
2019వ సంవత్సరంలో విదేశాలలో చదువుతున్న భారతీయుల సంఖ్య 5,86,337 ఉండేది. అదికాస్తా 2023లో పెరిగి 8,92,989గా మారింది. అన్నిటికంటే ఎక్కువగా భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌లో చదువుతున్నారు. పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రవిద్యామంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
న్యూఢిల్లీ: గత ఐదు సంవత్సరాలలో విదేశాలలో చదువుతున్న భారతీయుల సంఖ్యలో 52.2% పెరుగుదల నమోదు అయ్యింది. 2019 సంవత్సరంలో విదేశాలలో చదివే భారతీయుల సంఖ్య 5,86,337 కాగా అదికాస్త 2023 వరకు పెరిగి 8,92,989 సంఖ్యకు చేరుకుంది. ఈ వివరాలన్నింటిని రాజ్యసభలో విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది.
హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్‌ను అనుసరించి, విద్యామంత్రిత్వశాఖ వెల్లడించిన దాని ప్రకారం విదేశాలలో ఉన్నటువంటి 8,92,989 భారతీయ విద్యార్థులలో అన్నింటికంటే పెద్ద సమూహం అమెరికాలో ఉంది. అక్కడ 2,34,473 విద్యార్థులు ఉన్నారు. దీని తర్వాత కెనడాలో 2,33,532 ఇంకా ఇంగ్లాండ్‌లో 1,36,921 విద్యార్థులు చదువుతున్నారు.
విద్యామంత్రిత్వశాఖ గణంకాల ప్రకారం, 2019లో విదేశాలలో చదవాలని అనుకునేవారి భారతీయుల సంఖ్యలో నిరంతర పెరుగుదల నమోదు అయ్యింది. 2020ను మినహాయిస్తే ఈ లెక్కలు 55.7% తగ్గి 2,59,655గా ఉంది. ఈ క్షీణత కోవిడ్- 19 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన ఆంక్షల వల్ల ఏర్పడింది. దీంతో 2019- 2020 మధ్య అనేక విద్యాసంస్థలు తమ తరగతులను పూర్తిగా ఆన్‌లైన్‌కు పరిమితం చేశాయి.
కేరళ రాష్ట్ర సీపీఐ(ఎం) ఎంపీ వీ శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి సుకాంత మజూందార్ ఒక రాతపూర్వక సమాధానంలో ‘ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు సంబంధించిన డేటాను విద్యామంత్రిత్వ శాఖ తమ దగ్గర పొందుపరుచుకోదు. కానీ గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు వెళ్లే వారిలో ఎంతమంది భారతీయులు తమ ప్రయాణానికి సంబంధించిన ఉద్దేశ్యాన్ని ‘అధ్యయనం లేదా విద్యా’ అని చూపించారు’ అనే దానికి సంబంధించిన విషయాన్ని హోం మంత్రిత్వశాఖ(ఎంహెచ్ఏ)కు ఇమ్మిగ్రేషన్ బ్యూరో(బీఓఐఈ) అందించిన సమాచారం వల్ల ఇది తెలుస్తుంది’ అని తెలిపారు.
అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఆతిథ్యమిచ్చే పతాక మూడు దేశాలలో కెనడా మొదటి స్థానంలో ఉంది. అక్కడ భారతీయ విద్యార్థుల నమోదులో 76% పెరుగుదల నమోదు అయ్యింది. అది 2019లో 132,620 నుంచి పెరిగి 2023లో 233,532 మారింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా ఈ పెరుగుదల ఏర్పడింది.
2020 డిసెంబర్లో భారతీయ రైతుల ఆందోళనను సమర్ధిస్తూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల తర్వాత ఉద్రిక్తతకు దారితీసింది. భారత ప్రభుత్వం కెనడా దౌత్యవేత్తలకు సంబంధించిన దౌత్యపరమైన ఇమ్యూనిటీని రద్దు చేస్తూ, వారి కుటుంబాల సంరక్షణను వెనక్కు తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించింది. దీని పర్యావసనంగా 2023 అక్టోబర్‌లో తమ 41 మంది దౌత్యవేత్తలను భారతదేశం నుంచి కెనడా వెనక్కి పిలిపించుకుంది. అక్టోబర్ 2024లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. సిక్కు వేర్పాటువాది హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్య మీద ఇరు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. అంతేకాకుండా ఒకరి దౌత్యవేత్తలను మరొకరు బహిష్కరించారు. అయితే, 2023 జూన్ 18న కెనడాలోని ఒక గురుద్వార్ బయట హరిదీప్ సింగ్ నిజ్జర్‌ను తుపాకీతో కాల్చి హత్య చేశారు.
అయినప్పటికీ, ఈ సంవత్సరం నుంచి కెనడా కొన్ని విధానాలను అవలంభిస్తుంది. దీంతో కెనడాలో విదేశీ విద్యార్థులతో పాటు భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఎంఐటీ, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ ఇంకా యూసీ బర్కలీలాంటి ప్రముఖ విద్యాలయాలకు అమెరికా నిలయంగా ఉంది. దీంతో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్యలో 91% పెరుగుదల నమోదు అయ్యింది. అది 2019లో 122,535 నుంచి పెరిగి 2023లో 234,473 సంఖ్యకు చేరుకుంది.
ఈ మధ్య ఇంగ్లాండ్‌లో 273.9% నాటకీయమైన పెరుగుదలను గమనించవచ్చు. 2019 ఏడాదిలో యూకేలో చదివే వారి భారతీయ విద్యార్థుల సంఖ్య 36,612 కాగా అది 2023లో పెరిగి 136,921 అయ్యింది. అయితే 2021లో గ్రాడ్యుయేట్ రూట్ వీసా ప్రవేశపెట్టడంతో ఉప్పెనలాంటి పాక్షిక పెరుగుదల కనిపించింది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా వివిధ దేశాల విద్యార్థులు తమ చదువును పూర్తి చేసిన తర్వాత కూడా పని చేసుకోవడానికి, రెండు సంవత్సరాల(పీహెచ్డీ పట్టభద్రులకు మూడు సంవత్సరాలు) వరకు యూకేలో ఉండడానికి అనుమతిని ఇస్తుంది.
ద వైర్ హిందీ స్టాఫ్
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.