
ఎంటెక్ కోర్సులలో చేరాలనే ఆసక్తి విద్యార్థులలో రోజురోజుకు తగ్గుతున్నట్టుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) డాటా ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా భారతదేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలలోమూడింట రెండొంతుల ఎంటెక్ సీట్లు విద్యార్థుల లేమితో ఖాళీగా ఉన్నాయి.
డాటా ప్రకారం 2017-18 విద్యాసంవత్సరం నుంచి దాదాపు ఎక్కువగా పీజీ ప్రవేశాలు తగ్గాయి.
తగ్గడానికి కారణం
ఎంటెక్ ప్రవేశాలు ఏడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయాయి. ప్రస్తుత రెండు విద్యాసంవత్సరాలకు గాను 45,000 విద్యార్థుల తగ్గుదల దీనికి నిదర్శనంగా చూపించవచ్చు. మరోవైపు దీనికి పూర్తి విరుద్ధంగా బీటెక్‌లో ప్రవేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సంస్థల నియామకాలకు కరిక్యులమ్ మధ్య సంబంధం లేకపోవడం, జీతభత్యాల విషయంలో ఎటువంటి కీలక ప్రయోజనాలు లేకపోవడంతో ఎంటెక్ లో ప్రవేశాలు తగ్గుముఖం పట్టినట్టుగా నిపుణులు తెలుపుతున్నారు.
64 శాతానికి ఖాళీలు…
ఏడు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ ప్రొగ్రామ్స్ లో 1.85 లక్షల సీట్లు ఉన్నాయి. వీటిలో 63 శాతం సీట్ల ఖాళీగా ఉన్నాయి. కేవలం 68,677 సీట్లు భర్తీ అయ్యాయి. ఇదే ధోరణి కొనసాగుతూ 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఖాళీల సంఖ్య 64 శాతానికి పెరిగిపోయింది.
ఎంటెక్ సీట్లు కుంచించుకుపోయి 33శాతంతో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం కేవలం 45,047 విద్యార్థులు ఎంటెక్ డిగ్రీ చేస్తున్నట్టుగా డాటా ప్రకారం తెలుస్తోంది.
ఆసక్తి లేమి…
‘ఈ మధ్య పీజీలో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిండం లేదు. బీటెక్ పూర్తి చేసినా, పోస్ట్ గ్రాడ్యూయేషన్ తర్వాత జీతభత్యాలలో అంతలా వ్యత్యాసం కనబడడం లేదు. అందుకే ఎంటెక్ లో చేరేవారికి ఆసక్తి తగ్గిపోయింది’ అని ఏఐసీటీఈ సభ్యులు, కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.