Reading Time: 3 minutes
2021-22, 2022-23 సంవత్సరాల అసంఘటిత ఉత్పత్తి రంగవార్షిక నివేదికలు ఈ మధ్యనే వెలువడ్డాయి. 2021-22 నాటికి 17.25 మిలియన్లుగా ఉన్న అసంఘటిత రంగ వస్తూత్పత్తి పరిశ్రమల సంఖ్య 2022-23 నాటికి 17.83 మిలియన్లకు అంటే సగటున ఏటా 2.2 శాతం పెరిగినట్లు ఆ నివేదిక వెల్లడిరచింది. ఈ రంగంలో పనిచేసే కార్మికుల సంఖ్య 2022-23 నాటికి 6.3 శాతం పెరిగింది. తాజా ధరవరలతో పోలిస్తే ఈ రంగం నుండి 19 శాతం ద్రవ్యోల్భణంతో సర్దుబాటు చేస్తే 12 శాతం స్థూల విలువ సమకూరిందని ఆ నివేదిక వివరించింది.
వస్తూత్పత్తి పరిశ్రమల సంఖ్య, కార్మికుల సంఖ్య, స్థూల విలువలలో ఈ పెరుగుదల ఈ రంగు కోవిడ్ 19 అనంతర ప్రభావం నుండి పాక్షికంగా తేరుకున్నదని విదితం అవుతున్నది. 2021-22 సంవత్సరంలో కోవిడ్ 19 కారణంగా రెండవసారి లాక్డౌన్ విధించిన మూలంగా దాని ప్రభావం ఆ తర్వాత ఎన్నో నెలలపాటు కూడా కొనసాగింది. వస్తూత్పత్తి రంగంలో రాస్ట్రాల వారీ వృద్ధి ధోరణులను అధ్యయనం చేస్తే లాక్డౌన్ మూలంగా ప్రాణాలరచేత పట్టుకుని గ్రామసీమలకు చేరిన వలస కూలీలు తిరిగి పట్టణాల బాట పట్టారని మనం అర్థం చేసుకోవచ్చు.
బీహార్ ముందంజ
దిగువ పొందు పరిచిన పట్టికను పరిశీలిస్తే అసంఘటిత వస్తూత్పత్తి పరిశ్రమలు బీహార్ రాష్ట్రంలో 2021-21 నాటికి 5,25,000 గా ఉన్నదల్లా 2022-23 నాటికి 8,08,000 కు 33 శాతం పెరిగాయని స్పష్టమవుతుంది. 2021-22 నాటికి కనీసం 75,000 పరిశ్రమలు ఉన్న హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఈ రెండు సంవత్సరాలతో పోలిస్తే 11 నుండి 12 శాతం వృద్ధిరేటు కనిపిస్తా ఉన్నది.
బీహార్‌లో పై రెండేళ్ళ కాలంలో అసంఘటిత రంగ వస్తూత్పత్తి పరిశ్రమల సంఖ్య రికార్డుస్థాయిలో పెరగడమే కాదు, వీటిలో మహిళల యాజమాన్యంలో ఉన్న పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2021-22లో మహిళా యాజమాన్యంలో ఉన్న ఈ పరిశ్రమలు ప్రతి వెయ్యింటికి 310 గా ఉండేవల్లా 2022-23 నాటికి ఈ సంఖ్య 452 కి పెరిగింది. పరిశ్రమల సంఖ్యస్థాపనలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లు ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్నాయి. అసంఘటిత వస్తూత్పత్తి పరిశ్రమల స్థాపనలో వృద్ధిరేటు, దానికి అనుబంధంగా మహిళల యాజమాన్యంలో ఉన్న పరిశ్రమల సంఖ్యలో పెరుగుదల వివరాలు పై పట్టికలో పొందుపరచబడి ఉన్నాయి. అంతర రాష్ట్ర అనుబంధ గుణకం గణాంకాల రీత్యా 0.6గా గణనీయంగా ఉన్నది.
ఈ తరహా వృద్ధి రేటులో కూడా వివిధ రాష్ట్రాల మధ్య వైవిధ్యం కనిపిస్తోంది. బీహార్, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌లలో పరిశ్రమల స్థాపనలో వృద్ధి రేటు వేగంగా ఉంటే, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఈ వృద్ధిరేటు బలహీనంగా అయితే ఈ వృద్ధి రేటు ఇలా ప్రతికూలంగా ఉండడానికి కారణం, కనీసంగా పాక్షికంగా అయినా వలస కార్మికులు పట్టణాల బాట పట్టడమే. మహారాష్ట్ర నుండి ఈ వలసలు అత్యధికంగా ఉన్నప్పటికీ కోవిడ్ 19 అనంతర కాలంలో, 2022-23 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరగడానికి మహిళా యాజమాన్యంలో పరిశ్రమల సంఖ్యలో పెరుగుదల దోహదం చేసింది.
