
నీట్‌కు సన్నద్ధమవుతున్న బీహార్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి కోటాలోని తన హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తను కోటాలోని ఒక కోచింగ్ సెంటర్లో ప్రవేశం తీసుకున్నాడు. ఇంకా తను కోటాకు వెళ్లి కేవలం 20 రోజులే అయ్యింది. ఈ నెలలో ఇది మూడవ కేసు.
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు సన్నద్ధం అవుతోన్న 16 ఏళ్ల ఒక విద్యార్థి కోటాలో తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
తను నీట్ సన్నద్ధత కోసం కోటాలోని ఒక కోచింగ్ సెంటర్లో ప్రవేశం తీసుకున్నాడు. ఇంకా ఈ ప్రాంతానికి వచ్చి కేవలం 20 రోజులే అయ్యింది.
జనవరి నుంచి కోటాలో జరిగిన ఆత్మహత్యలలో కోచింగ్ విద్యార్థి అనుమానిత ఆత్మహత్యకు సంబంధించి ఇది 14వ కేసుగా పరగణించబడుతోంది. అంతేకాకుండా కేవలం ఏప్రిల్‌లో ఇది మూడవ కేసుగా నమోదు అయ్యింది. గడిచిన నెలలో 22వ తేదీన బిహార్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. నీట్‌కు సన్నద్ధం అవుతున్న ఢిల్లీకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి ఏప్రిల్ 25న మృత్యువాతపడ్డాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, బిహార్ రాష్ర్ట కటిహార్ నివాసి తమీమ్ ఇక్బాల్ సోమవారం అర్థరాత్రి తర్వాత తల్వండీ ప్రాంతంలో తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనబడ్డాడని పోలీసులు తెలిపారు.
గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని జవహార్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ లక్ష్మణ్ చెప్పారు. ఇంకా దీని వెనుక కారణం కూడా ఇప్పటి వరకు తెలియలేదని తెలిపారు. ఇక్బాల్ రూంమెట్, ఇతర విద్యార్థులు గది తలుపులు పదేపదే బాదినప్పటికీ లోపల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో వాళ్లు వెంటనే కేయిర్టేకర్కు చెప్పారు.
దీని తర్వాత హాస్టల్ కేర్‌టేకర్ పోలీసులకు సమాచారం అందించారు. ఒక పోలీసు బృందం వేగంగానే హస్టల్‌కు చేరుకుంది. హాస్టల్‌కు చేరుకొని పోలీసు బృందం తలుపులు విరగొట్టారు. గదిలో చూసేసరికి విద్యార్థి ఫ్యాన్‌కు వెళాడుతూ ఉన్నాడు.
ఇక్బాల్ 11వ తరగతి విద్యార్థి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా 20 రోజుల ముందే కోటాకు తిరిగి చేరుకున్నాడు. పోస్ట్‌మార్టం తర్వాత బాధితకుటుంబానికి మృతదేహాన్ని అప్పజెప్పామని పోలీసులు చెప్పారు. అయితే, విచారణ ఇంకా కొనసాగుతోంది.
గత ఏడాది రాజస్తాన్‌లో తక్కువలో తక్కువ 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో నుంచి 20 కేసులు కోటాలో నమోదు అయ్యాయి. పోలీసు రికార్డ్ ప్రకారం, 2023లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న 26 మంది విద్యార్థులు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 2015 తర్వాత నుంచి అన్నింటికంటే ఎక్కువగా ఉంది.
పోలీసు గణంకాల ప్రకారం కోటాలో 2022లో 15, 2019లో 18, 2018లో 20, 2017లో 7, 2016లో 17 ఇంకా 2015లో 18 విద్యార్థుల మరణం ఆత్మహత్య ద్వారా అయ్యింది. 2020 ఇంకా 2021లో విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి కేసు ముందుకు రాలేదు. ఎందుకంటే కోవిడ్-19 వల్ల కోచింగ్ సంస్థలు మూసివేయబడ్డాయి. లేదా ఆన్‌ల్లైన్ మోడ్ మీద నడిచేవి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.