సర్వవినాశక మారణహోమానికి పునాదులు వేసింది ‘‘వాన్సీ’’ అని ఎవరూ గుర్తించకపోయినా యూరపు యూదుల నాశనానికి సవివరమైన దారి పటాన్ని రూపొందించిదనడంలో సందేహం లేదు.
‘‘నాజీ తుది పరిష్కారం’’ గురించి అప్పటి గణాంకాలు చెప్పినంత వివరంగా మరేదీ చెప్పలేదు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన నాటి నుండీ 30 నెలల్లో ఊచకోతకు గురైనవారు గురికాగా 1942 మార్చి నాటికి నెల మధ్య వరకూ సర్వవినాశక మారణహోమం(హోలోకాస్ట్) బాధితుల్లో 75-80 శాతం ఇంకా బతికే ఉన్నారు. కానీ 1943 ఫిబ్రవరి నాటికి ఈ నిష్పత్తి తలకిందులయ్యింది.
యూరపులో యూదుల నిర్మూలన నాటకీయంగా వేగవంతమవడానికి కారణం ఏమిటి? అనేక నెలలపాటు జరుగుతున్న, నిదానంగా సాగుతున్న ఈ ఊచకోత ఉన్నట్టుండి యావత్ యూదు జనాభాను తుడిచేసేంతగా వేగం అందుకోవడానికి ప్రేరణ ఏంటి? ఈ 11 నెలల మధ్యకాలంలో జరుగుతున్న యుద్ధంలో గాని బయటగాని ఏమైనా జరిగిందా అని ప్రశ్న వేసుకుంటే అలాంటిదేమీ లేదనే, జవాబుకాదనే వస్తుంది.
ఈ చిక్కుప్రశ్నకు జవాబు చెప్పేది ఏదీ ఈ 11 నెలల కాలంలో జరగలేదు అన్నదాంట్లోనే మనల్ని వేధించే ఈ చిక్కుముడి విప్పే దారి కనిపిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ 11 నెలలకు ముందున్న నెలలో ఏమిజరిగిందన్నదే ఈ చిక్కుముడికి సమాధానమిస్తుంది. అధ్బుతమైన పచ్చటి తోట మధ్య గొప్ప వాన్సీ సరస్సు దృశ్యాలు చక్కగా కనిపించెలా ఉన్న సొగసైన, 20వ శతాబ్ది నాటి బెర్లిన్ శివార్లల్లో ఉన్న భవంతి అది. మనకిప్పుడు ‘‘వాన్సీ’’ సమావేశంగా తెలిసిన ఘటన అది మానవ చరిత్రలో అత్యంత దారణమైన సామూహిక హత్యకాండకు దారి తీసింది.
నేపథ్యం
1942 జనవరి 20న ఉదయం రెనార్డ్ హైడ్రిక్ రెఖ్ సెక్యూరిటీ ముఖ్య కార్యాలయ ప్రధానాధికారి. విశేష అనుభవమున్న ప్రభుత్వాధికారులు, నాజీ పార్టీ, ఆక్రమిత ప్రాంతాల పాలనాధికారులు స్కుట్జటప్ఫల్(ఎస్ఎస్), గెష్టపో హాజరైన సమావేశానికి అధ్యక్షత వహించారు. ‘‘యూదుల సమస్యకు అంతిమ పరిష్కారం’’ గురించి ఒక ముగింపు పలకడం ఈ సమావేశపు ఎజెండా.
అనేక వారాల ముందే ఈ సమావేశానికి పంపించిన ఆహ్వానంలో హైయిగ్రిచ్ జుల్కె 1941లో హెర్మన్ గోరింగ్ తనకు పంపిన సందేశాన్ని జోడించాడు. ఆ ఆదేశం ప్రకారం హైయిగ్రిచ్ ‘‘యూరపులోని యూదుల సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి అవసరం అయిన సంస్థాగతమైన, వాస్తవికమైన, భౌతిక ఏర్పాట్లు చేయడానికి’’ అధికారం పొందాడు. ఆ కాలం నాజీల అధికార నిచ్చెనలో గోరింగ్ హిట్లర్ తర్వాత రెండో అధికారస్థానంలో ఉన్నాడు.
