
మన ప్రధాన మంత్రి ఒకటి చెపుతూ, మరొకటి చేసే అసమానసామర్థ్యం కలవారు. తాను నిర్మించుకున్న ఒక భ్రమాజనిత ప్రపంచంలో ముందుగా తయారు చేసుకున్న ఇంటర్వ్యూలు, భాజాభజంత్రీ(గోడీ)మీడియాలో ఆయన గురించిన వార్తలు ప్రసారమవుతుంటాయి.
నరేంద్రమోడీకి రెండు భిన్నమైన అభిప్రాయాలు ఎందుకు ఉంటాయో, కొందరు ఆయన్ని ఎందుకు ఆరాధిస్తారో, మరికొందరు ఆయనపై ఘాటైన విమర్శలు ఎందుకు చేస్తారో, కొందరాయన్ని విశ్వగురువుగానో, ప్రపంచ నాయుకుడుగానో ఎందుకు కీర్తిస్తారో, ఇంకొందరు భారత ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పుగా ఎందుకు భావిస్తారో అర్థం తెలుసుకోవడానికి నాకు పదిసంవత్సరాలు పట్టింది.
ఈప్రశ్నలకు సమాధానాలు చాలా తేలికైనవి. ఎందుకంటే.. హాస్యనటుడు వీర్ దాస్ అన్నట్టు ఇద్దరు భారతీయులున్నట్టుగానే, ఇద్దరు మోడీలుంటారు.
ఒక మోడీ అంతర్యుద్ధం జరుగుతున్న మణిపూర్ ను సందర్శించ నిరాకరి వస్తారు. పాత్రికేయుల సమావేశాల్లో మాట్లాడరు. భారత సమాజానికి మతోన్మాదం పెను ముప్పుగా మారిందని కంటతడిపెడతారు. మరొక మోడీ సాధువులా జీవిస్తున్నట్టు, దయార్ద హృదయుడిలా, అందరికోసం సుసంపన్నమైన జాతిని నిర్మించే పెద్ద మనిషిలా కనిపిస్తారు.
కాబట్టి తొలుత మోడీ 1గా, తరువాత మోడీ 2గా సంభోదిద్దాం.
మోడీ 2 ను నిఖిల్ కామత్ చేసిన రెండు గంటల ఇంటర్వ్యూ చూసిన తరువాత నాలో ఈ జ్ఞానోదయమైంది. కామత్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తొలుత తానొక జర్నలిస్ట్ ను కాదనుకుని, రాజకీయాల గురించి తమకేమీ పెద్దగా తెలియదన్నట్టు, అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసే బరువు బాధ్యతలను పక్కన పెట్టి, ప్రస్తుత తీవ్ర సమస్యలపైన ఎలాంటి ప్రశ్నలు వేయకుండా జాగ్రత్త వహించారు.
తాను తొలి సారిగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక, స్కూల్లో తన సహ విద్యార్థి స్నేహితులను భోజనానికి పిలిచి, వారితో భోజనం చేస్తున్నప్పుడు, తన కోరికమేరకు వారిలో ఒకరు స్నేహపూర్వకంగా ‘నువ్వు’ అని సంభోదించాడని మోడీ 2 తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
మరొక పక్క మోడీ 1 తనను ‘నువ్వు’ అని సంభోదించగల హక్కు ఉన్న వారందరినీ తనకు మార్గదర్శకులైన మండల్ లాల్ కృష్ణ అద్వాని, మురళీ మనోహర్ జోషితో పాటు మరికొందరి దగ్గరకు పంపారు. తనకు అయిన వాళ్ళెవరు, కాని వాళ్లెవరు అని విభజించిన మోడీ 1 ప్రధాన మంత్రి అయ్యాక భారత రాజకీయ యవనిపై సైద్ధాంతికి ప్రాతిపదికన లెక్కలేనన్ని స్నేహాలను, సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకున్నారు.
మోడీ 2 దీర్ఘకాలిక స్నేహాలకు, మోడీ 1 వాటిని సమర్ధవంతంగా ధ్వంసం చేయడానికి చిహ్నాలు.
యువ రాజకీయనాయకులకు ఎలాంటి లక్షణాలుండాలని ప్రశ్న వేస్తే ‘‘అంకిత భావం, నిబద్దత, ప్రజల బాధల్లో, సంతోషాల్లో, విషాదాల్లో వారితో కలిసి నడవగలిగిన సామర్థ్యం ఉన్నవారై ఉండాలి’’ అని మోడీ 2 సమాధానమిచ్చారు.