పారిశ్రామికాభివృద్ధిలో అసంఘటితరంగ ఉపాధిలో మహిళల పాత్ర
గోల్డర్, అగర్వాల్‌ను నిర్వహించిన పరిశోధనలో ఈ మధ్యకాలంలో మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. 2017-18, 2022-23 మధ్య కాలంలో వస్తూత్పత్తి రంగంలో మహిళా కార్మికుల సంఖ్య 64 శాతం పెరగడం పారిశ్రామిక కార్మికులలో మహిళల భాగస్వామ్యం అనూహ్యంగా పెరగడాన్ని సూచిస్తుంది. అసంఘటిత వస్తూత్పత్తి పరిశ్రమల స్థాపనలో, ఉపాధిలో మహిళల యాజమాన్యం, భాగస్వామ్యం రాష్ట్రాలవారీగా పెరగడం సానుకూల పరిణామం.
అసంఘటిత వస్తూత్పత్తి రంగంలో కార్మికుల సంఖ్య వృద్ధి వివరాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అసంఘటిత వస్తూత్పత్తి రంగంలో కార్మికుల సంఖ్య పెరుగుదల లో కూడా బీహార్ ముందంజలో ఉన్నది. 2021-22, 2022-23 మధ్య కాలంలో ఈ రంగంలో దేశవ్యాప్త కార్మికుల వృద్ధిరేటు 6.3 శాతం కాగా బీహార్‌లో ఇది 60 శాతంగా ఉన్నది. అలాగే మహిళా కార్మికుల సంఖ్య పెరుగుదల రేటు 80శాతంగా ఉన్నది. 2022-23 సంవత్సరంలో అసంఘటిత వస్తూత్పత్తి రంగ ఉపాధి రాజస్థాన్‌లో 27 శాతం (మహిళా కార్మికుల వృద్ధిరేటు 27 శాతం), ఛత్తీస్‌ఘడ్‌లో 24 శాతం (మహిళాకార్మికుల వృద్ధిరేటు 45 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌లో వృద్ధిరేటు 12 శాతం (మహిళా కార్మికుల వృద్ధి రేటు 30శాతం), ఉత్తరప్రదేశ్‌లో 11 శాతం(మహిళా కార్మికుల వృద్ధిరేటు 18శాతం), మహారాష్ట్రలో 10 శాతం (మహిళా కార్మికుల వృద్ధిరేటు 17 శాతం)గా ఉన్నది. 2021`22 సంవత్సరంలో కనీసం 75,000 అసంఘటిత వస్తూత్పత్తి రంగంలో పరిశ్రమల సంఖ్యా పరంగానూ, మొత్తం కార్మికులలో మహిళా కార్మికుల శాతం పరంగానూ చూస్తే బీహార్ అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసింది.
2021-22, 2022-23 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అసంఘటిత వస్తూత్పత్తి రంగ పరిశ్రమల పెరుగుదలలో ఒక్క బీహార్లోనే సగానికి పైగా పెరుగుదల, ఉపాధికల్పనలో 30 శాతం పెరుగుదల (మహిళాకార్మికులలో 33 శాతం పెరుగుదల) నమోదు అయ్యింది. 2019-20, 2022-23 మధ్య కాలంలో బీహార్‌లోని గ్రామీణ ప్రాంతాలలో శ్రామిక మహిళల భాగస్వామ్యం 22 శాతం పెరిగి దేశవ్యాప్తంగా పోలిస్తే ద్వితీయ స్థానంలో ఉన్నది. బీహార్ వస్తూత్పత్తి రంగంలో మహిళా పారిశ్రామికుల సంఖ్యలో పెరుగుదల నిస్సందేహంగా ఇందుకు తోడ్పడిరది.
ప్రభుత్వసాయం అక్కరకు వచ్చిందా?
కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు (వీూవీజు) అందించిన ఆర్థికసాయం కోవిడ్ అనంతరం అసంఘటిత వస్తూత్పత్తి రంగం ఈ మేరకు పుంజుకున్నదని భావించడానికి తగిన కారణాలు ఉన్నాయి.
ప్రాంతాలవారీ నేషనల్ శాంపిల్ సర్వే గణాంకాలను అసంఘటితరంగ వార్షిక నివేదికలలోని యూనిట్ స్థాయి సమాచారంతో సరిపోల్చి అసంఘటిత వస్తూత్పత్తి రంగంలో పరిశ్రమల సంఖ్య, ఉపాధి పెరగడానికి ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం ఏ మేరకు తోడ్పడిరది అని అంచనా వేసాం. వ్యవసాయేతర అసంఘటిత పరిశ్రమలతో పోలిస్తే అసంఘటిత వస్తూత్పత్తి రంగ పరిశ్రమల సంఖ్య, ఉపాధి కల్పన పెరగడానికి ప్రభుత్వం నుండి ఉత్పత్తి సబ్సిడీ, వడ్డీరాయితీ, పెట్టుబడి బదిలీ, బిల్డింగ్ గ్రాంట్ల రూపేణా ఆర్థికతోడ్పాటు అందింది.