15మంది కీలక వ్యక్తులు…
అయితే, ఈ వాన్సీ సమావేశంలో మొత్త 15 మంది పాల్గొన్నారు. గెష్టోపో ప్రధానాధికారి హెన్రిచ్ ముల్లర్, ఆర్ఈఎస్ఏ యూదుల వలస కార్యాలయ ముఖ్య అధికారి అడాల్ఫ్ ఎయిచ్మన్, ఎస్ఎస్ వర్ణ నివాస అధికారి ఓట్టో హాఫ్మన్ నాజీ పార్టీ ఛాన్సలర్ శాశ్వత కార్యదర్శి గెర్హార్ట్ క్లోప్‌ఫెర్, రైఛ్ ఛాన్సలర్ శాశ్వత కార్యదర్శి ఫ్రెడరిక్ క్రిట్జ్న్గెర్, విదేశీ వ్యవహార కార్యాలయ సహాయకార్యదర్శి మార్టిన్ లూథర్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధానకార్యదర్శి రోలాండ్ ఫ్రెయిష్టరీ, తూర్పు ఆక్రమిత ప్రాంతాల మంత్రిత్వశాక కార్యదర్శి ఆల్ఫ్రెడ్ మేయర్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి విలేహెల్మ్ స్టుక్కార్ట్, ఆక్రమిత పోలెండు జనరల్ కార్యదర్శి జోసెఫ్ బుబ్లెర్ వీరిలో ఉన్నారు.
మారణ యంత్రానికి అవసరం అయిన ముఖ్య భాగాలను సమకూర్చాల్సిన విభాగాలన్నింటినీ సంప్రదింపులల్లో భాగస్వామ్యం కల్పించడానికి చాలా క్షుణ్ణమైన ఆలోచనతో సమావేశం రచించబడిందని స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు న్యాయ మంత్రిత్వశాఖ యూదుల ఆస్తులను చట్టపరంగా గుంజుకోవడానికి అవసరమైన ఆదేశాలు తరచుగా జారీచేయడానికి లేదా లిఖితమైన చట్టసమ్మతితో చావుకి అప్పజెప్పడానికి వీలుగా వర్ణాంతర వివాహాల వలన పుట్టిన బిడ్డల ‘‘వర్ణం’’ నిర్ధారించి పరిష్కారించడానికి ఈ శాఖ సహాయం అవసరం అవుతుంది.
విదేశీ మంత్రిత్వశాఖ హాజరుకావడానికి కారణం..
రుమేనియా, హంగరీ, ఫ్రాన్స్ వంటి స్నేహ సంబంధాలు గల ప్రభుత్వాల పరిధుల్లో నివసించే యూదుల విషయంలో వారు కూడా నాజీల నరమేధ పథకానికి అనునయంగా వ్యవహరించడం కోసం వారిని రప్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి విదేశీ మంత్రిత్వశాఖ హాజరుకావడం అవసరం అయ్యింది. ఈ నరమేధ పథకపు ప్రధాన నిర్వాహకుడు హైడ్రిచ్ ఆలోచనతో పాటు రైఛ్ ఛాన్సలర్ పూర్తి ఏకీభావం కలిగి ఉండాల్సిన అసవరముంది. ఎందుకంటే అన్ని దశల్లోనూ అన్ని రకాల ఏర్పాట్లు(యూదులను వధ్యశాలలకు తరలించడానికి కావల్సినన్ని రైళ్లను ఏర్పాటు చేయటం) ఎప్పుడు అడిగితే అపుడు వారు చేయాలికదా!
నరమేధానికి పునాది వేయడం
గంటన్నర పాటు విషయాన్ని వివరించడంతో చర్చను ప్రారంభించిన హైడ్రిచ్ అరగంటపాటు ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చాడు. వర్ణ సమస్యపై నాజీ విధానాన్ని పరిశీలించాడు. 1941 వరకూ ఈ విధానం ద్వారా సాధించిన విజయాలను ఏకరువు పెట్టాడు. అయితే ఈ విధానానికి కొత్త కోణాన్ని అందించాల్సిన అవసరం ఉందనీ, యుద్ధం తీవ్రతరం అవుతున్న దశలో యూదులను ఇతర దేశాలకు తరలించటం సాధ్యంకాని పరిస్థితుల్లో యూదుల సమస్యను పునఃపరిశీలించాల్సి ఉందని అతను పేర్కొన్నాడు. యూదులను వదిలించుకోవడానికి యుద్ధం తూర్పు ప్రాంతంలో గొప్ప కొత్త అవకాశాలు కల్పిస్తోందన్నాడు.
