
మార్పు!
ఔను నిర్విరామంగా జరుగుతున్న ఈ మార్పులో ఇప్పటిదాకా ఎన్ని జీవాలు, జీవితాలు కనుమరుగయ్యాయో? ఎన్ని మార్పుని తట్టుకొని ఇప్పటిదాకా నిలుచున్నాయే ఇదమిద్దంగానే కానీ శాస్త్రీయ పరిశోధనలతో చెప్పిన వారెందరు వాటిని తెలుసుకున్న వారెందరు!
ఈ భూగోళంపై నిరంతరం మార్పు సంతరిస్తున్నా, ఆదునిక మానవుడు ఎన్ని విశ్వ రహస్యాలు ఛేదిస్తున్నా ఇంకా మానవున్ని నిరంతరం వీడకుండా వెంటాడుతూనే వున్నది ఏంటో తెలుసా?
భయం!
ఔను భయమే ఈ భయం మానవున్ని ఎన్నో రూపాలుగా వీడకుండానే వుంది?
అది మరణ రూపంలో కావచ్చు
వ్యాధుల రూపంలో కావచ్చు
అంతర్గత మానసిక వ్యధల వల్ల కావచ్చు
భౌగోళిక ఉత్పాతాల వల్ల కావచ్చు
మనుగడకు సంభందించిన పోరాటాల వల్ల కావచ్చు
ఆధిపత్యానికై చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు
ఇలా చెప్పుకుంటూ పోతే పశువులు పక్షులు జలచరాలు క్రిమి కీటకాలూ వీటికి కేవలం ప్రాణ భయం మాత్రమే వుంటే, మానవునిలో భయాన్ని కొలవడం ఒక విరాట్ అణువుని కొలవడం ఒకటేనేమో!
ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు అంచనా వేసిన మార్పులే మనకు సరిగా తెలియవు? ఇక మనిషి జీవ పరిణామంలో ఇప్పటిదాకా జరిగిన మార్పులన్నీ ఏదో కొంత హిస్టరీ చదివిన వారికి తప్ప మిగతా వారికి మహా ఐతే ఏ మూడు తరాల వారు చూసిన లేదా విన్న హిస్టరీని మాత్రమే తెలుసేమో!
మార్పుని స్వీకరించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కానే కాదని నా అభిప్రాయం? మానవుడు అలా మార్పులకు గురైన ప్రతిసారీ ఎదుర్కొన్న అనేక అనుభవాలే జనజీవనంలో హిస్టరీగా నిక్షిప్తం చేయబడుతాయేమో!
మరి వసుధేంద్ర రాసిన ఈ #పట్టు_తోవ కూడా అలాంటి ఒకానొక మార్పుకి సంభందించిన అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని?
ఆ మార్పుని స్వీకరించలేక కొంతమంది,
స్వీకరించిన మరికొంతమంది,
తప్పనిసరై అగత్యం లేక అంగీకరించాల్సి వచ్చిన
ఇంకొంత మంది మద్యన ఏర్పడిన
ధర్మాధర్మ సంకటాల
నాటి మనుగడల మానవ జీవన పోరాటాల
బతుకుల భయాందోళనల ఆరాటాల
సఫలాల విఫలాల ఇలా భిన్న కోణాల
ఎంచుకున్న మార్గాల పయనాల
అత్యుత్తమ సముద్రంలోని కొన్ని బిందువుల
ఉదాహరణల సోదాహరణే ఈ పట్టు తోవ అని చెప్పచ్చునేమో!
నిజమే సముద్రాన్ని జయించడం ఎవరి తరం? అలాగే గతించిన కాలాన్ని కన్నుల ముందర పరిపూర్ణంగా పరచడం కూడా ఎవరి తరం!
సముద్రాన్ని జయించలేక పోయినా ఆ సముద్రాన్ని కనీస మాత్రంగానైనా అర్థం చేసుకున్నట్లు?
ఈ నవల కూడా చీనా నుండి రోమ్ వరకూ ఏర్పడిన వాణిజ్య రహదారి వల్ల, ఆ దారి పొడవునా నివశిస్తున్న జన జీవితాలు అంతకు ముందు ఎలా వున్నాయి ఆ తర్వాత ఎటువంటి కుదుపులకి గురయ్యాయి. అందులో సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లు అనేక రకమైన జీవితాల్లో ఈ పట్టు తోవ తెచ్చిన పెనుమార్పులకు ఒడిదుడుకులకు లోనైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత ప్రాతినిథ్య జన జీవితాల్ని వీలైనంత రేఖా మాత్రపు విస్తృత చర్చతో సాగిందే ఈ పట్టు తోవశేరా!
ఈ నవల చదవాలంటే ప్రపంచ చరిత్రపై కనీస పరిచయం వుంటే ఈ నవలని అందుకోవడం సులభం అవుతుంది? అంతేగాక నేనున్న ప్రాంతమే గొప్ప నా మతమే విశ్వ మతం అనే సంకుచిత అభిమతం వున్న వారికి ఈ నవలలో పరిచయమయ్యే వివిధ మతాచారాలకు సంభందించిన విషయాలు కొంత అయోమయానికి గురి చేసే అవకాశమైతే లేక పోలేదు.
