
నవవధువు చెదిరిన సింధూరం
ముక్కు పచ్చలారని
యువత బలిశాల కశ్మీరం!
నిజమే! కుంకుమపువ్వు అక్కడే పండుతుంది!!
దశాబ్దాలుగా ఆరని చిచ్చుని రగిలిస్తున్నది ఎవరు?
రాజ్యం మతమనే భావనకు ఉన్మాదమనే దెయ్యాన్ని జత చేస్తే
కురుస్తున్న బుల్లెట్ల జడివానకి రాలుతున్న కౌమారం ఈ సింధూరం
పదవులను, పీఠాలను
ఉడుముల్లా పట్టుకునే
రాజకీయ నేతల
కుత్సిత కుతంత్రాలకు
సమిధలైన
వందల, వేల
సామాన్యుల గోడు పట్టిందెవరికి?
సమ్మోహన పరిచే శిఖర శ్రేణులు
రుధిర మంచును వర్షిస్తే
కుంకుమ పండే నేలలో
ఆయుధాల మొక్కలు మొలిచి,
బుల్లెట్ల ఫలాలను ఇస్తుంటే..
దోపిడీ ఎవరిదో
అణిచివేత ఎవరిదో
తెలుసుకోలేని ఘనీభవించిన
అజ్ఞాన శీతల స్థితిలో సామాన్యులు!!
ఏ ఎడారి ఆశతో ఇంట జీవచ్ఛవాలను వదిలి
గెలవని యుద్ధాలకుపయనమయ్యేది?
జె
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.