సర్వేలో పాల్గొన్నవారిలో 34 శాతం మంది తమకు ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందినట్లు స్పష్టం చేసారు. నేషనల్ శాంపిల్ సర్వే కూడా దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలను రెండు గ్రూపులుగా విభజించింది. 34 శాతం కన్నా ఎక్కువమంది ప్రభుత్వసాయం పొందామని చెప్పిన ప్రాంతాలను ఒక గ్రూప్‌లోను మిగిలిన ప్రాంతాలను రెండవ గ్రూప్‌లోను సర్దుబాటు చేసింది. మొదటి గ్రూప్‌లో పరిశ్రమల సంఖ్య, ఉపాధికల్పనలో వరుసగా 8.9 శాతం, 12.7 శాతం వృద్ధిరేటు ఉండగా రెండవ గ్రూప్‌లో ఇది 1 శాతం, 4 శాతంగా ఉన్నాయి. కోవిడ్ అనంతర కాలంలో అసంఘటిత వస్తూత్పత్తి రంగం కోలుకోవడంలో ప్రభుత్వ ఆర్థిక సాయం తోడ్పడిందని అని స్పష్టమవుతుంది. నేషనల్ శాంపిల్ సర్వే ప్రాంతాల విభజన అధారం చేసుకుని ఆయా ప్రాంతాల్లో ఇచ్చిన సంస్థాగత రుణాల వివరాలతో పోలిస్తే మేం కూడా అదే నిర్ధారణకు వచ్చాం.
నేషనల్ శాంపిల్ సర్వే చేసిన ప్రాంతాల విభజనను మరింత లోతుగా విశ్లేషిస్తే అసంఘటిత వస్తూత్పత్తి పరిశ్రమలు 60 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పారని స్పష్టమవుతుంది. సంస్థాగత రుణాల అందజేత, ప్రభుత్వపరంగా ఆర్థిక తోడ్పాటు అందడం మూలంగా పరిశ్రమల సంఖ్య, ఉపాధికల్పన గణనీయంగా పెరిగాయి. సెమీ అర్బన్ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో సంస్థాగత రుణాలు, ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు తక్కువగా ఉండడంతో ఇక్కడ వృద్ధిరేటు నామమాత్రంగా ఉన్నది.
వివరణ : ప్రభుత్వ ఆర్థికసాయం, సంస్థాగత రుణాలు అసంఘటిత వస్తూత్పత్తి పరిశ్రమల సంఖ్య, కార్మికుల సంఖ్య వివరాలను అసంఘటిత రంగవార్షిక నివేదికల నుండి సంగ్రహించబడినవి. 1) నేషనల్ శాంపిల్ సర్వే ప్రాంతాల వారీ గణాంకాలు 2) ఈ సర్వేలో ఓ మోస్తరు వృద్ధిరేటు సాధించిన ప్రాంతాల గ్రూపు వివరాలు. 3) ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉండడం పరిగణలోకి తీసుకున్నాం.
చివరి మాట: మహిళల యాజమాన్యంలోని సంస్థల ఉత్పాదకతను పెంచాలి
మహిళా యాజమాన్యంలో ఉన్న పరిశ్రమలలో ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉన్నది. అసంఘటిత వస్తూత్పత్తి రంగంలో మహిళా యాజమాన్యంలో ఉన్న పరిశ్రమల సంఖ్య, ముఖ్యంగా బీహార్‌లో గణనీయంగా పెరిగినప్పటికీ ఇవి పురుష యాజమాన్యంలో ఉన్న పరిశ్రమల సంఖ్యలో పోలిస్తే సగం మాత్రంగానే ఉన్నాయి. స్థూల విలువ 1/7 వ వంతు, కార్మికుల తలసరి స్థూల విలువ 1/3 వ వంతుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ రంగం కోలుకుని, పుంజుకోవడానికి తోడ్పడినా ఈ పరిశ్రమలలో ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ‘వికసిత భారత్’ నినాదం సాకారం కావాలంటే ఈ రంగానికి ప్రభుత్వం వైపు నుండి ఆర్థిక `సాంకేతిక సహకారం మరింతగా అందించాలి. మహిళా యాజమాన్యాలకు శిక్షణ ఇవ్వడం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.
— సురేష్‌చంద్ అగర్వాల్ / బిశ్వనాధ్ గోల్దార్
అనువాదం : సత్యరంజన్