ఈ నేపథ్యంలో యూదు సమస్యకు ఆఖరి పరిష్కారం ఇవ్వడానికి సమయం ఆసన్నమైందని హిట్లర్ భావించాడు. తద్వారా జర్మనీలో జాతిపరమైన అసమానతలకు, వైవిధ్యాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంన్నాడు.దీనికి సంబంధించిన ప్రధాన బాధ్యతను ఎస్ఎస్కు అప్పగించారు. దానిని నడిపించే సర్వాధికారాలు హైడ్రిచ్కు అప్పగించారు. ఈ పథకం విజయవంతంకావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించే బాధ్యత ఈ సమావేశానికి హాజరైన విభాగాల నుండి ఆశించారు. తూర్పు ప్రాంతానికి(ఆక్రమిత సోవియట్ యూనియన్ భూభాగాలు) యూదులను తరలించడం పథకంలో కీలకాంశమని హైడ్రిచ్ అన్నాడు. జర్మనీ భాషలో నిర్వహణా నియమాలుగా పేర్కొనే సమావేశం మినిట్సులో నమోదు ప్రకారం ‘‘తరలించిన యూదులను అక్కడ నిర్మాణం ఇతర పనుల్లో శారీరక శ్రమ చేయటానికి నియమిస్తారు. అక్కడ కఠోర వాతావరణ, పని పరిస్థితుల వలన అత్యధిక సంఖ్యలో సహజంగానే తొలగించబడతారు లేదా కూలిపోతారు అని పేర్నొన్నాడు. వారిలో బతుకున్న వారితో సరైన రీతిలో వ్యవహరించబడుతుంది. ఎందుకంటే నిర్వివాదంగా వారు అత్యధిక నిరోధకశక్తి గలవారి ప్రతినిధులు కాబట్టి విడుదల అయిన వారు సరికొత్త యూదుల పునర్నిర్మాణానికి బీజకణాలవుతారు.
న్యూరెంబర్గ్ చట్టాలు..
ఈ తరలింపు విజయవంతం కావడానికి కొన్ని ముందస్తు షరతులుంటాయి. అవేమంటే తరలించాల్సిన వారిని గుర్తించడం. చర్చలో గణనీయమైన భాగం పాక్షిక యూదులు. జర్మన్లు పెట్టుకున్న వివాహ, వివాహేతర సంబంధాలకు జన్మించిన వారు. న్యూరెంబర్గ్ చట్టాల ప్రకారం గుర్తించబడిన వారు. వారి సంతానం ప్రథమ శ్రేణి మిస్సిలింగె (4 గురిలో ఇద్దరు యూదులూ, అమ్మలు ఉన్నవారు) ద్వితీయ శ్రేణి మిస్సిలింగె (ఒక యూదు తాత లేదా నానమ్మ, అమ్మమ్మ ఉన్నవారు) వీరితో ఎలా వ్యవహరించాలో సవివరమైన ప్రణాళిక సిద్ధమైంది. మినిట్సులో రాతల్ని బట్టి చూస్తే ఇది చాలా సమయం తినేసింది. రకరకాల దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. వారి వైవాహిక స్థితి, జీవిత భాగస్వామ్యం వర్ణ గుర్తింపు. వారి సంతానం (ఉంటే) ఆ సంతానం న్యూరెంబర్గ్ చట్టాలకు ముందు జన్మించారా తరవాతనా వంటి అనేకానేక అంశాలు ఒక వ్యక్తిని తరలించే నిర్ణయం తీసుకోవడానికి పరిగణనలోకి తీసుకున్నారు. జర్మన్ కల్పిత సమగ్ర పరిశీలన దృష్టి ఇక్కడ పనికి వచ్చిందనుకోవాలి.