జట్టులో ఆడేవాడు? ఈ లక్షణాలు మోడీ 2 కలిగి ఉండేవారు. ఎందుకంటే, మోడీ 1 ఈనేలనంతా, ప్రజలనంతా, ప్రతికలను, ఛానెళ్ళ నంతా ఇక చోటు లేకుండా తన ఫొటోల దర్శనంతో (జి 20 పోస్టర్లు, కోవిడ్ వ్యక్సిన్ సర్టిఫెకెట్లతొ) నింపేశారు. మోడీ 2 మాట్లాడితే ఇక అక్కడ చోటేమీ లేకుండా తయారుచేశారు.
ప్రజలు తమ బాధల్లో నడుస్తున్నప్పుడు, 80 కోట్ల మంది భారతీయులు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతోనే బతుకుతున్నప్పుడు, వారికి దూరంగా, 467 కోట్ల రూపాయల అంచనాతో మోడీ 1 తన కోసం నూతన నివాసాన్ని నిర్మించుకుంటున్నారు. ప్రపంచంలోని ఆకలితో అలమటించే 127 దేశాల సూచిలో భారత్ స్థానం 105వ స్థానంగా ఉంది.
‘‘మంచి వాళ్ళు రాజకీయాల్లోకి సేవాదృక్పథంతో రావాలి కానీ, ఆకాంక్షలతో రాకూడదు’’ అని ఆ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు.
ఒక దారుణమైన విషయం ఏమిటంటే ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, వై.ఎస్. చౌదరి, సువేంద్ర అధికారి, అశోక్ చవాన్, చివరికి హిమాంత్ బిష్వాస్ శర్మ కూడా మోడీ బీజేపీలో చేరారు.
‘‘నేను మానవమాతృణ్ణి. నేనేమీ దేముణ్ణి కాదు. నేను కూడా పొరపాట్లు చేశాను’’ అని మోడీ 2 కామత్ తో చెప్పిన దాంట్లో ఉంది. లోక్ సభ ఎన్నికల పోటీలో మోడీ 1 మాట్లాడుతూ ‘‘నేనేమీ జీవసంబంధమైన మనిషిని కాను. దైవదత్తమైన ఆకాంక్షను నెరవేర్చడానికి భగవంతుడు పంపిన దూతను’’ అన్నారు.
మళ్ళీ వెంటనే కమాత్ తో మోడీ 2 మాట్లాడుతూ, ‘‘నేను కష్టపడి పనిచేస్తాను. నాకోసం నేనేమీ చేసుకోను. సౌకర్యవంతంగా నేను జీవించను. సౌకర్యవంతముగా జీవించడానికి నేను అర్హుణ్ణి కాను.’’ అన్నారు.
తాను నిజంగా మోడీ 1 వద్ద ఉన్నానా, లేక మోడీ 2 వద్ద ఉన్నానా అని నిఖిల్ కామత్ కాస్త అయోమయంలో పడిపోతూ ఆశ్చర్యపోయారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ఒక ఖరీదైన గదిలో జరుగుతున్న ఇంటర్వ్యూలో వారున్నారు. సమీపంలో మెర్సిడెస్ కార్లు, 8,400 కోట్ల రూపాయల విలువైన ఎయిర్ క్రాఫ్ట్ లు ఆ సమీపంలోనే నిలిచి ఉన్నాయి.
రాజకీయాల్లో దళసరి చర్మం అవసరమైతే అని ప్రశ్నించినప్పుడు మోడీ 2 సమాధానం ఇలా చెప్పారు. ‘‘ఏదైనా అవసరమయినప్పుడు చాలా విచారంగా ఉంటుంది.’’ అన్నారు. అలాంటప్పుడు బాధపడతారా? అని అడిగినప్పడు ‘‘అవును, పేదలగురించి, వారి సమస్యల గురించి ఆలోచించినప్పడు నేను ఉద్వేగానికి గురవుతాను’’ అన్నారు.
నోట్ల రద్దును ప్రకటిస్తున్నప్పుడు, కోవిడ్ లాక్ డౌన్ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే దాన్ని అమలు చేస్తున్నప్పుడు, 2020 నవంబర్లో 2021 డిసెంబర్ లో ఢిల్లీ శివార్లలో శాంతి యుతంగా రైతులు నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భంగా వారిలో 700మంది మరణించినప్పటికీ వారి కోర్కెలను తిరస్కరించినప్పడు పేదలపైన మోడీ 1 ఆ ఏడాదంతా చూపిన జాలి అంతా వైరుధ్యాల పుట్టగా కనిపిస్తుంది.
