలేష్ట్రాల్ అధికంగా ఉండడం,వరిబీజం, లివర్,కిడ్నీ సమస్యలు,రక్తనాళాల్లో సమస్యలు,సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండడం,సిగరెట్,ఆల్కహాల్,గుట్కా అలవాట్లు,తీవ్రమైన మానసిక సమస్యలు.. సెక్స్ విషయంలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ,భయానికి లోనవడం,ఆత్మనూన్యత లాంటి వాటివలన కూడా రక్తసర ఫరా సరిగ్గా కాక అంగస్తంభన లోపం ఏర్పడవచ్చు.ఇంత చిన్న వయసులో నీకు నేను చెప్పిన పై జబ్బులు ఉండే అవకాశం లేదు కానీ చెప్పలేము కాబట్టి ఒకసారి ఈడీ ప్రొఫైల్ చేయించుకోవాలి.దీనివల్ల వ్యాధి నిర్ధారణ జరిగి సరైన చికిత్స అందుతుంది. మద్యం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది ..పూర్తిగా మానెయ్యి. ఇక పెళ్లికి ముందు పనికిస్తానో లేదో అని పరీక్షించుకుందామని సెక్స్ సంబంధాల్లోకి వెళితే…శీఘ్రస్ఖలన సమస్య …ఈడీ అంటే అంగ స్తంభన సమస్యతో పాటు, అన్నిరకాల సుఖవ్యాధులు,దాంతో పాటు ప్రాణాంతకమైన హెచ్.ఐ.వీ వ్యాధి రావచ్చు.పెళ్లయ్యాక నీ భార్యకు అంటచ్చును.పెళ్లి,సెక్స్ రెండూ విలువలతో కూడిన సామాజిక బాధ్యతలు గుర్తు పెట్టుకో.తరువాత హస్తప్రయోగానికి,ఈడీ కి సంబంధం ఉంది అని ఆశాస్త్రీయమైన అపోహను పోగొట్టుకో లేకపోతే అదే నీలో సెక్స్ వివి సమస్యలు సృష్టిస్తుంది
ముందు నువ్వు ఒక మంచి సెక్స్ కౌన్సెలర్ ను కలవు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.