
‘‘నేను అన్నదానికి క్షమాపణలు చెప్పమంటున్నారు. నాప్రకటనను ఉపసంహరించుకోమంటున్నారు. నేనలా చేయను. నా ప్రకటనను ఉపసంహరించుకోను, క్షమాపణలు చెప్పను’’ అని తుషార్ గాంధీ స్పష్టం చేశారు.
మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ ‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ ఎస్ ఎస్) జాతికి పట్టిన క్యాన్సర్’’ అని చేసిన వ్యాఖ్యానానికి ‘‘క్షమాపణలు చెప్పను’’ అని శుక్రవారం స్పష్టం చేశారు.
‘‘నేను అన్నదానికి క్షమాపణలు చెప్పమని వారు నన్నుకోరుతున్నారు. నా ప్రకటనను ఉపసంహరించుకోమంటున్నారు. ఆ పని నేను చేయను. ఒక సారి ఏదైనా సరే నేను చెప్పాక దాని నుంచి ఉపసంహరించుకోను, క్షమాపణలుచెప్పను.’’ అని ఎర్నాకులంలోని అలువలో ఉన్న యూనియన్ క్రిస్టియన్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ 1925 మార్చి 18వ తేదీన వైకోం సత్యాగ్రహంలో పాల్గొని వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవ సభలో తుషార్ గాంధీ పాల్గొన్నారు.
శివగిరి మాదోం వద్ద మహాత్మా గాంధీతో శ్రీ నారాయణ గురు సమావేశమైన రోజును పురస్కరించుకుని బుధవారం జరిగిన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ పై తుషార్ గాంధీ పై విధంగా వ్యాఖ్యానాలు చేశారు. తిరువనంతపురం శివారులోని నెయ్యాతినకర సమీపంలో తుషార్ గాంధీని ఆర్ ఎస్ ఎస్, బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టి నిర్బంధించారు.
‘‘ఈ విద్రోహులను బహిర్గతం చేయడాన్ని కొనసాగించడం కోసం నా నిర్ణయం మరింత బలపరుస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ప్రజల హక్కులను కాపాడుతున్న సంస్కృతి కల మళయాళీలు ప్రతిపక్షాన్ని కూడా కాపాడాలి’’ అన్నారు.
మలయాళీల చైతన్యం
‘‘ప్రతిపక్షంతో పక్కపక్కనే కూర్చుని జీవిస్తున్నాం. ఇతరుల నోరు మూయించేలా ఎప్పుడూ ప్రయత్నించలేదు. కేరళ ఆత్మని, మళయాళీల చైతన్యాన్ని మనం పరిరక్షించాలి. ఇలాంటి విషపూరితమైన వారిని కేరళ నుంచి బైటికి గెంటివేయాలి’’ అని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్యోద్యమం కంటే ఇది చాలా అవసరం , ‘‘మనకు ఉమ్మడి శత్రువు ఉన్నాడు’’ అని పేర్కొన్నారు.
ఈ కాలేజీని మహాత్మా గాంధీ సందర్శించిన సందర్భంగా ఆయన నాటిన మామిడి మొక్క ఉన్న చోట జరిగిన ఈ కార్యక్రయానికి కేరళ ప్రతిపక్ష నాయకుడు వి.డి సథీశన్ కూడా హాజరయ్యారు
‘ద హిందూ’ సౌజన్యంతో
అనువాదం : రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.