సామూహిక సరసంహారం కోసం సమన్వయం
ఇదంతా జర్మన్ సామ్రాజ్యం (జర్మనీ, ఆస్ట్రియా, బాహీమియా, మొరాలియా)లోని యూదులకు సంబంధించింది. కానీ ఆఖరి పరిష్కారం యూరపులోని మొత్తం యూదులను చుట్టుముట్టి పశ్చిమ దేశాల్లోని యూదులను తూర్పుదేశాలకు తరలించటం ద్వారా తుడిచిపెట్టి యావత్ యూరప్‌ను యూద విముక్తి ప్రాంతంగా మార్చే ప్రణాళిక కూడా ఇందులో ఉంది . అంటే మొత్తం యూరపును యూదుల నుండి శుద్ధి చేయడమే. యూరోపులో ప్రాంతాలవారిగా, దేశాలవారిగా విస్తరించి ఉన్న యూదుల సంఖ్యను వివరాలను పొందికగా రూపొందించడంలో ఎచ్మన్ చాలా శ్రమ తీసుకున్నాడు. ఇదే పునాదిగా చర్చనడిచింది. ఈ దేశాలన్నింటిలో ‘ఇస్తోనియా’ పేరు గర్వంగా ప్రస్తావించబడింది. ఇక్కడ ఆక్రమిత అధికారుల కఠోర పరిశ్రమ వలన అప్పటికే ఈ దేశం యూదుల నుండి శుద్ధి చేయబడింది. వివిధ భౌగోళిక పరిస్థితులు వాటి ప్రత్యేకతలు సంక్షిప్తంగా చర్చించబడ్డాయి. ఆఖరి పరిష్కారం కొలమానంలోకి వచ్చిన 110 లక్షల యూదులపైనే చర్చ నొక్కి వక్కాణించింది. ఇక్కడ మంచీ, మర్యాదలకు తావులేదు. (ఈ పథకం పరిధి నుండి సగం యూదులని మినహాయింపు సాధ్యాసాధ్యాలు) ఇతర దేశాల్లోని యూదుల గురించి ఇటువంటి వివరాల్లోకి వెళ్లకపోయినా జర్మనుల సున్నిత మనోభావాలు గాయపడతాయని స్పష్టమవుతుంది.
యూదుల సంహార ప్రణాళిక రూపొందించటం దానంతట అదే ఒక విశేషమైన పనితనం. యూదుల తలరాతను సూచించే నల్లని చుక్కలతో నిండి ఉంది ఆ ప్రణాళిక. నరసంహార ప్రణాళికలో ఏ చిన్న విషయాన్నీ విస్మరించలేదు. అలాగనీ ఈ ప్రణాళిక రూపకల్పనకు సంబంధించిన ఏ చిన్న వివరం కూడా భావితరాలకు అందకుండా ఉండేందుకు కావల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఉరితీయడం, నిర్మూలనం వంటి పదాలుగాని కాల్చేయడం, పొయ్యిలోకి నెట్టేయటం వంటి పదాలుగాని ఈ మినిట్సులో ఎక్కడా కనిపించవు. చాలా మర్మగర్భంగా ‘‘తరలింపు’’ అన్నపదాన్ని ఉపయోగించారు. అది కూడా అకుంఠిత విశ్వాసంతో. ఇది ఈ సమావేశంలో నమోద కార్యదర్శిగా కూడా పనిచేసిన ఎచిమన్ చేతి పనితనం. స్టెనోగ్రాఫ్ తయారు చేసిన మొదటి చిత్తుప్రతి నుండి ‘‘వికృత’’ పదాలన్నింటిని ఏరి తీసేయడానికి చాల కష్టపడి పనిచేసి, అధికారిక ప్రామాణికతలకు అనుస్వరం అయిన సాధారణ స్వరం మినిట్సుకి ఇవ్వడం. 1961 జెరూసలెం విచారణ సందర్భంగా దీన్ని అతను గర్వంగా తన సాక్ష్యంలో పేర్కొన్నారు.