సాధారణ ప్రజల జీవితాలను విధ్వంసం చేసిన ఆర్థిక విధానాలకు ప్రసిద్ధుడైన వ్యక్తి మోడీ 1 మంత్రి వర్గంలోని సభ్యుడే. చక్కెర పాకం పట్టిన పాప్ కార్న్ పైన, పరీక్షా పత్రాలపైన కూడా జీఎస్ టీ వేసిన ఘనుడాయన.
తప్పుడు వార్తలేమిటో ఈ నాటి యువతరం వెంటనే గమనించగలుగుతోందని మోడీ 2 తన ఇంటర్వ్యూలో చెప్పారు. మోడీ 1 పాలనా కాలంలో ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబెయిర్ ను జైలుకు పంపారు.
వసంత్ వ్రజిలాల్ పరికా(1929-2007) అనే నేత్ర వైద్యులు గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పడు 150 రూపాయలు విరాళంగా తీసుకుని, ప్రతి నయాపైసాకు లెక్క చెప్పారని మోడీ 2 గుర్తు చేస్తారు. మోడీ ఎలక్ట్రల్ బాండ్లకు దీనికి పోలికే లేదు. ఎలక్ట్రల్ బాండ్ల పథకం వల్ల 2018లో, 2023లో పేర్లు వెల్లడించని వారు బీజేపీకి ఇచ్చిన విరాళాలు 6060 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ పథకం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం కోర్టు ధర్మాసం కొట్టివేసింది.
నిజానికి తనకు ప్రచారయావ లేదని, ముఖ్యంగా పరిపాలనకు బదులు తనను ప్రదర్శించుకోవడం తనకు ఇష్టం లేదని మోడీ 1 మోడీ 2 చెపుతుంటారు. యువతరానికి ఉపదేశాలు చేయడం కూడా తనకు ఇష్టం లేదని, ఏ ఒక్కరికీ ఉపన్యాసాలు ఇచ్చే అర్హ త తనకు లేదని అంటారు. దీనికి పూర్తి భిన్నంగా మన్ కీ బాత్ (మనసులో మాట)ను ప్ర సార మాధ్యమాల ద్వారా మోడీ 1 ప్రజలకు వినిపించారు.
ఎవరినైనా సరే పైకి తీసుకు రావాలే కానీ అణగదొక్క కూడదని ఇంటర్వ్యూ ముగింపులో నొక్కి చెప్పారు. మోడీ అంత హుందాగా ఉన్నారని చెప్పడం మంచిది కాదు. సీనియర్ ప్రతిపక్ష నాయకులైన మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ రెయిన్ కోట్ వేసుకుని స్నానం చేస్తారని, సోనియా గాంధీని ‘‘కాంగ్రెస్ విధవ రాలు’’ అని వ్యాఖ్యానించారు.
భారతీయ వీసా కోసం ప్రపంచం క్యూకట్టే రోజు వస్తుందని దశాబ్దాల క్రితమే ఊహించానన్నారు మోడీ 2. ఈ ఇంటర్వ్యూ చేసిన కామత్ వివేకంతో ప్రశ్నించకపోయి నప్పటికీ, 2023లో మాత్రమే కాదు, 2016లో 2019 లో కూడా చాలా మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్ళిపోయారు.
అదంతా జరిగింది మోడి 1, మోడీ 2 పాలనా కాలంలోనే అయినప్పటికీ, దాంతో ఆయనకేమీ సంబంధం లేదు.
ఇద్దరు మోడీల గురించి ఈ సంభాషణను ఇక చాలిద్దాం.
మోడీ 1, మోడీ 2 అని వేరు వేరుగా లేరు. ఒక్క మోడీ మాత్రమే ఉన్నారు. ఈ రోజు ఆయన వాకిట ముందున్న పరిస్థితికి మోడీనే బాధ్యులు. ప్రధాన మంత్రి సామర్థ్యం ఏమిటంటే ఒకటి చెప్పడం, దానికి భిన్నంగా మరొకటి చేయడం వంటివి ప్రపంచంలో రెండు నాల్కల ధోరణితో మాట్లాడే రాజకీయ నాయకులు కూడా చేయరు. ముందస్తుగా తయారు చేసుకున్న ఇంటర్యూలు, భజనచేసే ప్రసార మాధ్యమాల వార్తల వంటి భ్రమాజనిత ప్రపంచం ఏదో ఒకరోజు కుప్పకూలక తప్పదు.
ఆయన ఇంద్రజాల రాక్షసతాండవ నిర్మాణానికి సహాయం చేసినవారందరు కూడా ఆ రోజు అదే చెపుతారు.
(రోహిత్ కుమార్ విద్యావంతులు, రచయిత, స్వతంత్ర జర్నలిస్ట్)
అనువాదం : రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.