
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ కమిటీ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను బీజేపీ తమ పార్టీ సమన్వయకర్తగా నియమించింది.
రోహిత్ ఆర్య పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత గత ఏడాది(2024) జులైలో బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించి, పార్టీలో చేరారు. వివిధ వార్తా కథనాల ప్రకారం పుష్యమిత్ర్ భార్గవ్‌తో పాటుగా జస్టీస్ ఆర్యని కూడా సమన్వయకర్తగా మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు విష్ణుదత్తా శర్మ నియమించారు.
వివాద అంశాలపై తీర్పు
గతంలో వివాదపూరితమైన అంశాలపైన మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య తీర్పులు వెలువరించారు. అటువంటివాటిలో 2021లో స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫారుకీ, నలిన్ యాదవ్ కు బెయిల్ ఇవ్వడానికి జస్టిస్ రోహిత్ నిరాకరిస్తూ తీర్పును ఇచ్చారు.
ఇండోర్‌లో కొత్త సంవత్సరం వేడుకల వేళ ఆస్తికుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా, కోవిడ్-19 ప్రోటోకాల్‌ని ఉల్లంఘించినట్టుగా ఆరోపణలతో వీరిద్దరి పైన కేసు నమోదు అయ్యింది.
‘ఇప్పటి వరకు అందిన సాక్ష్యాధారల ప్రకారం నిందితులు కావాలనే దేశంలోని ఒక సమూహాపు ధార్మిక మనోభావాలను గాయపరిచారు‘ అని జస్టిస్ ఆర్య తమ తీర్పులో తెలిపారు.
అంతేకాకుండా మునవ్వర్ ఫారుకీ, నలిన్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తీరస్కరిస్తూ ‘అందరిలో సోదరభావం పెరగడానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతిపౌరుడి రాజ్యాంగ కర్తవ్యం’ అని అన్నారు.
ఆరోపణలతో అదుపులోకి..
తన షో మొదలయ్యే ముందే స్టాండప్ కమెడియన్ ఫారుకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిహాల్స్ చేసేటప్పుడు తాను వినకూడని మాట విన్నానని బీజేపీ నేత తెలిపిన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఫారుకీని అరెస్ట్ చేశారు.
రాఖీతో న్యాయం చేసే తీర్పు…
దీనికన్నా ముందు జులై 2020లో ఒక మహిళతో 26 ఏళ్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన కేసుపై కూడా జస్టిస్ ఆర్య తీర్పు వెలువరించారు. మహిళ చేత యువకుడు రాఖీ కట్టించుకొని, ఎప్పుడూ ఆమెకు రక్షణగా ఉండాలనే షరతు మీద బెయిల్ కూడా మంజూరు చేశారు. అంతేకాకుండా నిందితుడు తన భార్యతో పాటుగా వెళ్లి ఫిర్యాదుదారుని ఆశీర్వాదించాలని, 11వేల రూపాయలు, మిఠాయి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు ఫిర్యాదుదారు కొడుకుకు రూ.5,000 ఇవ్వాలని, ఆ డబ్బులతో తాను బట్టలు, మిఠాయి కొనుక్కుంటాడని నిందితుడికి జస్టిస్ ఆర్య్ తెలిపారు.
సుప్రీంకోర్టు ఆగ్రహం
జస్టిస్ ఆర్య్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘బెయిల్ షరతు రూపంలో రాఖీ కట్టించే ఆదేశం ఇవ్వడం మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని సోదరుని చేయడం ఇది పూర్తిగా అంగీకరం కాదు.. రాఖీ కట్టించి, ఉపకారం ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి లైంగిక వేధింపులనేది చిన్న విషయం కాదు. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల విషయంలో రాజ్యాంగేతర, చట్టవిరుద్ధ బెయిల్‌ను ఇవ్వకోడదని తెలిపింది.
న్యాయమూర్తిగా రాజ్యాంగం ఆదేశించిన విధి విధానాలు క్రమశిక్షణ ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తి ఇలా బాహాటంగా ఓ సామాజిక సమూహానికి సంబంధించిన భావోద్వేగాలను సంతృప్తి పరిచే లక్ష్యంతో తీర్పులు ఇవ్వడం వాటిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సదరు మాజీ న్యాయ మూర్తి పదవీ విరమణ కాగానే బిజెపి తీర్థం పుచ్చుకోవడం, ఇపుడు రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదనల అమలుకు సమన్వయ కర్త గా వ్యవహరించడం భారత న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పై సందేహాలు లేవనెత్తుతోంది.
ది వైర్ హిందీ స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.