వాటిని ఎంత శుభ్రం చేసినప్పటికీ ఈ మినిట్సులో ఎక్కడయినా ఈ ఆఖరి పరిష్కారం విస్తృతి గురించిన కలవరంగాని అశాంతిగాని ఇబ్బందిగాని ఈ పాల్గొన్న వారిలో ఉన్నట్టుగా కనిపించిందా? వృత్తిపరంగా నైతికంగా మంచి-చెడులపరంగా గాని హాజరైన వారు ఏమైన మినహాయింపులు వ్యక్తం చేశారా? అంటే అదీ లేదు. కొన్ని చర్చలు జరిగాయి. స్పల్పమైన సాంకేతిక అంశాలపై తేలికపాటి అనంగీకారాలు వచ్చాయి. ఉదాహరణకు 21 సంవత్సరాల ప్రణాళికా కార్యదర్శి యుద్ధ పరిక్రమంలో పనిచేసే యూదుల్ని తక్షణం తరలిస్తే యుద్ధ ఆర్ధికస్థితి వెనుకబడుతుందా లేదానే విషయంలో సందిగ్ధం వెలిబుచ్చారు. మరో వైపున అంతర్గత కార్యదర్శి స్టుక్కార్ట్ ఒక విషయంలో జోక్యం చేసుకున్నాడు. ‘‘మిస్సిలెంగె’’ తరలింపు అనేకానేక అంశాలతో ముడివడి ఉన్నందున అంతులేని పరిపాలనా చిక్కులు ఎదురవుతాయా అన్న ప్రశ్న ఒక్కటే తలెత్తింది. శ్రమకు కారణం అవుతుంది. కాబట్టి మొత్తం మిస్సిలెంగె జనాభాకు బలవంతంగా కుటుంబ నియంత్రణ అమలు చేయాలని ప్రతిపాదించాడు. అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ అంతిమ పరిష్కారం యూదులు, పాక్షిక యూదు బిడ్డలను ఏం చేయాలని ఊహించిందో దానిపట్ల ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. ఈ విషయం తరచుగా ప్రస్తావించబడిరది.
ఈ మినిట్సులోని మరొక విషయం ఏమంటే ఈ అంతిమ పరిష్కారం వాన్సీ సమావేశానికి హాజరైన వారెవ్వరినీ ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే యూరోపు యూదులను వ్యవస్థీకృతంగా నాశనం చేసే ప్రణాళిక అప్పటికే కొద్ది నెలలుగా అమలవుతున్నది. పార్టీలో అనుభవంగల నాయకులుగాని ప్రభుత్వాధికారులు గాని ఈ పరిణామం తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఆక్రమిత పోలాండులోని లోజ్ దగ్గరి కెల్మ్నో మృత్యు శిబిరం సామూహిక హత్యలకు విషవాయువు వాడిన శిబిర నిర్మాణం 1941 నవంబరులోనే ప్రారంభం అయ్యింది. అదే కాలంలో విషవాయువు ప్రయోగానికిగాను వివరమైన మౌళిక నిర్మాణాలు సామూహిక సమాధి ప్రదేశాలలో బెల్జాక్ మృత్యుశిబిరం కూడా భవిష్యత్తు కార్యక్రమం కోసం సిద్ధం అయ్యింది. దానికంటే ముందే పోలాండు, సోవియట్ యూనియన్ల నాజీ ఆక్రమిత ప్రాంతాల్లో సామూహికంగా చంపే విషవాయువు వ్యాన్లు ఈ సేవల్లో ఉండేవి. 1941 జూన్ నుండి ఈ ఆక్రమిత ప్రాంతాల్లో ఎస్ఎస్ ఇన్కెసట్జరూపెక్ శాఖ రిజర్వు పోలీసు యూనిట్లు సామూహికంగా కాల్చిచంపే భయంకర వినోదం కొనసాగింది. (1941 సెప్టెంబరులో ఉక్రైన్ బారియర్ ఊచకోత, అదే ఏడాది జులైలో బయలిస్టాక్ మారణకాండ వంటిది దీనికి ఉదాహరణ) ఈ మృత్యు ఉద్యమాలు నరమేధంగా సాగాయి. కమ్యూనిస్టులు, రష్యాయుద్ధఖైదీలు, పోరాడేవారు, జిప్సీలు, రోమనీలు ఈ బాధితుల్లో అధిక సంఖ్యలో ఉన్నారు.