అదీగాక కొన్నిచోట్ల రచయిత మతాలకు సంభందించి చర్చకు లేవదీసిన అంశాల్లో ఎటువంటి అభ్యంతరాలూ లేక పోయినప్పటికీ చదువరులు దాన్ని ఏ మేరకు అందుకొని ముందుకు పోతారన్నది నాకైతే కాస్తంత అనుమానమే వున్నప్పటికీ, ఆసక్తి తప్పకుండా ఈ నవలని పూర్తిగా చదవడానికి ప్రేరేపిస్తుంది అని చెప్పగలను!
ఇంకా విషయానికి వస్తే ఇందులో కనిష్కుడు ఒక పల్లె పడతితో చేసిన చర్చలో ఆమె వ్యక్తం చేసే ప్రశ్నలు బహుశా పురుషులే కల్పించిన ఏ మతమూ వాటికి సమాధానం ఇవ్వడం కష్టతరమేమో?
సూక్షంగా చెప్పాలి అంటే ఈ పట్టు తోవ ఏర్పడక ముందు జ్ఞాన సాగరంతో నిండిన భౌద్దం, పట్టు తోవ ఏర్పడ్డాకా భుద్దమిత్రగా మారడం అనే విషయాన్ని వసుధేంద్ర అంతర్లీనంగా నడిపిన విధానాన్ని ప్రశంసించక తప్పదు!
ఇక్కడ నేను నవల గురించి అండులోని పాత్రల గురించి కథనాన్ని గురించి చెప్పి ఈ నవలను మీ పరిధిలో మీరు అర్థం చేసుకొని సమన్వయం చేసుకోవడాన్ని నేను ఎంతమాత్రం భంగపరచలేని కారణంగా? కొన్ని ఉదాహరణలతో నా ఈ వ్యాసాన్ని ముగిస్తానశేరా!
చిత్తూరుకి చెందిన కథా రచియిత్రి శ్రీమతి ఎండవల్లి భారతి తన ఒక కథలో మహిళా రైతు కూలీల గురించి చెబుతూ వారు వరి కోత యంత్రాలు రావడంతో రేపటి నుండి ఇక మా జీవనమెలా అని భయంతో కూడిన ఓ నిస్సహాయత వ్యక్తం చేస్తారు…
పెనుకొండ నుండి సోమందేపల్లె దాటాకా అక్కడున్న ఓ రైల్వే గేట్ వద్ద ఆ గేట్ పడిన ప్రతిసారీ ఆగిన వాహనాల ప్రయాణీకులకు గంపల్లో జామకాయలు వేరు శనగ విత్తనాలు చక్కిలాలు ఇలా చిరుతిళ్ళు అమ్ముకునే చిన్నా చితక జీవితాలు, వారి కళ్ళ ముందే దాదాపూ ఐదేళ్ళకు పైగా అక్కడ తయారౌతున్న రైల్వే గేట్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ ఐతే ఆ తర్వాత తమ బతుకు తెరువు ఎలా అన్నది వారి కళ్ళల్లో స్పష్టంగా భయంతో కూడిన ఓ నిస్సహాయత మనకు కనిపించక పోదు…
అనంతలో మూడేండ్ల క్రితం క్లాక్ టవర్ వద్దున్న పాత రైల్వే ఓవర్ భ్రిడ్జ్ పడగొట్టి ప్రస్తుతం కొత్త బ్రిడ్జ్ కట్టాకా, ఆ పాత బ్రిడ్జ్ పరిసరాల్లో చిన్నా చితకా పనులు చేసుకొని బతికిన పేదా సాదానే కాక కొంత స్థితిమంతులు సైతం ఎటువంటి భయాందోళనలతో గడిపారో గడుపుతున్నారో రికార్డ్ చేసిన వారెవ్వరు…
ప్చ్ అంతెందుకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఎఫెక్ట్ ఐన వారిలో నేను కూడా ఒకన్ని అని చెబితే మీరు ఆశ్చర్యపోవచ్చు? ఏదేమైనా ఇంత సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితులే ఇలా వుంటే అప్పుడెప్పుడో కొన్ని వందల యేండ్ల క్రిందట ఇలాంటి భయాందోళనలను ఎదుర్కొన్న జన జీవితాలను పట్టు తోవ అంతర్లీనపు దారంలో నవలగా గుదిగుచ్చడం అంత సామాన్యమైన విషయమైతే కానే కాదశేరా!
నా దృష్టిలో ప్రపంచ చరిత్రపై కనీస అవగాహన కలగాలంటే… ఇప్పుడు చదవడం మానేసి కేవలం వాట్సాప్ యూనివర్శిటీ ద్వారా చరిత్రలు నెత్తికి రుద్దబడి బయటకొస్తున్న పిట్టభద్రులందరూ అందరూ కనీసం చదవాల్సిన నవలిదశేరా…
చివరగా కన్నడ మాతృక నుండి రచయిత వసుధేంద్ర హృదయాన్ని చక్కగా తెనుగీకరించిన రంగనాథ రామచంద్రరావుకు కూడా అభినందనలశేరా…
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.