
లేదు.,నా జాతి గురించి ఒక్క అక్షరం కూడా ఎవరూ రాయలేదు !- – మలయాళం -పోయకల్ అచ్చపయ్యన్ కేరళ దళిత కవి,ఉద్యమకారుడు
ఫిబ్రవరి 17 -148 వ జయంతి సందర్భంగా.
తెలుగు అనువాదం – ఇంగ్లీష్ నుంచి-గీతాంజలి.
***
లేదు..నా జాతి గురించి ఒక్క అక్షరం కూడా ఏ గ్రంథాల్లో కనిపించదు.
చరిత్రలో చాలా జాతుల గురుంచి కనిపిస్తుంది.. ఒక్క నా జాతి గురించి తప్పితే!
**
కావలిస్తే ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కాబడ్డ చరిత్రల్ని క్షుణ్ణంగా పరిశీలించండి.
ఎక్కడా నా జాతి గురుంచి ఒక్క అక్షరం కూడా రాయబడలేదు!
ఈ భూమ్మీద ఒక్కళ్ళు కూడా లేరా నా జాతి చరిత్రను రాసి బద్ర పరచడానికి ఎంతాశ్చర్యం కాకపోతే ?
గడిచిన ఆ పాత రోజుల్లో నా జాతి వాళ్ళు కూడా రాయలేక పోయారా? నిజంగా ఎంత విషాదం ఇది ?
**
ఆలోచిస్తూ ఉంటే నా మనసంతా దుఃఖంలో మునిగిపోతుంది.
ఇది ఇలానే ఉండబోతుందా..లేదు !
ఆగండి..ఒక్క.క్షణం !
నాదైన స్వర మాధుర్యంతో
నేను ఏదో ఒకటి రాయబడని చరిత్రకి జోడిస్తాను ..నా జాతి కోసం ..అవును చూస్తూ ఉండండి !
***
అనాదిగా కేరళలో నివసించిన నా జాతి మనుషుల గురించి.,
వారు రాక్షసులుగా మార్చ బడ్డ గాథల గురించి.,
నేను కూడా కొత్తవైన,నిజాలు మాత్రమే ఉన్న కథలుగా రాసి చరిత్రకి జోడిస్తాను !
***
రాయనందుకు ..నా జాతిని దోషులుగా నిందిస్తున్నందుకు నాకు సిగ్గనిపిస్తున్నది !
నిజానికి నన్నే అందరూ దోషిగా భావిస్తారు
ఈ పృథ్వి మీద ఒక శాపగ్రస్థ సంతానంగా చూస్తారు !
భూమినుంచి ఆకాశం దాకా అందరూ మా జాతి వాళ్ళని మాత్రమే ఎందుకు నిందిస్తూ ఉంటారో అర్థమే కాని విషయం? అసలు ఇదెలా సాధ్యమో చెప్పండి?
**
ఇంతకీ భరించరానిదేమంటే ., ఈ భూమిని,మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడు ..
ఈ దుర్మార్గాన్ని.,వివక్షను తన భూమ్మీదే ఎలా అనుమతిస్తున్నాడు అని?
***
అందుకే..నా జాతి గురించి ఒక్క అక్షరం కూడా రాయబడని చరిత్రని తిరస్కరించి..నేను కొత్త చరిత్రని రాయబోతున్నాను !
అనువాదం : గీతాంజలి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.