సర్వవినాశక మారణహోమం..
కాబట్టి, హోలోకాస్ట్ వాన్సీ సమావేశంలో ప్రారంభం అయ్యిందని చెప్పడం కష్టం. ఈ నరసంహారాన్ని ప్రభుత్వ విధానంగా మార్చటం, వ్యవస్థాగతం చేయటం, దాని కోసం వ్యూహరచన, ఆర్థిక, మానవ వనరుల కేటాయింపు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయటం వంటి చర్యలకు వాన్సీ సమావేశం కేంద్రమైంది. వాన్సీ సమావేశం తర్వాత శక్తిలో అధికార యంత్రంగం ఒక పరిక్రమ స్థాయిలో విధ్వంస ప్రక్రియను చేపట్టింది. ఈ సామూహిక నరమేధం అప్పటిదాకా చెదురుమదురుగా జరిగేది కాస్తా ఓ ప్రణాళికాబద్ధంగా మారింది. పాలనా చర్యగా మారింది.
హిట్లర్ అంతిమ నిర్ణయం
అయితే, ఈ సర్వవినాశక మారణహోమం హిట్లర్ ఆదేశాలివ్వకుండానే ప్రారంభం అయిందని భావించలేము. 1941 డిసెంబర్ 12న రైఛ్ చాన్సలరీలో నాజీముఖ్యుల సమావేశంలో ‘‘ప్యూయరర్’’ వాన్సీ సమావేశానికి నెలరోజుల ముందే మరాణకాండ కొనసాగించమని అధికారిక అనుమతి ఇచ్చారు. సమావేశానంతరం జోసెఫ్ గోబెల్స్ రాసుకున్న డైరీ ప్రకారం ‘‘యూదుల సమస్యకు సంబంధించి వారిని పూర్తిగా తుడిచేయాలని ప్యూయరర్ నిర్ణయించకున్నారు. ఆయన యూదులు ఒక ప్రపంచ యుద్ధం తీసుకు వచ్చి పూర్తిగా వారి నిర్మూలనను అనుభవిస్తారని ముందే ప్రవచించారు.’’ అది ఒక పదబంధం కాదు. ప్రపంచయుద్ధంలో యూదుల నిర్మూలన అనివార్య పరిణామం. 1941 డిసెంబరు 1న ప్రపంచ యుద్ధంలో అమెరికా చేరడంతో ఆవశ్యక దిశలో ప్రారంభమైంది. హిట్లర్ వికృత తర్కం ప్రకారం యూరపు యూదులు వారి నాశనాన్ని వారు కోరి తల మీదకు తెచ్చుకున్నారు.
యూదుల్ని తుడిచి వేయాలని హిట్లర్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆపరేషన్ ‘‘బార్పరోసా’’ ప్రయోగం తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని భావించవచ్చు. 1941 జనవరి 22న జరిగిన ఈ ఘటన అనంతరం పేట్రేగిపోతూ తన సేనలను రష్యా భూభాగం మీదకి నడిపించాడు. అప్పటి వరకూ కలలో కూడా ఊహించలేనిదీ అసాధ్యం అనుకున్నదీ రష్యాపై దాడి. ఈ ధోరణిలోనే అతని ఆలోచనలు ‘‘గోరింగ్’’కు చేరి ఉండొచ్చు. అతను హైడ్రోచ్ను అంతిమ పరిష్కారానికి సిద్ధం కావాలని ఆదేశించి ఉండొచ్చు.
దీనికి కొంచం భిన్నంగా సాధ్యంమైనదిగా భావించే విశ్లేషణ, మాస్కోపై సాగుతున్న జర్మనీ కవాతును సోవియట్ దళాలు అడ్డుకున్నాయి. డిసెంబరు నాటికి సోవియట్లు ఎదురుదాడి ప్రారంభించారు. అప్పటికి గానీ ‘‘బార్బరోసా’’లో సాధించినట్లు రెప్పపాటులో విజయం సిద్ధంచే అవకాశం లేదనీ, ఈ హోమం దీర్ఘకాలం కొనసాగబోతోందని హిట్లరుకు అర్థం అయ్యింది. అమెరికా కూడా యుద్ధంలోకి దిగటంతో త్వరితగతిని యుద్ధం ముగించే అవకాశాలు సన్నగిల్లాయి. కాబట్టి యుద్ధం ముగిసేదాకా యూదుల సమస్య పరిష్కరించకుండా ఎందుకు వేచి చూడాలా అని హిట్లర్ ఆలోచించి ఉండచ్చు అతని ప్రాపంచిక దృక్పథానికి ఆయవు పట్టు ఈ సమస్యగదా!
క్రూరత్వపు వారసత్వం – మ్యూజియం చెబుతున్న కథలు
అదృష్టవశాత్తుతో కాకతాళీయంగా మినిట్సు బయటపడి ఉండకపోతే ఈ వాన్సీ సమావేశం గురించి తెలిసేదే కాదు. వాస్తవానికి సంబంధిత సంస్థలు, మంత్రిత్వశాఖలు, కార్యదర్శకులకు ఈ మినిట్సు 30 కాపీలు జారీ అయ్యాయి. కానీ యుద్ధం ముగింపు దశకు వచ్చేసరికి వారి ఆట ముగిసిందని నాజీలకు తెలుసు. వారి క్రూరత్వానికి సంబంధించిన వేలు, లక్షల పత్రాలు, సాక్ష్యాధారాలు అగ్నికి ఆహుతి చేశారు. ఈ క్రమంలోనే వాన్సీ సమావేశానికి సంబంధించిన పత్రాలు కూడా మంటలకాహుతి అయ్యాయి. ఎలాగో ఓ నకలు మాత్రం మిగిలిపోయింది. అదే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మిగిలిన ఒక్క కాపీ విదేశీ మంత్రిత్వశాఖకు చెందిన మార్టిన్ లూథర్ది. న్యూరెంబర్గ్ విచారణలకోసం నాజీ దస్తావేజులను మైక్రోఫిల్మ్ చేస్తున్న అమెరికా సిబ్బందికి ఇది దొరికింది. వారు దాన్ని అమెరికా ప్రాసిక్యూటర్స్కు అందజేశారు.
వాన్సీ సమావేశంలో పాల్గొన్న వారిలో బతికున్నవారందరినీ ప్రాసిక్యూటర్లు విచారించారు. మినిట్సు అంశాలను ధృవీకరించకున్నాకే తర్వాత జరిగిన అనేక న్యూరెంబర్గ్ విచారణ సందర్భంలో ఈ మినిట్సును ఉటంకించారు. ఇపుడు ఈ మినిట్సు మొత్తం పేజీల ప్రతులు వాన్సీ సమావేశం జరిగిన వాన్సీ భవంతి (ఇపుడది మ్యూజియం విజ్ఞాన నిలయం)లో సందర్శకులు చూడటానికి వీలుగా ప్రదర్శిస్తున్నారు.
నాజీల కాలానికి సంబంధించిన సాంస్కృతిక పరిపూర్ణస్థితిని ఈ ప్రదర్శనలోని ఫొటోలు శక్తివంతంగా కళ్ల ముందు ఉంచుతాయి. ప్రత్యేకించి ఒక ఫొటో చందమామల్లాంటి 5 గురు కౌమర వయస్కులైన కుర్రాళ్లు ‘‘బెవ్రాంజర్ డార్ఫ్లో యూదులకు అనుమతిలేదు’’ అని పెద్ద అక్షరాలతో రాసిన బోర్డు కింద యవ్వనంలో ఉన్న హిట్లర్ ఫోటోతో నిలబడటం నన్ను బాగా కలవర పెట్టింది. తిరుగుతూ ఉంటే అక్కడ ఇలాంటివి ఎన్నో కనబడతాయి. పెద్ద భవంతిలోని చక్కటి గదిలో అందమైన సమావేశపు ఇ బల్ల చుట్టు కూర్చున్న 15 మంది కనురెప్పయినా వేయకుండా 110 లక్షల మంది ప్రజలకు మరణశాసనంపై సంతకం ఎలా చేశారో మనకు అపుడు అర్ధం అవుతుంది.
– అంజన బసు
అనువాదం: దేవి